బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఏదో అనుకుంటాం ఇంకోటేదో జరుగుతుంది…


ఎప్పటికప్పుడు ఏదో రాద్దామనుకోడం, కానీ పరిస్థితులు చూసి నిరాశా , నిస్పృహా  రావడం. మనకెందుకొచ్చిన  గొడవా అని వదిలేయడం.. ఇవేళ ఇలా కాదనుకుని , కనీసం  గత రెండు నెలలుగా జరుగుతూన్న సంఘటనలమీద , ఎవరైనా చదివినా చదవకపోయినా, ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా, ఉన్నదేదో కక్కేస్తే, కనీసం ప్రశాంతంగా ఉంటుందీ అనుకుని , ఇదిగో ఇలా మీముందుకువచ్చాను.

సాధారణంగా, నిద్రపోతున్న ప్రజలని లేపాలంటే , ఓ ఉద్యమం  మొదలెడితే చాలు, పనిపాటా లేనివారు మన దేశంలో పుష్కలంగా ఉన్నారు.అప్పుడెప్పుడో గుర్తుందా, అన్నా హజారేగారు ,ఏదో మొదలెట్టారు, ఇంక చూడండి, ప్రతీవాడూ ఓ గాంధీ టోపీ పెట్టేసికుని, (అసలు గాంధీగారే పెట్టుకోలేదు ! దేశమంతా ధర్నాలూ, సత్యాగ్రహాలూ, ఒకటేమిటి, రాజధానిలో అదేదో జంతర్ మంతర్ దగ్గర బహిరంగ సభలూ, ఒకటెమిటి … ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్షప్రసారాలూ, చర్చలూ… అవన్నీ చూసి, విని  రాత్రికి రాత్రే అదేదో  లంచరహిత స్వర్ణభారతం వచ్చేస్తుందని కలలు కనేశారు. ఓ నెలరోజులు దేశమంతా హడావిడి జరిగింది. అదేదో చట్టం అన్నారు, దానికి మళ్ళీ సవరణలోటీ… ఏదో మొత్తానికి ఓ నాలుగు నెలల హడావిడి చేసి, తరువాత మళ్ళీ తుపాగ్గుండుకి కూడా దొరక్కుండా, ఒకాయన ముఖ్యమంత్రయాడు,  ఆయనతో పోటీచేసినావిడేమో  గవర్నరుగా   enjoy  చేస్తున్నారు.  All that “corruption free India ”  has gone for a Toss.

  ఒక్కవిషయం మాత్రం ఒప్పుకోవాలి– మన దేశంలో  ఉద్యమాలూ వగైరాలు చేయడానికి , కావాల్సినన్ని తాయిలాలు ఉన్నాయి… వెతకడం ఆలశ్యం అంతే. 2014 లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు– ” స్వఛ్ఛభారత్” అన్నారు. ఇదివరకటి రోజుల్లో బహిర్భూమికి వెళ్ళేవాళ్ళందరినీ  ఠాఠ్ అలా కుదరదూ, ఇంట్లోనే వెళ్ళాలన్నారు. మెడమీద తలున్న ప్రతీవాడినీ  Brand Ambassador  చేసేశారు. నెలకో రెండునెలలకో ఊళ్ళో ఉన్న ప్రముఖులు, చెత్త ఎక్కువగా లేని ప్రదేశాల్లోనో, ఓ చీపురూ బుట్టా పట్టుకుని ఫొటోలూ వగైరా. ఇక్కడ ఫొటోలు ముఖ్యం. ఆ పెద్దాయనకి చూపించొద్దూ మరి? 

ఈ మధ్యలో ఆంధ్రదేశంలో , అదేదో ” ప్రత్యేక హోదా” త, దానిమీద గొడవా. వచ్చిందీ లేదూ పెట్టిందీ లేదు.. అయినా హోదాలొస్తే ఉపయోగం ఏమిటీ, డబ్బులు కదా కావాల్సింది. అంత పెద్ద కబుర్లు చెప్పిన  నాయుడుగారూ, అవేవో లక్షలకోట్లు   నిధి అనగానే , ప్లేటు మార్చేశారు. ఇదీబావుందీ, నాలుగురాళ్ళు వెనకేసుకోవచ్చూ అనుకునుంటారు.  ఇద్దరు నాయుళ్ళూ కలిసి తెలుగువాళ్ళని వెర్రివెధవలు చేశారు. అయినా కొత్తగా చేయడానికేముందీ..

ఆమధ్యన ఉగ్రవాద దాడులు జరగ్గానే, మామూలుగా మన సైనికదళాల వారు  ఇచ్చే తిరుగుజవాబునే, అదేదో ఫాషనబుల్ గా ఉందీ, అందరి నోళ్ళలోనూ నానుతుందీ అనుకుని, దానికి  surgical strikes  అని ఓ ముద్దు పేరు పెట్టారు. గత 70 సంవత్సరాల్లోనూ ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా ఈ ప్రభుత్వం చేసిందీ అని హడావిడి చేశారు.  రక్షణమంత్రిగారు కూడా… ” అవునూ నేను ఉద్యోగంలో చేరిన తరవాత పాత రికార్డులన్నీ చూశానూ.. ఇంత అద్భుతమైన ఆపరేషన్ ఎప్పుడూ జరగలేదూ.. ” అని వక్కాణించారు.చివరకి మన విదేశాంగ కార్యదర్శి గారు, ” అదేమీ కాదూ, ఇలాటివి ఎప్పుడూ జరిగేవే, వాటికి ముద్దుపేర్లూ, మాధ్యమాల్లో ప్రచారాలూ ఉండేవి కావూ…” అని వీధిన పెట్టేశారు. ఇందులో మనకి లభించినదేమిటయ్యా అంటే , మన పదజాలాల్లోకి ఓ కొత్త పదం  ”  Surgical Strikes 

ఇంకేముందీ, జనాలంతా ఎడాపెడా వాడడం మొదలెట్టేశారు.దేనికిపడితే దానికే ఆ పేరు. కొత్తగా పుట్టిన పిల్లలకికూడా పెట్టారేమో తమాషాగా ఉంటుందని.. తెలియదు. మన ప్రధానమంత్రిగారికి ఓ సౌలభ్యం ఉంది– సంసార బంధాలు లేవు, ఈతిబాధలు లేవూ, పిల్లలకి పాఠాలు చెప్పక్కర్లేదూ, భవబంధాలకి అతీతులు. ఏదో తనూ, ప్రజలూనూ… మైక్కు ముందరకి వెళ్తేచాలు, కావాల్సినన్ని ఉపన్యాసాలు… చెప్పవలసిన చోట తప్పించి, దేశవిదేశాల్లో ఓ మైక్కివ్వండి చాలు…  మనమూ ఏదో ఒకటి చేసి, అందరినీ ఓ  Surgical Strike  చేస్తే ఎలా ఉంటుందీ అనుకున్నారు. అదేమీ పెద్ద Strike  కాదనుకోండి, అధికార పార్టీ వారూ, మిత్రపక్షాలూ, సద్దుబాట్లు చేసుకున్నతరువాత, నవంబర్ 8 అర్ధరాత్రి తరవాత  500, 1000 నోట్లూ చెల్లవు పొమ్మన్నారు.. రాత్రికి రాత్రి ATM  లలో ఉన్న వందనోట్లు ఖాళీ… పాత నోట్లు మార్చుకోమన్నారు.. అదేదో అన్నారు ఇదేదో అన్నారు.. 50 రోజులన్నారు, నల్లధనం అన్నారు, జాలీ నోట్లన్నారు… డిశంబర్ 31 న మళ్ళీ ఇంకో సంచలనాత్మక నిర్ణయం ప్రకటిస్తారేమో అని రోజంతా  చూడ్డం, ఓ పేద్ద బిల్డప్ ఇచ్చేసి  చివరకి తుస్సుమనిపించారు మన ప్రధానమంత్రి. 

 నల్లధనం అలాగే ఉంది, మార్పల్లా ఏమిటంటే. ఇదివరకటిరోజుల్లో  ఉదాహరణకి 1000 కట్టలకి బదులు 500 కట్టలతో పనైపోతోంది. ఇదివరకు 1000 రూపాయల దక్షిణతో జరిగే పనులకి 2000 అవుతోంది. ఎంతైనా  inflation  కదండీ.

ఈ మధ్యలో తిన్న తిండరక్క, ఆంధ్రదేశంలో తెలుగు మీడియానికి బదులు ఇంగ్లీషన్నారు. ఈ మాత్రందానికి మన భాషకి ” ప్రాచీన హోదా ” కూడా ఎందుకూ?. అయినా విద్యావిధానాన్ని ప్రెవేటీకరణ చేయడంతోనే దరిద్రం మొదలయింది. నారాయణలూ, చైతన్యలూ…అక్కడికేదో మనవాళ్ళందరూ ఆంగ్లంలో ఉద్దండ పండితులైనట్టు , ఒక్క leave letter  కూడా తప్పుల్లేకుండా రాయలేరూ, ..  ఏమిటో వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం అవదు. ప్రస్తుతం దేశవిదేశాల్లోని ప్రముఖ తెలుగు వ్యక్తులందరూ , తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నారు.ఆ విషయం మర్చిపోయి, ఎప్పుడైనా ఏ దెబ్బైనా తగిలితే  ఇదివరకు ” అమ్మా, అమ్మోయ్.. ” అన్నవాళ్ళందరూ  ”  Oh Mother.. ”  అనాలనేమో మన పాలకుల సదుద్దేశ్యం…

..

11 Responses

 1. ఒకేసారి అనేక మార్పులు జరిగాయి దేశంలో.మంచి రోజులు వస్తున్నాయని అనిపించడం లేదూ..తాత్కాలికంగా కష్టపడదాం.శాశ్వతం గా సుఖపడదాం.దేశక్షేమం కోసం.నల్ల ధనం బయటపడితేగానీ మన కష్టాలు తీరవు.నేను సైతం అనుకొందాం.ఏమంటారు?

  Like

 2. భలే ఏకేసారు ఉద్యమాలని, అవినీతి ప్రక్షాళనని. తెలుగు మాధ్యమం తీసేడం పులిని చూసి నక్క వాటా పెట్టుకొన్నట్టే. మీరన్నట్టు సెలవు చీటీ చక్కగా వ్రాయటం కూడా ఎంతమందికి వచ్చు అన్నది ప్రశ్నఅర్థకం. ఒక్కసారి మారిస్తే ఇంగ్లీషులో చెప్పే ఉపాధ్యాయుల్ని ఎక్కడ నుండి తెస్తారు?

  Like

 3. రాధికారావు గారూ,

  మీ optimsm చూస్తే కడుపు నిండిపోతోంది. నిజంగా అలానే జరిగితే మంచిదే. నల్లధనమన్నది ఏ రాజకీయనాయకుల దగ్గర ఉందో ప్రపంచం అంతా తెలుసు. కానీ జరిగిందేమిటీ? మన రాజకీయనాయకులు అంత honest persons అంటారా? ఎంతమందిని పట్టారుట? Still you want to believe this is a so called war against black money? సామాన్య ప్రజలే కష్టపడ్డది ఇప్పటిదాకా… ఇంకా ముందుముందుకూడా…

  రాముడు గారూ,

  అలాగని మనవాళ్ళని కించపరచడం కాదు నా ఉద్దేశం. ఉన్న పరమ సత్యాన్ని ఒప్పుకోవాలి.. ఉన్నదేదో సక్రమంగా నిర్వహించమనండి ముందు. ఆంగ్లమాధ్యమంలో నేర్చుకుంటే రాత్రికి రాత్రి , ఏదో అయిపోరు. ప్రతీ ప్రభుత్వమూ తమ మాతృభాష ఉధ్ధారణకి పోరాడుతారు. అదేం కర్మమో మనవాళ్ళకే ఈ దౌర్భాగ్యాలన్నీ. ఇందులోనే Special Status తెచ్చుకున్నారు, మళ్ళీ ప్రత్యేకంగా ఇవ్వలేదని ఏడుపెందుకో…

  Like

  • ఒక్కనెల లోనో రెండు నెలల్లోనో జరిగి పోవాలనుకోవడం అత్యాశ కాదా..త్యాగాలు చేయకుండా మనకి స్వాతంత్ర్యం రాలేదు కదా ఫణిబాబు గారూ….పెద్దవారు….మీకు తెలియనిదికాదు.

   Like

 4. రాధికారావు గారూ,

  మరీ రాత్రికి రాత్రే దేశం బాగుపడాలనుకోవడం అత్యాశే. కానీ మీరు నా సమాధానం పూర్తిగా అర్ధం చేసికోలేదు. మన రాజకీయ వువస్థ ఉన్నంతకాలం, ఇంకా రోజులు బాగుపడతాయని ఆశించడం కూడా వృధా ప్రయాశే.. What exactly do you expect? Corruption and black money are so deep rooted that one single man, however clean is, can not repeat can not improve. Take any politician, … you will appreciate my write up. Any way I leave it to your descretion.

  Like

  • Before independence everybody thought like that.But only one person tried and tried and successful.Bruso inspired by a spider became successful .Let us be patient.We can’t get fruits as soon as we sow the seed. I got utmost regard and appreciation towards your write ups.

   Like

 5. రాధికారావు గారూ,

  One more thing… స్వాతంత్ర పోరాటాన్ని దీనితో పోల్చడం అనవసరం. We had selfless politicians, whom we could call statesmen. Show me one politician in our Country nowadays whom we could compare with those Great Sons of India.

  Like

  • Before independence everybody thought like that.But only one person tried and tried and successful.Bruso inspired by a spider became successful .Let us be patient.We can’t get fruits as soon as we sow the seed. I got utmost regard and appreciation towards your write ups.Why can’t we expect change in politicians? Let us give them a chance.

   Like

 6. ఫణి బాబు గారు,
  మీరు వ్రాసిన ప్రతి అక్షరం సత్యమే. వాటిలో కేవలం మీది మాత్రమే కాదు, చాలా మంది సామాన్య పౌరుల ఆక్రోశం, ఆవేదన కూడా ఇమిడి ఉంది. ఏమీ చేయలేని నిస్సహాయత, ఏదన్నా చేద్దామనుకున్నా కలిసిరాని సమాజ, రాజకీయ పరిస్థితులు ప్రజలను కేవలం helpless onlookers గా మార్చివేస్తోంది.

  నిజానికి నల్ల ధనమంతా ఎవరి దగ్గర ప్రోగు పడి ఉంది? నా దృష్టిలో 50 శాతం రాజకీయ నాయకుల దగ్గర, 30 శాతం కార్పొరేట్ హౌస్ బాసుల దగ్గర, మిగిలిన 20 శాతం మాఫియా + పెద్ద వ్యాపారస్తులు + లంచగొండి ఉద్యోగులు + ఇతర చిల్లర మల్లర వర్గాల దగ్గర ఉంది. and the government is fully aware of that. ప్రభుత్వానికే గనుక చిత్తశుద్ధి ఉండి ఉంటే రాజకీయ నాయకుల, కార్పొరేట్ దిగ్గజాలపై వల వేస్తే డిమోనేటైజషన్ పధకం సాధించ లేనిది, ఆ స్ట్రైక్స్ అవలీలగా సాధించి ఉండేవి. ఈ వర్గాలనుంచి పెద్ద చేపలను ఒక్కరినైనా ప్రభుత్వం పట్టుకున్న దాఖలా ఇంతవరకు లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీళ్లంతా నల్ల ధనం లేని స్వచ్ఛ భారత్ ప్రతినిధులయి ఉండవచ్చు. సామాన్య ప్రజల దగ్గర నుంచి పూర్తి స్థాయి వ్యతిరేకత రాకపోవడం వీళ్లకు ఎక్కడలేని మానసిక భరోసానిచ్చినట్లు కనబడుతోంది. ప్రజలు నల్ల ధనం శక్తిని తమ రోజువారీ విషయాల్లో గమనిస్తున్నారు, నిరసిస్తున్నారు గనుకనే, నల్ల ధనం అంతమైతే ఖచ్చితంగా తమకు మేలు జరుగుతుందనే ఆశతో (అది దురాశ అన్నది కాలక్రమేణా అనుభవం లోకి వస్తుందిలెండి) ఓపిక పట్టారు. పడుతున్నారు. సమర్ధించారు. ఇంకా సమర్థిస్తూనే ఉన్నారు. అంత మాత్రాన all is well అనుకోవడమంత వెర్రితనం, భ్రమ వేరే ఉండదు. ఇక ప్రభుత్వ ఆఫీసుల్లో లంచగొండితనం అరికట్టడంలో ఏ విధమైన ప్రయత్నం గానీ ప్రణాళిక గానీ అసలెక్కడా కనపడదు. కొన్ని ప్రభుత్వ ఆఫీసులు పూర్తిగా నల్ల ధన ఉత్పత్తి కేంద్రాలే. ఖజానాలే. వ్యక్తిగతంగా నేను కూడా నల్ల ధనం అరికట్టడానికి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సిందే అనుకునే బాపతు మనుషుల్లోనే ఉన్నాను. కానీ జరిగింది మాత్రం భిన్నం. విధానం అమలులో చేతకానితనంతో బొక్క బోర్లాపడి, క్రింద పడినా నాదే గెలుపు అనే హుంకరింపుతో జరిగింది తప్పు అనే వారిని నోరు మూయించే ధోరణిలో ఉంది ప్రభుత్వం. ప్రభుత్వాలు ప్రచారాలకిస్తున్నంత ప్రాధాన్యత ప్రజా సంక్షేమానికివ్వడం లేదన్న నా (నిరాశా) వాదంలో ప్రభుత్వ వ్యతిరేకతో లేక దేశ వ్యతిరేకతో లేక డొల్లతనమో కనబడితే నేను నిస్సహాయుణ్ణి.

  మీరన్న “All that “corruption free India ” has gone for a Toss…
  ఒక్కవిషయం మాత్రం ఒప్పుకోవాలి– మన దేశంలో ఉద్యమాలూ వగైరాలు చేయడానికి , కావాల్సినన్ని తాయిలాలు ఉన్నాయి… వెతకడం ఆలశ్యం అంతే…”
  sums up everything.
  మీ వ్యాసంలో నాకు నిష్పాక్షికమైన విశ్లేషణ తప్ప వేరే ఉద్దేశ్యం కనబడటం లేదు. మంచిని పొగిడినప్పుడు శభాష్ అన్నట్లుగానే చెడును ఎత్తి చూపినప్పుడు కూడా మెచ్చుకోవాల్సిందే. దురదృష్ట వశాత్తు ఇప్పటి రోజుల్లో కళ్ళముందు చెడు జరుగుతున్నా ఖండించడానికి జంకుతున్నామంటే కాల పరిస్థితులే.

  “ఒక్కనెల లోనో రెండు నెలల్లోనో జరిగి పోవాలనుకోవడం అత్యాశ కాదా..త్యాగాలు చేయకుండా మనకి స్వాతంత్ర్యం రాలేదు కదా” అన్న రాధారావు గారి మాటల్లోని ఆశాభావం అర్ధం చేసుకోదగిందే. కాకపొతే ఆ త్యాగాలు కేవలం సామాన్య ప్రజలనుంచి కోరడమన్నదే ఇక్కడ శోచనీయ అంశం. ఆ త్యాగాల విలువ షుమారుగా రెండువందల ప్రాణాలు, ఇప్పటికే. కానీ ఆ బలిదానాలకు ప్రతిఫలం లభిస్తుందా అన్నదే ఇప్పటి ప్రశ్న. ఆయన అన్నట్లుగా ‘one man can definitely make a difference’. కానీ అప్పటి, గాంధీ గారి, రోజుల్లో ఆ ఒకే ఒక వ్యక్తి వెనుక ఆయనకేమాత్రం తీసిపోని వ్యక్తిత్వం, చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న ఘనులున్నారు. కానీ ఇప్పటి, మోడీ గారి, రోజుల్లో ఆయన ప్రక్కన కేవలం భజనపరులున్నారు. అంతే తేడా.

  __/\__ …

  Like

  • రావుగారూ,

   మీ analysis చాలా బాగుంది.కొంతసేపటి క్రితం ” Budha in a Trafic Jam ” అని ఒక సినిమా చూశాను TV లో. వీలుంటే మీరు కూడా చూడండి. సామాన్య ప్రజలు ఎలా ” taken for a ride ” అన్న విషయం అర్ధం అవుతుంది.
   మన దురదృష్టం ఏమంటే, మన రాజకీయ పార్టీలు అన్నీ ఒకలాగే తగలడ్డాయి. పోనీ వీడుకాపోతే ఇంకోడూ అనుకోడానికి కూడాలేదు. అందరూ దొందుకుదొందులే. ప్రతీవాడూ నీతులుచెప్పేవాడే. మిగిలిన దేశాల్లో మరీ ఇంత అన్యాయం అనుకోను. నామమాత్రంగానైనా శిక్షలనేవి ఉంటాయి. మనదేశంలో పలుకుబడి ఉంటే చాలు ఏం చేసినా చెల్లుతుంది.పార్టీతో సంబంధం లేదు. You scratch my back and I will, yours… To hell with ethics.

   మీస్పందనకు ధన్యవాదాలు.

   Like

   • ఫణిబాబు గారు,
    కృతజ్ఞతలు. నిజాయితీగా ఆలోచిస్తే మనం ఎన్నుకుంటున్న ప్రజా ప్రతినిధుల వల్లే వ్యవస్థ ఈ విధంగా కుళ్లిపోతుందంటే పరోక్షంగా మనమే వాళ్ళను ప్రోత్సహిస్తున్నట్లు. మరి అలాంటి వాళ్ళను ఏరి కోరి అందలమెక్కిస్తున్నపుడు may be we do not deserve a better society. we keep on electing the same lawless law makers, even when the whole world knows that they are unworthy of our trust, vote. తానున్న పార్టీ అధికారం కోల్పోనున్న దశలో ఉంటే నిస్సిగ్గుగా, నిర్భయంగా అధికారం ప్రాప్టించే ప్రక్క పార్టీలోకి రాత్రికే రాత్రే జంప్ చేస్తున్నా, మంచీ చెడులు విశ్లేషించకుండా మళ్ళీ అదే వ్యక్తికీ ఓట్లేస్తున్న సమాజానిదే తప్పంతా. ఈ పార్టీ లోనూ వాడే గెలుస్తున్నాడు, ఆ పార్టీ లోనూ వాడే గెలుస్తున్నాడు. లోపమెక్కడుంది? ఈ విషయంగా నేను గతంలో వ్రాసిన “ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే శ్రీ అబ్దుల్ కలాం గారికి డిపాజిట్ దక్కుతుందా? … శ్రీ హరిబాబు సూరనేని గారి “ఆంధ్రాకు అన్యాయం చేసినోడు … పోస్ట్ చదివిన తరువాత విరక్తి నిండిన నా స్పందన” http://nmraobandi.blogspot.in/2015/02/blog-post_10.html?q=%E0%B0%85%E0%B0%AC%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D+%E0%B0%95%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82
    ప్రస్తుత కాల మాన పరిస్థితులకు దర్పణం. దయచేసి చూడగలరు.

    ఇంకో విషయం. డీమానెటైజషన్ అమలులో ఉన్న రోజుల్లో మనం పేపర్లలో టీవిలో ఎన్నెన్ని కధలు చూశాం, విన్నాం, చదివాం – స్టింగ్ ఆపరేషన్ల గురించి, ఎక్కడెక్కడ ఏయే విధానాల్లో పాత నోట్లను కొత్త నోట్లకు మార్పిడి చేసుకుంటున్నారో అని. ఆఖరు రోజు వరకు ఆ మార్పిడులు యథేచ్ఛగా జరిగిన కధలన్నీ గమనించాం – మనం మాత్రమే. ప్రభుత్వాలు గమనించాయా? అడ్డుకున్నాయా? కేవలం అక్కడక్కడ కొన్ని డ్రామాలు తప్ప సమస్తం ప్రశాంతం. స్వచ్ఛ భారతం. కొన్ని చోట్ల ఆ నోట్ల మార్పిడి గురించి సమాచారమిచ్చిన వాళ్ళను బొక్కలో తోసి కుళ్ళబొడిచిన సంఘటనలున్న దేశం మనది. ఆలోచించే కొద్దీ మనకు బీపీ పెరగడం తప్ప ప్రయోజనం నాస్తి.
    రెండు సార్లు మీరు చెప్పిన సినిమా చూడ్డానికి ప్రయత్నించినా నెట్ ప్రాబ్లెమ్తో సాధ్య పడలేదు. తప్పక చూస్తాను.
    regards …

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: