బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పెళ్ళాం ఊరికి వెళితే…( aka) freedom at midnight


దేశానికి స్వతంత్రం వచ్చి కొన్ని దశాబ్దాలయినా,  మొగాళ్ళకి మాత్రం, స్వతంత్రం అనేమాట  పెళ్ళైన ఏడాదికల్లా, dictionary  లో కనిపించదు. ఆ మొదటి ఏడాదీ,  transition period  లాటిదన్నమాట. అప్పటిదాకా బ్రహ్మచారి జీవితం గడిపినవాడు కాస్తా… हांजी  ( హాజీ ) లోకి మారాల్సిందే నూటికి 98 పాళ్ళవరకూ. అప్పటిదాకా ఏ ఫ్రెండింటికైనా వెళ్ళి సిగ్గూ, మొహమ్మాటం లేకుండా ఉన్నవాడు కాస్తా, పెళ్ళవగానే, ” ఇవేళ మా ఇంట్లో భోజనం చేయండీ ..” అనగానే, పెళ్ళాం మొహంకేసె చూస్తాడు.పోనీ ఏదో సరదాపడుతున్నాడూ అని , భార్య సరే అంటే.. ఏదో మొక్కుబడిగా టేబిల్ ముందర కూర్చోడమే కానీ, ఇదివరకటిలాగ భోజనం చేయడం, అతిగా తినడం, పదార్ధాలు రుచిగా ఉన్నాయనడం అన్నీ బంధ్.. ఏదో ఆరోగ్యం సరీగ్గా ఉన్నంతవరకే కానీ, దురదృష్టవశాత్తూ , ఏ డాక్టరు దగ్గరకైనా వెళ్ళాల్సొచ్చిందా,  ఆ డాక్టరేమో భార్యలకే చెప్తాడు తీసికోవలసిన జాగ్రత్తలు. ఇంక చూడండి, ఆ డాక్టరు చెప్పినవాటికి మరికొన్ని అదనపు జాగ్రత్తలు జోడించి, భర్తలతో ఆడేసుకుంటారు.

ఈ పెళ్ళాలనే వాళ్ళు, ఏదో పెళ్ళైనకొత్తలో ఏ ఆషాఢ మాసంలోనో, దరిమిలా  ఏ పురిటికో తప్ప, భర్తలని వదిలేసి వెళ్ళరు కదూ.. మధ్యలో ఏ పెళ్ళిళ్ళకైనా వెళ్ళాల్సిన సరే , సకుటుంబసపరివారంతోనే. మొదట్లో ఏదో విరహాలూ గట్రా ఉండేవి, ఎంతైనా అలవాటుపడ్డ ప్రాణాలుకదూ… పిల్లలకి చదువులూ పెళ్ళిళ్ళూ చేసి , మొత్తానికి ఓ రోజుకి వీళ్ళిద్దరూ మిగులుతారు. ఈవెనింగు వాక్కు దగ్గరనుండీ, ఒకళ్ళకొకళ్ళు తోడుగానే ఉంటారు. ఇంక భర్త అనబడే ఈ బక్క ప్రాణికి  వెసులుబాటు దొరికేదెప్పుడూ… అలాగని  on a duty of permanent nature  వెళ్ళిపోవడంకాదండోయ్.. ఏదో ఓ  respite  గా ఉంటే బావుంటుందేమో అని… పైగా ఏ పిల్లపురిటికో విదేశాలకెళ్ళాల్సొచ్చినా , buy one get one   లోలాగ భర్తగారుకూడా తయారాయె. 

ఎప్పుడో అనుకోకుండా ఓ అవకాశం వచ్చేస్తుంది. ఇంక చూడండి ” పండగే పండగ “.. రోడ్డుమీద  traffic signals  పనిచేయనప్పుడు చూస్తూంటాం, వాహనాలవాళ్ళు, ఎవడిదారిన వాడు సందుచూసుకునేవాడే. అప్పటిదాకా, సిగ్నల్ red  అయినప్పుడు ఆగి, green  అయినప్పుడు వెళ్ళేవాళ్ళందరూ కూడా  విచ్చలవిడిగా నడిపించేయడమే. అదో ఆనందం.. అలాగన్నమాట  ఈ పెళ్ళాలు భర్తలని అప్పుడప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళడం. అలాగని అసలు ఎప్పుడూ traffic signals  లేకపోతే, అంతా అయోమయం.

 అలాటి అవకాశమంటూ వచ్చినప్పుడుంటుంది ,  ఎంత స్వతంత్రమో… మాటల్లో  చెప్పలేము.. అంతా మనిష్టం..ఒకే  dress  వారంరోజులూ వేసికున్నా అడిగేవాళ్ళు లేరు. పొద్దుటే నిద్రలేవగానే దుప్పటీ మడతపెట్టకపోయినా మనిష్టం.. తడిచెయ్యి పక్కనే అందుబాటులో ఉండే ఏ  door curtain  తోనో తుడిచేసికున్నా  full freedom.ఫ్రిజ్ లోంచి నీళ్ళసీసా కరిచిపెట్టుకుని తాగినా  चल्ता है  ( చల్తా హై ), చప్పుడు చేస్తూ చాయ్, కాఫీ కూడా జుర్రుకోవచ్చు..   ఉదయం  breakfast  కి  ఏ హొటలుకో వెళ్ళి కావాల్సినవి తినాలన్నా పూర్తి స్వతంత్రం..రాత్రిళ్ళు చాలాసేపు  మెళుకువగా ఉండి , పొద్దుటే ఎప్పుడు లేవండి మనిష్టం.  Whatsapp లో ఎంతసేపు చాటింగుచేసికోండి మీ ఇష్టం.అడక్కండి ..ఇన్నేసి ఆనందక్షణాలు భార్య ఎదురుగా చేయడమే… వామ్మోయ్…  దేనికీ  restrictions  అనేవే ఉండవు. వాళ్ళనడిగితే ” ఇవన్నీ కావాలని చేస్తున్నామా ఏమిటీ.. మీ గురించే కదా.. ” అనడం ఖాయం.కదా పాపం… ఓ వయసొచ్చినతరువాత ఆమాత్రం కట్టుబాట్లుండకపోతే , మనకేకదా నష్టం? తెలుసును మహాప్రభో .. కానీ ప్రతీదానికీ ఓ  pause  అనేదుండాలిగా.. మహా అయితే ఆరారగా ఓ వారంరోజులు. ఓ వారంకంటే survive  అవడంకూడా కష్టమే. ఏదో వెళ్ళేముందర ఓ గిన్నెతో పులుసూ, పప్పూ, ఓ రెండుకూరలూ  చేసి ఫ్రిజ్ లో పెట్టడంమూలాన,  ఓ గ్లాసెడు బియ్యం కుక్కరుమీద పెడితే తిండిమాట చూసుకోనక్కర్లేదు, ఊరగాయెలానూ ఉందాయె. వారం తిరిగాసరికి తెలిసొస్తుంది మాస్టారికి, ఇన్నాళ్ళూ తన సుకరాలన్నీ తీరుస్తూ ,  భార్య ఎలా చూసుకునేదో…

 ఏ రెండుమూడేళ్ళకో సరదాగా just  ఓ వారంరోజులు ,భర్తలని వంటరిగా  వదిలేసి చూడండి.. ఏం కొంపలు మునిగిపోవు..

 

Advertisements

14 Responses

 1. ఆ ఆనందం ఈ మధ్యనే అనుభవించారుగా ! నాకింకా ఆ ఛాన్స్ లేదు.!

  Like

 2. ఎల్లుండి నుండీ ఒక నాలుగు రోజులు మాత్రమే నాకు ఆ అరుదైన అవకాశం వస్తోంది‌.

  Like

 3. అమ్మో అమ్మో మీలో ఉన్న మరో కోణం బయటపడింది..హమ్మో

  Like

 4. funtastic!

  Like

 5. రాధారావు గారూ,

  Welcome..

  వాత్సల్యా,

  అంత పెద్దగా ” హాశ్ఛర్యపడి పోనక్కర్లేదు ఆమాత్రందానికి.కోణాలూకాదూ సింగినాదాలూ ఏమీ లేవు… చాలామంది చెప్పుకోరు, నేను వీధిన పడ్డాను. పైన ఉన్న వ్యాఖ్యలు చూడు.. ఒకరికేమో ఛాన్సు రాలేదని గోల, ఇంకోరికేమో ఓ రెండు రోజుల్లో వస్తోందని “లడ్డూ” ఫూటవతోంది ( like Cadbury’s ad ).. మమ్మల్నేమీ ఆడిపోసుకోనక్కర్లేదు– మీవారికి ఓ ఛాన్సిచ్చి చూడు.ఎగిరి గంతులేస్తారు….. ” తెలియదూ.. చెప్తే అర్ధం చేసికోరూ.. ”

  డాక్టరు గారూ

  టాంక్యూ…

  Like

 6. ఫణి బాబు గారు, బాగుంది పోస్ట్. నేనైతే మా ఆవిడ ఊరు వెళ్తుంటే ‘అనుభవించు రాజా’ అనే పాట ప్లే చేస్తాను బ్యాక్ గ్రౌండ్ లో.

  Like

 7. పవన్ గారూ,

  మళ్ళీ background ఎందుకూ..హాయిగా మీరేగొంతెత్తి పాడొచ్చుగా..

  Like

 8. Happy Birthday Sir.

  Like

 9. జన్మదిన శుభాకాంక్షలు ఫణిబాబు గారూ 🌹. బాపు గారి పుట్టినరోజూ డిసెంబరు పదిహేనేగా. Many Happy Returns of the Day.

  Like

 10. నూతన సంవత్సర శుభాకాంక్షలు

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: