బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– though late, than never…


ఏదేదో చేయాలని ఉత్సాహం, తెలియనప్పుడు ఇంకోరిని అడగడానికి మొహమ్మాటం,  ego  అడ్డంరావడం, ఒకటేమిటి అన్నీ కలిసొస్తాయి, చివరకి చేతులు కాలతాయి (   మరీ నిజంగా కాదనుకోండి). ఆతావేతా డబ్బులొదులుతాయి.. ఒక్కసారి అయితేనే కానీ తెలిసిరాదు. ఈ అనుభవాల వలనే కదా నేర్చుకునేదీ?

ఇదివరకటి రోజుల్లో గుర్తుందా, ఇంటింటికీ టెలిఫోన్లొచ్చిన రోజులన్నమాట, కొత్తగా అదేదో  STD  అని ప్రారంభించి, అన్ని ఊళ్ళకీ codes  ఇచ్చేశారు. ఇదీ బాగానే ఉందీ, పోస్టాఫీసులకి వెళ్ళి Trunk Calls  బుక్ చేయక్కర్లేకుండా హాయిగా ఇంటినుండే చేసికోవచ్చూ అనిపించింది.  దానికో  Dynamic Lock  కూడా ఉండేది. ఎక్కడ తను ఆఫీసుకెళ్ళినతరువాత, భార్య పొరుగూరిలోఉన్న తన చుట్టాలతో మాట్టాడుతూ ఎడా పెడా ఫోన్లు చేసేస్తుందో అని , ఆ టెలిఫోనె కి STD lock  చేసే ప్రబుధ్ధులుకూడా ఉండేవారు. పోనీ ఇంటికొచ్చిన తరువాతైనా చేసుకోనిస్తాడా, ఆరోజుల్లో సెకనుకింతా, నిముషానికింతా అని రేట్లుండేవి. అదేదో  pulse rate  అనేవారు. ఆ రేటెలా ఉన్నా, భార్య నాలుగైదు నిముషాలు మాట్టాడేటప్పటికే, పక్కనున్న ఇంటియజమాని  Pulse Rate  మాత్రం పెరిగిపోయేది, బిల్లెంతొస్తుందో అని !! అది దృష్టిలో పెట్టుకునే ఆ పేరెట్టుంటారు. తరవాత్తరవాత  రాత్రి 11 నుండి తెల్లారేదాకా సగం రేటు చేశారు. ఏ తెల్లారుకట్లో ఫోనొచ్చిందంటే, మన ప్రాంతాలనుండే అని తెలిసిపోయేది. బ్రహ్మముహూర్తంలో లేచి కూర్చునేది మనవైపేకదా.

ఈ అంతర్జాలాలూ, “ముఠ్ఠీమే దునియా” లూ లేనప్పుడు సుఖంగా ఉన్నాము. కానీ  ఈ కొత్త సుఖాలొచ్చిన తరవాత, అందరినీ చూసి, మనకి లేదంటే తలవంపులాయె.పోనీ ఏదో ఒక్క device  తో సరిపోతుందా అంటే అదీ లేదు, ఓ PC,  పిల్లలిచ్చిన  Laptop లూ, ఇంట్లో లిక్కులిక్కుమంటూ ఉన్న ఇద్దరికీ చెరో Smart Phone,  ఏ birthday  కో గిఫ్ట్ గా ఇచ్చిన ఓ  Tab,   మరి ఇంట్లో ఇన్నేసుండగా, వాటికి  Broadband  లేకపోతే ఉపయోగమేమిటీ?   భారతీయ పౌరుడి కర్తవ్యంగా, ప్రభుత్వరంగ  BSNL  వారి Broadband  తీసికోడం. అదేం కర్మమో, ఇంట్లో Net speed  ఎప్పుడూ , ” పల్లెవెలుగు”, రైల్వేవారి పాసెంజర్ బండి లాగానే ఉండేవి. ఏదైనా సైటు తెరిచి చూద్దామంటే, దానిదారిని గుండ్రంగా తిరుగుతుందేకానీ, ఛస్తే  open  అయ్యేది కాదు.రెండేసి నెలలకి బిల్లు మాత్రం 2000 దాకా వచ్చేది . ఏదో దయతలచి, రాత్రి 9 నుండీ, ఆదివారాలు పూర్తిరోజూ ఉచిత కాల్స్ ధర్మమా అని, ఎవరితోనైనా మాట్టాడ్డానికి ఈ ఉచిత సర్వీసులు తప్ప, ఇంకో పెద్ద ఉపయోగం కనిపించలేదు. Broadband  మాత్రం నత్తనడకే.ఇలాకాదని, అదేదో 1500 రూపాయల ప్లాన్ తీసికున్నా. ఎంతచెప్పినా ఇంట్లో left, right, centre usage  ధర్మమా అని వారానికల్లా మెసేజొచ్చేది.  ”  your usage has exceeded plan, in case you want  more speed, Top up ”  అని, ముందూ వెనకా చూసుకోకుండా, వాడెప్పుడు అడిగితే అప్పుడు  Top up  లు చేసికుంటూపోయేసరికి, 6500 రూపాయల బిల్లొచ్చేసరికి  రోగం కుదిరింది. అదేదో కొత్తగా 1199  Plan  ఒకటి పెట్టారుట, వెంటనే దాంట్లోకి మారడంతో ,  Flat 2 mbp speed, 24 Hour Free Calls  తో మనసు కుదుటబడింది.పైగా దీంట్లో  unlimited data  కూడానూ. హాయిగా ఉంది.నన్ను Disturb  చేయకుండా మా  ఇంటావిడ ఫోను చేసికోడానికి, మొన్న సప్తమి రోజున్ పుట్టినరోజుకి ఓ   Cordless  కొనిచ్చి  చేతిలో పెట్టడమేమిటి, తన  mobile లో ఉన్న contacts  అందరికీ దీంట్లోనే కబుర్లు. తనెంతసేపు మాట్టాడినా నా  pulse rate  పెరగక్కర్లేదు…img_20161012_134749

ఇదిలా ఉండగా, అదేదో  Jio  వచ్చింది కదా పోనీ నా మొబైల్ ని దంట్లోకి మార్చేసికుంటేనో అనే ఆలోచనొచ్చి, కొట్టుకెళ్తే అక్కడ పెద్దపెద్ద క్యూలు,  Jio Sim  కోసం. ఆమధ్యన ఓ ఫోనొచ్చింది, మీ ఎడ్రస్ పంపితే,  Reliance 4 G Sim  పంపుతామూ అని. ఇదీబావుందీ.అనుకుని ఎడ్రసిచ్చాను. ఓ నాలుగైదురోజులకి వచ్చింది.  ఈ జియో విషయంలో ఏవో వివాదాలొచ్చాయికదా అని, sim  మార్చలేదు.కానీ సడెన్ గా నా ఫోను block  అయిందని మెసేజీ. ఏమిటా అనుకుని  Reliance Store  కి వెళ్తే తెలిసింది, వాళ్ళంతటవాళ్ళే మార్చేశారూ అని.అయినా నేను వాళ్ళ Data  ఎక్కడుపయోగించానూ, ఇంట్లోనేగా, దానికి  Wi-fi ఎలానూ ఉంది. అదండీ విషయం.

ఈ కొత్త  plan ( 1199/-) లో మొదటిబిల్లొచ్చాక చూడాలి, నిజంగా free కాల్సేనా అన్నది. మా ఇంటావిడైతే హాయిగా మెర్రీగా గంటలతరబడి వాడేస్తోంది…

సరదా సరదాగా  ఈ కథ%e0%b0%ae%e0%b0%be%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 చదివేయండి…

సర్వేజనాసుఖినోభవంతూ…

3 Responses

  1. మీ దూరవాణి కధ బాగుందండీ.ఇంకా జియో ట్రై చెయ్యలేదా? అన్ లిమిటెడ్ ప్రీ టాక్ టైం పండగ రోజుల్లో సర్వీస్ టాక్స్ ఉండదని హైయెస్ట్ డినామినేషన్ వేయించి ఎడాపెడా మాట్లాడేయడం పరిపాటి.ఆ వీక్నెస్ వాళ్ళు కాష్ చేసుకుంటారు.

    Like

  2. Pani babu garu,
    27,28 PUNE కి సతీ సమేతంగా వస్తున్నాను, మీ నెంబెర్ లేదు.నా 9900056486 కి ఒక్క సారి రింగ్ ఇవ్వరా ప్లీస్?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: