బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- give a thought…


చిన్నప్పటి రోజుల్లో , నాన్నగారితో కూరలు కొనడానికి ఏ సంతకో వెళ్ళేవాళ్ళం  కాబట్టి  కూరలు ఎన్నిక చేయడం ( అంటే లేతవా, ముదురువా అని , బెండకాయ ముచిక విరవడమో, ఆనపకాయ గోరుతో గిల్లడమో లాటివన్నమాట ), బేరాలాడ్డం   by default , మనలో వచ్చేశాయి, అవసరాన్ని బట్టి ఉపయోగిస్తూంటాము కూడా. ఎప్పుడైనా ఏ పప్పులకో కిరాణా షాప్ కి వెళ్ళడంకూడా  అలవాటైపోయింది, చాలా మంది ఆ తరం వారికి.   పప్పులెంతంత తీసికోవాలీ, అలాగే పోపు సామాన్లెంతంత తీసికోవాలీ అన్న వాటిమీద కూడా ఓ అవగాహన ఏర్పడింది. ఉదాహరణకి ఏ ఆవాలో తెమ్మంటే, ఏ ఊరగాయరోజుల్లో కిలోల లెక్కన తెస్తాము కానీ, నెలసరి సరుకుల్లో ఏదో వంద గ్రాములతోనో సరిపోతుంది.. పెద్దయిన తరువాత ఉపయోగపడతాయని అలవాటు చేశారు. అంతే కానీ, మనల్ని ఏదో హింస పెట్టాలనిమాత్రం కాదనేది, మనందరికీ తెలుసు. అయినా కానీ, మనమేదో పేద్ద శ్రమపడిపోయినట్టూ, మన పిల్లలకి అసలలాటి   so called  ” శ్రమ ” అనేదే  తెలియనట్టు పెంచాలనే సదుద్దేశంతో , పిల్లలకి  ఏదైనా పనిచెప్పడమే  ఓ పెద్ద నేరమన్నట్టుగా పెంచాము , మన పిల్లలని. ఈరోజుల్లో అయితే  ఆ పధ్ధతి ఇంకా ముదిరిపోయింది. పైగా ఎవరైనా అడిగితే, “మా పిల్లలకి మా దగ్గర చాలా  freedom  అండీ, వాళ్ళూ వాళ్ళచదువులేకానీ, అస్సలు బయటి పనులేమీ చెప్పమండీ… ” అంటూ గొప్పలుచెప్పుకోడానిక్కూడా వెనకాడరు, అదేదో పేద్ద ఘనకార్యం లా.  చివరకెలా తయారయారంటే, ఏ కొద్దిచోట్లో తప్ప, బజారుకి వెళ్ళి ఓ సరుకు కూడా సరీగ్గా తేలేని పరిస్థితి. ఇంక ఆ తరువాతి రోజుల్లో తామే తల్లితండ్రులయాక, వారి పిల్లలకేం నేర్పుతారో ఆ భగవంతుడికే తెలియాలి.

ఏదో అంతర్జాలంలో చదివేస్తే రాత్రికిరాత్రి గొప్పవారైపోరుగా. ఇంక భాష దగ్గరకి వస్తే, ఈరోజుల్లో ఇంగ్లీషులో మాట్టాడలేకపోతే వాళ్ళ జీవితాలే వ్యర్ధమనుకునే రోజులు. పోనీ అదైనా సరీగ్గా ఉందా అంటే ప్రతీదానికీ ఓ shortcuట్టాయె. ఛస్తే అర్ధం అవదు. పిల్లకో, పిల్లాడికో నడవడం వచ్చిందంటే చాలు, అవేవో  Day Care  లోకి పంపడం. అదేమీ తప్పని కాదు, ఈరోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నందువలన ఈ పరిస్థితి తప్పదు. పైగా పిల్లలు కూడా  సాధారణంగా బాగుపడతారు. Like for example..  సిగ్గుపడకుండా మాట్టాడ్డం, ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం లాటివి. ఇలాటివన్నీ ఇదివరకటిరోజుల్లో ఇంట్లోనే నేర్చుకునేవారనుకోండి. అది వేరే విషయం. కాలంతోపాటు అన్నీ మారుతూంటాయి. ఈ playschool/ Day Care  వాళ్ళు, పిల్లలకి చాలా  మంచివిషయాలే నేర్పుతున్నారనడంలో సందేహం లేదు. పైగా పిల్లలుకూడా ఉల్లాసంగా ఉంటున్నారు. వీళ్ళ పరిజ్ఞానం పెంచాలనే సదుద్దేశంతో , నగరాల్లో, పిల్లలని  అక్కడ ఉండే  Malls  కి తీసికెళ్ళి చూపించడం ఓ కొత్త ఒరవడి. పుస్తకంలో బొమ్మలు చూపించి, ఇది ఫలానా, అది ఫలానా అంటూ చెప్పడంకంటే, ఇలా ఏ  Mall కో తీసికెళ్ళి, ప్రత్యక్షంగా చూపించడం చాలా బావుంది. తమతో పిల్లలని తల్లితండ్రులూ తీసికెళ్తారు, కానీ అదేపని   Teacher  తీసికెళ్తే  ఆ పధ్ధతే వేరు.ఎందుకంటే, parents  తీసికెళ్ళినప్పుడు, కొన్ని కొన్ని కౌంటర్లకేసి తీసికెళ్ళరు, ఏ వస్తువు కావాలని పేచీపెడతాడేమో అనే భయంతో. Teacher  తో వెళ్ళినప్పుడు Only Window shopping  కాబట్టి గొడవ లేదు..

ఈగోలంతా ఎందుకు రాస్తున్నానంటే, మొన్న దగ్గరలో ఉన్న  Reliance Mall  కి వెళ్ళినప్పుడు, ఓ నలుగురైదుగురు టీచర్లూ, ఓ పాతికమంది చిన్నపిల్లలూ కనిపించారు.అంతవరకూ బాగానే ఉంది.ఆ mall  లో ఉన్న ప్రతీ counter  దగ్గరకీ తీసికెళ్ళడం, వాటి గురించి చెప్పడమూ. కానీ ఆ టీచర్లు చెప్పేటప్పుడు ఇంగ్లీషు తో పాటు, మాతృభాషలో కూడా చెప్తే,  ఈ పిల్లలకి అర్ధం అవుతుందిగా. 

ఉదాహరణకి   aubergine కి బదులు ఏ బెంగన్ అనో, వంకాయ ( మన వైపు) అనో కూడా చెప్తే బావుంటుందేమోకదూ. అలాగే   Bottle Gourd  తో పాటు  లౌకీ/ ఆనపకాయ,  … టొమాటో అంటే సులభంగా తెలిసేదానికి అదేదో  Lycopersicon esculentus అంటే కంగారు పడిపోరూ పిల్లలూ..ఒప్పుకుంటాము … ఈ భావిభారతపౌరులందరి  Final Destination  అమెరికాయే అని.అందరూ వెళ్ళలేరుగా. కొంతమందైనా దేశంలో స్థిరపడాల్సినవారేకదా, దేశవాళీ పేర్లు  తెలిస్తే ఉపయోగం కానీ, ఈ గ్రీక్ లాటిన్ పేర్లు ఎవడికర్ధం అవుతాయీ? ఇలాటివి చూసినప్పుడు చిరాకేసికొస్తుంది– ఊరుకుంటానా, ఆ టీచర్లకి ఓ సలహా ఇచ్చాను… మరాఠీ/ హిందీ లోకూడా చెప్తే బావుంటుందేమో అని. మొహమ్మాటానికి సరే అన్నారు. చూద్దాం…

IMG_20160921_100500.jpg

4 Responses

 1. కరెక్ట్ గా చెప్పారు.పిల్లలు మనం చెప్తే శ్రధ్ధగా వింటారు.తొందరగా నేర్చుకొంటారు కూడా.పెద్దయ్యాక సుఖపడతారు.

  Like

 2. చక్కని సలహా ఇచ్చారు ఆ పాఠశాల ఉపాధ్యాయులకు ,మీరన్నట్టు ఆచరిస్తే మంచిది కానీ వారి యాజమాన్యం ఆంగ్లము లోనే చెప్పమని ఆదేశిస్తున్నారు ,పాపం ఉపాధ్యాయులు ఏం చేస్తారు !

  Like

 3. < " ….. లేతవా, ముదురువా అని , బెండకాయ ముచిక విరవడమో, ఆనపకాయ గోరుతో గిల్లడమో లాటివన్నమాట ), ….. "
  ——————————
  ఈ రోజుల్లో చాలా చోట్ల దుకాణదారులు అలా చెయ్యనివ్వడంలేదండి, కొనేవాడి మీద కేకలేస్తున్నారు. సరే మాళ్ళల్లో (అదే Malls) అయితే అసలా ప్రశ్నే లేదనుకోండి. ఇంక అటువంటి కిటుకులు ఈ తరం వాళ్ళకి ఏం నేర్పిస్తాం? దానికి తోడు మీరన్నట్లు ఈ తరం పిల్లలకి "శ్రమ" అనేదే తెలియకుండా పెంచడమొకటి ఎలాగూ పరిపాటయిపోయింది కదా.
  ఇక వస్తువుల "దేశవాళీ పేర్లు" చెప్పడమా ! …….. పైన వెంకట శాస్త్రి గారన్నట్లు స్కూళ్ళ యాజమాన్యాల నిర్వాకమే అయ్యుంటుంది. కుర్ర గృహిణులు అప్పుడప్పుడు మా మాడం గారికి ఫోన్ చేసి "ఆంటీ (🙁), ఇంగ్లీష్‌లో Bottle Gourd (కాకపోతే మరో కూరగాయ) అంటామే, దాన్ని తెలుగులో ఏమంటారు" అని అడగడం మామూలే. అయితే అది కూడా ఇప్పుడు కొంచెం తగ్గింది ……. వాళ్ళ తెలుగు మెరుగయ్యి కాదు ……. గూగులమ్మ వచ్చి కొలువు తీరిందిగా 🙂. తెలుగు భాష దుస్ధితి గురించి "కాటుక కంటినీరు …….. " అనుకోవాలంతే.

  Like

 4. రాధారావు గారూ,

  పిల్లలు ముందర వినడానికి సిధ్ధపడితేనే కదా, తరవాతి కార్యక్రమం…

  శాస్త్రిగారూ,

  యాజమాన్యం వారి మాట దేవుడెరుగు, ముందర ఈ ఉపాధ్యాయులకి తెలుసునో లేదో చూడాలి…ఎక్కడ చూసినా హైబ్రిడ్డే కదండీ…

  నరసింహ రావు గారూ,

  బయటి దుకాణాల్లో మీరన్నది రైటే. కానీ మాల్స్ లో మాత్రం, మన Traditional Testing చేసికోవచ్చు. నేనైతే చేస్తున్నాను. గూగులమ్మ అనువాదాలు మీరన్నట్టు చాలావరకూ ( కనీసం ఈ పప్పులూ, కూరల విషయంలో) సహాయ పడుతున్నాయి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: