బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Will we ever grow up?


మనవాళ్ళకున్న ఓ పెద్ద జాడ్యం ఏమిటంటే,  ఏదో ఒక రంగంలో తమ ప్రతిభ ప్రదర్శిస్తే చాలు, వెంటనే  ” మా వాడంటే ..మావాడు.. ” అని  చంకలెగరేసికోవడం. ఉదాహరణకి నిన్నటిరోజున  రియో  ఒలింపిక్ క్రీడలలో , కుమారి  సింధు బ్యాడ్మింటన్ పోటీలో ఫైనల్స్ కి చేరారు. ఇది చాలా గొప్పవిషయం. అందులో సందేహమేమీ లేదు. ఆమె మన భారతదేశాన్ని  represent  చేస్తూవెళ్ళిన క్రీడాకారిణి. అందులోనూ ఏదో అరకొరగా పతకాలు  తెచ్చే మన క్రీడాకారుల విషయంలో మరీ గొప్ప. అప్పుడెప్పుడో సైనా నెహవాల్ ప్రపంచ ఛాంపియన్ అయినప్పుడు, ఆ వెర్రితల్లి హైదరాబాదులో  జన్మదాఖలా లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆమెనీ ఏ బ్రాండ్ ఎంబాసిడరో చేసేవారు. ఇంకొకావిడ, హైదరాబాదీ అవడంతో హాయిగా బ్రాండ్ ఎంబాసిడరయింది ( పోనిద్దురూ పాకిస్తానీవాడిని పెళ్ళిచేసికుంటే ఏమిటీ? ).  భాగ్యనగరంలో ” ఆధార్  కార్డ్  ” ఉందా లేదా? అదీ లెక్క. మరావిడ తెలంగాణా రాష్ట్రం గురించి ఎంత ప్రచారం చేస్తోందో ఆ ” అల్లా ” కే ఎరుక. సయనా నెహవాల్ ప్రపం చ ఛాంపియన్ అయినప్పుడు, తీరిగ్గా కూర్చుని ” అదీ పెద్ద గొప్పేనామ్మా..” అని ఓ తెలివితక్కువ ప్రకటనకూడా చేసింది.Leave it  less said the better..

 ఇంక ప్రస్తుతానికి వస్తే, నిన్నటి రోజంతా మన టీవీల్లో, సిందూ గురించే కార్యక్రమాలు.     ప్రసారమాధ్యమాల్లో కనిపించడానికి , మన రాజకీయనాయకులకి ఇంకో మహదవకాశం. ఏదో తామే ఒలింపిక్ క్రీడల్లో ఆడేసినంత హడావిడి చేస్తున్నారు. ఎవడుపడితే వాడు  మా అమ్మాయంటే మా అమ్మాయనేవాడే. అది రైటేనండి బాబూ. .ఓ నెల్రోజులుపోయాక , ఎవరికివారే తమ పార్టీకి చెందిందా, తమకులానికి చెందిందా అనే ప్రక్రియ ప్రారంభించి, మొత్తానికి ఏదో ఒక లేబుల్ తగిలించడం ఖాయం.ఈ అమ్మాయికి మరి మన తెలంగాణా చంద్రుడు గారు, ఏం పదవి ఇస్తారో చూడాలి. పాపం ఆంధ్ర చంద్రుడికి ఛాన్స్ లేదూ అనలేము. ఎందుకంటే  ఆమె   తల్లితండ్రులది మాచెర్ల ట. ఈమెకి గొడవలేదనుకోండి– పుట్టడమే భాగ్యనగరంలో . ఇందులో గొడవేమిటీ అనకండి… ఎందుకంటే  మాచెర్ల పేరుతో ,   ఆంధ్రప్రదేశ్ లో ఒకటీ, తెలంగాణా లో మూడూ ఉన్నాయి.. ఇప్పుడామ్మాయి ఆంధ్రా అమ్మాయా, తెలంగాణా అమ్మాయా అని తేల్చేది? ఇది నేననేది కాదు, అప్పుడే  Facebook  లో కొట్టుకోడం మొదలెట్టారు. అందరి వంశవృక్షాలూ , మూలాలూ తెలుస్తాయి.  The whole thing looks so funny and silly.. పోనీ ఏ జాతీయక్రీడలో, లేదా ఏ గ్రిగ్గు పోటీలో అయితే  ఫలానా రాష్ట్ర ప్రతినిధీ అనొచ్చు. కానీ ఆమె ఇక్కడ అంతర్జాతీయ పోటీల్లో, మన దేశ ప్రతినిధి , అనేమాట, మిగిలినవారి సంగతెలా ఉన్నా, మన తెలుగు వారు మర్చిపోయారు.

అలనాటిరోజుల్లో శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు  ఓ వ్యాసం రాశారు…ఆంధ్రత్వం  అని. చదివి ఆనందించండి.

 

4 Responses

 1. చాల బావుఃది

  Like

 2. గురువు గారు, మిక్కిలి సమయోచితమైన వ్యాసం. మన సూరత్వం గురించి, మన నిర్వాకాల గురించి మొక్కపాటి వారు ఏనాడో ఎండగట్టేశారని తెలిసి ఆనందించాలో, దుఃక్కించాలో తెలియలేదు. రెంటిని పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

  Like

 3. Macherla veera vanita

  Like

 4. మూర్తి గారూ,
  మీ స్పందనకు ధన్యవాదాలు.

  రాముడు గారూ,
  గత రెండుమూడు రోజులుగా జరుగుతూన్న తమాషా చూశారుగా.. ఆమె కులం ఏమిటో తెలుసుకోవాలనే ఆత్రం ఎక్కువగా కనిపిస్తోంది.. మీ స్పందనకు ధన్యవాదాలు.

  మోహనరావు గారూ,

  ఇంక చెప్పేందుకేముందండీ…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: