బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- గబ్బిట “Wodehouse” గారు.


PGW_001_1_19

ఇదేమిటీ ఇదేదో కొత్త పేరులా ఉన్నట్టుందీ అనుకోకండి. ఇంగ్లీషు నవల్లు చదివే అలావాటున్న చాలామంది,  PGWodehouse  పేరు తో సుపరిచితులే. మళ్ళీ మధ్యలో  కొత్తగా తమాషాగా ఈ కొత్త పేరేమిటీ? ఈమధ్యన ఇంగ్లీషోళ్ళు కూడా  మన తెలుగు ఇంటిపేర్లు ” హడప్ ” చేసేస్తున్నారా ఏమిటీ అనే సందేహం కలగొచ్చు. అలాగేమీ కాదులెండి, ఈయన  పదహారణాల శుధ్ధతెలుగు బిడ్డే. అందులో సందేహం ఏమీ లేదు, కారణం ఆయన నాకు సుపరిచితులు, హాయిగా  కమ్మనైన తెలుగులోనే మాట్టాడుకుంటాం.

నేనూ, మా ఆవిడా చేసికున్న అదృష్టం ఏమిటంటే, మంచి స్నేహితులతో పరిచయం.నా మాటెలా ఉన్నా, తనకైతే పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఆయన  రాసిన  ” సరదాగా కాసేపు ” పుస్తకావిష్కరణకి వెళ్ళగలిగాను. కానీ ఈమధ్యన   ” సరదాగా మరికొంతసేపు ” పుస్తకావిష్కరణకి వెళ్ళలేకపోయాను.  చదివే యోగం అంటూ ఉంటే , అదే లభిస్తుంది. ఈమధ్యన మా  ఇంటికి వచ్చినప్పుడు, ఆ పుస్తకం కాస్తా వచ్చేసింది, ఎలా అంటే…GKM 1GKM2 ఇలా…. రెండు కాపీలు కాదండోయ్ ( మళ్ళీ ఎవరైనా అడిగితే ఇవ్వాల్సొస్తుంది కూడానూ ). ఒకటే , కానీ ఇద్దరి చేతుల్లోనూ పెట్టారు. అదీ విషయం.

అదేదో  Old Monk  లూ అవీ, పాతబడేకొద్దీ బావుంటాయని విన్నాను. అలాగే కృష్ణమోహన్ గారు కూడా వయసు పెరిగేకొద్దీ, ఇంకా.. ఇంకా ..తన కలానికి ( కీ బోర్డు) పదును పెట్టినట్టనిపిస్తోంది. ఈ తాజా ” సరదాగా మరికొంతసేపు ” లో మొత్తం పదిన్నొక్క కథలున్నాయి. దేనికదే ఓ ” అఛ్ఛోణీ” అనడం లో ఎటువంటి సందేహమూ లేదు.

ఆ పెద్దాయన రాసిన కథలు ఎంతమంది చదివారో తెలియదు కానీ, ఒక్కో కథా చదువుతూంటే, అసలు కథలన్నీ ఈయనే రాసుంటారూ, ఆ  Wodehouse  అన్నది ఈయన కలం పేరైనా అయుంటుంది, లేకపోతే ఆ పెద్దమనిషే ఈయనరాసినవాటిని Translate  చేశారేమో అనిపిస్తుంది. మామూలు గా  ఇంగ్లీషునుండి , తెలుగులోకి అనువదించడానికి అంత శ్రమేమీ పడక్కర్లేదు ఈరోజుల్లో అయితే. గూగులమ్మ ని ప్రార్ధిస్తే పనైపోతుంది అనుకునేవాడిని ఇన్నాళ్ళూ.. సరదాగా ఇవేళే try  చేశాను–

”  I am doing fine ” అని టైపు చేసి  Translate  చెయ్యమంటే  ”  నేను జరిమాన చేస్తున్న ” అని చూపించింది. శుభం. పాపం గూగులమ్మ,  fine  అన్న పదాన్ని “జురుమానా ” గానే  identify  చేస్తూందన్నమాట. అదృష్టంకొద్దీ , కృష్ణమోహన్ గారు, తన బాణీలోనే రాశారు.

ఉదాహరణకి– ఇంగ్లీషు కథల్లో వచ్చిన పాత్రల పేర్లే తీసికోండి,ఈ పుస్తకంలో ఒక్క ఇంగ్లీషు పేరు కనబడదు. एक दम  nativity maintain  చేశారు. ఆపేర్లు చదువుతూంటే ఏ బాపూ గారి సినిమాయో, (అంటే గ్రామీణ వాతావరణాన్ని రంగరించి) చూస్తున్నట్టే అనిపిస్తుంది. శుధ్ధ తెలుగు పేర్లు.. like…

John Hamilton Potter   రఘుపతి

Bobbie Wickham— శశిరేఖ

Lady Wickham—శ్రీమతి ప్రసూనాంబ

Cliford Gandle—ప్రసాద్     గా  ” పరకాయ ప్రవేశం ” చేసేశారు.

అలాగే…

Monkey Business కథలో

The Tankard—మగ్గుబీరువాడు.

Mr. Mulliner–  భాగోతుల సూతరాజుగారు

Small Bass – జిన్నారా

Rosalie Beamish– సుభాషిణి.

ఊరికే పేర్లు మారిస్తే  ఇంగ్లీషు కథ అయిపోతుందా, చిత్రం కాపోతే, వాటికి అనుగుణంగా సందర్భాలూ, వాతావరణమూ కూడా మార్చొద్దూ మరి.

“  He was an Assistant Director  in the employment of  Perfecto Zizzbaum  Motion Picture Corporation of Hollywood…. “

దాన్ని కాస్తా… “ సంతోషీమాత” ప్రొడక్షన్ యూనిట్ …గా మార్చేశారు..

పుస్తకం ఏక బిగిన చదివించాలంటే రచయితకి భాష మీద unequivocal  పట్టుండాలి. అదైతే పుష్కలంగా ఉందే. అనువాదాలన్నవి, ఏ డిక్షనరీ పెట్టుకునైనా చేయొచ్చు, కానీ ఈ ” అనుసృజన ” అనేదుందే, దాని దుంపతెగా, అందరికీ సాధ్యపడదు.   పెట్టిపుట్టాలి.  ఏ పరభాషా పుస్తకమో చదివేసి, దాంట్లో ఉండే ఎస్సెన్స్  పట్టేసికుని తెలుగులో రాయడం వేరూ, కానీ  Original  కథలో ఉండే,  వాతావరణం అనండి, భావోద్వేగాలనండి, ఏవీ చెక్కుచెదరకుండా  మక్కికిమక్కీ  ” తెలిగించడం” అంత సాదాసీదా వ్యవహారం కాదు.  ఆ విషయంలో నూటికినూరుపాళ్ళూ కృతకృత్యులయ్యారు రచయిత.

ముళ్ళపూడి వారి  ” రాజకీయ భేతాళ పంచవిశతి ” లాగ, హాయిగా , ఏ జీడిపప్పు పలుకో నోట్లోవేసినున్నట్టు,  చదివేయొచ్చు.  ఆ మహనీయుడి లోటు కొంతవరకూ తీర్చారు కృష్ణమోహన్ గారూ…  Hats off..

బైదవే, నేను నా బ్లాగులో రాసే టపాలు చదివి నాకు ” బ్లాగు బాబాయ్ ” అని పేరెట్టారు. ఇప్పుడేమో ఈయన, నేను  Facebook  లో పెడుతూన్న  post   ల ధర్మమా  అని  ”  Rgistrar of Births and Deaths గా మార్చేశారు. శుభం భూయాత్… గబ్బిట Wodehouse గా నామకరణం చేసింది, మా స్నేహితుడు శ్రీ దాసరి అమరేంద్ర గారు.

శ్రీ కృష్ణమోహన్ గారి గురించి నేను ఇదివరలో రాసిన   టపా 1     టపా 2  కూడా చూడండి.

 

3 Responses

 1. బాబాయ్ అన్న పదం చూస్తే బెరుకు పుడుతోందండోయ్ 🙂

  చీర్స్
  జిలేబి

  Like

 2. registrar of births and deaths—hmm a responcible thankless job, as it is unpaid

  Like

 3. జిలేబీ,

  అంత హాని ఏం చేశానూ ?

  డాక్టరు గారూ,

  Yes it is…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: