బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Moving with times…

ఎప్పుడైనా, ఎక్కడైనా  ” వాతావరణం ” లో మార్పంటూ వస్తే, చాలామందికి నచ్చదు.  ఆఫీసుల్లో చూడండి, అప్పటిదాకా అలవాటు పడ్డ  పై అధికారి   Transferయ్యో, రిటైరయ్యో వెళ్ళిపోతే, కొత్తగా వచ్చినాయనతో   adjust  అవడానికి టైము పడుతుంది.. ఏదో మొత్తానికి , కొత్తగా వచ్చినాయన ఇష్టాయిష్టాలు కూపీలాగి, ఆయన్ని కూడా మంచి చేసికుంటారు. మనిషైతే మారాడుకానీ, పనాగదుగా. ఏదో మన భ్రమ.. ” పోనిద్దూ ఈ కొత్తాయనకేం తెలుసూ ఉండేలు దెబ్బ..”  అనుకునే ఛాందసులూ ఉంటారు..  అలాటివారిమానాన్న  వాళ్ళని వదిలేసి, కాలం సాగిపోతుంది.

ఎవరింటికేనా వెళ్ళినప్పుడు, వాళ్ళింట్లో ఉండే పసిబిడ్డని , ఎత్తుకుందామనుకుంటే, కెవ్వుమంటాడు. వాడికీ కొత్తే మరి. చివరకి వస్తాడులెండి, ఏ బట్ట తడపడానికో…మన చిన్నప్పుడు, మన అమ్మలు  పొయ్యి కింద కట్టెలు పెట్టి పొద్దుటి భోజనమూ, బొగ్గుల కుంపటిమీద సాయంత్రం తిండీ, సంతర్పణల్లోనూ, పెళ్ళిళ్ళల్లోనూ వంట బ్రాహ్మలు గాడిపొయ్యిమీదా  వంటలు చేసేవారు. చివరాఖరికి స్నానానికి వేణ్ణీళ్ళు కూడా , ఏ డెగిసానో పొద్దుటే పెరట్లో పొయ్యిమీద పెట్టేవారు.మధ్యలో “పొట్టుపొయ్యి” లు కూడా వచ్చాయి. వాటిలో రంపంపొట్టు కూరుకోడం, ముందురోజు ముఖ్య కార్యక్రమం. పోసుకున్నవాళ్ళు పోసుకోవడం, తిరిగి ఆ వెలితి నీళ్ళు పోయడమూ.. నిత్యాగ్నిహోత్రంలా పొద్దుట పదింటిదాక మండుతూనే ఉండేది.Coal stove

PoyyiNPPStove

70 ల్లో అనుకుంటా, గ్యాసు పొయ్యీ, దానితో సిలిండర్లూ వచ్చాయి.. నగరాల్లో సుళువు పధ్ధతులు కావాల్సినవాళ్ళు ” కొత్త వింత పాత రోత ”  జనాలు  కొనుక్కుని అందులో ఉండే సుఖాలు అనుభవించారు.  అప్పటికి చాలాచోట్ల  ఇంకా వత్తుల స్టవ్ లూ,   ప్రెషర్ స్టవ్వులూ వాడకంలో ఉండేవి. ఏదో రోజులెళ్ళిపోతున్నాయిగా, మళ్ళీ ఇవేవో కొత్తగా వచ్చినవెందుకూ అనుకునేవారు. పైగా వీటిమీద పుకార్లు కూడా వచ్చేవి. సాధారణంగా జనాలు ” అదిగో తోకంటే ఇదిగో పులి.. ” అనడం పుట్టుకతో వచ్చిన బుధ్ధాయె…అక్కడెక్కడో పక్క ఊళ్ళో ఆ గాసు  ” బండ ” పేలిపోయిందిటర్రా.. ఆ సిలిండరుకి ” బండ ” నామధేయం ఇవ్వడం మనవాళ్ళకే చెల్లింది.ఏదైతేనేం, మొత్తానికి  కొత్తగా వచ్చిన గాసు స్టొవుల దరిదాపుకి  ఎవ్వరూ వెళ్ళలేదు. తరవాత్తరవాత  ఎక్కడ చూసినా గాస్ సిలిండర్లూ, చివరకి  Piped Gas  లోకొచ్చేశారు.

చెప్పొచ్చేదేమిటంటే  కొత్తగా ఏదైనా వస్తే, అంత సుళువుగా ఒప్పుకోరు జనాలు. చుట్టుపక్కలుండేవాళ్ళు ఉపయోగించగా … ఉపయోగించగా… మనక్కూడా ఏమైనా ఉపయోగిస్తుందా లేదా అని రూఢీ చేసికుంటేనే కానీ లొంగరు. ఈ క్రమంలోనే,  Interne ట్టూనూ… కొత్తగా వచ్చినప్పుడు, ఈ కంప్యూటర్లూ అవీ యువతరానికి సంబంధించినవే , మనకెందుకులెద్దూ అనుకుని, చివరకి అప్పుడే పుట్టిన పిల్లాడిదగ్గరనుండీ ,  ఓ చేతిలో రిమోట్టూ, ఇంకో చేతిలో   Smart Phoనూ , చేతులు రెండే కాబట్టి బతికిపోయాము కానీ, ఇంకో రెండు చేతులుకూడా ఉండుంటే ఇంకేం పెట్టుకునేవారో…. అందరినీ చూస్తూ మరీ  తనొక్కడూ ఎందుకు మిగిలిపోవడమని, వీటికేసి ధ్యాస పెట్టారు. ఇంట్లో ఉండే   కొడుకులకీ, కూతుళ్ళకీకూడా ఓ మంచి అవకాశం– ఓ  Smart Phone  వీళ్ళకిచ్చేస్తే, హాయిగా ప్రతీదానికీ జ్ఞానబోధలు తప్పుతాయీ అనేమిటీ, లేక అందరితోపాటూ మా పేరెంట్స్ కూడా  Techsavvy  అని చెప్పుకోడానికైతేనేమిటి, ఇప్పుడు ఎక్కడ, ఎవరి చేతులో చూసినా ఈ కొత్త అలంకారాలతో కళకళ లాడుతున్నాయి. ప్రతీ  Social network  లోనూ sign up  అయిపోవడమే. ఎవరిని చూసినా తప్పనిసరిగా   Facebook, Whatsapp  లైతే మరీనూ.. వీటి ధర్మమా అని, ఖాళీగా ఉంటారేమో,  ఎప్పుడో 50 ఏళ్ళక్రితం తనతో చదువుకున్న స్నేహితులతో కూడా  connect  అయిపోయి, ” నువ్వెక్కడున్నావంటే నువ్వెక్కడా.. ” అని చాటింగులూ, పైసా ఖర్చులేదుకాబట్టి  దాంట్లోనే ఫోను కాల్సూ… ఒకటేమిటి, ఫొటోలు పంచుకోడాలూ అంతా హడావిడే. వర్షాకాలంలో నదులు అన్నిటికీ  ” జలకళ ” వచ్చినట్టుగా, ప్రతీవారి  especially Senior Citizens  మొహాలు, ఇదివరకటిలాగ , ముడుచుకున్నట్టు కాక , విచ్చుకుంటున్నాయి. ఇదివరకటిరోజుల్లో ఉండే ” అమ్మలక్కల కబుర్లు ” ఈ చాటీంగ్ ల ధర్మమా అని  ” నిత్యకల్యాణం పచ్చతోరణం ”  అయ్యాయి.

 ఇవేళ ఓ మంచి కథను పరిచయం చేయాలిగా మరి… చదివేయండి.. 11 పేజీలుంటుందికదా అని దాటేయకండి.. సరదాగా  తనివితీరా నవ్వుకోవచ్చు…  ..శ్రీవారితో సినిమాకి– కొండముది హనుమంతరావు

 

 

%d bloggers like this: