బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–” బ్రహ్మోత్సవం” my take…


    సాధారణంగా  ఎవరి అభిరుచిని బట్టి , వారికి నచ్చిన పుస్తకం చదవడమో, లేక ఏదో సినిమా చూడడమో చేస్తారు.. ఇదివరకటి రోజుల్లో ప్రసారమాధ్యమాలు , మర్నాడు సాయంత్రం, అంతకుముందురోజు అర్ధరాత్రిదాకా వచ్చిన వార్తలకే పరిమితమయ్యే వార్తాపత్రికలు, రేడియో మాత్రమే.. కాలక్రమేణా టీవీలూ, ఈరోజుల్లో అయితే   ” मुठ्ठी मे दुनिया ” అంతర్జాలమూనూ.  ఎక్కడైనా భూకంపం వచ్చి ఇళ్ళు కదిలేసరికల్లా, ప్రపంచం అంతా క్షణాల్లో తెలిసిపోతోంది.. క్షణాలేమిటీ, భూమి కంపించేది కొన్ని సెకన్లైనా, ఇంకా కదలడం ఆగేలోపలే తెలుస్తోంది. ఇంత వేగంగా ప్రపంచం ముందుకుదూసుకుపోతూంటే, ఇంకా  ఏడు తరాలూ, బంధుత్వాల గురించీ ఆలోచనలకి స్థానం ఎక్కడుంటుందీ?  इषारा काफ़ी है…  నేనెక్కడికి వెళ్తున్నానో ఊహించేసుంటారు కదూ. ఎంతైనా మీ ఆలోచనలముందర మేమెంతా? తాబేలూ కుందేలు కథలోలాగ  జీవితాంతం తాబేళ్ళమే.. ఏమిటో ఆనాటి సంబంధ బాంధవ్యాలూ, ఆత్మీయతలూ పట్టుకు వేళ్ళాడుతూన్న వాళ్ళం.  అవన్నీ  outdated  అని తెలుసుకోడానికి ఇంకొంత టైము పడుతుందేమో. ఆలోపులో పుణ్యకాలం కాస్తా వెళ్ళిపోతుంది.

 అయినా, టివీల్లో వచ్చే ” జబర్ దస్త్ ” లాటి దౌర్భాగ్యపు కార్యక్రమాలూ, ఎప్పుడు ఎవరి పీకనొక్కుదామా అని చూపించే సీరియళ్ళకీ అలవాటు పడ్డ ప్రాణాల కి ఈ సెంటిమెంట్లు ఎక్కడ అర్ధమవుతాయీ?  గత నాలుగురోజులుగా ప్రతీ  Social network  లోనూ, పేపర్లలోనూ హోరెత్తించేస్తున్నారు.   ఈరోజుల్లో వ్యవహారం ఎలా ఉందంటే, day in and day out  ఏదో ఒక పాటనో, ఎవరో ఓ వ్యక్తి గురించో, లేక ఓ సంస్థ గురించో ప్రేక్షకులని  bombard  చేసేస్తే చాలు. సగం పనైపోయినట్టే. సదరు విషయం ఓ సెలెబ్రెటీ అయినా అవొచ్చు, లేదా దానిమీద ఓ విపరీతమైన ఏహ్యభావమే నా రావొచ్చు.   Exactly  అదే జరిగింది ఈమధ్యన రిలీజైన  ” బ్రహ్మోత్సవం ” విషయంలో.

 ఓ విషయం చెప్పండి.. అందులో వినకూడని విషయమేమైనా ఉందా, పోనీ మామూలు సినిమాల్లోలాగ double meaning dialogues  ఉన్నాయా, లేక item songs కానీ overexposed heroins కానీ ఉన్నారా. ఆ అమ్మాయెవరికో నడుంమీద ఓ పుట్టుమచ్చ మాత్రమే చూపించారు. అదీ తప్పేనా? అసలు సెన్సారు బోర్డువాళ్ళే షాక్కయుంటారు, ఇది తెలుగు సినిమానా అని. చుట్టాలూ, ఆత్మీయతలూ , సంబంధ బాంధవ్యాల గురించి, గూగుల్ లో వెదకాల్సిన ఈ రోజుల్లో,  సినిమాలో చూపించినవి మింగుడు పడలేదు. పైగా ఆ గూగులమ్మకేం తెలుసూ అసలు ఇలాటివికూడా ఉంటాయని? న్యూక్లియర్ కుటుంబాలకి అలవాటు పడ్డ ఈరోజుల్లో, ప్రతీవాడూ కజిన్ , ప్రతీ పెద్దవారూ అంకుల్, ఆంటీలు గా రూపాంతరం చెందిన ఈరోజుల్లో, అత్తయ్యా, నాన్నగారూ, మావయ్యా ఏమిటీ  just rubbish  కదూ? నచ్చలేదంటే మరి ఎలా నచ్చుతుందీ? మహా అయితే తాత, అమ్మమ్మ, నానమ్మా, అదికూడా తమ పిల్లలని చూడ్డానికి, గుర్తుంటారు. అలాటిది మరీ ఏడు తరాలా   No way.. దేనికైనా అర్ధం పర్ధం ఉండొద్దూ? అసలు తెలుగు సినిమా అంటే ఎలా ఉండాలమ్మా? ఓ హీరో, ఓ కమేడియన్, ఇద్దరు హీరోయిన్లూ, ఆడా మగా తేడా లేకుండా వెకిలివేషాలూ, ద్వందార్ధ డయలాగ్గులూ, ఉంటే గింటే  ఓ ” నిర్భయ” ఘట్టం. అదీ సినిమా అంటే..  అంతేనే కానీ, ఏదో తిరుపతి వెంకన్నని నమ్ముకుంటారు కదా అని ” బ్రహ్మోత్సవం ” పేరుపెట్టి, ఇలా మోసం చేయొచ్చా హ..న్నా..

 ఆ సినిమాలో లోపాలంటారా, చాలానే ఉన్నాయి.  Bulk mail  ద్వారా తెలిసున్న నటులందరినీ పిలిచేసి, అందరికీ తలో లైనూ ఇచ్చారు..కెమేరా, దర్శకుడూ ఎప్పటికప్పుడు  clap  కొడుతూ, తలో సీనూ తీసేశారు. పాపం ఆ ఎడిటర్ గారికి ఖాళీ ఉండుండదు. తనకి నచ్చిన సీన్లని వరసలో copy  చేసేసి paste  చేసి మనమీదకి వదిలేశాడు. తలా తోకా లేదు. ఏదో సుమతీశతకం గురించి ఓ డాక్యుమెంటరీ చూసినట్టుంది. మా అబ్బాయన్నట్టు ఆ ఎడిటర్ గారికి ఇవ్వాల్సిన remuneration  ఇచ్చుండరేమో.  Skype  లోనో,  Facetime  లోనో  తల్లితండ్రులతోనూ, సోదరుడితోనూ మాట్టాడిన అమ్మాయి, తన తండ్రి పోయినప్పుడు ఎక్కడా కనిపించలేదు. రావడానికి టైముండుండదు. ఏసీన్ కీ సంబంధం లేదు. విడివిడిగా ఏ సీనుకాసీను చూస్తే, ఓహో..అలాగా.. అనుకుంటాము. ఏ రిసెప్షన్ కో వెళ్ళినప్పుడు, మరీ కూర ఓ ప్లేటులోనూ, అన్నం ఓ ప్లేట్ లోనూ, మిగిలినవన్నీ తలో ప్లేట్ లోనూ వేసికోముకదా, అన్నిటికీ ఒకే ప్లేట్ కదా.పైగా ఎన్ని ప్లేట్లు తీస్తే , ఆ క్యాటరర్ అన్ని శాల్తీలకి లెక్కేస్తాడు. అందుకే ఓ ప్లేటూ, రెండో మూడో బొచ్చెలూనూ. అలా అన్నిటినీ  పధ్ధతిలో చూపిస్తేనే పుణ్యం పురుషార్ధమూనూ. అందుకే ఇదివరకటి రోజుల్లో అరిటాకులోనో, అడ్డాకుల్లోనో పెట్టేవారు విందుభోజనాలు. అదీతేడా ఈ సినిమా  Intention was noble.. but execution awful.

 

 

5 Responses

 1. నేను అనుకోవడం మొదట టైటిల్ ఆలోచించి తరవాత సినిమా తీశారేమో.మీరు చెప్పినట్లు ఉద్గేశ్యం బ్రహ్మాండం.ఉత్సవం ముక్కలైపోయింది.ఫార్మ్యులాకి దూరంగా తీసినా ఎడిటర్ దెబ్బ తినిపించాడు.

  Like

 2. ఫణి బాబు గారూ. అద్భుతంగా ఉన్నది మీ సమీక్ష. మీ వ్యాసం నుంచి నాకు నచ్చిన బంగారం
  1. అసలు సెన్సారు బోర్డువాళ్ళే షాక్కయుంటారు, ఇది తెలుగు సినిమానా అని.
  2, Bulk mail ద్వారా తెలిసున్న నటులందరినీ పిలిచేసి, అందరికీ తలో లైనూ ఇచ్చారు..కెమేరా, దర్శకుడూ ఎప్పటికప్పుడు clap కొడుతూ, తలో సీనూ తీసేశారు
  3. ఈనాటి తెలుగు సినిమాలన్నీ ముందు పేరు ఆతరువాత హీరో ఎవరు, ఈ రెండు “ముఖ్య” విషయాలు నిర్ణయించిన తరువాత ఒక కథ వ్రాయటం. మీరు వ్రాసిన వ్యాక్యం “ఈ సినిమా Intention was noble.. but execution awful” మీ వ్యాసానికి పేరుగా పెట్టతగ్గది..

  నా ఫేసుబుక్కు లో మీ వ్యాసం పంచుకుంటున్నాను.

  Like

 3. సూపర్ వాక్యం !

  >> ఏదో సుమతీశతకం గురించి ఓ డాక్యుమెంటరీ చూసినట్టుంది

  జిలేబి

  Like

 4. రివ్యు బాగున్నది….ఇటు మోటు ప్రేక్షకులకి అటు సినీ నిర్వాహకులకి తగిన విధంగా “వడ్డించారు”.

  Like

 5. రాధారావు గారూ,
  ఏమిటో అనుకుని ఏమిటో చేసేటప్పటికి అంతా గందరగోళం అయిపోయింది.

  శివరామప్రసాద్ గారూ,

  మీ అభిమానానికి ధన్యవాదాలు.

  జిలేబీ,

  అయితే మీ రేటింగ్ ఇచ్చేశారన్నమాట. థాంక్స్

  రాధాకృష్ణగారూ,

  మరీ ” వడ్డించ” లేదండీ, ఏదో నాకు తోచింది నాలుగు ముక్కల్లో… థాంక్స్

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: