బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– చెప్పకూడదనుకుంటూనే….


ఓ ఏడాది క్రితం నేను తెలుగు వికీపీడియా గురించి ఒక  టపా పెట్టాను .  అప్పుడు ,  తెలుగు వికీలో చూసిన ఒక  misprint  గురించి రాశాను. దాన్ని సహృదయంతో స్వీకరించి, తప్పును వెంటనే సరిచేశారు. అంతవరకూ బాగానే ఉంది. అక్కడితో ఆపకుండా, కొంత  “జ్ఞానబోధ “కూడా చేశారు. ఆ టపా చదివితే మీకే తెలుస్తుంది. ఇది ఎలా ఉందంటే… ” నీ నెత్తిమీద బూజు పడిందిరా ..” అంటే  ”  అదేదో నువ్వే తీసేయ్..” అన్నాట్ట వెనకటికి ఎవడో.. ఏదో  ” విజ్ఞానఖని ”  అంటారు కదా అని, అవసరార్ధం , తెలుగు మహనీయుల గురించి, తెలుగులో సమాచారం కావాల్సినప్పుడు, చూస్తూంటాము. తప్పులు రాసినప్పుడు, దాన్ని కూడా , పాఠకులనే సరిచేయమనడం ఎంతవరకూ సమంజసమంటారు? ” ఏదో ఆయనే ఉంటే ..” అని ఒకావిడ అన్నట్టు, ఆమాత్రం తెలివితేటలే ఉంటే ఇలా ఎందుకుంటాము?

 కానీ ప్రస్థుత విషయం రెండు వికీల్లోనూ ఉన్న సమాచారం గురించి. తెలుగు వికీలో శ్రీ కె. విశ్వనాథ్ గారి గురించి ఏప్రిల్, 19 అన్నారు KV2 అదే విశ్వనాథ్ గారి గురించి,  Wikipedia   లో KV3  అన్నారు. ఇందులో ఏముందీ, పేద్ద హడావిడి చేస్తున్నారూ అంటారేమో,. చేయాల్సొచ్చింది. నేను ప్రతీరోజూ మహనీయుల జయంతి/ వర్ధంతి సమాచారాలు, నామీదున్న గౌరవం అనండి, అభిమానం అనండి, ఎంతో మంది చదవడమే కాక, చాలామంది  share  కూడా చేసికుంటారు. అలాటప్పుడు నాకు కూడా ఓ బాధ్యత అనేది ఉంటుందిగా– సరైన సమాచారం పాఠకులకి ఇవ్వాలని. అనుకున్నట్టుగానే ఒకరు సందేహం వెలిబుచ్చారు, “మాస్టారూ ఫిబ్రవరి 19 అని చదివానూ, మీరేమో ఏప్రిల్ 19 అంటున్నారూ, ఏది రైటూ..”. వెంటనే స్పందిస్తూ, నేను తెలుగు వికీలో చదివిన సమాచారం   Copy paste  చేశాను.

 దివంగతులైన celibreties  గురించి రాసినప్పుడు, ఇలాటి తేడాలొచ్చినా, ఓ  disclaimer  రాస్తూంటాను. ” ఫలానా దాంట్లో ఇలా ఉందీ, ఫలానా దాంట్లో అలా ఉందీ.. తేదీ ఏదైనా అటువంటి మహనీయుడిగురించి స్మరించుకోవడం మన ధర్మమూ…” అంటూ. గొడవుండేది కాదు. కానీ సజీవులైన మహనీయుల గురించి రాసేటప్పుడు, ఒక్కసారి వారినే సంప్రదిస్తే ఇలాటి తప్పులు దొర్లే అవకాశం ఉండదుగా. దాన్నికూడా వికీ చదువరులనే చేయమంటారేమో?.

  దేశంలో ఈ జన్మతిథుల గురించి ఇప్పటికే చాలా విన్నాం. అప్పుడెప్పుడో, మన భారతీయ సైనికాధిపతి గారు, నానా హడావిడీ చేశాడు.  మా మంత్రసాని చెప్పిన ప్రకారం నేను ఫలానా సంవత్సరంలో పుట్టానూ, ఇంకో ఏడాది సర్వీసుందీ అన్నాడు. ఠాఠ్ అదేం కుదరదూ అని ఆయన్ని రిటైరు చేసేశారు. అయితేనేం, ” తన్నితే బూర్ల బుట్ట లో పడ్డట్టు..”, హాయిగా ఏడాది తిరక్కుండా కేంద్రంలో మంత్రి అయి కూర్చున్నాడు. ఆయనడిగినట్టు ఇంకో ఏడాది  Extension  ఇస్తే  ఈ భోగాలుండేవా మరి? అయిదేళ్ళపాటు హాయిగా ఉండొచ్చు. ప్రభుత్వ పెన్షన్,( పైగా OROP కూడానూ..) ఆ తరువాత పార్లమెంటు సభ్యులకిచ్చే పెన్షనూ తీసికోవచ్చు. ఏవో  Memoirs  అని పాత ప్రభుత్వంలోని లొసుగులు  రాయొచ్చు.

   Wikipedia  లో ఏవిషయం గురించైనా సందేహం ఉంటే  బ్రాకెట్లో   citation needed  అని  రాస్తూంటారు.. ఇంక వాళ్ళ బాధ్యత ఏమీ ఉండదు. కావాల్సొస్తే తీసికోడం, లేకపోతే ఓ దండం పెట్టడం. అలాగే  సజీవులైనవారి గురించి రాసేటప్పుడు ఒక్కసారి  just  ఒక్కసారి, ఆ విషయం, వారినుంచే  confirm  చేసికుంటే బావుంటుందని. అలాగే ఇదివరకోసారి, ఓ ప్రముఖ దర్శకుడి గురించి రాస్తూ… ఎరక్కపోయి తెలుగు వికీలో రాసిన వారి అసలు పేరు కూడా ప్రస్తావించాను. ఇంకేముందీ.. ఆయనకి కోపం వచ్చేసింది. ఆయన  అసలు పేరూ అవీ నాకు తెలుసునా ఏమిటీ, ఏదో మన తెలుగు వికీలోనేకదా రాశారూ అనుకుని నేనూ రాశాను. బుధ్ధొచ్చింది. జన్మలో మళ్ళీ అలాటిది చేయకూడదని.

 నిజమే తప్పులు  point out  చేసినప్పుడు కోపం రావడం సహజం. చెప్పకూడదనే అనుకుంటూంటాను… అయినా … ఎందుకులెండి…

7 Responses

 1. Just to put on record,
  జనరల్ వి కె సింగ్ గారు మిలిటరీ ఆఫిసర్ కుమారులు,
  మిలిటరి ఆసుపత్రి వన్వోరీ పూనే (తరువాత కమాండ్ హాస్పిటల్ అయ్యింది) లో పుట్టారు.
  ఆ అసుపత్రి సర్ట్ఫికేట్ ప్రకారమే , ఆయన పోరాడారు. మంత్రసాని లెక్కల బట్టి కాదు.
  ఆయన పర్సనల్ రికార్డు లో కూడా ఆయన బ్రిగేడియర్ అయినంత వరకూ అదే పుట్టిన తారీఖు ఉన్నింది.
  ఆ తరువాత, ఆయన తప్పక చీఫ్ అవుతారని, ఆయన అర్మీ చేరేదానికి 10 వ తరగతి చదివేటప్పుడు
  సింధియా స్కూల్ ఇండోర్ లో , దాఖిలా పత్రం లో (ఆయన డ్రిల్ మాస్టారు ద్వారా) జరిగిన సంవత్సర పొరబాటు,
  వెతికి తీసి అదే నీ పుట్టిన రోజని , ఒప్పుకోపోతే తరువాతి ప్రొమోషన్ రాదని మార్చారు.
  ఆయన చేసిన పోరాటం సరి అయ్యిందే !
  కాక పోతే అప్పుడు ఓడినా తరువాత న్యాయం జరిగింది.

  Like

  • డాక్టరు గారూ,
   మీ మనోభావాలు hurt చేయడం నా అభిమతంకాదు. శ్రీ సింగ్ ది ఎంత న్యాయసమ్మతమైన పోరాటమైనా, అన్నేళ్ళూ ఆ విషయం తెలియదా ఆయనకి? The way in which, the Leader of our Armed Forces, fought at the fag end of his career and made The Great Indian Army, a laughing stock was highly deplorable.. I have the Highest regard for our Armed Forces. How is it that he agreed for status quo all; these years? Could he not got it rectified earlier? Sorry Sir.. I dont agree.. He then should not have withdrawn the case. If it is for Honour, he could have laid down his office and put in papers, as General Thimmayya once almost did, during Nehru/ Krishnamenon time.

   Like

 2. చాలా బాగుంది

  Like

 3. భలేవారే మాష్టారూ! మీరు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది చెప్పండి? వికీపీడియాలో మీకు కనిపించిన తప్పులను ఇలా ఎత్తిచూపుతూ ఉండండి. వీలైనంతవరకు సరిచేసే ప్రయత్నం చేస్తాము.

  Like

  • మురళీ మోహన్ గారూ,

   ఇదివరకు ఒకసారి మీరు సరిచేశారని ప్రస్తావించాను. తప్పులు చూపడం చాలా సులభం. కానీ మీరందరూ పడుతున్న శ్రమ అమోఘం. కానీ, నా ఇదివరకటి టపాకి ( లింకు ఇచ్చాను) ఎవరో విశ్వనాధం గారు స్పందించిన పధ్ధతి నచ్చలేదు. దాని పరిణామమే ఈ టపా. నా ఉద్దేశ్యమల్లా, కనీసం సజీవులైన ప్రముఖుల గురించి రాసేటప్పుడు, ఇంకొంచం జాగ్రత్త తీసికుంటే బావుంటుందని మాత్రమే.

   Like

 4. Sometimes uploading to internet may differ.Jayaprada’s date of birth is 1964 according to net.But her birth year is1957 definitely.She was our sister’s classmate.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: