బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు.


 గుర్తుందా మన చిన్నప్పుడు, పెళ్ళిలో వియ్యాలారి విడిదిలో  వారి స్థోమతకి తగ్గట్టుగా , కొన్ని వస్తువులు ప్రత్యేకంగా ఉంచేవారు.. వాటిని చూసి, వాళ్ళూ పరవాలేదూ, మర్యాదలు బాగానే ఉన్నాయీ అనుకునేవారు. వాటిలో ముఖ్యమైనది  సెంటు నూనె Hair Oil Scented  ఈరోజుల్లో నెత్తికి నూనె రాసుకోవడమే, నామోషీగా భావించే  ఈ తరానికి ,  ఆ సెంటునూనెలో ఉండే ఆనందం ఏం తెలుస్తుందీ? దేనికైనా పెట్టిపుట్టాలంటారు అందుకే. ఉండడం చిక్కగా ఉన్నా, అది నెత్తికి రాసుకుంటే, ఆమడలదూరం తెలిసేది దాని సువాసన. 

అలాగే కాంథడ్రీన్ అని ఒక తలనూనె ఉండేది..Cantherdine అలాగే , సాధారణంగా ఏ కచికతోనో, బొగ్గుపొడితోనో పళ్ళు తోముకునేవారు, కొంతకాలానికి , ఇంటింటికీ వచ్చి ఓ జోలా సంచీలో ( జోలా అన్నా సంచీ అన్నా ఒకటే, కానీ దాన్ని ఇప్పటికీ అలాగే అంటారు …అదో సరదా ) పంపిణీ చేసే నంజను గూడ్ వారి శ్రేష్ఠమైన పళ్ళ్ పొడిNANjan gud కాలక్రమేణా  Tooth Powder తరవాత్తరవాత   వచ్చిన బినాకా పేస్టూ, దానితో పాటు వచ్చే Binaca బుల్లి బుల్లి బొమ్మలూBinaca Toys 1  అసలు ఆరోజులే వేరూ..పొద్దుటే తాగడానికి Ovaltine (1) స్నానానికి Mysore Sandal    పసిపిల్లలు ఏదైనా నలతచేసి ఏడుస్తూంటే  ఓ గుక్కెడు గ్రైపు వాటరూGripe Water, రోడ్డు పక్కనుండే కిళ్ళీకొట్టుకి వెళ్ళి తాగే KIllikottu  కలరు సోడాలూ Colour Soda   ఇలా చెప్పుకుంటూ పోతే,  కనీసం బ్లాగు పోస్టుల ద్వారా అయినా ఆరోజుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదూ… ఒక్కసారి గుర్తు చేసికోండి..

 

3 Responses

 1. పాత సరదాలు గుర్తు చేసినందుకు మీకుఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే.వియ్యపురాలి పాటలు పాడడం గొప్ప క్రేజ్.

  Like

 2. మరీ అత్యాశ .మళ్ళి ఆ రోజుల్లోకి ఎలాగా వేల్లలేము కానీ మీ బ్లాగుల ద్వారా ఊ హల పల్లకిలో ఊగుతూ ఏదో అందులో మీరు చూపిస్తున్న చిత్రాలను చూస్తూ నేత్ర్రా నందము పొందుతున్నాం అదే పదివేలు .కృతజ్నతలు సారూ

  Like

 3. రాధారావు గారూ,

  ధన్యవాదాలు. ప్రస్తుతం నేను post చేస్తున్నవి, పాతకాలపు వస్తువుల మూలాన, మీరు చెప్పిన వియ్యపురాలి పాటల గురించి ప్రస్తావించలేదు.

  శాస్త్రిగారూ,

  ఎక్కడికక్కడే అన్నట్టు, పోనీ అలనాటి వస్తువులు గుర్తుచేసికునైనా సంతోషిద్దాం, ఏమంటారు?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: