బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ఎంతవరకూనిలబడుతుందో చూడాలి…


 మన దేశంలో సాధారణంగా జరిగేది ఏమిటంటే, ఓ కింది కోర్టువారు ఇచ్చిన తీర్పుని, పైకోర్టువారు కొట్టేయడమో, లేక అదేదో ” స్టే ఆర్డరు ” ఇవ్వడమో.  ఆ ” తీర్పు” లోని  విజ్ఞత   ఆ “పైవాడికే “తెలియాలి. ఈ మధ్యన  so called priority cases  తీసికోండి, కింది కోర్టులిచ్చినవి , పైకోర్టువారు  invariable  గా   reverse  చేసేశారే. అది ఓ జయలలిత కేసవనీయండి, లేక ఓ సల్మాన్ ఖాన్ కేసవనీయండి, లేకపోతే ఆవిడెవరిదో సస్పెన్షన్ కేసవనీయండి. అన్నేసి సంవత్సరాలు అంతంతమంది సాక్ష్యాలు విని  , ఓ న్యాయాధిపతి  ఎంత కింది కోర్టయినా సరే, ఇచ్చిన తీర్పు లో అన్నన్ని లొసుగులున్నాయంటారా? పైగా ఇలా రాస్తే అదో గొడవ మళ్ళీ..

 బహుశా నేరం చేసేవారికందరికీ అదే భరోసాయేమో. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ తో అంటాడు గుర్తుందా? “కోర్టుల్లో శిక్షలు పడేనాటికి నువ్వూ ఉండవు, నేనూ ఉండను..” అని. బహుశా అదే  ప్రస్థుత పరిస్థితి. మన రాజకీయ నాయకులమీద సవాలక్ష కేసులున్నాయి. ఒక్కటీ తేలలేదు.   Just pause  మాత్రమే. ఎప్పుడో వాడు కిరికిరి పెట్టినప్పుడు మళ్ళీ మొదలెట్టి బెదిరిస్తారు.  ఈమధ్యన మన రాష్ట్ర, జాతీయ శాసనసభల్లో, నేర చరిత్ర ఉన్న సభ్యులు లేరంటారా? ఒకానొకప్పుడు, ఏదైనా పోలీసు స్టేషన్లో ఫిర్యాదున్నా సరే, పోటీ చేయనిచ్చేవారు కాదు. దానికీ ఓ ఎమెండ్ మెంటు తెచ్చి, ఫరవాలేదూ, ఫిర్యాదులు ఎవరైనా చేయొచ్చూ,  కోర్టువారు శిక్ష వేసేంతవరకూ హాయిగా, జైల్లోంచికూడా పోటీ చెయ్యొచ్చు అన్నారు.. ఏమైనా అంటే ” ప్రజాస్వామ్యం అంటారు.

అసలు కథలోకి వద్దామా… మహరాష్ట్రలోని నీటికొరత మూలాన, అవేవో  I P L   తమాషా మ్యాచ్చీలు ఇక్కడ ఆడి నీటిని వ్యర్ధ పరచొద్దని  ఆయనెవరో   I P L   మీద  ఓ   P I L   వేశాడు. దాన్ని ముంబై హైకోర్టువారు అంగీకరించి, ఇక్కడ ఏప్రిల్ 30 తరువాత ఆ మ్యాచ్చిలి ఆడి, నీటిని వేస్టు చేయొద్దన్నారు. బుధ్ధీ,  జ్ఞానం   ఉన్నవాడెవడైనా అదే అంటారు. తాగడానికి నీళ్ళు లేక  రైల్వే వాగన్లలో నీటిని తరలిస్తున్నారే, ఇప్పుడు ఆ మాచ్చిలకోసం 60 లక్షల లీటర్లనీళ్ళు  అవసరమా? 

 ఇంక మన క్రికెట్ సంఘాలన్నీ, ఇదంతా మామీద కక్షా అంటాడొకడు. నీళ్ళు లేకపోవడమనేది ఓ కొత్త విషయమా అంటాడు భారత కెప్టెన్ గారు.  అసలు ఈ IPL గురించి  చూద్దాం… వాటిని అప్పుడెప్పుడో మొదలెట్టిన, మోడీ ఏమో, మాల్యాతో కలిసి లండన్ లో వేషాలేస్తున్నాడు.. ఇంకో శ్రీనివాసన్ అల్లుడి ధర్మమా అని ఉన్న పదవి కాస్తా ఊడింది. ఆ దాల్మియాని  ముందర ఆరోపణలతో తీసేశారు. తిరిగి  రావడమైతే వచ్చాడు కానీ, పరలోకాలకి వెళ్ళిపోయాడు. ఇంక మన మహనీయ ఆర్ధిక మంత్రిగారిమీద ,  DDCA  లో డబ్బులు లాగించేడని ఆరోపణలు వచ్చాయి. వీళ్ళందరూ కలిసి  జనాలని ” బక్రా” లు చేసి ఆడిస్తున్నారు,  entertainment  పేరుతో.. డబ్బులు చేసికునేది వీళ్ళందరూ. దేశానికి ఒక్క ఉపయోగం లేదు. పైగా, మహరాష్ట్రనుండి,  మాచ్చిలు మార్చేస్తే 1000 కోట్లు నష్టం వస్తుందని బెదిరింపోటీ.

 అసలు నాకోటి అర్ధం అవదూ… ఈ నీళ్ళమీద ఆధారపడకుండా, హాయిగా  హాకీలోలాగ ఏ  ASTRO TURF  లాటిదానితోనో పిచ్చిలు చేసికోవచ్చుగా. ఎలాగూ కోటానుకోట్లు చేసికుంటున్నారాయె. ఇదివరకటి రోజుల్లో డాకా లో టెస్టు మాచ్చిలు  Matting Wicket  మీద ఆడేవారు. అలాకూడా చేయొచ్చుగా ఇన్నిన్ని కబుర్లు చెప్తారూ?

ఈ మాచ్చీలేమీ  దేశగౌరవానికి సంబంధించినవి కానే కావు. ఎలా ఆడితే ఏం పోయిందిట? అప్పుడెప్పుడో ,  World T 20  లో సరీగ్గా కామెంటరీ ఇవ్వలేదనీ, శత్రుపక్షాన్ని పొగిడాడనీ, ఉన్న లక్షణమైన వ్యాఖ్యాత   Harsha Bhogle  ని కాస్తా తీసేశారు.

 వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ముంబై హై కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టుకి వెళ్తే ఏం చేస్తారూ అని..  Keep your fingers crossed…

4 Responses

 1. కోర్టుల ఫణి బాబు నిటన్
  హార్డుగ మొట్టిరి! జిలేబి, హాహా యనగన్
  బోర్డులు పితూరి జేసెన్
  గార్డులు గూడన్నిది సరి గాదని యనిరే !

  జిలేబి

  Like

 2. జిలేబీ,

  కోర్టులని హార్డుగా మొట్టినందుకు మీ శభాసీ కి ధన్యవాదాలు… చూద్దాం ఏం జరుగుతుందో…

  Like

 3. అసలు IPL అవసరం ఏమిటి? బ్లాక్ మనీ, బెట్టింగ్‌లని పెంచి పోషించడం తప్ప.

  Like

 4. బోనగిరి గారూ,

  ఉన్న Black Money అంతా Swiss Banks, Panama ల్లోనూ ఇరుక్కుపోయాయి కదా, దేశంలో చిల్లర ఖర్చులు ( ఎన్నికల సమయం లో) కోసం డబ్బులుందాలి కదా మాస్టారూ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: