బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ఆ సీలింగ్ ఫాన్లు ఏం చేశాయిట…


  దేశంలో ప్రతీవారూ, అంతస్థితిమంతులు కాదుగా.. ఒకానొకప్పుడు  తాటాకు విసినికర్ర లుండేవి. గాలి ఆడకపోయినా, ఉక్కబోత పోసినా, హాయిగా వాటితో పని కానిచ్చేసేవారు. శ్రీరామనవమి వచ్చిందంటే, రామాలయంలో, పానకంతో పాటు, తాటాకు విసినికర్ర కూడా ఇచ్చేవారు.. ( పెద్దవాళ్ళకు మాత్రమే ). HF 1  

 వంటింట్లో కుంపట్లోని బొగ్గులు మండాలంటే  వెదురు విసిని కర్రే గతి.HF 2

 కాలక్రమేణా ఫాషనుగా , చూడ్డానికి పొందిగ్గానూ, మడతపెట్టడానికి వీలుగానూ ఉండేవి వచ్చాయిHF3

ఎలెట్రిసిటీ రావడంతో  ఓపికున్నవాళ్ళందరూ  Table Fans TF లోకి దిగిపోయారు. ఇంట్లో హాల్ లో ఓ టేబుల్ మీద పెట్టి, మొత్తం ఇంటి సభ్యులందరూ దాని చుట్టూరా చేరేవారు.. రాత్రిళ్ళు ఎవరికివారే ఆ హాల్లోనే నిద్రపోయేవారు. ఈ పై చెప్పినవన్నీ కాల గర్భంలో కలిసిపోయాయి.  గోడలకి వేల్లాడతీసే  Air Circulatorలూ, అవేవో  Pedastal Fan లూ వచ్చాయి.AC1PF

 ఇవి కాకుండా  రైళ్ళలో ఇంకో రకం ఫాన్లు ఉన్నాయి. FAn Train   సాధారణంగా, ఏ పుల్లో, పెన్సిలో పెట్టి తిప్పితే కానీ, అవి తిరగడం మొదలెట్టవు. పైగా వాటికి ఒకే స్పీడు. తగ్గించడం, హెచ్చించడం లాటివి ఉండవు. ప్రయాణికుల్లో , ఫాన్ గాలి పడదని ఒకరూ, గాలాడటంలేదని ఇంకోరూ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు.  కాలక్రమేణా, సీలింగు ఫాన్లలోకి దిగాము.CFఈ రోజుల్లో సీలింగ్ ఫాన్ లేని ఇళ్ళుండవు.   వారి వారి ఆర్ధిక స్థోమతని బట్టి, అవేవో విండో ఏసీలూ, స్ప్లిట్ ఏసీలూ ఉన్నా సరే, సీలింగు ఫాన్ మాత్రం తప్పకుండా ఉంటుందే.

 మనందరికీ ధారాళంగా గాలి ఇస్తూన్న ఈ సీలింగు ఫాన్లని, కొంతమంది , ప్రాణాలు తీసికోడానికి కూడా ఉపయోగించుకోడం, చాలా విచారకరం. ఈమధ్యన ఆత్మహత్యలు చేసికోడానికి దీన్నో సాధనంగా ఉపయోగిస్తున్నారు.. ఆత్మహత్యలు ఎందుకు చేసికుంటున్నారూ అనేది కాదు విషయం.. ఎవరి కారణాలు వారికుంటాయి.   ప్రముఖులు ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడితే  అదో పతాక శీర్షిక. అదే ఏ రైతో తను చేసిన అప్పులు తీర్చలేక, ఆత్మహత్య చేసికుంటే, వార్తా పత్రిక లోని ఏ అయిదో పేజీలోనో… ఫలానా చోట… ఇంతమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసికున్నారూ, అని  చేతులు దులిపేసికుంటున్నారు. 

పరీక్షలో తక్కువ మార్కులొస్తాయేమో అని ఒకరూ, కార్పొరేట్ కాలేజీల్లో ragging  భరించలేక ఇంకోరూ, ఇలా చెప్పుకుంటూ పోతే, దేశంలో ఎక్కడో అక్కడ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. చిత్రం ఏమిటంటే,  చాలామంది ఈ సీలింగు ఫాన్లనే సాధనంగా ఉపయోగిస్తున్నారు.  అలాగని రాత్రికి రాత్రి ఈ సీలింగ్ ఫాన్లని, నిషేధించమంటే  ఎలాగండి బాబూ?   ఒంటిమీద తెలివుండి మాట్టాడే మాటెనా ఇది? ఏదో నోరుందికదా అని నోటికొచ్చినట్టు వాగడం. దానికి  ప్రసారమాధ్యమాలు publicity  ఇవ్వడం.   అప్పుడప్పుడు రైళ్ళు పట్టాలు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, రేపు ఏ తలమాసినవాడో  రైళ్ళు ఎత్తేయండంటే చెల్లుతుందా? అలాగే ఎన్నో ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతూంటాయి ప్రతీ రోజూ, అలాగని వాటిని మూసేయమంటే కుదురుతుందా? పురుగుమందులు  (pesticides) తాగి ఆత్మహత్యలు చేసికుంటున్నవారు ఎంతమందో. కానీ, వాటిని నిషేధిస్తే, పంటలకు పట్టే చీడ ఎలా తగ్గించడం?  ఇప్పుడేదో ఆ తింగరి బుచ్చెవరో ఇచ్చిన ఉచిత సలహాని ప్రభుత్వం అంగీకరించేస్తుందని కాదు. 

11 Responses

  1. ఫ్యాను తెచ్చెను తంటాను ! పాసు గాక
    బోతె వేసుకుంటాముగ భోరు మనుచు
    ఉరియు ! తానేమి జేసెనొ! ఉలకదు గద !
    శీతలము నిచ్చు ఫ్యానును ఛీ యనతగు ?

    జిలేబి

    Like

  2. మంచి ఐడియా కదా సార్. నిషేధిస్తే పోలా? ఏమో ఆత్మహత్యలు తగ్గినా తగ్గచ్చు – ఏమో, గుఱ్ఱం ఎగరావచ్చు 🙂 🙂
    మీరన్నట్లు పబ్లిసిటీ కోసం ఏవేవో మాట్లాడుతుంటారు మాస్టారూ, మామూలేగా 🙂

    అవును గానీ, విసినికర్రల ఫొటోలు ఎలా సంపాదించారండీ బాబూ ఈ కాలంలో ! నిగనిగలాడుతూ చూడముచ్చటగా ఉన్నాయి !

    Like

  3. ఏమో ఈ తుగ్లక్ వంశీ యులు అమలు చేసినా చెయ్యగలరు

    Like

  4. ఫణి బాబు గారి దగ్గర లేనిది లేదండి బాబూ

    Like

  5. నరసింహారావు గారూ ఫణి బాబు గారి సేకరణ లో లేనిది లేదు

    Like

    • Thanks వెంకట శాస్త్రి గారూ. అలాగే కనిపిస్తోంది. ఈ సేకరణలో ‘హరేఫలే’ ఫణిబాబు గారు, ‘కష్టేఫలే’ శర్మ గారు ఒకరికొకరు సాటి.

      Like

  6. వన్నె వన్నెల విసన కర్రలు,వాటి చరిత్ర,
    బాగుంది కాని ఫాన్ బాన్ చేయాలన్న వన్నెలాడి
    ఫోటో కూడా పెట్టుంటే ఎంచక్కా బాగుండేదేమో!

    Like

  7. జిలేబి,
    మీ ” పద్య” వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    నరసింహారావు గారూ,
    మీ వ్యవహారం చూస్తూంటే, రేపు నేనిచ్చిన జాబితాలోని అన్నిటినీ నిషేధించేటట్టున్నారు.. శుభం.

    శాస్త్రిగారూ,

    నామీద లేనిపోని ” అపవాదులు” వేసేస్తున్నారు… ఇక్కడకి వస్తారుగా ఏదో రోజు.. అప్పుదు చెప్తా మీపని..

    డాక్టరుగారూ,

    ఆ ” వన్నెలాడి ” ఫొటో కావాలా.. హన్నా.. మేడంగారి చెవిన వేయమంటారా ఈమాట?

    Like

  8. అన్యాయం కదా ఫణిబాబు గారూ, అన్ని స్మైలీలు పెట్టినా నేనన్నది సీరియస్ అభిప్రాయంగా తీసుకుని “ఆవిడనీ” నన్నూ ఒకే గాటన కట్టెయ్యడం 🙂 🙂 తెలుగు సినిమా డైలాగుల్లో చెప్పినట్లు “I hurt”. 🙂 🙂
    ఇంతకీ విసినికర్ర ఫొటోల రహస్యం చెప్పనేలేదు 😦

    Like

  9. నరసింహారావు గారూ,
    మీరుస్మైలీలు పెట్టినంతమాత్రాన, మరీ ” అమాయకుడి” గా అనుకోమని మరీ బలవంతపెడితే ఎలా మాస్టారూ?
    విసినికర్రల ఫొటోలంటారా.. ఇందులో అంత పెద్ద రహస్యం ఏముందీ? ప్రపంచంలో మనం ఎలాటివి అడిగినా, ఎంతో సహనంగా, మనింట్లోవారికంటే మన మాట విని, సమాధానం చెప్పేది ఆ ” గూగులమ్మే ” కదా.. ఆవిడనే అడిగాను, ప్రసాదించింది.. పెట్టాను… बस.. ఏదైనా “లేపం ” వేసికోండి.. hurt అయ్యానన్నారుగా..

    Like

    • మంచిదండి.
      మీకందరికి ఉగాది శుభాకాంక్షలు.

      Like

Leave a comment