బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు… యాత్ర పార్ట్ 2


28 వ తేదీ రాత్రికి కాట్రా లోనే ఉండిపోయాము. రాత్రివేళలో కొండదారి దీపాలతో అద్భుతంగా కనిపించింది.SMV.by.night (1)

మర్నాడు జమ్ము లో గడపుదామన్నారు. మేమెక్కిన బోగీలో జనం అసలే లేరు. ఇంక చూసుకోండి,  అమరేంద్ర గారూ, మా ఇంటావిడా , కెమేరాలు కిటికీలోంచి బయట పెట్టి ఫొటోలే..ఫొటోలు.. నాకైతే నా ఫోను బయటపెట్టి ఫొటోలు తీసికోడానికి భయం వేసింది బాబూ. చేతిలోంచి పడిపోతే… వామ్మోయ్.. దొరక్క దొరక్క మా ఇంటావిడ ఎంతో ప్రేమతో ఇచ్చిన బహుమతి కూడానూ.. మళ్ళీ ఇమ్మనడం బాగోదుగా..clicking

10.30 కి జమ్ము చేరాము.  కట్రా-జమ్మూ దారిలో స్టేషన్లన్నీ, మనం హిస్టరీ  జాగ్రఫీల్లో చదువుకున్న పేర్లే– పానిపట్, కురుక్షేత్ర,, లూధియానా… etc..  పోనీలే స్టేషన్లేనా చూడ గలిగామనిపించింది.అమరేంద్ర గారి ఫ్రెండు , ఈయనతో కాకినాడ ఇంజనీరింగు కాలేజీలో చదువుకున్నారుట, ఎంతో అభిమానంతో, మమ్మల్ని ఆహ్వానించి, ఊళ్ళో ఉన్న ఓ రెండు ముఖ్య దేవాలయాలకి తీసికెళ్ళారు. అక్కడి ప్రసాదాలతోనే కడుపు నిండిపోయింది. తరువాత, జమ్మూ లోని ఓ  elite club– Jammu Club  కి  వెళ్ళి లంచ్ చేశాము.Jammu.Clubnt

 ఈమధ్యలో ఓ విషయం చెప్పడం మర్చిపోయాను– ఇప్పటిదాకా చూసిన రైల్వే స్టేషన్లలో  ” కట్రా ” స్టేషనుకి మించిన స్టేషను ఉంటుందనుకోను. విశాలంగా, ప్రతీ ప్లాట్ఫారానికి మెట్లనేవి లేకుండా, అతి శుభ్రంగా ఉంది. సాధారణంగా, మన సూట్ కేసులు లాక్కోడానికి చక్రాలున్నా, ఏ ఓవర్ బ్రిడ్జి దగ్గరో మెట్లే. చచ్చినట్టు  ఎత్తి తీసికెళ్ళాలి. అలా కాకుండా, ఇక్కడ అన్నీ రాంపులే.. హాయిగా లాక్కుంటూ పోవచ్చు.KatraRS

రాత్రి ట్రైనెక్కి, మర్నాడు మధ్యాన్నానికి ఢిల్లీ చేరాము. ఢిల్లీలో చాలామట్టుకు ఇదివరకే చూసేయడంతో, ఎక్కడకీ వెళ్ళకుండా రెస్టు తీసికుని, ఆ సాయంత్రం, దగ్గరలో ఉన్న సెంట్రల్ పార్కుకి వెళ్ళాము. ప్రస్తుతం పువ్వుల సీజను కావడంతో, ఆ గార్డెన్ లో ఎక్కడ చూసినా పువ్వులే పువ్వులు…garden1                             group

మర్నాడు ప్రొద్దుటే నిజాముద్దీన్ లో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్స్ ఎక్కి తిరిగి పూణె చేరాము.

మొత్తం ప్రయాణం అంతా ఎంతో ఆహ్లాదంగా జరిగింది. ఒక్కటంటే ఒక్కసారికూడా, మా ఇంటావిడమీద చిరాకు పడలేదు. పాపం తనూ అలాగే అనుకోండి. దీనర్ధం ఏమిటంటే, కావాలంటే ఒకరిమీద ఇంకోరు విసిగెత్తించకుండా కూడా ప్రయాణాలు చేసికోవచ్చని. ప్రయాణం మొత్తంమీద ఒక్కటంటే ఒక్కటికూడా , తెలుగు పత్రికలు కొనలేదు. ఒక్కరితోకూడా పరిచయం చేసికోలేదు. సాధారణంగా ప్రయాణాల్లో ఎవరో ఒకరితో కబుర్లు పెట్టుకుంటాను. ఈసారి ఎవరూ దొరకలేదనడం కంటే, నేనే ప్రయత్నం చేయలేదనడం సబబు గా ఉంటుంది..అన్ని  విధాలా ఈ ప్రయాణం మాత్రం   UNIQUE…  గుర్రం ఎక్కాను, హెలికాప్టరు ఎక్కాను.. ఇంకా ఏమేమి ఎక్కాలో?

పూణే నుండి నిజాముద్దీన్ “దురంతో” గుజరాత్ మీదుగానే వెళ్ళింది.. ఏం లేదూ, మీడియాలో వింటూంటాముగా, గుజరాత్ అంత  స్వఛ్ఛ రాష్ట్రం లేదని.. అలాటిదేమీ లేదు. ఏదో ముఖ్య పట్టణాల్లో, ప్రధాన వీధులు అద్దంలా ఉంచుతారేమో కానీ, మిగిలిన రోడ్లూ, పరిసరాలూ  as dirty as any ..  స్వఛ్ఛభారత్ పేరు చెప్పి కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నారు.

8 Responses

 1. Beautiful narration. We(I actually) commented in another blog of yours to this post. Kallaki kattinatlu varninchaaru.We could finish upto Khatmandu.Later she got back pain and we could not visit this long pending awesome place.

  Like

 2. < "…..మీడియాలో వింటూంటాముగా, గుజరాత్ అంత స్వఛ్ఛ రాష్ట్రం లేదని.. అలాటిదేమీ లేదు. ఏదో ముఖ్య పట్టణాల్లో, ప్రధాన వీధులు అద్దంలా ఉంచుతారేమో కానీ, మిగిలిన రోడ్లూ, పరిసరాలూ as dirty as any .. "
  ———————

  ఆహా పై వాక్యం చదివాక నాకున్న మరో అభిప్రాయం కూడా తలకిందులయింది. ఏ ఊరి వీధులు చూసినా ఏమున్నది గర్వకారణం!

  అవును ఫణిబాబు గారూ, మీరు కాశ్మీరంలో అడుగుబెట్టి జమ్మూ వరకూ వెళ్ళొచ్చారు కదా, ఇంకా ముందుకి సాగి శ్రీనగర్ కూడా వెళ్ళడం క్షేమకరమేనంటారా అక్కడి వారు? (కాశ్మీరం చూడాలి చూడాలి అనుకుంటూనే ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ధైర్యం రావడంలేదు)

  Like

 3. రాధారావు గారూ,
  ఆ వ్యాఖ్య చదివానండి. Dont worry.. your wish would soon be realised by the Grace of GOd.

  నరసింహరావు గారూ,

  జమ్ము లో , మా స్నేహితుడిని అడిగాను, కాశ్మీరు దాకా వెళ్ళొచ్చా అని ( లోపల ఎంత భయమున్నా !!) టైముసరిపోదూ అన్నారు. బతికానురా భగవంతుడా అనుకున్నాను. జరిగేదేదో జరక్కమానదు అనుకుని వెళ్ళిపోవడమే. ఆమధ్యన కేదారనాథ్ వరదల సందర్భంలో యాత్రికులు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. అయినా వెళ్ళడం మానేరా… ఇదీ అలాగే ..

  Like

  • కరక్టే గానీండి – కేదారనాథ్ లో ప్రకృతి విపత్తు (వరదలు), కాశ్మీర్ లో మానవ కల్పిత దారుణం (ఉగ్రవాద దాడులు) – కదా. A Wednesday సినిమాలో ఉగ్రవాదుల గురించి నసీరుద్దిన్ షా పోలీస్ కమీషనర్ అనుపం ఖేర్ తో – నేనెప్పుడు చనిపోవాలో వాడా (ఉగ్రవాది) నిర్ణయించేది – అంటాడు చూడండి. అలాంటిదన్నమాట నా గోల కూడా.

   Like

 4. నరసింహా రావు గారూ,
  ప్రతీదానికీ ఆలోచించడం కంటే, spur of the moment లో ఏం చేయాలంటే అదే చేసేయడం.. అయినా ప్రతీదానికీ ఇన్నా( న్నే) ళ్ళూ భయపడ్డాము చాలదూ? ఇంక భయపడ్డం అనవసరం.. ” జెండా పై కపిరాజు..” అంటూ పద్యాలు పాడుకుంటూ ప్రయాణం కట్టండి..

  Like

 5. విన్న కోట వర్య ! భమిడి విదురు జెప్పె
  కలల జమ్మూర శ్రీనగర్ కనక భూమి
  భరత దేశమున గలదు భాగ్య మిదియె
  సరస వర్ణన భూలోక స్వర్గ మదియె !

  Like

 6. అంతేలెండి ఫణిబాబు గారూ. సాహసము శాయరా అని పాతాళభైరవిలో చెప్పాడు కదా 🙂 అలాగే చెయ్యాలి.
  జిలేబీ గారికి కూడా థాంక్స్.

  Like

 7. జిలేబీ,
  మీరు మా వెనకే ఉండండి.. ధైర్యం చేసేస్తాం…

  నరసింహారావుగారూ,

  ఇంకెందుకు ఆలశ్యం మాస్టారూ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: