బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ” జీవన యానం”–

    ఈ మధ్యన “మా” టీవీ లో ప్రతీ రోజూ ప్రొద్దుటే ఓ కార్యక్రమం ” జీవన యానం ” అని ప్రసారం చేస్తున్నారు. సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహరావు గారి ప్రసంగం , చాలా బాగుంటోంది. ఎంతమంది చూస్తున్నారో తెలియదు , మచ్చుకు రెండు విడియోలు ఇక్కడ ఇక్కడా పెడుతున్నాను. ఈనాటి విద్యావిధానంలో ఉన్న లోటుపాట్లు కొన్ని తెలియ చేస్తున్నారు.

    యాదృఛ్ఛికంగా ఆ మధ్యన News line ( Indian Express ) లో రెండు వార్తలు IE
IE 2
చదివిన తరువాత ఎంతో బాధవేసింది. శ్రీ గరికపాటి వారు చెప్పేరనే కాదు, మనందరికీ తెలుసు, కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. ఈరోజుల్లో పిల్లలకి ఏం చెప్తే ఏమి కోపం వచ్చి, అలిగి ఇంటినుండి పారిపోతాడేమో అని భయం !

    సాధారణంగా టీవీల్లో వార్తలు చూడాలంటే , ఓ విరక్తి ఏర్పడింది. ఏదో పైన చెప్పిన కార్యక్రమం బాగుంది కదా అని, ఆ చానెల్ వారు ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ, పెద్ద గొప్పగా ఉంటాయని కాదు. entertainment పేరుతో కొన్ని చెత్తకార్యక్రమాలే ఎక్కువ. దానికి సాయం ఆదివారం వచ్చిందంటే చాలు, ఓ మూడు గంటలపాటు, అదేదో క్విజ్ కార్యక్రమం మన నెత్తిమీద రుద్దుతారు. ఇంకా ఎన్నాళ్ళు భరించాలో . ఆ చానెల్ ని ఇంకోరెవరికో అమ్మేశారుట త్వరలోనే ముక్తి లభించొచ్చు. క్విజ్ కార్యక్రమం బాగానే ఉంది, కానీ అదేకార్యక్రమాన్ని రోజంతా మన నెత్తిమీద రుద్దితే ఎలాగండి బాబూ? చెరకు గెడని crush చేయగా..చేయగా రుచికరమైన చెరుకురసం వస్తుంది, నిజమే, కానీ చివరకు మిగిలేది “చెరుకు పిప్పి ” కదా. దానికి రుచీ, పచీ ఉందదు. మన కార్యక్రమాలూ అలాగే.

    అసలు సిసలైన entertainment చూడాలంటే, మన చట్టసభల్లో ప్రతీరోజూ జరిగే “భాగోతాలు ” చాలవంటారా? ఆహా ఏమి భాష, ఏమి హావభావాలు , … అన్నిటిలోకీ పార్లమెంటులోనూ, శాసనసభల్లోనూ అద్యక్షస్థానం లో ఉన్నవారి ఓర్పూ, సహనమూ మెచ్చుకోవాలి. మామూలు మనుష్యులకి అసాధ్యమైన రీతిలో భరిస్తున్నారు. అఛ్ఛా ఇంకో విషయం, సాధారణంగా పిల్లలు తమతల్లితండ్రులనే అనుసరిస్తారని నేర్చుకున్నాము. ఇంక ఈ పాలకుల రీండో తరం కూడా ఇంతేనంటారా? అప్పటిదాకా బతికుంటేనే కదా తెలిసేది..

%d bloggers like this: