బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— ” मन की बात ” అనబడే ప్రధానమంత్రి గారి “ఉవాచ”…


   ఇదివరకటి రోజుల్లో, ఇంట్లో ఉండే పెద్దవారు,వారికి జీవితంలో జరిగిన అనుభవాలను, సలహా రూపంలో తమ కుటుంబసభ్యులతో పంచుకునేవారు. అలాగే స్కూల్లో ఉపాధ్యాయులుకూడా, క్లాసు పాఠాలతో పాటు, తమతమ అనుభవాలు విద్యార్ధులతో పంచుకునేవారు. ఎంత చెప్పినా, పుస్తకాలద్వారా నేర్చుకున్నదానికంటే, అబుభవం మీద తెలిసిందే, చాలా కాలం గుర్తుంటుంది. అందుకేనోమో, చిన్నప్పుడు , పెద్దవారితో గడిపిన క్షణాలూ, వారు నేర్పిన జీవిత పాఠాలూ ఇప్పటికీ గుర్తుండిపోతాయి.
కాలక్రమేణా, కుటుంబాలూ సూక్ష్మరూపం ధరించేసి, కుంచుకుపోయాయి. ఎవరి కారణాలు వారివీ. ఈరోజుల్లో కుటుంబం అంటే, భార్యా, భర్తా, వాళ్ళకి ఓ ఇద్దరు పిల్లలూ. వారి ప్రపంచం వారిది. ఏదైనా సమస్య వచ్చినా, ఈరోజుల్లో అంతర్జాలంలో దానికి పరిష్కారం తెలిసికోడానికి, ప్రయత్నిస్తారే కానీ, పోనీ కుటుంబంలోని పెద్దవారిని అడిగితే, ఏదైనా తమ అనుభవం చెప్పి, దీనికి ఫలానా పధ్ధతిలో చేస్తే సమస్య పరిష్కారం అవుతుందేమో అని సలహా ఇచ్చినా ఇవ్వొచ్చు. కానీ, ఈరోజుల్లో ఎవరూ దీనికి సిధ్ధంగా లేరు. పోనిద్దూ, కన్సల్టేషన్ ఫీజు పడేస్తే, ఎవడైనా చెప్తాడూ అనుకుని, వేలకి వేలు తగలేస్తారే కానీ, పెద్దవారిని మాత్రం అడగరు. అయినా ఈరోజుల్లో డబ్బే లోకం కదా…leave it..
ఇంక ఈ consultants ల విషయానికొస్తే, వారు పుస్తకాలలో చదివినదో, అంతర్జాలంలో చదివినదో, సలహాగా ఇస్తారు కానీ, అనుభవంమీద ఇచ్చేది మాత్రం కాదు, ఎక్కడో నూటికీ, కోటికీ తప్ప. పైగా సలహా అంటే ఇస్తారు కానీ, సమస్య పరిష్కారం అవుతుందని గ్యారెంటీ ఉండదు. కానీ, దీనివలన, వారి వ్యాపారానికొచ్చిన నష్టంకూడా లేదు. అందుకనేనేమో దేశంలో చాలామంది, కన్సల్టెంటులు గా మారిపోతున్నారు.

    ఈమధ్యన మన ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు, ఓ కొత్త కార్యక్రమం మొదలెట్టారు. వారికి తీరిగ్గా కూర్చోడం అసలు ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. ఒకానొకప్పుడు, ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు, ఆకాశవాణి, దూర్ దర్శన్ లే దిక్కు మనకి. కాలక్రమేణా, FM చానెళ్ళు వచ్చి, ఆకాశవాణినీ, వ్యాపార చానెళ్ళు వచ్చి, DD నీ పక్కకు పెట్టేశాయి. మనప్రధాన మంత్రిగారి “Make in India “ పరంపరలో, ఈ రెండింటికీ, మళ్ళీ ప్రాణం పోయాలనే “ సదుద్దేశ్యం” తో, “ मन की बात “ అనే కార్యక్రమం ద్వారా, నడుం కట్టారు. ఏదో, వారి ప్రభుత్వ విధానాలూ, ఉద్దేశాలూ, కార్యక్రమాలూ ప్రజలకి తెలియచేస్తే బావుంటుందికానీ, అంతకంటే మించి ఉపదేశాలూ, సలహాలూ ఇవ్వడం మొదలెడితే, ఆ విన్నవారు, మరీ confuse అయిపోతారేమో. ఏదో ప్రధానమంత్రంతటివారు, చెప్పేరూ, వినకపోతే బావుండదేమో అనుకున్నారా, కొత్త సమస్యలు తలెత్తుతాయి.

    ఉదాహరణకి, ఈ మధ్య విద్యార్ధులతో/కి ఒక కార్యక్రమం చేశారు. వారి “ మనోభావాలు “ పిల్లలతో పంచుకున్నారు. వాటి సారాంశం ఇక్కడ చదవండి.
అందులో రెండో పాయింటు… “Do not take so much tension. I have been an ordinary student. I have not scored exceptionally well in the exams I gave and have a poor handwriting also.” విన్న తరువాత, పోనిద్దూ ఆయన చేతిరాత బాగుండేది కాదుట, ఊరికే ఇంట్లో ప్రాణం తీస్తూంటారు, అనుకుంటే …
ఏడో పాయింటు “”Appear for the exams in cool manner…. Have faith in yourself…. Do not get worried about outside reasons because that shows lack of self-confidence and you fall into ‘andh vishwas’ (blind faith).” మరి పరీక్షలముందరా, రిజల్టు వచ్చిన తరువాతా, మన దేవుళ్ళ గతేమిటీ?
పదో పాయింటు ..” . “Dear parents, don’t compare your child’s performance with your neighbour’s or relative’s children, instead talk to them about their bright future, opportunities and possibilities.” ఇది తల్లితండ్రులకోసం. ఏమిటో ఈ ప్రధాన మంత్రిగారేమో ఉన్న భార్యని దూరంగా ఉంచేశారాయె. సంతానం మాటే లేదు. ఇంక పిల్లల్ని పెంచడం గురించి, ఆయనకేం తెలుసూ అని దేశంలోని ప్రతీ తల్లీ, తండ్రీ అనుకుంటే తప్పేమిటిట?
ఉపదేశాలూ, సలహాలూ ఇవ్వడంలో తప్పేమీలేదు. కానీ వాటిలో ఆచరణయోగ్యంగా ఎన్నున్నాయీ అని కూడా అలోచించాలిగా.

   ఏమో మన ప్రధాన మంత్రిగారి “मन की बात “ చదివిన తరువాత నా मंकी बात వ్రాశాను….

Advertisements

4 Responses

 1. చెప్పేవాడికి వినేవాడు లోకువ
  ఎవడేమి చెప్పినా వినడము
  మనకున్నాయిగా రెండు చెవులు
  Throo సిగ్నల్ ఇచ్చేయడమే పరిష్కారము.

  Like

 2. Yes sir. Correct hasyamu jodinchi chepparu. Bagundi..

  Like

 3. ఇదేం అన్యాయం గురువుగారూ! చెబితే పనిలేదా అని, చెప్పకపోతే చెప్పలేదనీ తిడితే ఎలా సార్! అసలు ఇద్దరు పిల్లలన్నారు పాతమాట ఇప్పుడొకరే…అసలు లేకపోడం కూడా జీవితం అనుఇభవించడమే>>>

  Like

 4. శాస్త్రిగారూ,

  మీరు చెప్పినట్టుగా throo signal ఇవ్వడమే శ్రేష్ఠం…

  విష్ణువందనా,

  మీ స్పందనకు ధన్యవాదాలు…

  శర్మ గారూ,

  “అసలు ఇద్దరు పిల్లలన్నారు పాతమాట ఇప్పుడొకరే” ఏమిటీ, పేపర్లు చదవడం మానేశారా? మీ ముఖ్యమంత్రిగారూ, కొందరు అధికారపార్టీ ( బిజేపీ) నేతలూ, ఎంత “ఓపిక” ఉంటే అంత సంతానాన్ని కనమంటున్నారని చదివేము…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: