బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Facebook గందరగోళం..


   గత అయిదారు రోజులుగా, నా Facebook పేజీలో , అర్దంపర్ధంలేని, కొన్ని అశ్లీలమైన విడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఏదో, నాదారిన నేను జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల జయంతి, వర్ధంతి ఈ తరం వారికి తెలియచేయాలని, గత ఆరేడు నెలలుగా ఓ వ్యాపకం పెట్టుకున్నాను. ఒకరోజు ముందుగా, మర్నాటి ‘పోస్టు” గురించి, అంతర్జాలం లో నాకు ఓపికున్నంతవరకూ, వెదికి, వీలైనంతవరకూ, వారి ఫొటోలు కూడా సేకరించి, సరంజామా తయారుచేసికుని, రాత్రి తొమ్మిదీ, పదీ మధ్య పోస్టుచేస్తున్నాను. నచ్చినవారికి నచ్చుతోంది. దీనివలన నాకు ఒరిగేదేమిటీ అంటే, నిజం చెప్పాలంటే nothing. కానీ, ఈ వ్యాపకం మొదలెట్టినప్పటినుండీ మాత్రం “పరిచయాలు” పెరిగాయే అనుకోవాలి.దీనితో ఏమౌతోందంటే, నేను ప్రతీరోజూ పోస్టు చేస్తూన్న సమాచారం కోసం నా ఫేస్బుక్ మిత్రులు , ఆత్రంగా వేచిఉంటారూ అన్న విషయం తెలిసి నాకైతే చాలా సంతోషం వేసింది. అదో ” తుత్తి ” . అలా wait చేస్తూంటారూ, అని మీకు మీరే ఊహించేసికుంటున్నారా అని కూడా అనుకోవచ్చు. కానీ కొందరు మిత్రులనుండి వచ్చే ఫోన్లూ, ఎప్పుడైనా కలిసినప్పుడు, వారు వ్యక్తపరచిన అభిప్రాయాలూ, నా పోస్టులకు వారి స్పందనా చూస్తే నచ్చినట్టే కనిపిస్తోంది. ఒకటి మాత్రం నిజం-ఇప్పటిదాకా ఎవరూ ” చివాట్లు” వేయలేదు. దీనితో, ప్రతీరోజూ నా “కార్యక్రమం” నిరాటంకంగా జరిగిపోతోంది.

    మళ్ళీ ఇందులోనూ కొన్ని “కష్టాలు” ఉన్నాయనుకోండి– అర్ధం పర్ధం లేని కొన్ని ఫొటోల్లో , మన ప్రమేయం లేకుండా, ఎడా పెడా tag చేసేస్తూంటారు. ఏదో settings లోకి వెళ్ళి, ఆ సమస్యను పరిష్కరించొచ్చని తెలిసింది. అంతవరకూ, బాగానే ఉంది. కానీ , ఈమధ్య అశ్లీల విడియోలకి మన పేరుతో జతచేసి, స్నేహితులందరికీ పంపడం. రెండు రోజులక్రితమైతే మరీ దారుణం- ఓ డజను విడియోలు నా పేరన post అయిపోయాయి. ఏదో మర్యాదగా సంఘంలో బతుకున్న వారిని target ఎందుకు చేస్తున్నారో అర్ధం అవదు. పోనీ facebook వారిని అడుగితే, సమాధానమే రాదు.
Public domain లో ఉన్నప్పుడు, ఇలాటివి తప్పవూ అంటారు, కొందరు. నిజమే, కానీ యాజమాన్యానికి కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా..

   అసలు ఈ “అంతర్జాలమే ” ఒక మాయ. అందులో, మళ్ళీ, ఈ ఫేస్బుక్కులూ, ట్విట్టర్లూ, ఓ వ్యసనం లాటివి. ఒకసారి ఇది పట్టుకుంటే వదలదు. పోనీ, వదిలేద్దామా అంటే, ఇంకో కాలక్షేపమా లేదాయె. ఏం చేయాలో అర్ధం అవడం లేదు.పోనీ ఇలాటి సమస్యలకి పరిష్కారం చెప్తారా అంటే, ఒకోరిదీ ఒకో పధ్ధతి.. రోగం వస్తే , అందరూ తలో సలహా ఇస్తూంటారు. మళ్ళీ ఇందులో ఇంకో గొడవా– మనపేరున ఎవరైనా ” అఘాయిత్యం” చేశారా అని చూసి, పోనీ timeline లోకి వెళ్ళి, అదేదో delete చేసేద్దామా అంటే, ఆ సదుపాయం కాస్తా తీసేశారు. ఆయనెవరో, ఓ సలహా ఇచ్చారు- ఇంకో సిస్టంలో లాగిన్ అయి చూడండి అని. ప్రస్తుతం చేస్తూన్న పని అదే. డెస్క్ టాప్ లో కొంతసేపూ, లాప్ టాప్ లో కొంతసేపూ, వీటితోనే సరిపోతోంది.
ఈవేళ, స్నేహితుడు రెహ్మాను ఓ సలహా ఇచ్చారు. సమస్య fb తో కాదూ, నా బ్రౌజరు ( Chrome) తోనూ అని. పరిష్కారం కూడా చెప్పారు.Google Chrome లో ఉన్న ఒక extension ను enable చేసికుని మొత్తానికి తాత్కాలికంగా, బయట పడ్డాను.

    ప్రతీసారీ, నాకు సాధ్యమైనంతవరకూ, తప్పులు లేకుండా పెట్టడానికే ప్రయత్నిస్తూంటాను. అయినా, ఒక్కొక్కప్పుడు తప్పులు వస్తూంటాయి. నా మిత్రులలో ఎవరో ఒకరు, తెలియచేసినప్పుడు, వెంటనే సరిచేసికుంటూంటాను. అయినా కొందరు “విచిత్ర ప్రాణులు”, నేను సరిచేసిన తరువాత కూడా, అదే ” ఎత్తి చూపి” ఓ ఆనందం అనుభవిస్తూంటారు. అదో మనస్థత్వం కొందరిది. భరించాలి.. కానీ అలాటప్పుడు అనిపిస్తూంటుంది- ఈ వయసులో నాకివన్నీ అవసరమా అని. అయినా ఒక వ్యక్తి కోసం , మానుకోవడం కంటే, సంతోషిస్తున్న మిగిలిన మిత్రులకోసం, ఆమాత్రం శ్రమ పడితే తప్పేమీలేదనిపిస్తుంది.

    మన చిన్నప్పుడు, స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతీ subject కీ guide లు ఉండేవి, గుర్తుందా. అలాగే నా వ్యాపకమూనూ. నేను పోస్టు చేస్తున్న సమాచారం, ఎవరికీ తెలియదని కాదు, ఒకసారి ఆ ప్రముఖుల గురించి గుర్తుచేయడమే, ముఖ్యోద్దేశం. పోనిద్దురూ ఆనాటివారు ఎలా పోతే మనకెందుకూ, అనుకుంటే అసలు గొడవే లేదు. కానీ, నూటికి తొంభైమందికి nostalgia లో ఆసక్తి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే మొదలెట్టాను.

Advertisements

6 Responses

 1. <<< కానీ అలాటప్పుడు అనిపిస్తూంటుంది- ఈ వయసులో నాకివన్నీ అవసరమా అని. ….

  అవదూ మరి !

  ఆయ్ !

  బ్లాగు లోకాన్ని విడిచి పెట్టి పోతే మరి ఎట్లా !

  బుద్ధి గా మళ్ళీ బ్లాగు లోకానికే వచ్చే సేయ్యండి !!

  లోకాః సమస్తా ఫేకు బుక్కో భవంతు !!

  జిలేబి

  Like

 2. నిజమే, బ్లాగ్లో ఇలాంటి తిరకాసు లు లేవు

  Like

 3. ఈ రిస్కులు ఇష్టం లేకే నేను ముఖపుస్తకం వంటి వాటిల్లో లేను.

  Like

 4. ఫణిబాబు గారికి,
  నమస్కారం
  ఎందుకోగాని నాకూ ఆ ముఖపుస్తకానికీ నచ్చుబాటు కాలేదు 🙂 ఒక అక్కౌంట్ ఉంది కాని, అన్నీ చేదు అనుభవాలే! నేనెవరికి ఫ్రెండ్ రిక్క్వెస్ట్ పంపను, అదో పెద్ద కథ. మీకు చెప్పగలవాడను కాను కాని…….. అది చాలా పెద్ద పెద్దవారి….పైకొకటి లోపలఒకటి చేసేవారి అడ్డా అనేది నా అభిప్రాయం. ఇకబ్లాగంటారా! అది మనిష్టం, కుదిరితే కప్పు కాఫీ, లేదా చెల్లు. పొరపాటు మాటాడి ఉంటే బ్లాగ్గురువుగారు మన్నించాలి.

  Like

 5. జిలేబీ,
  మీ సలహా శిరోధార్యం…ఇటుపైన వారానికి కనీసం మూడు టపాలు…

  డాక్టరుగారూ,

  మీరన్నదీ నిజమే…కనీసం బ్లాగులో ” encroachment” లు ఉండవు…

  నరసింహారావుగారూ,
  అప్పుడప్పుడు రిస్కులు కూడా తీసికోవాలండీ.. చేతులుకాలితేనే కదా తెలిసే$దీ?

  శర్మ గారూ,

  పెద్దలు మీరూ.. అనుభవం మీద చెప్తూన్న మాటలు కాదని ఎందుకనాలి? మీరు చెప్పినంత “చేదు” అనుభవాలు రాలేదనుకోండి. “పంటి కింద రాయి” ( నాకు పళ్ళు లేవనుకోండి) లా అప్పుడప్పుడు … అంతే…

  Like

  • గురువుగారు! నాకూ పళ్ళులేవు, 🙂 మొన్ననే పీకించేసుకున్నా, పూర్తిగా! ఏదో సంసారపక్షంగా వారానికి మూడు టపాలు, బస్!…. కప్పు కాఫీ కాలక్షేపం…చాల్లెద్దురూ…వేసం కాలమొచ్చేసింది.. అప్పుడే ఎండలు దంచేస్తున్నాయి మూడురోజులనుంచి…రాత్రి చలి ఉంది..

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: