బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ఏదో సరదాగా అంటే, మరీ అంత సీరియస్సుగా తీసికుంటారేమిటమ్మా…


   మన దేశ ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారు, “స్వఛ్ఛ అభియాన్ ” అని పేరుపెట్టి, దేశంలో ఉన్న so called ” ప్రముఖులందరినీ” అదేదో బ్రాండ్ ఎంబాసడర్లు చేసేశారు. దానితో, దేశంలో రాత్రికి రాత్రే బాగుపడిపోతుందనుకున్నారు. మన కి సర్టిఫికెటల మీద సంతకాలు పెడుతూంటారు, వారెవరో ” నోటరీస్ ” లాగ, ఈ బ్రాండ్ ఎంబాసడర్లు కూడా ఓ ఆదివారప్పూట, చేతిలో చీపుళ్ళు పట్టుకుని ఫొటోలూ, టివీ ల్లోనూ హడావిడి చేశారు. ఇంకేముందీ, దేశమంతా బాగుపడిపోయిందన్నారు. గాంధీ గారి కళ్ళజోడుని ఓ “లోగో” చేసేశారు. పోనీ అంతటితో ఊరుకోవచ్చా, అబ్బే మొట్టమొదట దేశరాజధాని ఢిల్లీ ని శుభ్రపరుద్దామన్నారు. అరే ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వమే లేదూ, అని గుర్తుకొచ్చి, పోనీ ఏదో సద్దుబాటు ( horse trading)) చేసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామా అని చూశారు, కానీ కుదరలేదు. చేసేదేమీ లేక ఎన్నికలు ప్రకటించారు. దేశం మొత్తం మీద నెగ్గగా లేనిది, ఢిల్లీ ఎంతా? बाए हाथ का खेल అనుకున్నారు. తీరా చూస్తే ముఖ్యమంత్రి పదవికి సరిపడేవారు లేక, మొన్న మొన్నటి దాకా బిజేపీ ని నానా మాటలూ అన్న, కిరణ్ బేడీ ని రంగంలోకి దింపారు. ఆవిడేమో, తను 40 సంవత్సరాలు చేసిన నిస్వార్ధ్ధ సేవ పణంగా పెట్టి, రంగం లోకి దిగారు.

    దేశం లోని అన్ని రాష్ట్రాలలోని బిజేపీ నాయకులూ, కేంద్ర మంత్రివర్గం, మోదీ గారూ, గత నెల రోజులుగా మీటింగులు పెట్టేసి, వాటిని అన్ని చానెళ్ళలోనూ, ప్రత్యక్షప్రసారాలు చేసేసి, ఒకటేమిటి, అన్ని రకాల హడావిళ్ళూ చేసేశారు. మోదీ గారు ఏదో సరదాగా.. మొట్టమొదట ఢిల్లీ నే దేశానికి స్వఛ్ఛభారత్ కి ప్రతీకగా ఉంచాలి” అని ఎరక్కపోయి అన్నారు. ఢిల్లీ వాసులు ” ఔను కదూ.. తుడిచేద్దాం.. ” అనేసికుని, ఆంఆద్మీ పార్టీవారి చీపురు గుర్తు మోదీగారిదే అయుంటుందీ అనుకుని, ఆ పార్టీని ఉహాతీతంగా నెగ్గించేశారు. బిజేపీ వాళ్ళేమో, చతికిలబడ్డారు. చిత్రం ఏమిటంటే, రాష్ట్రాన్ని విభజించినందుకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, కాంగ్రెస్ ని ఎలా నామరూపాలు లేకుండా చేశారో, exactly అలాగే, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ని తుడిచిపెట్టేశారు. దేశానికి ఇదో శుభ పరిణామం.

    దేశ ఎన్నికల euphoria లో, ఓ మూడు నాలుగు రాష్ట్రాలలో, బిజేపీ వచ్చింది, కానీ ఢిల్లీ ఎన్నికల దృష్ట్యా రాబోయే ఎన్నికలలో ఇంకా ఏమేమి చూడాలో? ఇదివరకటి రోజుల్లో ఎన్నికల్లో ఏ పార్టీ అయినా మరీ ఇన్నేసి సీట్లు సంపాదించేస్తే, అధికారపార్టీ rigging చేసిందనేవారు. మరి ఇప్పుడో? నెగ్గకపోతామా అని మోదీగారి పరిపాలనకి రిఫరెండం అన్నారు. తీరా తుడిచిపెట్టుకుపోయేసరికి, అబ్బే అలాటిదేమీలేదూ, ఎక్కడదక్కడే, దేశం వేరూ, రాష్ట్రం వేరూ అన్నారు. అవేవో exit polls ని बाजारू అని స్వయంగా మోదీ గారే ఘోషించారు. ఇంక బేదీ గారైతే, ఇక్కడే ఉండడమా, లేక ఆవిడ లెక్చర్స్ ఇచ్చుకోడమా అనే ఆలోచనలో ఉన్నారు. చూద్దాం..

    ఉత్తుత్తి కబుర్లు చెప్పడమూ, హిందువులందరూ ఇంకా ఇంకా పిల్లల్ని కనాలీ, blah..blah.. లు పనికిరావూ అని తేలిపోయింది. దేశరాజధానిలో ఉంటూ కూడా, పార్టీల చెత్త చెత్త స్లోగన్స్ పట్టించుకోకుండా, ఢిల్లీ ఓటర్లు రాజకీయ పార్టీలకి ఓ చక్కని గుణపాఠం నేర్పారు. కేజ్రీవాల్ గారు ఏం చేయబోతున్నారు అన్నది చూడాలి.మోదీగారు ఏమిటేమిటో చేస్తానన్నారు, ఇక్కడ మన ” చంద్రులు” ఇద్దరూ రోజుకో ప్రకటన చేసేస్తున్నారు. చూడాలి…

   ఏదీ ఏమైనా, ఢిల్లీ ప్రజలు అసలు సరుకు చూసినతరువాతే ఓటు వేస్తారూ అన్నది తేలిపోయింది. ప్రజాస్వామ్యానికి ఇదో మరచిపోలేని రోజు….

7 Responses

  1. >>ఢిల్లీ నే దేశానికి స్వఛ్ఛభారత్ కి ప్రతీకగా ఉంచాలి” అని ఎరక్కపోయి అన్నారు. ఢిల్లీ వాసులు ” ఔను కదూ.. తుడిచేద్దాం.. ” అనేసికుని, ఆంఆద్మీ పార్టీవారి చీపురు గుర్తు మోదీగారిదే అయుంటుందీ …..

    సూపరస్య సూపరః !

    చీర్స్
    జిలేబి

    Like

  2. SPECIAL GROUP OF STATES – ASSEMBLIES without CONGRESS MLAs

    1. ANDHRA PRADESH
    2. DELHI

    HOW MANY MORE ARE JOINING?

    Like

  3. desam lo andaroo naalaanti ati sincerelu ekkuvaipoyi ilaanti tudichivetalu..chesukunna vaariki…chesukunnanata..

    Like

  4. జిలేబీ,
    మీ స్పందనకు ధన్యవాదాలు…

    Like

  5. బోనగిరి గారూ,

    చూద్దాం త్వరలో ఎన్నికలు వస్తున్నాయిగా, కాంగ్రెస్ తో పాటు, బిజేపీ కూడా ఒళ్ళుదగ్గరపెట్టుకోవాలని ఢిల్లీ వాసులు ఓ వార్నింగు ఇచ్చారు…

    అమరేంద్ర గారూ,
    నిజం. మీరు చెప్పినట్టు ” చేసికున్నవాళ్ళకి చేసికున్నంత..”

    Like

    • ఢిల్లీ లో మన తెలుగువారి శక్తీ కొంత శాతం ఈ నాటి క్రేజ్ కూడా క్రేజివార్ విజయానికి దోహద పడింది
      మోదీ గారికి మన ఆగ్రహం రుచి చూపించారు మరి మన రాష్ట్రానికి వారు ఇవ్వాల్సిన ప్రతిపత్తి ఆలస్యం చేస్తున్నారు కదా
      నేటి రాజకీయ వాతావరణం పైన మీ వ్యాఖ్య సమంజసముగా సముచితముగా ఉంది మిత్రమా .

      Like

  6. ఢిల్లీ లో మన తెలుగువారి శక్తీ కొంత శాతం ఈ నాటి క్రేజ్ కూడా క్రేజివార్ విజయానికి దోహద పడింది
    మోదీ గారికి మన ఆగ్రహం రుచి చూపించారు మరి మన రాష్ట్రానికి వారు ఇవ్వాల్సిన ప్రతిపత్తి ఆలస్యం చేస్తున్నారు కదా
    నేటి రాజకీయ వాతావరణం పైన మీ వ్యాఖ్య సమంజసముగా సముచితముగా ఉంది మిత్రమా .

    Like

Leave a comment