బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– “తెలుగు వికీ” లో కొన్ని avoidable mistakes.


        ఏదో అందరికీ అందుబాటులో ఉండాలన్న గొప్ప ఉద్దేశ్యంతో , వికీపీడియా వారు, అంతర్జాలం లో వివిధ భాషల్లోనూ సమాచారం అందిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, తగినంత జాగ్రత్త తీసికోవడంలేదేమో అనిపిస్తోంది. విమర్శించడం చాలా తేలిక, స్వయంగా ఏదైనా చేస్తేనే, అందులోని కష్టసుఖాలు తెలుస్తాయీ, ఊరికే బయటనుంచి మాట్టాడడం కాదూ, అని కొందరు అభిప్రాయ పడొచ్చు. అలా చేయడం తెలియకే కదా, సమాచారం అవసరమైనప్పుడు, తెలుగు వికీపీడియా చూస్తున్నది. ఒక వేదిక ఓ విషయం గురించి సమాచారం సేకరిస్తున్నప్పుడు దానిని కూలంకషంగా పరిశీలించిన తరువాతే , ప్రచురిస్తే బాగుంటుందేమో.

    వార్తా పత్రికల విషయం వేరు. ఏదైనా వార్త ప్రచురించినా, దాన్ని ఎవరో చదివి ఆ వార్తలోని నిజానిజాలు తెలియచేస్తే, అది ఆ పత్రిక యాజమాన్యానికి నచ్చితే, ఏదో ఆ మర్నాటి పత్రికలో, ఆ ముందురోజు వార్తను సవరిస్తూ ఓ ప్రకటన ఇచ్చి, చేతులు దులిపేసికుంటారు. కాకపోతే ఆ వార్త ఏ వ్యక్తికి ఆపాదించారో ఆ “ప్రముఖుడు” నన్ను out of context quote చేశారూ అంటాడు. అదీ కాకపోతే కోర్టులో “పరువు నష్టం ” దావా వేసికుంటారు. అయినా ఈ రోజుల్లో వార్తా పత్రికలని నమ్మడం ఎందుకులెండి? ఏ చానెల్ చూసినా, ఏ పత్రిక చదివినా అందులో కనిపించేవి, వారివారి “ప్రియతమ నాయకుల” గురించి, జేజే లూ, ప్రతిపక్షాల గురించి అవాకులూ, చవాకులూ.. less said the better. అయినా మనవార్తాపత్రికలు, న్యూస్వ్ చానెళ్ళ గురించీ కాదుగా ఇక్కడ ప్రస్తావిస్తూన్న విషయమూ…

    కానీ, వికీపీడియా అంతర్జాతియంగా ప్రసిధ్ధి చెందిన ఒక సంస్థ. ఇంగ్లీషు తో పాటు, ప్రపంచం లోని వందలాది భాషల్లో, వేలాది విషయాల గురించి సమాచారం లభిస్తుంది. నూటికి తొంభై పాళ్ళ వరకూ, ఇంగ్లీషు వికీ లో సమాచారం బాగానే ఉంటుంది. మనకి తెలియని ఎన్నో ఎన్నెన్నో విషయాలు తెలిసికుంటాము. చెప్పొచ్చేదేమిటంటే, వికీపీడియా అంటే ఓ గని. ఎంతైనా తవ్వుకోవచ్చు. మన knowledge అభివృధ్ధి చేసికోవచ్చు.

    నావరకూ నేను ప్రతీరోజూ వికీపీడియా ఇంగ్లీషూ, తెలుగూ refer చేస్తూంటాను. నాకు సుళువుగా అందుబాటులో ఉండే సాధనం అదేగా మరి ? ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఒకే వైద్యుడు చెప్పిందే కాకుండా, second opinion అని ఒకటికూడా తీసికుంటాము కదా, అలాగే నేను కూడా ఏదైనా విషయం తెలిసికోవాలనుకున్నప్పుడు, రెండు మూడు సైట్లు చూస్తూంటాను. ప్రతీరోజూ ఇంకో పనేమీ లేదా, ఈ వికీపీడియా చూడ్డం తప్పా అనకండి. రిటైరయిన తరువాత ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలిగా. పైగా ఎవరు చూసినా, అదేదో faceబుక్కూ, Whatsapp లలో మనం లేమనుకుంటే, అదేదో “పాపం” చేసినట్టు చూస్తూంటారు. సరే, మనమేం తక్కువ తిన్నామూ అనుకుని, గత కొన్ని నెలలుగా ఓ వ్యాపకం పెట్టుకున్నాను. ప్రతీ రోజూ, ఆ మర్నాటికి సంబంధించిన ప్రముఖ వ్యక్తుల , పుట్టినరోజులూ, జయంతులూ ఈ నాటి వారికి పరిచయం చేద్దామని, ఓ రెండు మూడు గంటలు అంతర్జాలం లో వెదికి ఆ సమాచారం ఇద్దామని. అక్కడికేదో నేనేదో ” ఘనకార్యం” చేస్తున్నానని కాదు కానీ, ఎంత చెప్పినా మన జీవితాలను ప్రభావితం చేసిన ప్రముఖ వ్యక్తులను కనీసం వారి జన్మదినం రోజునో, లేక వర్ధంతి రోజునోనైనా గుర్తుచేసికుంటారని. ఇక్కడ ప్రచురిస్తూంటాను. నచ్చిన వారికి నచ్చుతున్నాయి. అదో కాలక్షేపం. కనీసం ప్రతీరోజూ చూసి..చూసి.. రేపెప్పుడో నన్నూ గుర్తుంచుకుంటారని !! దీనివలన నాకు లభించినది ఏమిటంటారా, అంతర్జాలం ధర్మమా అని ఎందరో స్నేహితులు. ఈ వయసులో ఇంతకంటే ఏం కావాలండి?

    రెండేసి రోజుల వివరాలు సేకరించే సందర్భంలో ఫిబ్రవరి 9 వ తారీకు, వివరాలు చూస్తే, అందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది.తెలుగు వికీ ఫిబ్రవరి 9.

    అందులో “మరణాలు ” శీర్షిక కింద 1975-రెండో పేరు చూడండి. లక్షణంగా, ఆరోగ్యంగా ఉన్న సుమంత్ ని మరణాల జాబితాలో వేసేశారు. మరీ ఇంత అన్యాయమా? సమాచారం ఇవ్వడమే కాదు, ఆ సమాచారం ప్రచురించే ముందర, దాని authenticity కూడా చూసుకోవడం, సంస్థ బాధ్యత అని నా అభిప్రాయం. ఇంకొక సూచన — ప్రముఖ వ్యక్తుల గురించి రాసేటప్పుడు, ” ఏకవచనం ” తో కాకుండా, మర్యాదగా ” బహువచనం” తో సంబోధిస్తే బాగుంటుందని. ఎంతైనా, వారు మనకంటే ప్రముఖులూ, పెద్దవారూనూ.. అందుకే కదా వికీపీడియాలో వారి గురించి ప్రస్తావించిందీ ?

10 Responses

 1. మానవ తప్పిదం. ఇప్పుడు సరిచేశాను.

  Like

 2. ఏకవచనంతో సంబోధించడం పై వికీపీడియాలో చాలా చర్చ జరిగింది. అన్నివ్యాసాలలో ఒకే విధమైన సంబోధన ఉంటే బాగుంటుందనే అనుకుంటున్నాను. అయినా ఏక వచన ప్రయోగం ఇప్పుడు (కనీసం వికీపీడియాలో) అమర్యాద కాదు 🙂

  Like

 3. బాబుగారూ!

  పొరపాటున జననాలలో బదులు మరణాలలో వ్రాసి వుంటారు. నాకు తెలిసినంతవరకూ, తె వి కీ లో యెవరైనా, దేన్నైనా సరిచేయొచ్చు. అలా సరిచేయబడినట్టు కూడా ప్రచురితం అవుతుంది. మీ అనంతానుభవాన్ని వీటికి కూడా ఉపయోగించండి వీలు చూసుకొని!

  Like

 4. చూశారా…..కోడీహళ్లి వారు స్పందించనే స్పందించారు!

  Like

 5. మురళీ మోహన్ గారూ,

  మీరు నేను వ్రాసిన టపా సహృదయంతో స్వీకరించినందుకు ధన్యవాదాలు. ఇంకొక విషయం– మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు కానీ, మీరన్నట్టు ” అన్ని వ్యాసాలలోనూ ఒకే విధమైన సంబోధన ” లేదు. కొన్నిచోట్ల ” రు ” ఇంకొన్ని చోట్ల ” డు” అని ఉన్నాయి. గమనించ ప్రార్ధన…. ఏదో నాకు అనిపించింది వ్రాశాను.

  కృష్ణ శాస్త్రి గారూ,

  మీరన్నట్టు “మార్పు” చేసే సౌలభ్యం ఉంది. కాదనను.. కానీ ఎన్నని ? మనకేదైనా సమాచారం కావాల్సొస్తే వికీపీడియా వెదికితే ” పేజీ సృష్టించు” అని వస్తుంది. అంత తెలివితేటలు ఉంటే ఎక్కడో ఉండేవాడినేమో…

  Like

 6. నావరకూ నేను ప్రతీరోజూ వికీపీడియా ఇంగ్లీషూ, తెలుగూ refer చేస్తూంటాను. నాకు సుళువుగా అందుబాటులో ఉండే సాధనం అదేగా మరి – అన్నారు మరి అంతగా రిఫర్ చేసే మీరు అక్కడ తప్పు కనిపిస్తే ఎందుకు వదిలేసారు. వికీలో ప్రధానమైన రూల్ ఎవరైనా ఎపుడైనా మార్పు చేయచ్చి అని. తప్పు కనిపిస్తే ఎవరూ ఎవరు రాసారు ఎందుకు రాసారు ఎపుడు రాసారు అని వెదకరు – మార్పు అనేది ఉంది కనుక వెంటనే సరిచేస్తారు. ఇక అంతర్జాతీయంగా పేరు పొందిన సంస్థ అన్నారు. అది మనము మనకొరకు తయారు చేసుకొన్న ఒక విజ్ఞాన వేదిక మాత్రమే. మనకు సరిఅయిన సమాచారం కావాలంటే మనమే సరిగా రాసుకోవాలి. మీకు తెలిసింది మీరు రాయండి. ఉయోగించుకోవడం మాత్రమె కాదు ఉపయోగపడేలా చేయాలికదా ఎవరు చేస్తారు?. ఇక్కడ అందరూ వాలంటీర్లుగానే చేస్తున్నారు. భవిషత్తు తరాల ప్రయోజనాల కొరకు .

  Like

 7. విశ్వనాథ్ గారూ,

  మీ సూచన బాగానే ఉంది. నేను ఈ టపా వ్రాసిన ఉద్దేశం, ఎవరినో తప్పు పట్టాలని కాదు అని గమనించండి. నిజం చెప్పాలంటే, తెలుగు వికీ లో చాలా తప్పులు కనిపించాయి, ముఖ్యంగా తేదీల విషయంలో… అక్కడకి నాకేదో తెలిస్తేనే కదా, సరి చేసేదీ? వివిధ సైట్లలో ఒకో రకంగా ఉంటుంది. ఏది సరైనదో తెలియనప్పుడు, మిడిమిడి తెలివితేటలతో సరి ( మార్పు) చేయడంకంటే, తెలియచేయడమే సరైన పధ్ధతి అనుకున్నాను… అలాగని నేను చేసే పోస్టులలో ఎప్పుడూ తప్పు చేయలేదని అనలేదు. నా పోస్టులలో ఎవరైనా “తప్పు” point out చేసినప్పుడు, వెంటనే సరి చేసికున్నాను. ఇప్పుడు శ్రీ మురళీమోహన్ గారూ అదే పని చేశారు.. దీనివలన మీ మనోభావాలు ఏమైనా hurt అయుంటే, చేసేదేమీ లేదు.

  Like

 8. ప్రముఖుల సంభోధన గురించి అయితే రాముడు వచ్చాడు అనటం జరుగుతుంది కాని రాము గారు వచ్చారు అన్లేం. చిరంజీవి అదరగొట్టాడు అంటాం కాని చిరంజీవి గారు అదరగొట్టారు అనం, గాంధీ వచ్చాడు, స్వతంత్రం తెచ్చాడు. ఇలా ప్రముఖులను వాడు అనటం మామూలు కనుక అలా మొదలెట్టారు, ప్రస్తుతం రెండువిధాలా రాస్తున్నారు. పాతవి అలా ఉంచి కొత్త వారిని గారు వారు లా చేస్తున్నారు – కాని పాత వాటినీ అలాగే చేయాలంటే ఏమంత అందం కాదు. ఆంగ్ల వికీలో లక్షల మంది రాస్తున్నరు, పరిశీలించేవాళ్ళూ వేలల్లో ఉన్నారు. మరి తెలుగులో రాసేవాళ్లే పదుల సంఖ్య దాటటం లేదు. పరిశీలించేవాళ్ళు రాసేవాళ్లకంటే ఎక్కువ అన్నట్టుంది.

  Like

 9. తెలియ చేయాలంటే అక్కడ ప్రతి వ్యాసానికీ ఒక చర్చా పేజీ ఉంటుంది. ప్రతి వాళ్ళూ రాస్తారు. లేదూ దాని క్రింద కూడా రాయచ్చు, ఇది తప్పుగా అనుకుంటున్నాను. ఒక సారి సరిచూడండి అని రాయచ్చు – మీకు తెలుగు రాయడం చాలా బాగా వచ్చును కదా – చాలా తప్పులు కనిపిస్తున్నపుడు మీకు దృష్టికి వచ్చినవే సరిచేయండి.

  Like

 10. విశ్వనాథ్ గారూ,

  మీరన్నట్టుగా “రాముడి” గురించి , మరీ ” రాముగారు” అని సంబోధించాలని కాదండి. మా చిన్నప్పుడు, పెద్దవారిని ” గౌరవంగా, మీరు, ఆయన.. ” అని సంబోధించాలని నేర్పారు, ఏం చేయమంటారు? ఆధునిక కాలంలో అవన్నీ మారిపోయాయేమో…
  ఇంకో విషయం– హిందీలో ” आप..” కీ ” तुम..” కీ ఉన్న తేడాలాటిది. ఉత్తరభారత దేశంలో లక్నో విషయం తీసికుంటే వారు ప్రతీవారినీ ” आप ” అనే సంబోధిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో తల్లితండ్రులు తమ పిల్లల్ని కూడా ” आप ” అనే సంబోధిస్తారు. ఎవరి పధ్ధతి వారిది.
  అయినా, మనకంటే గొప్పవారిని, ప్రముఖులనీ గౌరవసూచకంగా సంబోధిస్తే వచ్చే నష్టమేమిటో నాలాటి “అర్భకులకి ” అర్ధం అవడం లేదు.. నేను వ్రాసిన టపా శీర్షిక చూస్తే తెలుస్తుంది ” avoidable mistake ” అనివ్రాశాను.. అంటే మీరన్నట్టుగా ” ఇది తప్పుగా అనుకుంటున్నాను. ఒక సారి సరిచూడండి ” అనే కదా అర్ధం ?.
  ఇంక మీసూచన ప్రకారం నాకు “తెలుగు” వ్రాయడం వచ్చును కదా అని, ప్రతీదీ సరిచేసే level కి రాలేదండీ. మహా అయితే, వికీలో ఏదైనా ” unintended mistake ” చూసినా, నాదారిన నేను పట్టించుకోకుండా ఉండడానికే పరిమితం అవడం, ఉత్తమంగా భావిస్తున్నాను.. అలా కాదంటారా, మీ ఫోను నెంబరివ్వండి, అవసరం వస్తే ఫోను చేసి మీకు చెప్తూంటాను. సరేనా…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: