బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్…


    అదేవిటో కానీ, నాకు వారంలోని అన్నిరోజుల్లోనూ మంగళవారం అంటే చాలా ఇష్టం. కారణం చెప్పలేను, కానీ ఆరోజున అంతా బాగుంటుందనీ, ఆరోజంతా feel good గానే ఉండడం చేత, ఈ మంగళవారంకోసం ఎదురుచూస్తూంటాను. మా ఇంటావిడ ఏదైనా పని చెప్పినా, లేదా నేనేదైనా ముఖ్యమైన పనిచేయాలన్నా, ఈ మంగళవారానికే వాయిదా వేస్తూంటాను. అలాగని మిగిలిన రోజులు బాగుండవని కాదూ, ఏమిటో మంగళవారాల్లాగ మాత్రం ఉండవు. ఎవరి పిచ్చివాళ్ళకి ఆనందం అని సరిపెట్టేసికోండి.

    ఒక్కోప్పుడు ఏ పని చేద్దామనుకున్నా, పని అవదని కాదు కానీ, ఏదో ఆటంకం, చిరాకూ, మొత్తానికి అవుతుంది, కానీ అంత సంతృప్తిగా ఉండదు. నిన్నటికి నిన్న ( సోమవారం) అంతా అలాగే గడిచిపోయింది. మా ఇంట్లొ ఇక్ష్వాకుల కాలం నాటి ఒక SONY MUSIC SYSTEM ఉందిలెండి, అంటే మరీ అంత పాతదని కాదూ, 2000 సంవత్సరంలో కొన్నదే, ఇప్పటి వాటితో పోలిస్తే పాతదన్నమాట,మొదట్లో అన్నీ బాగానే పనిచేసేది. క్రమక్రమంగా, ఒక్కో “అంగమూ” పనిచేయడం తగ్గించింది. పాపం దానికీ వయసొచ్చేసిందిగా,క్యాసెట్లు పెట్టుకునేది బీట తీసింది, FM అయితే రావడమే మానేసింది, ఇంక CDలంటారా, పాత గ్రామఫోను రికార్డుల్లా ఒకచొటే తిరుగుతుంది. అయినా హాల్లో “అలంకారార్ధం గంధం సమర్పయామి” లా హాలుకి నిండుతనం తెస్తోంది.gadgets 036. దానికి వైద్యం చేయిద్దామని,దగ్గరలో ఉండే SONY వాడిని అడిగితే, ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాప్పుకి వెళ్ళమన్నాడు. దగ్గరా, దాపా , నేనా బస్సులవాడినాయె, పిల్లల్ని అడిగితే తీసికెళ్తారు, కానీ ముందర చెప్పేదేమిటయ్యా అంటే, దీన్ని మార్చేసి కొత్తది తీసికోమని. కానీ 10 సంవత్సరాలు, అంత బాగా పనిచేసినదాన్ని, ఏదో ” ఆరోగ్యం” బాగాలేదని బయట పారేస్తామా మరీనూ? ఎంతైనా ” పాతతరం ” వాళ్ళం, పోనీ ఓసారి వైద్యం చేయిస్తే బాగుపడుతుందేమో అన్న ఆశ.ఎంత చెప్పినా తరాలు వేరు కదా ! అలాటి ఆలోచనలు పిల్లలకి అంత నచ్చవేమోలే అనుకుని, మా స్నేహితుడు శ్రీ శాస్త్రిగారితో మాటవరసకి అన్నాను ” మాస్టారూ మీకు వీలైతే ఒకసారి మీ కారులో తీసికెళ్తారా..” అని , ఆమాత్రం చనువుందిలెండి ఆయనతో. దానికేముందండీ తప్పకుండా వెళ్దాం అన్నారు. ఆమధ్యన ఒక రోజు OLA cabs వాడు ఒక్కరోజుకి, అదేదో promotional offer పెట్టాడు. రోజంతా ఫ్రీగా వాడుకోవచ్చని. సరే అనుకుని, ఆ cab వాడిని పిలిచి మొత్తానికి ఆ SONY డాక్టరుదగ్గర నా Soundsystem ని చేరేశాము.ముందర ఓ 500 డిపాజిట్ చేయమంటే, నాదగ్గర లేకపోవడంతో పాపం ఆయనే ఇచ్చారు. (తరువాత తిరిగి ఇచ్చేశాననుకోండి.).

    మర్నాడు ఫోనుచేసి, దాన్ని repair చేయడానికి 5000 అవుతుందన్నాడు, పైగా గ్యారెంటీ కూడా లేదాయె.మరీ అంత డబ్బు ధారపోసే ఓపిక లేక , ఎప్పుడో exchange offer లో కొత్తదే తీసికోవచ్చనే ఉద్దేశ్యంతో వద్దనేశాను. మరి దాన్ని తిరిగితెచ్చుకోవద్దూ, మళ్ళీ శ్రీ శాస్త్రిగారి సహాయం అడిగేను. ఆ cab వాడు 50% రాయితీ ఇస్తాననడంతో, నన్ను ఆ షాప్పుకి బస్సులో వెళ్ళమనీ, తను అక్కడకి cab వచ్చేటట్టు బుక్ చేస్తాననీ చెప్పారు. ఆయన cab బుక్ చేసి, ఆ వివరాలు నా మొబైలో పంపేరు. ఓ అరగంటలో వస్తానన్నవాడు, గంటన్నరైనా అయిపూ, జాడా లేకుండా పోయాడు. అప్పుడు వాళ్ళకి ఫోను చేసి నానా చివాట్లూ వేసి బుకింగు క్యాన్సిల్ చేసి, ఆటోలో ఇంటికొచ్చాను. అనవసరంగా ఇంత శ్రమపెట్టేశానే అని శ్రీ శాస్త్రిగారు బాధపడిపోయారు. పాపం ఆయనేమైనా కావాలని చేశారా ఏమిటీ, ఆ దరిద్రపు OLA Cabs వాడి నిర్వాకమేగా ఇదంతా.ఏదో మొత్తానికి ప్రొద్దుటి session అలా పూర్తయి, ఇంట్లో తినడానికి పళ్ళు లేవని, బయటకి వెళ్ళి, పనిలో పనిగా D’mart కి వెళ్ళాను.

    ఈమధ్యన మా ఇంట్లో పనిమనిషి లేకపోవడంతో, మా ఇంటావిడే చేసుకుంటోంది.ఏదో మరీ ఒంగుని తుడిస్తే, నడుం నొప్పిపుడుతోందీ అనే ఉద్దేశ్యంతో, అదేదో కొన్నాను, ఉపయోగిస్తుందీ అని.
gadgets 034
నా చేతిలో చూడ్డంతరవాయి, ” మళ్ళీ ఇలాటిది ఎందుకు తీసికొచ్చారండి బాబూ.. ఇదివరకోసారి చెప్పానుగా..” అంటూ ధూం..ధామ్ అనేసింది. పోనీ ఓసారి వాడి చూద్దాం అంటే, ” ఇదివరకూ ఆలాగే చెప్పి నన్ను బుట్టలో వేశారు..” చివరకి అంత డబ్బూ పెట్టికొని, పనిమనిషికి ఇచ్చేసాం, పైగా ఇప్పుడు పనిమనిషికూడా లేదూ…అంటూ గయ్యిమంది.. పోతేపోయేయీ 282 రూపాయలూ అనుకుంటూనే, పోనీ వెనక్కి తీసికుంటాడేమో చూద్దామూ అనుకుని, అడిగితే , తిరిగి తీసికుని నా డబ్బులు వెనక్కిచ్చేశాడు… కథ సుఖాంతం..
పైన చెప్పిన olacabs వాడు, నాకు ఆరోజు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ, మా ఫ్రెండు ఎకౌంటుకి 300 రూపాయలు జమచేశాడు, ఆయనేమో ఆ డబ్బులు నాకిచ్చారు !!

Advertisements

2 Responses

 1. >>>> ” మళ్ళీ ఇలాటిది ఎందుకు తీసికొచ్చారండి బాబూ.. ఇదివరకోసారి చెప్పానుగా..” అంటూ ధూం..ధామ్ అనేసింది. పోనీ ఓసారి వాడి చూద్దాం అంటే, ” ఇదివరకూ ఆలాగే చెప్పి నన్ను బుట్టలో వేశారు..”

  మీరు ఇలాంటివి ఎప్పుడు రాసినా మీ మీద నాకో పేద్ద అనుమానం వచ్చేస్తుంది. అసలు మీరు పుణేలో ఉంటారా, లేక మా పక్కింట్లో ఉంటూ మా ఇంట్లో జరిగే ప్రహసనాలన్నీ వినేసి/చూసేసి రాసేస్తారా అని! :):):)

  భవదీయుడు,
  వర్మ

  Like

 2. అబ్బులూ,

  నేనెక్కడకి వెళ్తాను బాబూ? చిత్రం ఏమిటంటే, కాలమానపరిస్థితుల అవసరం లేకుండా, మా ఇంటావిడ చాన్సు వచ్చినప్పుడల్లా నామీద గయ్యిమనడం ఓ హాబీగా పెట్టేసికుంది…
  ఇంకో విషయం… ఈ భార్యలకి దేశాలతో కూడా సంబంధం లేదు. దగ్గరలో ఓ punching bag ఉందా లేదా అని చూసుకోవడం… mission accomplished…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: