బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు — ఏదైనా సరే ఎక్కువైతే మొహం మొత్తుతుంది….


    తినే పదార్ధమైనా సరే, చూసేదైనా సరే, వినేదైనా సరే అప్పుడప్పుడైతే ఫరవా లేదు కానీ, అంతం లేకుండా భరించడం కొంతవరకూ కష్టమే అని నా అభిప్రాయం. కొత్తలో బాగానే ఉంటుంది, రానురానూ విసుగు పుడుతుంది.దేంట్లోనైనా వెరైటీ ఉంటేనే బాగుంటుంది. అలా అంటే, ప్రతీ రోజూ చూస్తున్నారుకదా, కట్టుకున్నవాళ్ళకీ ఇదే రూలా అని between the lines పరీక్షలు పెట్టకండి. వాళ్ళు వేరూ, నేచెప్పిన విషయాలు వేరూ. అలా అంటే మళ్ళీ double standards అంటారు, నాకు తెలుసు. అయినా తిన్న తిండరక్క ఇలాటి topic మీద వ్రాయడం నాదే తప్పు, సరేనండీ ఒప్పుకుంటాను. కానీ ముందుగా నేను వ్రాసేది ఆలోచించండి.మొదటి లైనులో నేను వ్రాసిన వాటి గురించి ఒప్పుకుంటారా లేదా? నాకు తెలుసు ఒప్పుకుంటారని, బయటకి చెప్పుకోడానికి మొహమ్మాటం, ఎందుకంటే సొసైటీలో ఎవరైనా వెలేస్తారేమో అని భయం ! తినడానికి రుచికరంగా ఉంటుందికదా అని ఏ పదార్ధమైనా “అతి” గా లాగిస్తే భరించగలమంటారా?

    ఉదాహరణకి టీవీల్లో వచ్చే ప్రకటనలే తీసికోండి.. ఓ సినిమా వచ్చినా, ఇంకో క్రికెట్ మాచ్ ( నేను చూడననుకోండి) వచ్చినా, ఒకే యాడ్డు ఓ పాతిక సార్లైనా చూపించి మన ప్రాణం తీస్తారు. చివరకి ఎక్కడిదాకా వస్తుందంటే, వాళ్ళు చూపిస్తూన్న ప్రకటనలో వస్తువు అసలు కొనకూడదనేదాకా.. అంత వెగటు పుడుతుంది. అయినా, ఆ చానెళ్ళవాళ్ళు ఈ ప్రకటనలమీదేకదా బ్రతుకుతూన్నారూ అంటారు, అవునండీ నిజమే కాదనడంలేదు,కానీ వాళ్ళు చూపించే పధ్ధతి ఓ negative ప్రకంపనలగా మారడంలేదూ?

    ఈటీవీ వారు అప్పుడెప్పుడో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, “స్వరాభిషేకం ” అని. మొదట్లో బాగానే ఉండేది. చలనచిత్ర రంగానికి సంబంధించిన అతిరథమహారథులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చి, ( అందులో కూడా కొందరు boycott చేశారనుకోండి, ఆ విషయం పక్కకుపెడదాం), నేపథ్యగాయకులందరిచేతా, అలనాటి ఆణిముత్యాలని పాడించడం అదో అలౌకికానందంగా అనిపించింది.అయిదారువారాలపాటు, ఆదివారం సాయంత్రం వచ్చిందంటే చాలు, టీవీ ముందర హాజరు ! ఒక్కో గాయకుడు, గాయని పాడుతూంటే అలా..అలా..పాతరోజుల్లోకి తీసికెళ్ళిపోయారు. దానికి సాయం ఆ కార్యక్రమానికి యాంకరింగు కూడా చాలా బాగుంది. అంతవరకూ బాగానే ఉంది.కానీ అదే కార్యక్రమాన్ని “రూపం ” మార్చేసి, ప్రతీ ఆదివారంనాడూ చూపించడం భావ్యంగా ఉందంటారా?
ఆ విషయం పోనీ పక్కకుపెడదాం… ఇంక మిగిలిన చానెళ్ళలో ఏదో పేరుపెట్టి, ఆ గాయకులే, ఆ పాటలే మళ్ళీమళ్ళీ వినిపించడం. ఆనాటిపాటలు అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు, పాడినవారుకూడా చాలా బాగా పాడేరనడంలోనూ సందేహం లేదు, అలాగని “పాటలు” ఎంత “తీయగా పాడినా” మొహం మొత్తేస్తుందేమో. దీన్నే over exposure అంటారనుకుంటా.

    దేనికైనా ఓ వెరైటీ ఉంటే బాగుంటుందేమో కానీ, ఒకే కార్యక్రమాన్ని మనమీద రుద్దితే అన్యాయం కదూ…

Advertisements

10 Responses

 1. అతి సర్వత్ర వర్జయేత్

  Like

 2. “…ప్రకటనలో వస్తువు అసలు కొనకూడదనేదాకా…”

  మీరు చెప్పిన విషయం చాలా కరెక్ట్. ప్రస్తుతానికి వ్యాపార ప్రకటనలు, అతిగా చూపించటం వాళ్ళ నెగెటివ్ ప్రకంపనలనే తీసుకు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ ప్రకటనలు ఇచ్చే కంపెనీలు గమనించుకోవాలి. ఎదో అలవాటు ప్రకారం పబ్లిసిటీకి ఇంత అని తగలేయ్యకుండా, ఆ డబ్బులతో వస్తువు నాణ్యం పెంచి ధర తగ్గిస్తే, వెయ్యి ప్రకటనల పెట్టుగా ఉంటుంది. కాని ఈ జ్ఞానం కలగటానికి ఎవడన్నా ఎం బి ఏ వాడు వచ్చి చెబితే కాను అర్ధం కాదట. లేదంటే కన్సల్టెంట్ రూపంలోనన్నా వచ్చి చెప్పాలట. సామాన్యంగా చెబితే అర్ధం కాదట.

  Like

 3. టివీ చూడటం మానేసి సుఖపడిపోయానన మాట 🙂

  Like

 4. ఏమిటో, గత నాల్గైదు ఏళ్ళగా మీరు వ్రాసేవి చదివి చదివి …………..దహా.
  (క్షమించాలి. అప్పుడప్పుడు శృతి మించుతాను….మీ దగ్గరే)

  Like

  • ఫణిబాబు గారు ఈ మధ్య ఎక్కువగా వాయడంలేదండి.

   Like

 5. డాక్టరుగారూ,

  కానీ ఆ విషయం మనవాళ్ళు మరచినట్టున్నారు..

  శివరామప్రసాద్ గారూ,

  ఈరోజుల్లో ప్రతీదానికీ ఈ consultancy గోల ఒకటీ.. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదుట !! ఏం చేస్తాం భరింఅాలి…

  అశోక్ గారూ,
  థాంక్స్…

  శర్మగారూ,

  నిజంగా సుఖపడ్డారు…

  సుబ్రహ్మణ్యంగారూ,

  ఇది అన్యాయం !! మీరో ఇంకోరో ఇలాటి మాటంటారనే గత ఆరు నెలల్లోనూ నాలుగంటే నాలుగే టపాలు వ్రాశాను.. అయినా కడుపుబ్బరం ఆపుకోలేక మళ్ళీ బ్లాగుల్లోకి అడుగెట్టాను.. చెప్పండి మానేయమంటే మానేస్తాను.. ఎంతైనా ఓ రెండు నెలలు పెద్ద కూడానూ మీరు…

  Like

 6. ఈ స్వరాభిషేకం విషయంలో మీ మాటే నాదీనూ….తినగా తినగా గారెలు కూడా మొహం మొత్తుతాయని ఊరికే అన్నారా!

  Like

 7. శ్రీదేవిగారూ,

  పోనీలెండి..మీరైనా ఒప్పుకున్నారు నేను చెప్పింది ! తెలుగువారి ” ఆత్మగౌరవం” hurt చేశానని ఎవరైనా కోప్పడతారేమో అని భయపడ్డాను…

  Like

 8. బాబుగారూ!

  స్వరాభిషేకమే కాదు…..రెండు చెవుల్లోనూ తీగలుపెట్టుకుని బుర్ర వూపుకుంటూ, వేళ్లతో తాళం వేసుకుంటూ, యాక్స్తిడెంట్ లు తప్పించుకుంటూ నడిచే వాళ్లనీ, స్లీపర్ కోచ్ లలో ఆ పాత మధురం పాటలు (యెవడికోసం వింటారు అన్నట్టు) సెల్లు ల్లో సౌండ్ పెట్టేసే వాళ్లనీ చూసి, గత రెండు మూడేళ్లుగా……పాటలంటే విరక్తి పుట్టి, సంగీతం వింటే ఒట్టు!

  చక్కని విషయం వ్రాశారు. సంతోషం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: