బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఈవేళ “అత్తగార్ల దినోత్సవం ” ట…


   ఈవేళ ఈనాడు పేపరు చదువుతూంటే తెలిసింది, ఈవేళ అత్తగార్ల దినోత్సవం అని ! మొగుడు బెల్లం- అత్త అల్లం అనుకుంటూన్న ఈరోజుల్లో కూడా, ఈ అత్తగార్లకి ప్రత్యేకం ఒకరోజు కేటాయించడం బాగుంది కదూ !! అసలు ఈ అత్తాకోడళ్ళ వ్యవహారం ఉందే, వాళ్ళిద్దరూ ఏ గొడవాలేకుండా ఉన్నా సరే, ఊళ్ళోవాళ్ళకే కిట్టదు. నూటికి తొంభై కేసుల్లో, బయటివారి ద్వారానే వస్తాయి గొడవలన్నీ. వీటికి సాయం రాత్రనకా పగలనకా మన టీవీల్లో వచ్చే సీరియళ్ళోటి. ఆ చానెల్ వారి ultimate goal ఏమిటయ్యా అంటే, సుఖంగా ఉన్న కుటుంబాల్లో పుల్లలు పెట్టడం.మరీ టీవీల్లో చూపించినంత అధ్వాన్నంగా ఉండదు, నిజ జీవితాల్లో. కానీ ఉన్న కాస్తనీ అతిశయోక్తిగా చూపిస్తేనే కదా టీవీ వాళ్ళ TRP లు పెరిగేది !అదిగో దాన్నే సొమ్ముచేసికుంటున్నారు వాళ్ళు.

    కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే అత్తాకోడళ్ళు సఖ్యంగా ఉంటేనే కదా. ఇంటి మొగాళ్ళిద్దరూ just passive souls లోకే వస్తారు. వీరిప్రమేయం అసలుండదు.అధవా ఉన్నా, ఏదో తమఅస్థిత్వం చూపించుకోడానికి, ఏదో మాటవరసకి ఓ సలహా ఇస్తారు, వాళ్ళకీ తెలుసు ఎవరూ వినరని ! అయినా మానవప్రయత్నమంటూ ఒకటి చేయాలిగదండీ. ఇవన్నీ పూర్వకాలపు పరిస్థితులు.
ఈరోజుల్లో కోడళ్ళ ఆలోచనా పధ్ధతులు కొద్దిగా మారుతున్నాయి.ఎంత అవసరంలేదనుకున్నా, పెద్దవాళ్ళు దగ్గరలో ఉంటే ఉపయోగాలు చాలానే ఉంటాయి. వయసొచ్చిన కూతురుందనుకోండి, ఆ పిల్లకి “అమ్మ” అనే ప్రాణీ, తనకి పెళ్ళై ఇంకో పిల్లకో,పిల్లాడికో తల్లయేవరకూ బధ్ధశత్రువే.అలాటప్పుడు ఇంట్లోనో, ఇంటికిదగ్గరలోనో, తల్లో,అత్తగారో ఉంటే వాళ్ళైనా నయానో భయానో , ఈ పిల్ల బాగోగులు చూసుకుంటారు. ఎంతైనా అమ్మమ్మా, నానమ్మలతో అనుబంధం వేరుగా ఉంటుంది.

   భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూన్న ఈ రోజుల్లో, ఇళ్ళల్లో ఎవరోఒక పెద్దవారుండడంలో ఉండే ఉపయోగాలు కోకొల్లలు. ఈవిషయం కోడళ్ళు కూడా గుర్తించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఆ సందర్భంలోనే అనుకుంటా, ప్రతీదానికీ తలా తోకాలేకుండా “దినోత్సవాలు” పాటిస్తున్నట్టే , ఈ “అత్తగార్ల” క్కూడా ఓ రోజు కేటాయించారు. శుభం !
2011 లో ఆంధ్రభూమి దిన పత్రికలో ఒక వ్యాసంDilmil వ్రాశాను. ఓసారి చదవండి.

   పురాణకాలంలో అత్తాకోడళ్ళు ఎంతో సఖ్యతగా ఉండేవారూ , అసలు గొడవలన్నీ ఈ నవతరానికే వచ్చాయీ అనే అపోహలో ఉండేవాడిని. కానీ ఈమధ్య గృహలక్ష్మి అనే మాసపత్రిక చదువుతూంటే తెలిసింది. 1936 అంటే 80 ఏళ్ళ క్రితమే మారాయని. 1936 అక్టోబరు సంచికలో శ్రీమతి తాడి నాగమ్మ గారు ” మానవ పరిణామము” అనే వ్యాసంలో స్త్రీలలో ఆనాటికీ ఈనాటికీ వచ్చిన మార్పులంటూ ప్రస్తావించారు.Grihalakshmi )ct 1936

2 Responses

 1. 365 రోజుల్లో ప్రతిరోజూ ఎదో ఒక “దినమే”! దినం అనే మాట అంత అంచి అర్ధం వచ్చేదిగా అనిపించదు. కాని ఆంగ్లంలో ఉన్న డే కు తెలుగు అంత కంటే మరొకటి స్పురిమ్చటం లేదు. మరి కొన్నిరోజులు పోయిన తరువాత ఏ దినమూ కాని దినం జరుపుకునే రోజు వస్తుందేమో!

  Like

 2. ఈ మధ్య అంతర్జాతీయ స్త్రీ దినోత్సవ సందర్భంగా
  గుండె జబ్బున్న స్త్రీలలో ప్రసవాల తీరు,
  వారికి నొప్పి తెలియకుండా ప్రసవాన్ని జరిపే మార్గాల
  గురించిన ప్రసంగం ఇస్తూ దానిని, మా అత్తగారికి అంకితం ఇచ్చాను.
  ఎందుకంటే ఆవిడ కాంప్లెక్స్ గుండె జబ్బున్నా ఏడు మందికి జన్మనిచ్చి
  ఆ తరువాత తన 50వ ఏట 8గంటల ఓపన్ హార్ట్ సర్జరి చేయించుకొని,
  కృత్రిమ కవాటాలతో 34 ఎళ్ళకు పైగా ఇంకా జీవించి
  ఉన్న అతి కొద్ది మందిలో ఒకరు.
  ఆవిడ మిగిలిన జీవితం సుఖమయంగా ఉండాలని కోరుకుంటాను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: