బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–రెండురోజుల భాగ్యనగర దర్శనం….


        ఈనెల 13-16 తేదీలలో మా మేనకోడలు కూతురి పెళ్ళికి హైదరాబాద్ వెళ్ళాను. తెల్లవారుఝామునే లేచి, శతాబ్ది పట్టుకోవడంలో ఉన్న కష్టాలు తెలుసును కాబట్టి, మొహమ్మాటపడకుండా, పూణె లో మధ్యాన్నం 2.15 కి బయలుదేరి, ఊళ్ళన్నీ చుట్టబెట్టుకుని, మర్నాడు తెల్లవారుఝామున హైదరాబాదు చేరే, పూణె- హైదరాబాదు express లో బయలుదేరి వెళ్ళాను.ఎవరింటికో వెళ్ళి వారిని శ్రమ పెట్టడం ఎందుకూ అనుకుని, online లోనే రైల్వే retiring room ( A/C ) ది బుక్ చేసికున్నాను. ఈ రూమ్ము సికిందరాబాద్ స్టేషనులో ఉంది. అదేదో MMTS ఎక్కి, మొత్తానికి చేరాను.ఆ retiring room వాడి దగ్గరకు వెళ్ళి, నేను తీసికున్న printout చూపిస్తే, ఓ రూమ్ము చూపించాడు.స్నానం ముగించుకునేసరికి, ఇంతలో తలుపు తట్టి, నేను ఇచ్చిన printout సరీగ్గా లేదన్నాడు. కారణం- నేనిచ్చిన కాగితం అసంపూర్తిగా ఉండడం. ID,TrnxnID లేదుట. ఎలాగూ మా ఫ్రెండు ఇంటికి వెళ్తున్నాగా, సాయంత్రానికి ఇస్తానూ అంటే ఒప్పుకోలేదు.నాకు అప్పటికప్పుడు తెమ్మంటే, ఏం చేయాలో తోచలేదు.దగ్గరలో ఇంటర్నెట్ కెఫేలు ఉంటాయీ, అక్కడకు వేళ్తే చేయొచ్చూ అని సలహా ఇచ్చాడు. తిరా వెళ్ళి చూస్తే, అవేమో ఇంకా తెరవలేదాయె, ఏంచేయనూ అని ఆలోచించి, ఇంట్లో మా ఇంటావిడ ఉందిగా, తనేమైనా సహాయం చేయగలదేమో అనుకుని, ఫోను చేసి సంగతి ఇదీ అని చెప్పడంతోటే, వెంటనే, నా మెయిల్ తెరిచి చూసి చెప్పింది.నేను నోట్ చేసికోవడం అంటే బ్రహ్మప్రయత్నం చేయాలి, అయినా నాకు వీలైనంతవరకూ నోట్ చేసికుని, తిరిగి వెళ్ళి, వాడికి చూపిస్తే, అది తప్పంటాడు. అయినా వాడిననేంలాభం, నా చేతివ్రాత అంత సుందరంగా ఉంది, 9 అని వ్రాస్తే దానికి క్రింద కాడుండకుండా 0 లా కనిపిస్తుంది. మరి ఆ రిటైరింగు రూమ్మువాడు చిరాకు పడ్డాడంటే పడడూ మరి ? అదృష్టంకొద్దీ, మా ఇంటావిడ, నేను చేసే నిర్వాకం ముందుగానే ఊహించి, ఆ నెంబరుని నా సెల్ లో sms చేసింది–కథ సుఖాంతం. అందుకే అంటారేమో మనకంటే మన ఇల్లాళ్ళే తెలివైనవారని !

   మా స్నేహితుడు శ్రీ దాసరి అమరేంద్రగారూ, శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారూ, నేనూ కలిసి, శ్రీ వంశీ గారి ఇంటికి వెళ్ళాము.ఈ సమావేశం పూర్తిగా surprise నాకు.ఆయనతో మాట్టాడుతూంటే, అసలు టైమే తెలియలేదు. ఆయన శంకరాభరణం చిత్రానికి, శ్రీ విశ్వనాథ్ గారికి సహాయ దర్శకుడిగా పనిచేసినప్పటినుండీ, ఆయన దర్శకత్వం వహించిన సినిమాల వరకూ, ఎన్నెన్నో విశేషాలు, మాతో పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం ఆయనతో Facebook ద్వారా ఆయనతో connect అయ్యాను.ఇక్కడ ఒక పిట్టకథ–మహానటి సావిత్రి గారు కొనుక్కున్న మొట్టమొదటి కారుతో తీసికున్న ఫొటో ఒకటంటే ఒకటే ఉంది ( శ్రీ భూషణ్ గారు తీసినది ). ఆ ఫోటో, శ్రీ వంశీగారేమో, శ్రీ కృష్ణమోహన్ గారికి ఇవ్వగా, దానికి మళ్ళీ ఫొటో తీసి, నాతో పంచుకున్నారు. ఈమధ్యన ప్రతీరోజూ Facebook లో నేను పెడుతూన్న ఫొటోల క్రమంలో, ఈ ఫొటో పెట్టొచ్చా అని శ్రీ కృష్ణమోహన్ గారి అనుమతి తీసికుని, ఆ ఫొటో కాస్తా నా FB Timeline లో పోస్టు చేశాను.Savitriఆ ఫొటో చూసినవారందరూ సంతోషించారు. కానీ ఆ ఫొటోకి అసలు యజమాని అయిన శ్రీ వంశీగారికైతే ఆశ్చర్యం వేసిందిట.. అర్రే ఈ ఫొటో ఇక్కడకెలా వచ్చిందీ.. అనుకుని శ్రీ కృశ్ణమోహన్ గారికి ఫోనుచేస్తే, తెలిసిందిట, నా నిర్వాకం ! సరే అనుకుని నేను ప్రతీరోజూ పోస్టు చేసే మిగిలిన ఫొటోలుకూడా చూసేసరికి, అవన్నీ ఆయనకీ నచ్చేశాయిట ! ఈ విషయం నాతో చెప్తూ, ఆయన ఇంకో మాటన్నారు..నేను పోస్టు చేస్తూన్న ఫొటోలన్నీ ఆయన download చేసికుని save చేసుకుంటున్నారుట ! ఇంతకంటే Best compliment ఉంటుందనుకోను ! మనం చేస్తూన్న ఒక పని నచ్చడం వేరూ, కానీ గుర్తుపెట్టుకుని అభినందించడం వేరూ..ఇంకో విషయం కూడా చెప్పేరు- తను ప్రొద్దుటే లేవగానే, FB తెరిచి నేను ఏమేం ఫొటోలు పెట్టేనో చూస్తారుట.. “like లూ అవీ పెట్టనండీ, కానీ ప్రతీరోజూ క్రమం తప్పకుండా మీరు పెట్టే ఫొటోలు మాత్రం miss అవనూ..” అనడంతోనే My day is made.. Thanks Vamsi gaaru.

   నేను ప్రతీరోజూ Facebook లో పెడుతూన్న ఫొటోలు ఏమిటో మీతోకూడా పంచుకోవద్దూ మరి? ఇక్కడ చూడండి.

   అక్కడ తీసికున్న మిగిలిన ఫొటోలు ఇవండీ…Hyd August 2014 004Hyd August 2014 012

Hyd August 2014 017

   అలా మొదటిరోజు కార్యక్రమం పూర్తిచేసికుని, రాత్రికి నిద్రపోడానికి , మళ్ళీ రూమ్ముకి వచ్చి, మర్నాడు ఉదయమే ఖాళీచేసి, నా బ్యాగ్గుని క్లోక్ రూం లో పెట్టి, మన గురువుగారు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారికి ఫోను చేశాను.ముందుగా ఆయనే నన్ను కలవడానికి వస్తానన్నారు, కానీ నేనే బస్సు ఎక్కి, ఆయన చెప్పిన ” కామినేని హాస్పిటల్స్” దగ్గర దిగగా, ఆయన వచ్చి తీసికెళ్ళారు. అక్కడ శ్రీ సుబ్రహ్మణ్యంగారి భార్య, పుత్రుడు, మనవరాళ్లు, అల్లుడు గార్లతో ఓ రెండుగంటలు బాతాఖానీ వేసి, వారి కూమారుడు తన బైక్కు మీద, మలక్ పేట స్టేషనులో దింపగా, నేను చేరవలసిన లింగంపల్లి కి బయలుదేరాను…శ్రీ సుబ్రహ్మణ్యంగారితో కబుర్లు ఇంకో టపాలో…

Hyd August 2014 021Hyd August 2014 025

Advertisements

7 Responses

 1. బాగున్నాయి మీ భాగ్య నగరం యాత్రా విశేషాలు,
  మీ ముఖ పుస్తకం లోని ఫోటోలు నాకు కూడా ఎంతో
  కను విందు చేస్తున్నాయి,మరిన్ని మరిన్ని థాంకులు!!

  Like

 2. ఇల్లాళెప్పుడూ మనకంటే తెలివయైన వారే గురువుగారూ :). బులుసుగారిని కలిసేరనమాట, బావుంది.నేనే ఎక్కడికి కదల్లేకపోతున్నా.

  Like

 3. కష్టే ఫలే వారు,

  మీరు బాతాఖానీ వారి లా కదలా లంటే, ఆ పంచ వదలి పంట్లాము తొడగడం మొదలెట్టండి అప్పుడే వీలవుతుందను కుంటా

  హరేఫలె వారు,

  బాగుంది మీ ఈ భాగ్య నగారా !!

  జిలేబి

  Like

 4. >>>అక్కడ శ్రీమతి సుబ్రహ్మణ్యంగారి భార్య,…………?????
  అచ్చుతప్పా? నామీద జోకా ?…….దహా.
  వస్తున్నాము, వచ్చేస్తున్నాము అంటూ మూడు ఏళ్ళగా బెదిరిస్తూ చివరికి మొన్న మీ బిజీ షెడ్యూల్ లో మాకు రెండు గంటలు కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ రాక మాకెంతో సంతోషం కలిగించింది.

  Like

 5. retire అయినా tire అవ్వకుండా తిరుగుతున్నందుకు అభినందనలు.

  మరో మాట – మీ వ్రాతలు సరదాగానే ఉంటాయి కాని, ఫొటోల్లో మీరు సీరియస్‌గా ఉంటారు. ఎందువలనో?

  Like

 6. డాక్టరుగారూ,

  నా టపాల మాటెలా ఉన్నా, ముఖపుస్తక పోస్టులు నచ్చినందుకు ధన్యవాదాలు.

  శర్మగారూ,

  ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి…

  జిలేబీ,

  ” ఆ పంచ వదలి పంట్లాము తొడగడం మొదలెట్టండి ” అంటే మీ ఉద్దేశ్యం శర్మగారు పంట్లాములు తొడగరనా ? ఎవరు చెప్పేరు మీకు ?

  సుబ్రహ్మణ్యంగారూ,

  అయ్యా.. తప్పయిపోయింది..సరిచేశాను..మీమీద జోకేసేటంత ధైర్యం చేస్తానా? మూడేళ్ళూ ఆగితేనేమిటీ.. మీరుకూడా ఖాళీగా ఉండడంతో నాకు మీతో సమయం గడపడానికి టైమిచ్చారుగా.. ఇదివరకైతే బ్లాగుల హడావిడిలో ఏదో ముక్తసరిగా నాలుగు మాటలు చెప్పి పంపించేసేవారేమో…ఎవడికి తెలుసూ ?

  బోనగిరి గారూ,

  మీరన్నది రైటే.. నాకు తెలిసి రెండు కారణాలు– 1) ఫొటోతీసే టైముకి బిగుసుకుపోతాను.. 2) పోనీ సరదాగా నవ్వుదామా అనుకుంటే, నా “బోసినోరు” highlight అయిపోతుందేమో అని భయం..

  Like

 7. ఈసారి హైదరాబాద్ వచ్చేటప్పుడు మేము కూడా హైదరాబాదులోనే ఉంటున్నామని గుర్తుంచుకోండి ఫణిబాబు గారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: