బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. మెడికల్ సర్టిఫికెట్లు…


    నేను ఉద్యోగంలో 1963 లో చేరాను. ఆరోజుల్లో రక్షణసామగ్రి తయారుచేసే ఫాక్టరీలలో వారానికి 60 గంటలు పనిచేసేవారు. దానికి అదనంగా డబ్బులు ఇచ్చేవారు, దానినే overtime అనేవారు.పూర్తి డబ్బురావాలంటే వారమంతా ఎక్కడా ” నాగా” పెట్టకుండా డ్యూటీకి వెళ్ళాల్సొచ్చేది. దేశభక్తి మాటెలా ఉన్నా, అదనంగా డబ్బులొస్తాయంటే వెళ్ళని వాడెవడూ? ఏదో మొత్తానికి కారణం ఏదైతేనేం, రక్షణ సామగ్రి ఉత్పాదన ఎక్కువగానే ఉండేది. ఎవ్వడూ శలవు పెట్టిన పాపాన పోయేవాడుకాదు.

    ఉత్పత్తి మాటెలా ఉన్నా, మిగిలిన ట్రైనింగులూ అవీ ఉండేవిగా. ఎక్కడైనా బయటి ప్రదేశాలకి వెళ్ళాల్సొస్తే, బాగానే ఉండేది. కారణం- వాటికి టిఏ, డిఏ లాటివి దొరికేవి. ఫాక్టరీ routine నుండి కొద్దిగా మార్పు కూడా ఉండేది.ఓవర్ టైము డబ్బులు లేకపోయినా, ఆ వారం పదిరోజులూ ఇంకో ఊరికి వెళ్ళామన్న ఉత్సాహం ఉండేది.వాళ్ళిచ్చే టిఏ, డిఏ కీ ఈ ఒవర్ టైముకీ చెల్లన్నమాట ! కానీ దేశానికి సంబంధించిన చాలా విభాగాల Headquarters ఇక్కడే పూనాలోనే ఉండేవి.బయటి ఫాక్టరీల ఉద్యోగులు ట్రైనింగుకి వస్తే, వాళ్ళకి “కిట్టుబాటు ” అయ్యేది, ( పై కారణాలవలన ). కానీ ఊళ్ళోనే ఉండే మావాళ్ళ సంగతేమిటీ? ఎలవెన్సులు ఏవీ ఉండేవికావు. పైగా ట్రైనింగుకి వెళ్ళడం తప్పనిసరాయె.ఎప్పటికప్పుడే తమ తమ పేర్లు ట్రైనింగుకి ( ఊళ్ళో ఉండేవి) వస్తే, ఏదో తమకున్న పలుకుబడులనుపయోగించుకుని తప్పించుకునేవారు ! అందరికీ అలాటి సదుపాయాలుండవుగా !

   అలాటి ఒకానొక సందర్భంలో మా స్నేహితుడికి ఊళ్ళోనే ట్రైనింగుకి వెళ్ళాల్సొచ్చింది. ఏం చేస్తాడూ, ఓ రెండు రోజులు శలవు పెట్టేశాడు. మెడికల్ లీవు ఒకటుందిగా, ఓ సర్టిఫికెట్ జోడించి శలవు పెట్టేశాడు. మా ఫాక్టరీ పెద్దాయనకి తెలిసింది ఈ విషయం- సరే వీడి పని ఇలాగుందా చూద్దాం అనుకున్నారు. వెంటనే , మా స్నేహితుడి “punching card ” ( ఎటెండెన్సు రికార్డు చేసేది ), గేటునుండి తెప్పించి, తన దగ్గర ఉంచేశారు. మా స్నేహితుడు రెండురోజులు పోయాక, అమ్మయ్య ట్రైనింగు గొడవ తప్పిపోయిందీ అనుకుని ఆడుతూ పాడుతూ ఫాక్టరీకి వచ్చిచూస్తే , తన ఎటెండెన్స్ కార్డు మాయం ! ఎక్కడకు పోయిందా అని వెదికితే తెలిసింది, పెద్దాయన సొరుగులో ఉందీ అని ! నోరుమూసుకుని ఆయన ఆఫీసుకి వెళ్ళాడు. పైగా ఉన్నదేదో చెప్పకుండా, కొద్దిగా ” అతి తెలివితేటలు ” ఉపయోగించి, నా ఒంట్లో బాగోలేకపోవడం వలన, శలవు పెట్టాల్సొచ్చిందీ, మెడికల్ సర్టిఫికేట్ కూడా జతచేశానూ అన్నాడు !. దానికి ఆయన ” అలాగా పాపం ! ఇప్పుడు ఎలా ఉందీ, పోనీ మన ఫాక్టరీ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుని ఫిట్నెస్స్ సర్టిఫికెట్ తెచ్చుకుని డ్యూటీలో చేరూ .. అన్నారు. అప్పటికే ఫాక్టరీ డాక్టరుగారికి ఫోనుచేసి, ” ఓ బడుధ్ధాయి వస్తాడూ, వాడిని చెక్ చేసి ఓ వారం పదిరోజులు అన్ ఫిట్ చేసేయ్ అని చెప్పుంచారు. మా స్నేహితుడికీ తెలుసు ఫాక్టరీ ఆసుపత్రికి వెళ్తే ఏమౌతుందో ?

    ఎందుకొచ్చిన గొడవా అని పెద్దాయన కాళ్ళమీద పడి, మహప్రభో ట్రైనింగు తప్పించుకుందామని ఇలా చేశానూ, ఇటుపైన అలాటి పొరపాట్లు జరగకుండా చూస్తానూ..ఈసారికి క్షమించి వదిలేయండీ అని ప్రార్ధించాడు. ఇతని ఏడుపులకి కరిగిపోయి, ఉన్నవిషయమేదో మొదట్లోనే చెప్పుంటే, ఏదో చూసేవాడిని, కానీ నాకే టొకరా ఇద్దామనుకోవడం బుధ్ధితక్కువ, ఇటుపైన సరీగ్గా ఉండూ, సరే ప్రతీరోజూ ఫాక్టరీనుండే డ్యూటీమీదే వెళ్తూండూ.. అంటూ ఓ విషయం చెప్పేరు.– ఎప్పుడైనా ప్రభుత్వోద్యోగాలలో అత్యవసరంగా శలవు పెట్టాల్సొచ్చినప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ, స్వంత ఆరోగ్యం సాకుగా ఉపయోగించి శలవు పెట్టకూడదూ, ఇంట్లోని ఇంకెవరికో ఆరోగ్యం బాగోలేదనే కారణమే చూపాలీ.. అంటూ నీతిబోధ చేశారు…

   మాకెందుకూ మీగొడవా అంటారేమో.. అందుకూ ఓ కారణం ఉంది. మన ” భారత రత్న ” గారు శ్రీ సచిన్ తెండూల్కర్, ఏదో దేశాన్ని ఉధ్ధరించేస్తారని, రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు గత ప్రభుత్వం వారు. ఆయనకేమో వ్యాపార ప్రకటనలూ అవీనూ, ఈ రాజ్యసభలు అవీ ఏమైనా తిండి పెడతాయా, గుడ్డ పెడతాయా, ఏదో ఢిల్లిలో పనునప్పుడు తప్ప, ఎప్పుడూ రాజ్యసభకి రావడానికి ఆయనకి తీరికే లేదాయె. అదేదో పరీక్షల్లో “పాస్ మార్కు ” లాగ ప్రతీదానికీ ఎటెండెన్సు సరిపోకపోతే టీసీ ఇచ్చేస్తారు కదూ ! సరీగ్గా ఆయనకీ అదే పరిస్థితి ! ఏదో ఓ కారణం చెప్పొద్దూ మరీ ?

    ” మా అన్నగారి ఆరోగ్య రీత్యా రాలేకపోయానూ ..” అన్నారు. ఈ విషయం ఈవేళ పేపర్లో చదివేటప్పటికి Sachin పై విషయం గుర్తుకొచ్చింది !!!

Advertisements

13 Responses

 1. What a silly reason…isn’t it like a school kid giving reasons for his absence? How has his brother managing all these years when he was in team ? Hmmm….

  Like

 2. వీళ్ళలో గొప్పదనం ఊహించుకుని హీరోలుగా చూస్తున్నది మనమేనండి. మనకి వ్యక్తిపూజ ఎక్కువ కదా. ఈ హీరోల్ని చూసి ప్రజలు మైకంలో పడటం తగ్గించుకుంటే అంతా బాగానే ఉంటుంది.

  Like

 3. మరి విజయవాడలో PVP వారి మాల్ ప్రారంభానికి టైం ఎక్కడనుంచి వచ్చిందో?

  Like

 4. నిరుపమ గారూ,

  అలాటి వాళ్ళు ఏ silly కారణం చెప్పినా చెల్లుతుంది…అదే మన దౌర్భాగ్యం…

  నరసింహారావుగారూ,

  “ప్రజలు మైకంలో పడటం తగ్గించుకుంటే అంతా బాగానే ఉంటుంది “అంత అదృష్టం ఎక్కడండి సార్ ?

  బోనగిరి గారూ,

  ఇవన్నీ ముఖ్యం కానీ, రాజ్యసభకేముందీ ? ఏమిటో మీరు మరీనూ…

  Like

 5. సచినుడి సంగతి వదిలేయండి, ప్రజలకి ఆ వేలంవెర్రి తగ్గేది కాదు, పెట్టేది కాదు.
  మీ పోస్ట్ లో నాకు నచ్చిన అసలు మాట – మీ సహోద్యోగికి బాసుడు ఇచ్చిన “…… స్వంత ఆరోగ్యం సాకుగా ఉపయోగించి శలవు పెట్టకూడదూ, ఇంట్లోని ఇంకెవరికో ఆరోగ్యం బాగోలేదనే కారణమే చూపాలీ.. ” అంటూ నీతిబోధ చేశారు చూసారూ అది గొప్ప కొసమెరుపండి. ఆయన తన అనుభవమంతా రంగరించి చెప్పినట్లుంది 🙂

  Like

 6. నరసింహరావుగారూ,

  ఆరోజుల్లో, క్రమశిక్షణతో పాటు, నీతిబోధలు కూడా చేసేవారు.. అవేకదండీ, మనజీవితాలని ఒక పధ్ధతిలో నడిపేయీ…ఈరోజుల్లో “ఎవరికి వారే యమునాతీరే “..

  Like

 7. ఎక్కడి కెక్కడి కన్నా లింకు పెట్ట గల ‘బాట్’ ఉన్న ‘పాత కాని ‘ లక్ష్మీ ఫన్ వారు !!

  జిలేబి

  Like

 8. 🙂 పాప౦ అన్నగారి సేవలో ములిగిపోయాడు సచిన్ .. కావాల౦టే మా కాలనీ పక్కన డాక్టరుగారు పది నిమిషాల్లో సర్టిఫికేటు ఇచ్చేస్తారు.

  Like

 9. జిలేబీ,

  పేపరులో ఆ వార్త చదివిన తరువాత, నా ఉద్యోగ జీవితంలోని ఒక సంఘటన గుర్తొచ్చి, నవ్వుకున్నాను… 40 ఏళ్ళయినా time tested నీతులుంటాయీ అని ! బహుశా అందుకే వాటిని ” నీతులు” అంటారేమో…Thanks..

  కృష్ణప్రియా,

  పదినిముషాలెందుకూ? సందర్భం వచ్చిందికదా, ఇంకో అనుభవం— నాకు ఒకసారి మెడికల్ సర్టిఫికెట్ కావాల్సొచ్చి, ఈ సర్టిఫికేట్లు ఇచ్చే ఒక specialist దగ్గరకు వెళ్తే, ఓ అట్టముక్కమీద పేస్టు చేసున్న లిస్టులోంచి, ఏ ” రోగం ” కావాల్సొస్తే , దానికి సర్టిఫికెట్ ఇస్తానన్నారు.. వీటికి రోగాలే అఖ్ఖర్లేదు.. డబ్బులుంటే చాలు…Thanks

  Like

 10. ఇప్పుడే అందినవార్త…. సచిన్ గారి శలవు అర్జీని తాజ్యసభ ఉపాద్యక్షుడు మంజూరు చేశాడట ….ఆయన అడగడం, ఈయన చేయడం.. అఛ్ఛేదిన్.. అంటే ఇవేనేమో….

  Like

  • సభ సెషన్స్ మొత్తానికి సెలవు కోరాడట. Fall of Giants అంటే ఇలాగే ఉంటుందేమో?

   Like

 11. హమ్మో, హమ్మో…హెంత మాటనేశారు. మా సచిన్ బాబు మీద అంతలేసి అభాండాలేస్తారా? అది కూడా మహరాష్ట్రలో ఉంటూ. ఎంత దారుణం, ఎంత దారుణం. 24 గంటల్లోపుగా ఈ ఫోస్ట్ తొలగించకుంటే, మీ ఇంటి ముందు ధర్నాలు మొదలెడతాం.

  అవునూ…నాకో చిన్న అనుమానం. కొంపదీసి ఈ టపా అందాల రష్యా టెన్నిస్ సుందరి మారియా షరపోవా గుట్టుగా ఫణిబాబుగారిలా ముసుగేసుకెట్టుకొచ్చి పెట్టేసిందేమో!

  http://www.independent.co.uk/news/people/i-dont-know-of-sachin-tendulkar-maria-sharapovas-admission-incurs-wrath-of-indian-cricket-fans-9584594.html

  మొత్తానికి భలే చురకవేశారు. సచినుడు మిగతావాళ్ళలా కాదేమో అనుకున్నా. బుజ్జిబాబుకి రాజకీయాలు బాగానే వంటబడుతున్నాయి.

  భవదీయుడు,
  వర్మ

  Like

 12. నరసింహారావుగారూ,

  ఈవేళ్టి పేపరులో వచ్చింది– గత రెండుమూడు రోజులూ ఢిల్లీ లోనే ఉన్నా, రాజ్యసభకి రావాలనుకోలేదు, కానీ శలవు చీటీ మాత్రం పంపేడు.. వీళ్ళందరూ మనకి ” GOD s ” అదీ మన దౌర్భాగ్యం…

  వర్మా,

  షరపోవాయే రావఖ్ఖరేదు బాబూ.. కావాల్సినవన్నీ దొరికిన తరువాతే అసలు రంగులు బయట పడుతూంటాయి.. వాళ్ళని ఏ మాటైనా అంటే, “గొర్రెల మందలు ” ఎలాగూ ఉన్నాయి వారిని defend చేయడానికి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: