బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అపాత్ర సహాయాలు…


   అపాత్ర దానాలని విన్నాము. ఇప్పుడు ఈ అపాత్ర సహాయాలేమిటా అని అనుకుంటున్నారా? దానాల్లాగే సహాయాలు కూడా అవతలివారిని చూసి చేస్తూండాలి. అడిగినవాడికీ, అడగనివాడికీ సహాయాలు చేస్తూ పోతూంటే లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటూ ఉంటాము. ఈ సహాయాలు పొందినవారుంటారే, వారి పని సవ్యంగా జరిగిపోతే చాలు, ఆ సహాయం చేసినవాడు ఎలా పోయినా, ఏ గంగలో దూకినా ఏమీ పట్టింపనేది ఉండదు.

   సినిమాల్లోనూ, కథల్లోనూ చూస్తూంటాము, ఏ ఎయిర్ పోర్టులోనో, రైల్వే స్టేషన్ లోనో, మన దారిన మనం ఉంటున్నా సరే, ఎవడో ఓ ఆగంతుకుడు వచ్చి, మా సామాను చూస్తూంటారా అనగానే , ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా, సరే అంటాము. ఊరికే చూడడమేగా ఇందులో అంత శ్రమ పడేదేముందీ అని అనుకుంటారు.అలాగే, రైల్వే స్టేషనులో కూడా, ఎవరో ఒకరు అడుగుతూంటూనే ఉంటారు.ఆ అడిగినవాడు మామూలువాడైతే ఫరవాలేదు, కానీ కొన్ని సందర్భాల్లో avoidable చిక్కుల్లో పడుతూంటారు, ఈ పరోపకారులు. రైల్లో చూడండి, రిజర్వేషను చేయించుకున్నా, భార్యకోచోటా, భర్తకో చోటా సీటు దొరుకుతుంది. మరీ వేరు వేరు కోచ్ లైతే ఏమో కానీ, ఒకే కోచ్ లో కూడా , విడివిడిగా కూర్చోడానికి కూడా ఏదో ప్రాణం మీదకొచ్చినంత హడావిడి చేసేస్తూంటారు. ఎవడో బక్రా దొరుకుతాడు, ఆతన్ని కాళ్ళావేళ్ళా పడి, మొత్తానికి ఆ పెద్దమనిషిని ఒప్పించి, సీటు మార్చుకుంటారు. బస్.. వాళ్ళక్కావలసినది అయిపోయిందిగా, ఎవరెలా పోతే మనకేం అనుకుంటారు. ఏదో అలా అనుకుంటే ఫరవాలేదు, కానీ అతి ఉత్సాహానికి వెళ్ళి అవతలి వారిని అదీ ఎవరివల్ల సహాయం పొందేరో వారిని చిక్కుల్లో పెడతారే, అలాటివారి గురించన్నమాట ఈ టపా.

    క్రిందటి ఆదివారం నాడు, మా అగస్థ్య, నవ్య లని హైదరాబాదునుండి తీసికుని, పూణె బయలుదేరారు వాళ్ళ అమ్మమ్మా, తాతయ్యలు, శతాబ్ది లో. వాళ్ళెవరికో పైన చెప్పేనే అలాటి పరిస్థితి వస్తే, మా వియ్యంకుడూ, వియ్యపరాలినీ అడిగేరు సీటు మార్చుకోవచ్చా అని. సరే అన్నారు,సామాన్లు అన్నీ పై లగేజీ షెల్ఫ్ లో పెడుతూ, ప్రయాణం లో పిల్లలు తినే సరుకులూ, మొబైల్ ఛార్జర్లూ, అలాగే కొన్ని బట్టలూ ఉన్న బ్యాగ్గుని క్రిందే ఉంచారు. మా వియ్యంకుడు గారేమో, ఎవరో తమ సీటు నెంబర్లు ఛార్టులో చూడమని అడిగేరుట,ఆయన క్రిందకు దిగేరు. వియ్యపురాలు మనవడూ, మనవరాలితో కొద్దిగా వెనక సీట్లలో కూర్చున్నారు. అదండీ దృశ్యం.

    ట్రైను కొంతదూరం వెళ్ళిన తరువాత పిల్లల తిండి సరుకుల బ్యాగ్గుకోసం చూస్తే కనిపించలేదు. అందరినీ అడిగేరు, ఎవరికివారే తెలియదంటే తెలియదన్నారు. చివరకి TC ని అడిగితే తెలిసింది, ఆ బ్యాగ్గు కాస్తా, క్యాటరింగువాడు తీసికెళ్ళి సికిందరాబాద్ స్టేషన్ లో రైల్వే పోలీసు స్టేషనులో ఇచ్చి వచ్చాడుట. అదేమిటీ అలా ఎందుకు చేశాడూ అని విచారించగా, తేలిందేమిటంటే, ఏ దంపతులైతే కాళ్ళా వేళ్ళా పడి సీటు మార్పించుకున్నారో వాళ్ళ నిర్వాకంట. వాళ్ళ సామాన్లు సద్దుకుని, కూలబడ్డాక చూస్తే పక్క సీట్లో ఓ బ్యాగ్గు కనిపించిందిట, ఆ బ్యాగ్గు ఎవరిదీ అని అందరినీ ( మా వాళ్ళను తప్పించి) అడిగిందిట, ఎవరూ తమది కాదంటే తమది కాదన్నారుట, ఆవిడేమో భారతీయ responsible citizen పాత్రలోకి ఒదిగిపోయి, TC ని పిలిచి, ఇక్కడ ఒక unclaimed bag ఉందీ, చూడండీ అందిట, ఏ బాంబైనా ఉందేమో, ఎందుకొచ్చిన గొడవా అని, క్యాటరింగు వాడిని పిలిచి, దాన్ని కాస్తా రైల్వే పోలీసులకి అప్పచెప్పొచ్చాడుట. మా వియ్యంకుడు గారు వచ్చేసరికి తెలిసిన విషయం ఇదీ.

    ఆ సీటు పుచ్చుకున్నావిడని అడిగితే, మాకేం తెలుసూ ఆ బ్యాగ్గు మీదనీ అని దబాయింపోటీ.చివరకి TC కి విషయం చెబితే, అతను ఫోను చేసి సికిందరాబాదు రైల్వే పోలీసులకి సమాచారం ఇచ్చాడు, కంగారేమీ లేదూ, ఆ బ్యాగ్గులో బాంబులూ అవీ లేవూ, అందులో ఉన్న సామాన్లు ఫలానావీ. స్టేషనులోనే ఉంచండీ, వీరి తరఫువారు వచ్చి తీసికుంటారూ అని. మా వియ్యపురాలు తన తమ్ముడి కొడుక్కి వెంటనే ఫోను చేసి, Railway Police Station కి వెళ్ళి బ్యాగ్గు collect చేసికోమన్నారు. తీరా ఆ అబ్బాయి వెళ్ళేసరికి ఆ తిండి సరుకులు కాస్తా, ఆ పోలీసులే లాగించేశారుట. ఊరగాయల సంగతి తెలియలేదు. ఛార్జర్ల విషయం ఆ దేవుడికే తెలియాలి. పైగా 200 రూపాయల దక్షిణ కూడా తీసికుని మొత్తానికి ఆ బ్యాగ్గు తిరిగి ఇచ్చారుట.

    దీన్నే అంటారు పుణ్యానికి వెళ్తే తలకి చుట్టుకుందని. మీలో ఎవరైనా సహాయం చేద్దామని అనుకుంటే, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మరీ చేయండి. అడిగినవాళ్ళందరికీ చేస్తూ పోతూంటే ఇదిగో ఇలాటి చిక్కుల్లో పడుతూంటారు. తస్మాత్ జాగ్రత్త...

15 Responses

 1. ఇటువంటివి పనిగట్టుకుని నాకే జరుగుతాయనుకున్నా! మీకూ జరుతాయనమాట. అన్నట్టు పోలీసుల లేకి బుద్ధి చూపించుకున్నారు కదూ, దాని గురించి మాటాడరేం?

  Like

 2. బాతా ఖానీ వారి ఖానా యా మజాకాయా ? పోలీసులు రుచి చూచి ఓ పట్టు పట్టి లాగించి చూడ కుండా వదిలి పెడతారా మరి !!

  ఇక చార్జర్ ల రెండు వందల రూపాయల చమురు వదులు గట్రా స్వయంకృతాపరాధం ! బేగు పొతే పోయిందని వదిలి పెట్టి ఉంటె (వేరే ఏమీ లేవను కోవాలా?) రెండు వందలు మిగులు ! (చార్జర్ ధర అయినా దక్కి ఉండేది !))

  రైల్వే పోలీసు వారు ఆ బ్యాగు సంరక్షణ ఖరీదు మీ ‘ఖానా’ మరి !

  జిలేబి

  Like

 3. Well said Zilebi garu. Unfortunate but true.

  Like

 4. మొహమాటానికి పోతే ఒకోసారి ఇలాగే జరుగుతుంది.
  గత వారం నేను విజయవాడ నుండి చెన్నయి వస్తుంటే, నెల్లూరులో ఎక్కిన ఒక కుటుంబం సీటు మారమని అడిగారు. ఇంకో రెండు మూడు గంటల ప్రయాణానికి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని నేను ఒప్పుకోలేదు.

  Like

 5. Two incidents in our lives.

  1) Way back years ago – my dad used to ship mangoes to his brothers and we (me and my brother) had to go to railway station for packing etc. Always the complaint from uncles was – missing mangoes. Every time they had the identical problem. Afte a couple of years my dad stopped shipping and asked uncles to come and collect. This was years ago but always the same – even NOW.

  2) A year back in some train. We were a family of 12 going from one place to the other and this guy comes in between the 6 berths area and connects his cell phone. And the joke is he stands there and makes a call with wire hanging over our heads, kids and women looking uncomfortable becuase he stands there amidst of all of us. I pulled the wire and asked him to get out and use his own plug. His explanation – that outlet on my berth was not working. I felt like punching him. What was the emergency to make such an urgent call?

  These days it became a fashion to use cell phone and laptop everywhere without even worrying about the privacy of the people. STUPID STUPID and horribly STUPID. Pretty brainless.

  Like

 6. శర్మగారూ,

  ప్రస్తుత సంఘటన మా వియ్యంకుడు గారికి జరిగినది. ఎప్పుడో నాకూ జరగొచ్చు, రోజు బాగుండకపోతే… ఇంక పోలీసుల వ్యవహారమంటారా, నూటికి తొంభై సార్లు “చేతులు తడపకుండా” పనులవుతాయంటారా ..

  జిలేబీ,

  ఛార్జర్లేకాదు, ఇంకా మరికొన్ని పిల్లల వస్తువులూ, తినుబండారాలూ etc.. చాలానే ఉన్నాయి. రెండువందలతో పని అవడం ఒక విధంగా చవకే… ఇంక తినుబండారాలంటారా… పోనిద్దురూ కాస్త పుణ్యమైనా మూట కట్టుకున్నారు, మా వియ్యాలారు…

  నరసింహారావుగారూ,

  సమర్ధనలూ గట్రా వినడానికి చదవడానికీ బాగానే ఉంటాయి. మనదాకా వస్తే..? అలా రాకుండా జాగ్రత్త పడతారనే ఈ పోస్టు ఉద్దేశ్యం..

  బోనగిరిగారూ,

  ఔననుకోండి… కానీ ఒకోప్పుడు మనకే అలాటి అవసరం వస్తే అడగాలిగా, అలాటప్పుడు అవతలివారు మనతో అలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందంటారు? I just wanted people to be alert. అంతేకానీ, అసలు సహాయపడవద్దని కాదు…

  okaDe గారూ,,

  మీరు చెప్పిన “సెల్ ” పక్షులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కానీ నేను చెప్పినది, సీటు మార్చుకోమని అడగడం, “రేవు దాటాక పడవ తగలేసే” టైపు జనాల గురించి.
  ఇంక మామిడిపళ్ళ సంగతంటారా, మనవైపు ఎడ్ల బళ్ళల్లో చెరుకు రవాణా చేస్తూంటారు చూసే ఉంటారు.. బండి వెనక్కాలే వెళ్ళి చెరుకు గడలు లాగేయడం కొంతమందికి ఆనందంగా ఉంటుంది. అలాగే మీ మావిడిపళ్ళూనూ… అప్పనంగా వచ్చేది ఏదైనా బాగానే ఉంటుంది…

  Like

  • మీ బ్లాగ్ పోస్ట్ “ఉద్దేశ్యం” విడమర్చి చెప్పినందుకు Thanks.

   Like

 7. నరసింహారావుగారూ,

  నా స్పందన మిమ్మల్ని hurt చేసినట్టు అనిపిస్తోంది. క్షంతవ్యుడిని. ఏదో మా బంధువుల అనుభవం అందరితో పంచుకుంటే ఉపయోగిస్తుందేమోనని వ్రాసిన టపా ఇది. ఎవరినీ sermonise చేసే స్థాయిలో ఉన్నవాడిని కాను నేను. ఏదో నాకు తోచిందేదో వ్రాస్తున్నాను… ఎవరినీ బాధపెట్టడంలేదనే అనుకుంటున్నాను. తెలిసిందేమిటంటే , నా స్పందనలుకూడా కొంతమందిని బాధపెడుతూంటాయని.. ఏదో మామూలుగా ” మీ స్పందనకు ధన్యవాదాలు..” అని పొడిపొడిగా వ్రాస్తేనే ఆరోగ్యకరమేమో…అలాగే కానిస్తానులెండి..

  Like

 8. క్షమాపణ లాంటి పెద్ద మాటలెందుకులెండి. నేను కూడా నా మొదటి వ్యాఖ్య (మే 28) యొక్క “ఉద్దెశ్యం” వివరిస్తాను.

  మీరు మీ టపాలో వర్ణించినటువంటి సంఘటన నలుగురికీ జాగ్రత్తగా ఉండమని చెప్తుందనటంలో సందేహం లేదు. అటువంటివి జరిగినప్పుడు సామాన్య మానవుడుకి పోలీసుల వద్దనుంచి అందే స్పందన, సహాయం ఏమాత్రంగా ఉంటాయో తెలుస్తోంది. అవి తలుచుకుని ఇంకొంత బాధపడటమే జరుగుతుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్ధితిని ఏ కోణంలో చూస్తే సమాధాన పడవచ్చో, ఎలా ఫిలసాఫికల్ గా తీసుకుంటే మనసుకి కొంచెమైనా ఊరటగా ఉంటుందో, జిలేబి గారు తన వ్యాఖ్యలో (ఆమెకే సొంతమైన హాస్యభరిత శైలిలో) చెప్పారని నాకనిపించింది. ఆవిడ అబ్సర్వేషన్ కే నేను “Well said” అన్నది.

  దాంతోపాటుగా, వ్యవస్ధ ఈరకంగా ఉండటం దురదృష్టకరం కాని వాస్తవం (“Unfortunate but true”) అని కూడా నేను చెప్పినదాని ఉద్దేశ్యం.

  అంతేకాని జరిగిన సంఘటనను, బాధితులనూ ఎద్దేవా చెయ్యలేదు. ఇటువంటి సంఘటనలు, వాటి పర్యవసానాలు ఎవరికి ఎదురైనా బాధాకరమే – మీ బంధువులకూ, మీకూ, నాకూ, వేరేవారికి, ఎవరికైనా సరే. (నా మట్టుకు ఎన్ని ప్రయాణాలు చెయ్యకపోతేను, ఎన్ని సంఘటనల్ని ఎదుర్కోకపోతేనూ / చూడకపోతేనూ ఇంత జీవితం గడిచింది.)

  నా వ్యాఖ్య యొక్క ఈ “కవిహృదయం” నేను వ్రాసిన రెండు వాక్యాల్లో నిక్షిప్తమై ఉందని అనుకున్నాను. అయినా దానికి తప్పు నాది కాదులెండి, మా స్కూల్ మేస్టర్లది :). స్కూల్లో మమ్మల్ని చితక్కొట్టి మాచేత precis writing exercises రెగ్యులర్ గా చేయించేవారు. దాంతో కాస్త క్లుప్తత అలవాటయ్యింది. ఆ క్లుప్తతే నా మొదటి వ్యాఖ్యలో కూడా ప్రయోగించాను. దానివల్ల సమస్య వచ్చినట్లుంది. అందుకని ఇకనుంచీ ప్రతిదీ విపులంగా వ్రాయదలుచుకున్నాను :). ఇక ఇప్పుడు “స్పందనకి ధన్యవాదాలు” అంటూ మీరు క్లుప్తత మొదలుపెట్టకండి :). దానివల్ల చర్చ జరగదు. అఫ్ కోర్స్, మీ బ్లాగ్ మీ ఇష్టం అనుకోండి.

  Like

 9. నరసింహారావుగారూ,

  మొత్తానికి మీ “కవి హృదయం ” అవగతమయింది. బహుశా నేనే కొద్దిగా ఎక్కువగా react అయానేమో. అదికూడా తప్పేగా మరి? మీరన్నట్టు ఏదైనా విషయం public domain లో ఉన్నప్పుడు, అది తప్పకుండా చర్చనీయాంసమే అనడంలో సందేహం లేదు. పొడిపొడిగా స్పందిస్తే ,అసలు చర్చకే అర్ధం లేదు. You are most welcome to express your opinions and I assure I will respond positively.
  Thanks again…. by the way.. ఆరోజు జరిగిన సంఘటనకి కొసమెరుపు… ఆరోజు ఏ TC అయితే వీళ్ళ బ్యాగ్గు పోలీసులకి handover చేశాడో, అతనే వీళ్ళు మొన్న తిరిగివెళ్తూంటే duty లో ఉన్నాడు. వీళ్ళని గుర్తించి, వచ్చి చెప్పిందేమిటీ అంటే తన brief case ఎవరో దొంగిలించేశారని….

  Like

 10. Hmm. అనుకోకూడదు గాని, దీన్నే poetic justice అంటారేమో.

  Like

 11. నరసింహారావుగారూ,

  సర్వే జనా సుఖినీభవంతూ…

  Like

 12. Of course, అందులో సందేహమేమీ లేదు ఫణిబాబు గారు.

  Like

 13. Sir,

  Waiting for your next post.

  Like

 14. సమీరా,

  కొన్నిరోజుల విరామం తరువాత, మళ్ళీ వచ్చేశాను… ” బోరు” కొడుతున్నానని మాత్రం అనకండి…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: