బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– హాయిగా టపాలు వ్రాసుకోవచ్చు…


    అమ్మయ్య! ఓ గొడవ వదిలింది. దేశంలో ఎన్నికల కార్యక్రమం ప్రకటించినప్పటినుండీ, ఓ వ్రతం పెట్టుకున్నాను. టీవీ లో వార్తాప్రసారాల చానెళ్ళు చూడకూడదని,న్యూసు పేపర్లు చదువకూడదనీ పనిలో పనిగా క్రికెట్ సర్కస్ కూడా. నమ్మండి నమ్మకపొండి, గత రెండు నెలలూ వాటి జోలికి పోలేదు.ఎంత హాయిగా ఉందో. రాజకీయనాయకుల వ్యర్ధ ప్రేలాపనలూ చూడాల్సిన పని లేకపోయింది. అలాగే ” నాలుక కోసేస్తా… తల పగలకొడతా.. ” అనే దౌర్భాగ్యపు భాషకూడా చదవాల్సిన అవసరం లేకపోయింది. ఎవడెలా కొట్టుకున్నా, అరుచుకున్నా జరిగేది జరక్క మానదుగా. చివరకి జరిగింది కూడా అదే.

    రాష్ట్ర విభజన సందర్భంలో అధికార పార్టీకి సంబంధించిన చవటాయిలందరినీ నామరూపాల్లేకుండా గోదాట్లో పడేశారు సీమాంధ్ర వారు. అలాగే, కావాల్సింది సాధించి, మీదిక్కున్నచోట చెప్పుకోమన్నారు తెలంగాణీయులు. చివరికి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్న్ట్టట్టయింది కాంగ్రెస్ పరిస్థితి.కొడుకుని ప్రధానమంత్రిని చేద్దామనుకున్న కలలు కల్లలైపోయాయి. 1984 ఎన్నికల తరువాత ఒకే పార్టీకి అన్ని సీట్లు రావడం ముదావహం. ఇదివరకు శ్రీ పీవీ గారి హయాములో మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించిన ఘనత, శ్రీ పీవీ గారికే చెందాలి.ఆయన ఫస్ట్ ఫ్యామిలీ ని పట్టించుకోకపోవడం, దానితో వారు అలిగి, శ్రీ పీవీ గారి పేరును చరిత్రలోంచే చెరిపేశారు.1992 లో జరిగిన ఆర్ధిక సంస్కరణల ఫలాల్ని అనుభవించడం తెలుసు. వాటిని అమలుపరచిన శ్రీ పీవీ ఎప్పటికీ చిరస్మరణీయులే.

    ఏదో ఈ ఎన్నికలలో ఘనవిజయం సాధించిందని జనం అందరూ జేజేలు కొడుతున్నారు. అధికారం చేతికొచ్చిన తరువాత పరిణామాలకి we have to wait and see. మార్పు ఎప్పుడూ మంచిదే. అలాగే తెలంగాణా సాధించడంతోటే పనైపోలేదు. కాంగ్రెస్ చేతిలో రాష్ట్రం అంతా 60 ఏళ్ళు సర్వనాశనం అయిపోయిందీ, మళ్ళీ బాగుచేయాలంటే మాటలేమిటీ .. అనే ఒక lame excuse తో ఓ అయిదేళ్ళు గడిపేయొచ్చు. తరువాత ఉంటేనేమిటి, ఊడితేనేమిటి మనక్కావాల్సింది కూడబెట్టుకున్నామా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న. ఇదంతా ఏదో pessimism అని కాదు, చేదు నిజం. ఎన్నికలలో నెగ్గిన euphoria ఓ నెలరోజులుంటుంది. తరువాత అంతా మామూలే. You scratch my back, I will scratch yours.. కాబోయే ప్రధానమంత్రి ఈవేళ వరోద్రాలో చెప్పనే చెప్పారు.. “రాజకీయాల్లో ఎవరూ శత్రువులుండరూ..ఉంటే గింటే అభిప్రాయబేధాలే..” అని. That is the bottom line. ఈ పదేళ్ళూ మేము చేసిన వెధవ పనులు మీరు కాశారూ, ఈ అయిదేళ్ళూ మీ welfare మేము చూస్తాము..dont worry.. బొగ్గుల కుంభకోణం లో భాజాపా వారి చేతులకి అసలు మట్టే అంటుకోలేదంటారా? ఏదో public consumption కోసం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు.ఈవేళ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఉపాద్యక్షుడూ మీడియా ముందర మాట్టాడడం చూసేఉంటారు.ఏదో పెద్ద ఘోరం జరిగిపోయిందనే ఫీలింగే లేదు, ఉన్న నాలుగు నిముషాలూ నవ్వుతూనే ఉన్నారు.ఎందుకంటే ఖర్చుపెట్టిన డబ్బు మీదీ, నాదీనూ, వాళ్ళదేం పోయిందీ? అలాగని ఎన్నికలలో తుడిచిపెట్టుకుపోయినందుకు ఏడుపులూ, పెడబొబ్బలూ పెట్టాలని కాదు, ఏదో కొద్దిగానైనా బాధపడ్డట్టు నటించినా ఏదో సానుభూతి ఉండేదేమో. పోనిద్దురూ ఈవేళ పోతే రేపు రెండో రోజు….

    ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారిగురించి బాధంటూ పడితే ఒక్క నందన్ నీలెకెనీ గురించి మాత్రమే. హాయిగా ఉన్న మనిషి ఉన్నవాడున్నట్టుండకుండా ఎన్నికలెందుకూ అసలు ఆయనకి? అదీ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుమీదా? కుమారస్వామిలు, యెడ్డీలూ ( మచ్చుకి మాత్రమే) ఉన్న భాజాపా దేశాన్ని ఏదో ఉధ్ధరించేస్తారనుకోవడం ఉత్తి భ్రమ ! శ్రీ మన్మోహన్ సింగు గారి ఆధ్వర్యంలోఎన్నెన్ని గొడవలొచ్చినా , వ్యక్తిగతంగా అయన clean. మోడీ గారిమీద, ఎన్ని రకాలైన మతసంబంధితమైన ఫిర్యాదులున్నా, లంచగొండి ఫిర్యాదులు ఎప్పుడూ మీడియాలో రాలేదు. అలాగే మోడీ గారు లంచాలు తీసికోకపోయినా, మిగిలినవారు తీసికోకూడదని ఏమైనా రూలా? తరువాత గొడవేమైనా జరిగితే, పాపం మోడీ మంచివారే, ఆయన పేరుచెప్పుకుని ఎవరైనా తింటే పాపం ఆయన తప్పేమిటీ అనొచ్చు…

    అఛ్ఛా నాకో డౌటూ, పాపం వాళ్ళెవరెవరినో చంచల్ గూడా జైల్లో పెట్టారూ, వాళ్ళ సంగతేమిటి ఇప్పుడూ? బయట ప్రతీ రాజకీయనాయకుడూ ఎవరి దారిన వాళ్ళు మజా చేసికుంటున్నారు, ఆ జైల్లో ఉన్నవాళ్ళు అలాగే ఉండాలా లేక…

    ఇటుపైన వ్రాయడానికి కావాల్సినన్ని విశేషాలు… ఓపికుండాలే కానీ రోజుకో డ్రామా చూడొచ్చు… శుభం…

5 Responses

 1. భంశు !!

  బిలేజి

  Like

 2. Sorry sir, this is sheer pessimism

  Like

 3. నీలేకని ఓడిపోతే బాధ ఎందుకండి?
  ఆయనది మా నియోజకవర్గమే.
  అర్థం లేని ఆధార్ కార్డులతో దేశంలో కోట్లాదిమంది ప్రజలని ముప్పు తిప్పలు పెట్టినందుకు, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినందుకు ఆయన ఓడిపోవటం ఊహించిందే.

  Like

 4. మీ మ్యుసింగ్స్ మరల మమ్మలిని ఆనంద పరుస్తున్నందుకు ధన్యవాదాలు. బ్లాగ్ లో రాజకీయాలు తప్ప ఇంకేమైన వ్రాయండి బాగుంటుంది.

  Like

 5. జిలేబీ,

  క్స్ంథా…

  శర్మగారూ

  I wish I am proved wrong !!!

  బోనగిరి గారూ,

  ఏదో మామూలు రాజకీయనాయకుడు ఎలా పోయినా ఫరవాలేదు. పాపం ఈయన మంచి టెక్నోక్రాట్ కదండీ. ఆధార్ కార్డులవలన దేశంలో కొన్నిచోట్ల తిప్పలు పడ్డ మాట నిజమే. కానీ, ఏదో ఒక గుర్తింపు (individual) గా వచ్చిందిగా, గుంపులోగోవిందా లాగ రేషన్ కార్డులకే పరిమితం అవకుండా !!

  డాక్టరుగారూ,

  నా పునరాగమనం తెలియచేయడానికే ఈ టపా. రాజకీయాలగురించి నెలకోటపా మాత్రమే వ్రాస్తానని హామీ ఇస్తున్నాను.

  Like

Leave a Reply to భమిడిపాటి ఫణిబాబు Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: