బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఖాళీగా ఉండకూడదుగా మరి…


    ఏప్రిల్ లో దేశమంతా ఎన్నికలు పూర్తయి, మేలో ఫలితాలు వచ్చేదాకా టివీ లో కానీ,వార్తాపత్రికల్లోకానీ, రాజకీయాల గురించి అసలు పట్టించుకోకూడదని పెట్టుకున్న నియమం ధర్మమా అని, ఇంకోటేదో వ్యాపకం పెట్టుకోవాలిగా మరి. క్రిందటి టపాలో వ్రాసిన నా బ్యాగ్గుల గోలతో కొంత కాలక్షేపం అయింది.

    మా ఇంట్లో ఓ ఫ్రిజ్ ఒకటుంది. అదేం గొప్పా ఏమిటీ, ప్రతీ ఇంట్లోనూ ఉండేదేగా, దీనిక్కూడా అదేదో పెద్ద విషయంలా ఓ టపా పెడుతున్నాడూ, అడిగేవాళ్ళు లేకపోతే సరీ అని మీరు తిట్టుకున్నా సరే, చెప్పేదేదో చెప్పేస్తేనేకానీ నేనుండలేను మరి. సామాన్యంగా ఈరోజుల్లో ఫ్రిజ్ లు ఎలా ఉంటాయీ, Automatic Defrost తో కదూ. మాదానికి అలాటి లక్షణాలు శూన్యం.మరి అదే ప్రత్యేకత ! రెండురోజులకోసారి ఆ Defrost Button నొక్కితే, క్రింద ఉన్న Tray లోకి వెళ్ళే నీళ్ళు వెళ్ళగా, మిగిలిన నీళ్ళు ఇల్లంతా పాకుతాయి. ఆ మాయదారి Tray ఏమో లిటికంత.ఇలా నీళ్ళనీ బయటకు వచ్చేసినప్పుడు, నేనే ఓ పాత గుడ్డా, పాత్రా తీసికుని, ఆ ఫ్రిజ్ ని switch off చేసేసి, క్రింద చతికిలబడి, ఆ గుడ్డని ఆ Tray లో ముంచి, నీళ్ళు పాత్రలోకి పిండుతూంటాను. దిక్కుమాలిన ఫ్రిజ్ కొన్నది నేనేకదా, మరి అనుభవించొద్దూ? ఎవరో సలహా ఇవ్వగా, రాజమండ్రీ కాపరంలో కొన్నాను.క్రితజన్మలో చేసిన పాపాలు అనుభవించొద్దూ మరి? ప్రతీ నెలలోనూ ఏదో ఒక “మూడు” రోజులు నాకు తప్పదు ఈ శిక్ష ! ఏమిటో కానీ, వయసొచ్చేసినతరువాతకూడా ఇలాటివి తప్పడం లేదు. పోనీ ఆ ఫ్రిజ్ ఏదో మార్చేసి కొత్తది కొనుక్కోవచ్చుగా అని సలహా మాత్రం ఇవ్వకండి. ఆ ఫ్రిజ్జే దానంతట అది “చల్లబడడం” మానేసేదాకా మార్చను. అంటే దానర్ధం, దాని బాగోగులకి ఒఖ్ఖ పైసా కూడా ఖర్చుపెట్టదలుచుకోలేదు.

    ఇన్నాళ్ళూ చలికాలం అవడంతో ఆ ఫ్రిజ్జ్ ఉపయోగంకూడా అంతమాత్రమే. దాన్ని periodical గా defrost చేయడం కొద్దిగా అశ్రధ్ధ చేసినమాట నిజమే ( మా ఇంటావిడ ఉవాచ !). వచ్చేది వేసవికాలంకదా, ఆ ఉన్న ఫ్రిజ్జి ని సద్వినియోగం చేసికుందామూ అనే సదుద్దేశ్యంతో ఒకసారి దానివైపు దృష్టి పెట్టాను. ఈమధ్య అసలు నీళ్ళు తోడాల్సిన అగత్యమే రాలేదేమిటి చెప్మా అని చూస్తే ఇంకేముందీ, “అమరనాథ “ దృశ్యం కళ్ళబడింది.Fridge 004

    అందులో పేరుకుపోయిన హిమవత్ఖండాలని కరిగించాలంటే ఓ రెండు మూడు రోజులైనా పట్టేటుంది. ఇన్నిరోజులూ ఫ్రిజ్ లేకుండా గడపడం కూడా కష్టమే. అలాగని పుట్టినప్పటినుండీ ఫ్రిజ్ లతోనే పెరిగామని కాదూ, చిన్నప్పుడు ఇలాటివేమైనా చూశామా పెట్టామా, తరువాత్తరువాత పుట్టుకొచ్చిన సుకరాలు ఇవి. అయినా అలవాటు పడిపోయాము కదా. ప్రస్థుత సమస్య ఆ హిమఖండాలని కరిగించడం. సడెన్ గా ఓ అవిడియా వచ్చేసింది.వేడి తగిలితే కరుగుతాయేమో అని! వేడి ఎలా తగిలించడం? పైగా అలాటి పిచ్చి పనులు చేస్తే, ఫ్రీజరు తగలడుతుందేమో,పోనిద్దూ పీడా వదులుతుంది,కొత్తది కొనేయొచ్చు, కారణం ఒకటి పుట్టుకొచ్చిందిగా అనుకుని, ఆ వేడి చేయడం ఎలాగా అని ఆలో..చించి..చించి..చించగా మొత్తానికి ఓ highly innovative idea వచ్చేసింది ! ఇంట్లో ఎలాగూ ఓ hot water bag ఒకటుందిగా, కాపడాలు పెట్టుకోడానికి దాంట్లో మరుగు నీళ్ళు నింపి కాపడాలు పెట్టుకునేవాళ్ళం కదా. ఆ “కాపడం” ఏదో ఆ ఫ్రీజరుకి పెట్టేస్తే సరీ అనుకుని రంగంలోకి దిగిపోయాను. శుధ్ధధన్యాసి రాగంలో హరికేశనల్లూర్ ముత్తయ్యభాగవతార్ గారు రచించిన ” హిమగిరితనయే హెమలతే ..” కీర్తన గుర్తు చేసికుంటూ ఆ బ్యాగ్గునిండా మరుగు నీళ్ళు పీకలదాకా నింపేసి ఆ ఫ్రీజరుకి కాపడం పెట్టేశాను.. ఓ పావుగంటలో ఆ హిమఖండాలన్నీ avalanche లా టప టప మంటూ పిగిలిపోయాయి. కథ సుఖాంతం..Fridge 002

    ఎంత ఐసు తీశానో…Fridge 007.

    నా ఈ అఘాయిత్యప్పనుల తరువాత అసలు ఫ్రిజ్ పనిచేస్తోందా లేదా అని సందేహం లేకుండా, శుభ్రంగా ఐస్ ట్రే లో నీళ్ళు నింపి ఓ గంట తరువాత చూస్తే లక్షణంగా పనిచేస్తోంది.

    గత కొన్నిరోజులుగా ఈ టపాలు వ్రాయడం మానేసి Facebook లో షికార్లు కొట్టేవాడినిగా, అదేమిటో కానీ అందరూ కొత్తవారే ఎవరో ఒకరిద్దరు తప్ప. దాంట్లో పాతవి ఫొటోలూ అవీ పెట్టి కాలక్షేపం చేశాను. ఆ సందర్భంలోనే కొన్ని లింకులు కూడా పెట్టాను. శ్రీ నండూరి సుబ్బారావుగారు ( గణపతి పాత్రని అజరామరంగా పోషించినవారు) విజయవాడ ఆకాశవాణి కేంద్రంద్వారా ఆయన నటించిన కొన్ని మచ్చుతునకలు దొరికాయి, అక్కడ ఆ లింకులు ఇచ్చినప్పుడు ఇక్కడకూడా పంచుకోవడం భావ్యం కదూ… ఇంకెందుకు ఆలశ్యం.. మీరూ వినేయండి ఇక్కడ ఈ లింకు నొక్కితే కుడిచేతివైపు కుడిప్రక్కన ఓ అయిదు నాటికలు వినొచ్చు. Enjoy..

Advertisements

9 Responses

 1. ఫ్రిజ్ కే కాపడం పెట్టిన మీ టాలెంట్ సూపర్…

  Like

 2. నిరుపమా,

  ఈరోజుల్లో ఏదో ఒకదానిలోనైనా టాలెంటు ఉండాలంటారుకదా మీరందరూ… ఇదేదో బాగుందని ఇందులోకి వెళ్ళాను…

  Like

 3. మంచి చిట్కా ఇచ్చారు .
  ఈ చిట్కా ఇప్పుడే అందరికి పంపిస్తున్నాను

  Like

 4. శాస్త్రిగారూ,

  నూటికి తొంభైతొమ్మిది ఫ్రిజ్జిలకి అదేదో Auto Defrost ఉంటుందిగా.. అలా లేని నాలాటి ఆంఆద్మీలకే ఉపయోగిస్తుంది సారూ ఈ చిట్కా…

  Like

  • అయ్యా! జ్ఞాపకం ఉన్నానాండీ! నేను మల్లిన నరసింహారావుని, పెద్దాపురం, గుర్తుకొచ్చేఉంటాన్లెండి.మొన్నను నేను చెన్నై వెళ్ళి భైరవభట్ల వారిని కలసి వచ్చాను.వారు చెప్పిన వార్త ఏమిటంటే వారు తెలుగు ఎస్ ఏ.ను పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో మొదటి సంవత్సరం పరీక్షను విజయవంతంగా వ్రాసి రెండవ సంవత్సరం పరీక్షకు కూర్చుంటున్నానని అన్నారు. ఇంకో శుభవార్త వారు చెప్పింది ఏమిటంటే S.S.L.C. లోగానీ S.S.C. లోగానీ తెలుగు పేపరులో 60% మార్కులు దాటి గనక వచ్చి ఉంటే ఏ ఎంట్రన్సు టెస్టునూ వ్రాయక్కరలేకుండానే మనం తెలుగు ఎమ్.ఎ పరీక్షకు వ్రాయవచ్చని అన్నారు. ఇది విని నేను అర్జంటుగా భాగ్యనగరానికి వెళ్ళి అక్కడ బాంకులో రూ.3800 కు(3400+400) డి.డి.లు తీసి అప్లికేషనును నింపి వారికిచ్చిపుస్తకాలు తెచ్చేసుకొని చదవటం మొదలుపెట్టాశానండి. అందుకని ప్రస్తుతం నాకు సమయం చాలటం లేదు, ఎందుకంటే పరీక్షలు ఆగస్టు, సెప్యెంబరులలో ఉంటాయట. అదండీ సంగతి . మార్చి 30 వరకూ లేటు ఫీ తో కలిపి డబ్బు కట్టి చేరవచ్చు నన్నారు. తెలుగంటే నాకు అభిమానం కాబట్టి మొదలుపెట్టేశాను. మీ వంటి పెద్దల ఆశీస్సులతో పూర్తి చేయగలనని ఆశిస్తున్నాను.

   Like

 5. నరసింహరావుగారూ,

  మిమ్మల్ని మరచిపోవడమనే ప్రశ్నే లేదు. అంత అభిమానంతో, ప్రత్యేకంగా వచ్చి మమ్మల్ని కలిసి ఆనంద పరిచారు. ఎప్పుడూ గుర్తుంటారు.
  మీకు మన భాషమీద ఉన్న అభిమానానికి పరాకాష్ట ఇప్పుడు, ఎం.ఏ. పరీక్షకి చదవడం. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. అందులో సందేహం లేదు.

  Like

 6. బాబుగారూ!

  కొన్నాళ్లుగా మీ టపాలు నా ఇన్‌బాక్స్ లోకి చేరకపోవడం చాలా వెలితిగా వుండేది. మీ ఇన్నాళ్ల కృషినీ చూస్తుంటే, అయ్యబాబోయ్ అనిపించింది. ముఖ్యంగా నండూరి వారి రేడియో నాటికల సేకరణతో మా చెవుల తుప్పు వదిలించినందుకు మరోసారి పాదాభివందనాలు.

  కానే, యేవో రెండు మాటలైనా రోజూ గిలికేసి మరీ మీ కృషి కొనసాగించండి. మాకు బాధ తప్పించండి.

  అన్నట్టు, మా వూరెప్పుడు వస్తున్నారూ?

  Like

 7. శాస్త్రిగారూ,

  మీ inbox లోకి చేరకపోవడానికి ముఖ్య కారణం, నేను గత రెండు నెలలుగా ఎటువంటి టపా వ్రాయకపోవడం. ఈ మధ్యనే మళ్ళీ మొదలుపెట్టాను. గత రెండు నెలలుగా Facebook లో ఎలా ఉంటుందో అని వేలుపెట్టాను. చాలా..చాలా లింకులూ, ఫొటోలూ పెట్టాను. అందరికీ నచ్చినట్టే ఉన్నాయి. ఏ రోజునైనా కొత్తది పోస్ట్ చేయకపోతే ఫోన్లు చేసేదాకా వచ్చింది !!
  మీ అభిమానానికి thanks..

  Like

 8. జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: