బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– బ్యాగ్గులతో ప్రస్థానం…


    ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు, ఇదివరకటిరోజుల్లో అంటే మా చిన్నప్పుడన్నమాట, ఓ చేతిసంచీ ఒకటి తీసికుని మరీ వెళ్ళేవారు. తమిళులు చూడండి, పసుప్పచ్చ సంచీ ఒక trade mark లాటిది. బెంగాలీలైతే “జోలా” బ్యాగ్గులాటిది తప్పకుండా కనిపిస్తూనే ఉంటుంది, మనవైపు అయితే ఇదివరకటి రోజుల్లో పళ్ళ పొడి కొత్తగా వచ్చిన రోజుల్లో, ఆ అమ్మేవాళ్ళు ఉపయోగించేవారు. ఈ సంచీల ఉపయోగం ముఖ్యంగా ఎందుకంటే, బజారుకెళ్ళినప్పుడు చవగ్గా ఏ కూరైనా కనిపిస్తే దాన్ని కొనుక్కుని, తెచ్చుకోడానికి. ఆ రోజుల్లో ఈ పాలిథీన్ బ్యాగ్గులూ అవీ ఉండేవి కాదుగా మరి. కిరాణా కొట్లలో కూడా కాగితపు సంచీలోనే కట్టి ఇచ్చేవారు. ఓ సంత కెళ్ళినప్పుడు ” సంత సంచీ ” అని ప్రత్యేకంగా ఉండేది. ఆరోజుల్లో యాయవారం బ్రాహ్మలని ఉండేవారు. వారు ఇంటింటికీ వెళ్ళి ఆ ఇంటివారిచ్చే స్వయంపాకం లాటిది దాంట్లోనే తెచ్చుకునేవారు. అతావేతా చెప్పొచ్చేదేమిటంటే ఈ సంచీలతో అందరికీ ఓ అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది.

    కాల క్రమేణా ఈ బ్యాగ్గులు కూడా చిత్రవిచిత్ర రూపాలు సంతరించుకున్నాయి. ఇదివరకటి రోజుల్లో అయితే ఆడవారు ఎక్కడో తప్పించి అంతగా బయటకి వచ్చేవారు కాదు.అంతగా రావాల్సొచ్చినా, భర్తతోనే వచ్చేవారు, ఆయన దగ్గర ఓ బ్యాగ్గు ఎలాగూ ఉంటుంది కనుక, పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కాలక్రమేణా ఈరోజుల్లో చదువుకోడానికైతేనేం, షాపింగుకైతేనేం, ఉద్యోగానికి వెళ్ళడానికైతేనేం, అందరికీ ఈ బ్యాగ్గుల అవసరం ఎక్కువైపోయింది. అందువలన మార్కెట్ లో వివిధరకాల బ్యాగ్గులూ వస్తున్నాయి. ఈ రోజుల్లో బ్యాగ్గు లేకుండా ఎవరూ కనిపించరు. స్కూళ్ళకీ, కాలేజీలకీ, ఉద్యోగాలకీ వెళ్ళేవారైతే అవేవో back packs మొదలెట్టేరు, పైగా సౌకర్యంగా కూడా ఉంటాయి.ఆఖరికి ఏ ఈవెనింగు వాక్కు కి వెళ్ళాలన్నా ఓ బ్యాగ్గు తప్పకుండా ఉండాల్సిందే, ఓ కళ్ళజోడూ, మొబైలూ పట్టేదైతే సరిపోతుంది.

    ఇంక నా సంగతికొస్తే, ఉద్యోగంలో ఉన్నంతకాలమూ ఓ జోలా బ్యాగ్గుఒకటీ, ఇంకో చేతిలో మా ఇంటావిడ, నలభై ఏళ్ళపాటూ ఇచ్చిన లంచ్ బాక్సుకి ఓ సంచీనూ. ఏదో ఫాక్టరీ బస్సులో కాబట్టి, సౌకర్యంగానే ఉండేది. ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు, క్యూలో నుంచునుండగా, నా బ్యాగ్గు కాస్తా బ్లేడుతో కోసేసి, అందులో ఉండే చిన్నబ్యాగ్గు కొట్టేయడంతో, ఆ జోలా బ్యాగ్గుకి స్వస్థి చెప్పేశాను. ఒక జిప్ బ్యాగ్గులాటిదానితో రిటైరయేదాకా కాలక్షేపం చేశాను.

    రిటైరయిన తరువాత కొంతకాలం జోలా బ్యాగ్గు వాడాను, కానీ అదీ మానేసి రాజమండ్రీలో ఉండగా ఇదిగో ఈ బ్యాగ్గు మొదలెట్టాను.Bags 004 బయటకు వస్తే ఈ బ్యాగ్గులేకుండా వచ్చేవాడిని కాదు. అదేదో జేబుల్లో పెట్టుకుంటే బస్సులోనూ అక్కడా, ఎవడైనా కొట్టేస్తాడేమో అనే భయంతో ఒక్క బస్సు పాసు తప్ప మిగిలినవన్నీ ఆ బ్యాగ్గులోనే వేసేసికునేవాడిని.ఏదో రోజులు వెళ్ళిపోయేవి, ఏ గొడవా లేకుండా. రోజులన్నీ మనవి కావుగా, ఒకసారి అలాగే కెమేరా బాగుచేయిద్దామని బస్సులో వెళ్తూంటే, వాడెవడో ఆ కెమేరా కాస్తా కొట్టేశాడు. అనుకున్నట్టుగానే అందరూ చివాట్లు వేశారు- “అదేవిటీ సంచీలో చెయ్యెట్టి వాడెవడో కెమేరా తీసేస్తూంటే అంత ఒళ్ళు ఎరక్కుండా ఉన్నారా...” అంటూ. పోయినవస్తువు ఎలాగూ పోయింది, దానికంటే ఆ తరువాత జరిగే post mortem ఘోరంగా ఉంటుంది. భరించడం చాలా కష్టం. మరీ వయస్సులో పెద్దవాడినవడంతో సుతారంగానే చెప్పి వదిలేశారు. పోయింది నా సరదా కోసం కొనుక్కున్నదే అవడంతో, కొనుక్కునే ఓపిక కూడా ఉండడంతో, కొత్తది కొనుక్కున్నాను. పైగా ఇందులో ఒక సుఖం కూడా ఉంది–దబాయించొచ్చు…. అవునూ.. పోయిందీ.. మిమ్మల్నెవర్నైనా కొనిపెట్టమన్నానా.. కావాల్సొస్తే నేనే కొనుక్కోగలనూ..” అంటూ వాళ్ళందరి నోరూ మూసేయకలిగాను. అయినా పాపం వాళ్ళు మాత్రం ఏమన్నారూ ఏదో పెద్దవారైపోయారూ, మరీ బస్సుల్లోనూ వాటిల్లోనూ తిరగడం ఎందుకూ, హాయిగా ఇంటి పట్టునుండొచ్చుగా అనేగా. కానీ నాకేమో కాలు నిలవదాయె. నేనూ నా మిస్టరీ షాపింగులూ నా కాలక్షేపం నాది. ఏదో మొత్తానికి ఓ కొత్త కెమేరా కొనుక్కున్నాను. Chapter closed..

  ఆయనే ఉంటే మంగలాడెందుకూ అన్నట్టుగా, మన రోజులు బాగుంటే అసలు గొడవే లేదుగా. సరీగ్గా అదే అయింది నాకు. క్రిందటి సంవత్సరం( 2013) ఆఖరి రోజుల్లో, మా ఇంటావిడ దగ్గరలో ఉండే చతుర్ శృంగీ మాతా గుడికి రమ్మంది. సరే అక్కడకు వెళ్ళినప్పుడు సరదాగా ఫొటోలు కూడా తీసికోవచ్చూ అనుకుని, మా ఇంటావిడ ఎంతో ప్రాణప్రదంగా చూసుకునే Tab తీసికుని అక్కడ ఫొటోలు తీసికుని, నా దారిన నేను బయలుదేరి వచ్చేశాను. చెప్పేనుగా, ఆ Tab ఏదో మా ఇంటావిడ దగ్గరే వదిలుండొచ్చుగా, పోనీ ఓ ఆటోలోనైనా ఇంటికి వచ్చుండొచ్చుగా, ఏమిటో రోజులు బాగోలేకపోతే ఇలాటివేవీ తట్టవుకాబోలు. ఎవడికో ముచ్చటేసింది, ఆ Tab కాస్తా కొట్టేశాడు. మరీ కెమేరా పోయినప్పుడులా కాదుగా, పోతే పోయిందీ, దానికి కాళ్ళొచ్చేశాయీ అనుకోడానికీ, పైగా అల్లుడూ, కూతురూ ఎంతో ప్రేమగా ఇచ్చిందొకటీ, sentimental value కొంచెం అధిక మాత్రా లోనే ఉంది. నా కెమేరా పోయినప్పుడు ఫొటోలు తీసికోడానికి మా ఇంటావిడ అప్పుడప్పుడు ఈ Tab ని చాలా ఉదారంగా వాడుకోనిచ్చింది. ఆవిడకి ఆ Tab చేతికి వచ్చిన తరువాత నాకైతే కొన్ని అదనపు సౌకర్యాలు వచ్చాయి. ఉదాహరణకి నా Desktop జోలికి వచ్చేది కాదు, నాదారిన నన్ను వదిలేసేది, ఏదో అప్పుడప్పుడు ఏదైనా వ్రాసుకోడానికీ, ప్రెస్ ఎకాడెమీ సైటు చూడ్డానికీ తప్ప, మిగిలినవాటికన్నిటికీ Tab తోనే కాలక్షేపం చేసేసేది. ఇప్పుడేమో ఆ సౌకర్యం కాస్తా పోగొట్టుకున్నాను, ఇదివరకటి లాగ దబాయించడానికి లేదు. దీనికి సాయం, పిల్లలొచ్చినప్పుడల్లా ” మీ నాన్నగారికేమిటీ ..ఎప్పుడూ ఆ కంప్యూటరు ముందరే ఉంటారు.. ఇంట్లో ఇంకో మనిషుందీ అనే ధ్యాసే లేదూ..” అంటూ…
ఇదేమీ కొత్తగా వచ్చిన జాడ్యంకాదు, ఇదివరకూ చాలా టైము కంప్యూటరుముందే కూర్చునేవాడిని, తన చేతిలో Tab ఉన్నంతకాలమూ దానిగురించి అసలు పట్టించుకోనే లేదు. కానీ ఇప్పుడో ఓ అవకాశం వచ్చింది. తను అలా అన్నప్పుడల్లా నాకైతే ఎక్కడో తగిలేది. పాపం నా వలనే కదా తన Tab పోయిందీ.. అనుకునేవాడిని. అలాగని ఏవేవో త్యాగాలు చేసేసి కొత్తదేమీ తెచ్చిపెట్టేయలేదు అనుకోండి. వచ్చే ఏడాది కొనిపెట్టొచ్చులే అనుకున్నాను. ఏదో మొన్న మా పెళ్ళిరోజుకి, అల్లుడూ,అమ్మాయీ ఇంకో కొత్త Tab కొని ఇచ్చారు.కథ సుఖాంతం..

    ఇంట్లో అందరూ నా బ్యాగ్గుల్లో సరుకులు పోగొట్టుకోవడంపై ఓ కమెటీ వేసి , అలాటి సంఘటనల కారణాలు విచారించడం మొదలెట్టి, కొన్ని సూచనలు చేశారు. అందులో మొదటిది ఆ బ్యాగ్గు మార్చడం, ఏదో జిప్పులాటిదంటూ ఉంటే ఎవడైనా కొట్టేద్దామనుకున్నప్పుడు మరీ చేతులు సంచీలో పెట్టి దొరికిందేదో కొట్టేయకుండా ఓ జిప్పులాటిదుంటే మంచిదీ అని. రెండోది, నన్ను బస్సులే ఎక్కొద్దనీ, అధవా నా మొండి తనంతో ఎక్కాల్సినా విలువైనవి తీసికెళ్ళొద్దనీ.. సూచనలైతే బాగానే ఉన్నాయి. ఇందులో ఆ జిప్పులాటిది… అన్నది నాకు నచ్చి ఓ కొత్త బ్యాగ్గు కొనుక్కున్నాను. దానికి ఓ మూడు అరలూ, విడివిడిగా జిప్పులూ.. మా ఇంటావిడకైతే మహ బాగా నచ్చేసింది.Bags 001 ఏదో ఎవరిచేతా చివాట్లు తినకుండా, మరీ విలువైన వస్తువులు ( ఆవిడ Tab అయితే అసలే ముట్టుకోకుండా) పెట్టుకోకుండా, ఓ పది పదిహేను రోజులు లక్షణంగా వెళ్ళాయి.

    చెప్పేనుగా రోజులండీ బాబూ రోజులు.. ఎవడికో నామీదా, నా బ్యాగ్గు మీదా మళ్ళీ కళ్ళు పడ్డట్టున్నాయి… మొన్న బస్సులో బయటకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి నా బ్యాగ్గు పరిస్థితి ఇలా అయిపోయింది !!! Bags 003 అదృష్టంకొద్దీ ఆ బ్యాగ్గులో కాగితాలు తప్ప ఇంకెమీ లేవు. ఉన్న కెమేరా కాస్తా నా పాంటు జేబులోనే పెట్టుకున్నాను. ఇలా ఉంది బాబూ నా దయనీయ స్థితి…

Advertisements

13 Responses

 1. Sir ,

  మీ కొసమే దొంగ కూడా బయలు దేరుతున్నాడు. Somebody is keenly following you.

  Like

 2. >> ఆయనే ఉంటే మంగలాడెందుకూ అన్నట్టుగా,

  Fits you and your bag excellently 🙂 ROFL

  Like

 3. SIR
  mee byagula gurinchi chadivinataruvata, naku osari alanti anbhavam kaligindi. kindati nellalo bangalore ma abbai daggariki veleliinapudu, evening walkng kelli vastu return lo city bus prayanam. antalo purse kottesaru. purse lo kevalam naa id, pan,adahr, ave vuntai. endhkaia machidani dabbu pettanu.dabbu shirt back jebu lo pettevanni. sare digi chsukonnte purse mayam. potepoindi anni id cards kada. annli enko copy cheyinckivachhu lemmani minnkundi poyanu. intlo teleisi kasta jagaratalu.chepparu. sare. return ma vurki vachesanu. oka varam rojula taravatha oka phone from bangalore numchi. oka good samaraitan phone chesadu. naa cards chusi vatipai na mobile number chusui. rammanandu. abba enttao santhosamaindi.
  eenelalo malli bangalore kellinapudu atati daggirkelli velli na cards tecucukonnanu. chala abhinadicanu. a good samaratan. he is a worker in a small engineeing shop. adi katha. mee to panchukovalsi vachidndi.
  a.v. ramana

  Like

 4. సమీరా,
  Thanks for your concern. ఏదో ఇండియాలో దొరికేవాటి గురించి చెప్పండి. మరీ 50$ పెట్టి కొనుక్కునే తాహతు లేదమ్మా !! అంతకంటే బయటకు వెళ్ళడం మానేయడం looks more economical…

  Like

 5. okaDe గారూ,

  మీ ఇష్టమండీ.. ఎలాగ అనుకోవాలంటే అలాగే….

  వెంకటరమణ గారూ,

  ఎంతో అదృష్టవంతులు మీరు… దేనికైనా పెట్టిపుట్టాల్లెండి….

  Like

 6. దీనిని బట్టి అర్థమయ్యిందేమిటంటే, మిమ్మల్ని ఒక్కడినే బయటకు ఎక్కడకీ పంపకూడదు అని.

  Like

 7. బోనగిరి గారూ,

  ఏదో నాదారిన నన్నుండనీయండి… అయినా ఇంకోరెవరో ఉన్నారుకదా అని కొట్టేసేవాడు కొట్టేయకుండా ఉంటాడా .. ఆ ముచ్చటలూ తీరాయి… నామీదా, నా వస్తువులమీదా చెప్పలేనంత ప్రేమ దొంగలకి…

  Like

 8. ఒక జిప్ ఉన్నగుడ్డ సంచీలో మీ రెక్సిన్ జిప్ బ్యాగు పెట్టుకొనండి.
  మీబ్లాగ్ విరామానికి కారణం తెలిసింది,నా సంతాపనలు.
  పోయినవి మనవి కావని అను కుంటే,
  కొంచం కొంచం గా మరచి పోగలం. ఏమంటారు?

  Like

 9. డాక్టరుగారూ,

  ఆ ముచ్చటా తీరింది. జిప్పు ఉన్న బ్యాగ్గులోంచే తిరుపతి క్యూ లో ప్రక్కనకోసేసి, ఆ రెక్సిన్ బ్యాగ్గు కోసేశాడు సారూ…
  రెండొదుందే వేదాంతం: అదే వంట పట్టించుకుంటున్నాను !!!!

  Like

 10. ఇంక ఏమీ చెయ్యలేం బాబాయి గారు…సంచిని గట్టి గ వాటేసుకుని పట్టుకోవటమో,లేక shirt కి లోపలివైపు జేబులు కుట్టించుకోవటమో చెయ్యాలి..ఐన అన్ని ఎల పొగొట్టుకున్నరండి బాబు..చదువుతుంటేనె బాదగా వుంది..

  Like

 11. నిరుపమా,

  ఏం చేయనండీ? మీసలహా బాగానే ఉన్నట్టుందే…

  Like

 12. गर्व से कहो మాఇంటి పేరు ఫలానా है అని…
  ఇంటి పేరు నిల పెడ్తూ ఉన్నారండీ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: