బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    అనుకున్నట్టుగానే ఆంఆద్మీ పార్టీ వారు అన్ని కబుర్లూ చెప్పి చివరకి , ఏ పార్టీనైతే తిట్టిన తిట్టు తిట్టకుండా ఎన్నికలలో “చీపురు” తో తుడిచిపెట్టారో, ఆ కాంగ్రెస్ పార్టీ తోనే చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇంక కేజ్రీవాలైతే, ప్రపంచంలో అందరిమీదా చివరకి తన పిల్లలమీద కూడా “ఒట్లు” పెట్టేసి, బిజెపీ కాంగ్రెస్ వారితో చేతులు కలపనూ అన్నాడే, మరి ఇప్పుడేమయిందిట? పైగా తమను ఎన్నుకున్న ఓటర్లందరూ ఆంఆద్మీ వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్నారుట ! అదీ ఎక్కడా… అంతర్జాలం ద్వారా.. అంతర్జాలంలో విషయాలు ఎంతగా manipulate చేయొచ్చో ఎవరికి తెలియదు? తనకి పదవీ వ్యామోహం ఉందీ అని ఒప్పుకోడానికి ఏం రోగం? ఎవరైనా కాదన్నారా? పోనీ ఈ కాంగ్రెసు వారి చరిత్ర ఏమైనా అంత ఉత్కృష్టమయినదా, అప్పుడెప్పుడో చౌధరీ చరణ్ సింగుకి కూడా సపోర్టు ఇచ్చినట్టే ఇచ్చి, ఠపీమని తీసేశారు. ఇప్పుడుమాత్రం అలాటిది జరగబోదని ఏదైనా భరోసా ఉందంటారా?కబుర్లు అందరూ చెప్తారు, ఆచరణలోకి వచ్చేటప్పటికే అసలు రంగు బయట పడుతూంటుంది.

       నిన్న ఏదో తెలుగు పేపరు చదువుతూంటే ” పది కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళేవాడిని..” అని మన మహామహీం రాష్ట్రపతి గారి ఉవాచ ట, అదేమో ఒక తెలుగు వార్తాపత్రికకి పతాక శీర్షికట ! ఇంతకంటే ముఖ్యమైన వార్తే దొరకలేదా? పోనీ దొరకలేదే అనుకుందాము, అందులో అంతగా ఆశ్చర్యపడాల్సిన విషయమేమిటో నాకైతే అర్ధం కాలేదు. నూటికి డెభై మంది పరిస్థితి అలాటిదే. సామాన్యప్రజల కష్టాలు కనిపించవూ,VIP లవైతే , అందరూ చదివి అయ్యో పాపం అనుకోవాలిట. 

    నిన్నననుకుంటా, ఆంధ్రప్రదేష్ హైకోర్టువారు, ఓ ఇద్దరు సినిమా నటుల్ని వారికిచ్చిన “పద్మ” ఎవార్డులని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయమని ఆదేశించారుట. వారి వారి పేర్లకు ముందుగా ఉపయోగించడం ఓ కారణంట. ఇదేదో అందరికీ వర్తిస్తుందంటారా? లేక only a select few కి మాత్రమేనా? భారతరత్న ల విషయమేమిటిట? అయినా మనకెందుకూ ఆగొడవలన్నీ, మనందరికీ వచ్చేయా పెట్టేయా?

    ఈసారి నా పుట్టినరోజుకి మా అబ్బాయి, కోడలు, నవ్య, అగస్థ్య ఓ తమాషా బహుమతి ఇచ్చారు.Image

    అదికూడా ఒకరోజు ముందుగా! అసలేంజరిగిందంటే, 13 న మా చుట్టాల అమ్మాయి పెళ్ళి రిసెప్షన్ కోసం, వాషి ( న్యూ ముంబై) వెళ్ళాము. మర్నాడు పుణె తిరిగొచ్చిన తరువాత, ఆదివారం ఉదయం ఆరుగంటలకల్లా శతాబ్దిలో భాగ్యనగరానికి వెళ్ళాల్సొచ్చింది, అదీ ఇంకొక స్నేహితుడి కూతురి పెళ్ళికి. ఆ విశేషాలన్నీ ఇంకో టపాలో.

Advertisements

14 Responses

 1. Designed and branded Bhamidipati Phani Babu garu at work- NICE PICTURE!!

  Like

  • అదండీ మన బ్రష్ట రాజకీయ నాయకుల పొంతన లేని ప్రగల్భాలు .అందరూ ఉసరవెల్లులె అందరూ దొంగలే.
   మనకు ఉండవలసింది స్వపరిపాలన కాదు నియంత్రుత్వము .అప్పుడే ఈ రాజకీయ రాబందులనించి ప్రజలకు శాంతి కలుగుతుందేమో

   RK Laxman లాగా మీ ఈ ఇమేజ్ మీకే ప్రత్యేకమయిన లోగో .చాలా బాగుంది మీ బ్లాగ్ లకు coverpage గా రూపొందించండి .

   Like

 2. Caricature 100% represents you sir !!
  Belated Happy B’day

  Like

 3. Chaala baagundi mee pic…very apt…

  Like

 4. మీ బొమ్మ బాగుందండి. (కొంచెం) అద్వానీ గారిలా ఉన్నారు.

  Like

 5. డాక్టరుగారూ,
  మరీ “బ్రాండ్” అని కాదు, నాకు సంబంధించినవన్నీ పొందుపరిచారు ఆర్టిస్ట్..

  శాస్త్రిగారూ,
  థాంక్స్..
  సమీరా,
  Thank you very much..

  నీరు,
  ధన్యవాదాలు..

  బోనగిరి గారూ,
  థాంక్స్..

  Like

 6. నూతన సంవత్సర శుభాకాంక్షలు

  Like

 7. happy pongal and sankranthi

  Like

 8. డాక్టరుగారూ,

  మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీకుకూడా మా నుంచి శుభాకాంక్షలు. ఇంకో రెండు మూడు రోజుల్లో టపా పెడతాను.

  Like

 9. Enjoying your musings in goindia.com, thank you,
  Mohan

  Like

 10. స్పందించడానికి కంఫర్ట్ ఇక్కడే ఉంది మరి.

  Like

 11. ఎట్లా మిస్ అయిపోయామండీ ఈ మీ టపా !

  శుభాకాంక్షల తో
  జిలేబి

  Like

 12. జిలేబీ గారూ,

  ధన్యవాదాలు..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: