బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “బాపు” రే… ఎక్కణ్ణించి వస్తాయో ఆ ఆలోచనలు…


Shri Bapu

    తెలుగువారు ప్రస్థుత వాతావరణం లో కూడా సిగ్గూ ఎగ్గూ వదిలిపెట్టేసి పరిసరాలు కూడా మర్చిపోయి మనసారా నవ్వుకోగలుగుతున్నారంటే దానికి ఒకేఒక్క కారణం మన బాపు గారే అనడంలో సందేహమేమీ లేదు. అసలు ఆయన వేసే కార్టూన్లు చూడ్డంతోటే నవ్వొచ్చేస్తుంది. ఇంక వాటికి వ్రాసిన కాప్షన్లైతే మరీనూ. ఆ బుర్రలోకి అలాటి ఆలోచనలు ఎలా వచ్చికూర్చుంటాయో తెలియదు. ఈ టపాలో పెట్టిన ఫొటో ఎప్పుడో “హంస” పత్రిక కి ముఖచిత్రంగా వేశారు. మరి దానికి సంబంధించిన వ్యాసం కూడా చదివేయండి..మన బాపు

    తెలుగు ఆడబడుచుకి నిర్వచనం చెప్పి, తెలుగమ్మాయి ఎలాఉండాలో చూపించిన ఘనత ఆయనదే. ఓ అమ్మాయి అంటే ఓ benchmark సృష్టించి అమ్మాయంటే ఇలాగుండాలీ అని ఓ ఆర్డరు పాస్ చేసేశారు.తెలుగు ఆడబడుచుకి ముగ్ధమనోహరరూపం సృష్టించింది “ఆంధ్రసచిత్రవారపత్రిక” కి ” ముఖపత్రచిత్రం వెనక కథ ఏమిటో కూడా చదివి ఆనందించండి.
ముఖపత్ర చిత్రం

    ఆరోజుల్లో శ్రీబాపు గారు “తెలుగువెలుగు” శీర్షికతో పాటు కొన్ని కథలు చిన్నపిల్లలకోసం వ్రాసేవారు. మచ్చుకి ఓ జపనీస్ కథ ఆధారంగా వ్రాసిన కథ కూడా చదవొద్దూ మరి..అమ్మ బొమ్మ– శ్రీ బాపు

    అసలు తాము తీసిన సినిమాలమీద వ్యంగ్యాస్త్రాలు వేయడం ఎప్పుడైనా విన్నామా? మరి అదే శ్రీ బాపు గారి ఖలేజా..మా సినిమాలు-బాపు( This link may take some time to open.. please bear with me. Be patient..its worth the delay)

    అసలు ఎన్నో ఎన్నెన్నో వ్రాయాలనుకున్నాను. కానీ ఆయన గురించి వ్రాయడానికి మనకి ఓ అర్హత కూడా ఉండాలిగా. అది లేకే ఇంకెవరెవరో వ్రాసినవి మీ అందరితోనూ పంచుకుంటున్నాను.ఈ సందర్భంలోనే , శ్రీ బాపు గారి “గొప్ప మనసు” గురించి, తన అనుభవాన్ని, మా మిత్రులు శ్రీ కృష్ణమోహన్ గారి అక్షరరూపంలో ఉంచారు. చదవండి.satamanam

    అఛ్ఛా Also ran.. అని ఎప్పుడంటారో విన్నారా? ఇదిగో ఇలాటప్పుడు– ప్రముఖులకి సంబంధించిన విషయాలలో ఇంకో అర్భకుడి గురించి చెప్పాల్సొస్తే, ఇలా Also ran.. అని అంటూంటారు.ఇక్కడ ఆ అర్భకుడికి ఎటువంటి ప్రాముఖ్యతా ఉండదు ఏదో ఓ ఒక్క విషయంలో తప్పించి..అదిగో అలాటి సందర్భంలోనే నేను కూడా Also ran. గురువుగారు డిశంబరు 15 న ఎనభైయ్యో సంవత్సరం పూర్తి చేసికుంటూంటే నేను డెభైయ్యో పడిలోకి అడుగెడుతున్నాను, అది నేను చేసికున్న అదృష్టం.

    ఇలాటి జన్మదినాలు ఎన్నో..ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తూ…

     శ్రీ బాపు గారికి

     హృదయపూర్వక శుభాకాంక్షలు

12 Responses

  1. జన్మదిన శుభాకాంక్షలు 🙂

    Like

  2. ఫణిబాబుగారూ,

    మీకు, బాపుగారికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన బొమ్మ, మీ బ్లాగు ఇలాగే తెలుగువారిని మరెన్నో ఏళ్ళ పాటు రంజింపజేస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ…

    భవదీయుడు,
    వర్మ

    Like

  3. Happy birthday to u baabaayi gaaru

    Like

  4. Wish you a very happy birthday and many many happy returns of the day

    Like

  5. మీకు, బాపుగారికీ జన్మదిన శుభాకాంక్షలు.
    Please keep writing.

    Like

  6. చక్కని వ్యాసం ద్వారా మనందరి ఆప్తులు ఆత్మీయ అభిమాన బాపు గారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ కొన్ని మంచి references పొందుపరచారు .మీరు శ్రీ బాపు గారికి అందచేసిన ఈ ప్రత్యెక శైలి
    శుభాకాంక్షలు చాలా వినూత్నంగా ఉన్నాయి అభినందనలు

    i
    i

    i

    Like

  7. many many happy returns of the day

    Like

  8. జన్మదిన శుభాకాంక్షలు ఫణిబాబుగారూ!!!!

    Like

  9. ఫణిబాబు గారు జన్మదిన శుభాకాంక్షలు! మీరు నాకంటే చిన్నవారనుకున్నాను. అప్పుడే డభ్భయ్యా? మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని, మీ బ్లాగు మీతో బాటే నిరాటంకంగా నడవాలనీ మనస్పూర్తిగా ఆ భగవంతుదిని ప్రార్ధిస్తున్నాను. ….ఫణికుమార్ కాండ్రేగుల.

    Like

  10. జన్మదిన శుభాకాంక్షలు ఫణి బాబు గారూ.

    Like

  11. మీరందరూ ఎంతో అభిమానంతో అందచేసిన జన్మదిన శుభాకాంక్షలకి ఆలశ్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుడిని. కారణాలు ఒక టపాలో వ్రాస్తాను…

    కిశోర్,

    థాంక్స్..

    అబ్బులూ,

    నా బ్లాగుమాట దేవుడెరుగుగానీ, శ్రీ బాపు గారి బొమ్మమాత్రం సదా చిరంజీవియే..

    నీరూ,

    ధన్యవాదాలమ్మా..

    డాక్టరుగారూ,

    థాంక్స్..

    బోనగిరి గారూ,

    శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఇక వ్రాయడమంటారా ఆ భగవంతుడి దయ..

    శాస్త్రిగారూ,

    ధన్యవాదాలు సార్. కోయంబత్తూరులో ఎలా ఉంది? ఇక్కడి మనవడిని మిస్ అవుతున్నారా?

    వెంకటరమణ గారూ,

    థాంక్స్..

    ఫణిగారూ,

    మీ అభిమానానికి ధన్యవాదాలు..

    సుబ్రహ్మణ్యంగారూ,

    థాంక్స్…

    Like

  12. క్రిస్మస్ సెలవులు అయిపోవచ్చాయి,
    మరి బాతాఖానీ కబుర్లు లేక పొద్దు పోవటం లేదు,
    త్వరగా రండి, మరిన్ని కబుర్ల తో, ప్లీస్!!!!

    Like

Leave a comment