బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Unhappy…


    ఇదేమిటీ ఈ టపాకి శీర్షిక అదోలా ఉందీ, ఈయన హ్యాపీ గా ఉంటే ఎవడిక్కావాలి, అన్ హ్యాపీ గా ఉంటే ఎవడిక్కావాలీ అనుకుని కోప్పడకండి. నాక్కావాల్సింది మీరందరూ హ్యాపీగా ఉండాలనే నా కోరిక. మరి ఈ శీర్షిక వెనకాల కథా కమామీషూ ఏమిటంటారా, ఇది SBI వారి 24×7 సర్వీసు పేరు. బ్యాంకుల్లో పనిచేసేవారికీ, అందులో పనిచేసి పదవీ విరమణ చేసినవారికీ తప్ప, మనలాటి ఆంఆద్మీ లకి తెలియదు. ఎప్పుడో పేపర్లలో వేశారుట. పోనిద్దురూ ఇన్నాళ్ళూ ఏ గొడవా లేదుకాబట్టి తెలిసికోవాల్సిన అవసరం కూడా కలగలేదు. మొన్న ఒక టపా వ్రాశాను, చదివే ఉంటారు, పింఛనీదార్ల ఇక్కట్ల గురించి. మాకు ఈ ఊళ్ళో ఒక స్నేహితుడు ఉన్నారు. ఆయన SBI లోనే పనిచేసి రిటైరయ్యారు. నా టపా చదివిన తరువాత, నాకు ఫోను చేసి ఈ సర్వీసు గుర్తుచేశారు, ఎప్పుడో చెప్పేరులెండి, అయినా ఈ Grievance Redressal Cell లమీద అంత విశ్వాసం లేకపోవడం మూలాన, దాని విషయం మర్చిపోయాను. ఆయన నిన్న ఫోనుచేయగానే , పోనీలే ఒక SMS చేస్తే, మనసొమ్మేంపోయిందీ అనుకుని చేశాను. SMS చేయాల్సిన నెంబరు 8008202020. మనకేమైనా సమస్య ఉంటే( SBI కి సంబంధించినంతవరకూ) ఈ నెంబరుకి Unhappy అని ఒక SMS చేసేయడం. వెంటనే ఒక రిప్లై వస్తుంది..”Your SMS has arrived in SBI’s Happy Room. Your satisfaction is our destination. We shal call you shortly to get details..” అని.ఇలాటివి ఎలాగూ ఆటోమేటెడ్ సమాధానాలే, అయినా చూద్దాం అనుకున్నాను.

    కానీ ఈవేళ ప్రొద్దుట ఒక ఫోను వచ్చింది, సమస్య ఏమిటీ అని. మొన్న నాటపాలో వ్రాసిన విషయాలన్నీ వివరంగా చెప్పేను. తప్పకుండా ఈ సమస్య ని resolve చేస్తామనైతే చెప్పేరు. చూద్దాం.

    బ్లాగు పాఠకులందరికీ ఇలాటి సమాచారం అంతగా ఉపయోగపడకపోవచ్చు. మొదటి కారణం ప్రభుత్వరంగ బ్యాంకులతో ఈతరం వారికి లావాదేవీలు పెట్టుకోడం అంతగా ఇష్టం ఉండదు. ICICI, HDFC,CITI, YES లాటి బ్యాంకులకే ఎక్కువ ఇష్టపడతారు.ఎంతచెప్పినా వారి సర్వీసు ప్రభుత్వరంగ బ్యాంకులంత అధ్వాన్నం కాదుకదా. కానీ మీమీ ఇళ్ళల్లో ఉండే ఏ పెద్దవారికో ఏదైనా సమస్య వస్తే పైన వ్రాసిన సర్వీసు ఉపయోగబడవచ్చు.

    ఇదివరకెప్పుడో రైల్వే వారి నెంబర్లు కూడా ఇచ్చినట్టు జ్ఞాపకం. ఇదివరకు వివిధ జోన్లకీ, విడిగా నెంబర్లుండేవి. కానీ ఇప్పుడు ఒకే నెంబరు : 8121281212
Railway Complaints

    పొగత్రాగడం హానికరం అని ఎన్ని ప్రకటనలు పెట్టినా, సిగరెట్ కాల్చేవారు కాలుస్తూనే ఉంటారు. ఆ సిగరెట్ మీద ఒక వ్యాసం చదవండి.సిగరెట్

7 Responses

 1. :-):-):-):-)

  Like

 2. ఇప్పటి తరం వాళ్ళు కూడ పాత బాంకులకే వెళతారండి.
  ఒకటి, అక్కడ లోన్లు తీసుకోవడానికి కొంచెం కష్టపడినా, తరువాతి బాదుళ్ళు ఉండవు.
  రెండు, ఆ ఎడ్రస్ ప్రూఫ్ ఎక్కడో అక్కడ ఉపయోగపడుతుంది.

  Like

 3. thank you! useful information sir.
  and hope your problem will be resolved!

  Like

 4. కార్తీక్,

  ఏమా స్మైలీ? ఏమా కథ?

  బోనగిరిగారూ,

  నాకు తెలిసిన ఈతరం ప్రెవేటు కంపెనీలలో పనిచేసేవారెవరికీ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎకౌంట్లు లేవు. మిగిలినవారి సంగతి నాకు తెలియదు.

  కృష్ణా,

  నాకేమీ సమస్యలేదు. ఇదంతా సమాజసేవలోకి వస్తుంది. లింకులు నచ్చినందుకు థాంక్స్..

  Like

 5. Keep up the zeal and spirit of informing and helping others!
  Without statutory warning tobacco products are advertised, not suiting your blog.
  Mohan

  Like

 6. sbi credit card teesukoni vallani vadilinchukovadaniki nenu padda paatlu,aa paga vadiki kuda vaddanipinchindi.
  Ippatiki aa vedava naa card cancel cheyyaledu.
  messages vastune vuntayi.
  inka jeevitamlo public sector banks ki ponu ani strong ga decide ayipoyanu

  Like

 7. డాక్టరుగారూ,

  మీరు చెప్పిన యాడ్ల తో నాకు అంత సంబంధం లేదు. ఇంకో చిత్రం ఏమిటంటే, వాళ్ళు పెడుతున్న యాడ్స్ నాకు కనిపించవు. ఎప్పుడో ఒకసారి వాళ్ళని అడగాలి. నాకు పైసా ఇవ్వకుండా, వాళ్ళు అసలు యాడ్లు ఎందుకు పెడుతున్నారో. I think this is an occupational hazard..

  శ్రావ్యా,

  క్రెడిట్ కార్డులకి సంబంధించినంతవరకూ, ప్రభుత్వ, ప్రెవేట్ రంగాల బ్యాంకులందరూ ఒకటే…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: