బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఫొటోలు పెట్టుకోడం ఎందుకు?


    కొంతమందికి తమ ఫొటో పబ్లిగ్గా పెట్టుకోవడమంటే ఓ ఎలర్జీ అనుకుంటా. తమ నిజస్వరూపం అందరికీ తెలిస్తే వచ్చే నష్టం ఏమిటో? Public domain లో ఉంటున్నప్పుడు అలాటి అభ్యంతరాలకి అర్ధం లేదు. ప్రతీ పోలీసు స్టేషనులోనూ కనిపిస్తూంటాయి seasoned criminals ల ఫొటోలు, మరీ అలాటి ప్రదేశాల్లో మన ఫొటోలు ఉండాలని కాదుకానీ, బ్లాగు ప్రొఫైలులో కానీ, ఫేస్ బుక్ ప్రొఫైలులో కానీ, తమ తమ నిజం ఫొటోలు పెట్టుకోడానికి చాలామంది, ఎందుకు సందేహిస్తారో నాకైతే అర్ధం అవదు. అంత అజ్ఞాతంగా ఉండవలసిన కర్మేం పట్టిందో తెలియదు.ఒకసారి ఎవరిదైనా ఫొటో చూస్తేనే కదా, ఓహో .. ఆయనా.. ఆవిడా.. మా ఇంటిప్రక్కనే ఉంటారనో, మా నాన్నగారి స్నేహితుడనో గుర్తుపట్టేది. బ్లాగుల్లోనూ, ఫేస్ బుక్కుల్లోనూ తమతమ నిజస్వరూపాలు చూపించుకోకూడదన్నదాని వెనక ఉండే rationale ఏమిటో నాకు అర్ధం అవదు. ఎవరిదైనా ఫొటో చూస్తేనేకదా, వారిమీద ఒక అభిప్రాయం ఏర్పరుచుకునేదీ? వాళ్ళు వ్రాసేవన్నీ చదవాలా, కానీ వాళ్ళెలాఉంటారో తెలియకూడదా? మనిషిని గుర్తించడానికి ఉన్న సాధనాల్లో ఈ ఫొటోలొకటీ, వేలిముద్రలోటీ. ఈమధ్యన అవేవో DNA test లూ అవీ కూడా చేస్తున్నారనుకోండి. ఏదో ఎన్డి తివారీల్లాగ వెధవపనులు చేస్తే ఏమో కానీ, లక్షణంగా ఓ ఫొటో పెట్టుకుంటే ఎవరో కొందరైనా చూసి సంతోషిస్తారుకదా.

అదేమిటో కానీ, ఇలా తమ అసలు ఐడెంటిటీ దాచుకోవాల్సిన వారిని చూస్తే, పోలీసులు పట్టుకున్నప్పుడు, అవేవో నల్లగుడ్డలు మొహాలకి కట్టుకుంటారే వాళ్ళే గుర్తుకొస్తారు నాకు. కొంతమంది సినిమా స్టార్ల బొమ్మలూ, కొంతమందైతే అవేవో ప్రకృతి దృశ్యాలూ, ఇంకా కొంతమందైతే …. ఎందుకులెండి….ఈ virtual world ఇలా ఉండడంలో పోనీ ఏదో సరదా అనుకుందాం, కానీ ఆయనెవరో ప్రఖ్యాత రచయిత, తన ఫొటోలు పెడతారన్నారని అసలు ఆ పత్రికలకే వ్రాయడం మానుకున్నారుట ! ఇప్పటిదాకా తన అసలు ఇడెంటిటీ ఏదో , తన రచనలు చదివేవారికి తెలియకపోవడం అదో ఘనతగా భావిస్తున్నారు. ఏమైనా అంటే ప్రైవసీ.. నా మొహం, నా ఇష్టం అంటారు. నిజమేకదా ఎవరెలా ఉంటే మనకెందుకూ? ఫొటోలు ప్రపంచానికి తెలిసేటట్టు పెట్టడమనేది, వారు వ్రాసే వ్రాతలతో మనం connect చేసుకోగలడానికే కానీ, వాళ్ళ కొంపలు కూల్చడానికి కాదూ అని ఎప్పుడు తెలిసికుంటారో? ఒక విషయం ఒప్పుకుంటాను, ఈరోజుల్లో నెట్లో ఆడపిల్లలు ఫొటోలు పెడితే , వాటిని దుర్వినియోగం చేసికోడానికి చాలామందికి అవకాశం ఉంది, కాదనను, కానీ సంవత్సరాలనుండీ వ్రాస్తూన్నవారికి కూడా అలాటి సందేహాలుంటాయంటే మాత్రం ఒప్పుకోను. అయినా ఎక్కడో ఎవడో ఏదో చేస్తాడేమో అని భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతామూ?

ఈమధ్యన మా చుట్టం ఒకబ్బాయి నన్ను కలియడానికి వస్తానని ఫోనుచేశాడు., మా పెదనాన్నగారి మనవడు. ఫలానా చోటులో ఉన్నామూ, ఫలానా బస్సులో వస్తే ఇక్కడకు రావొచ్చూ, నేను బస్ స్టాప్ లో నుంచుంటానూ అని చెప్పేను. బయలుదేరేముందు ఫోను చేయీ, నాకూ ఓ పదినిముషాలు పడుతుందీ, రావడానికీ అని చెప్పేను. ఎంత సేపు ఆగినా ఫోనే రాలేదు. బహుశా ఇంతదూరం శ్రమ పడి వేళ్ళేదేమిటిలే అనుకున్నాడేమో, పోనీ పలకరించాడు అదే పదివేలూ అనుకున్నాను కానీ, బస్ స్టాప్ కి వెళ్ళనేవెళ్ళేను. సంగతేమిటో తెలిసికోవాలని ఫోను చేస్తే, ఇంకో పావుగంటలో చేరతానన్నాడు.మేముండే చోటుకి, అతనుండే ప్రదేశం కనీసం ఇరవై కిలోమీటర్లు. అయినా ఎవరెవరినో అడిగి, మొత్తానికి చేరేడు. బస్సుదీగీదిగగానే నన్ను చూసి హలో అని పలకరించాడు. అరే ఎప్పుడూ చూడనేలేదూ, నన్నెలా గుర్తుపట్టకలిగేడూ అనుకుని అడిగితే, మీరు ఫేసుబుక్కులో మీ ఫొటో పెట్టేరుగా, అది చూసి గుర్తుపట్టానూ అన్నాడు. ఓహో ఇలా ఫొటోలు పెట్టడం వల్ల ఇలాటి ఉపయోగాలూ ఉంటాయన్నమాట అనుకున్నాను.

పురాణాల్లొ చదివిన దేవతామూర్తులని మనవేమైనా చూశామా పెట్టేమా, ఏదో మహారాజా రవివర్మ గారి ధర్మమా అని, ఆయన ఊహించి వేసిన చిత్రాలతో ఆ దేవుళ్ళని identify చేసికుని, ఓహో రాముడంటే అలా ఉండేవారా అనో, శివుడంటే అలాగా, అమ్మవారంటే ఇలా ఉండేవారన్నమాట అని మనం తెలిసికోవడమూ, మన పిల్లలకి చెప్పడమూ కదా.

అంతదాకా ఎందుకూ, ప్రతీ మాట్రిమోనియల్ సైట్లలోనూ, ఫొటోలతోనే కదా అసలు కథ ప్రారంభం అయేదీ? ముందుగా ఫొటో చూసి, ఫరవాలేదూ, అనుకున్నతరువాతే కదా next step వేసేదీ? మన తాతముత్తాతలగురించి మన తల్లితండ్రులు ఎన్నెన్నో విషయాలు చెప్తారు, కానీ ఆ రోజుల్లో ఫొటోలూ గట్రా సదుపాయాలు లేకపోవడం వలన, వారి అసలు రూపాలు చూసుకొనే అదృష్టం కలగలేదు. నిరతాన్నదాత్రి డొక్కా సీతమ్మగారి ఫొటో ప్రక్కనే సింహాసనం మీద పెట్టుకుని బ్రిటిష్ మహారాజు పట్టాభిషేకం చేసికున్నారని చదివేము. ఏదో అదృష్టంకొద్దీ ఒక్కటంటే ఒక్క ఫొటో ఆవిడది లభ్యం అయింది. ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఫొటో ఒకటి దొరికింది ఈమధ్య.శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు

ఫొటోలు పెట్టుకోనివారికీ, అజ్ఞాతంగా ఉండి ఏదో ఉధ్ధరించేద్దామనుకునేవారికీ ఈ టపా నచ్చకపోవచ్చు.

9 Responses

 1. ద్వారం గారిని చూసే భాగ్యం, నేరుగా వినేభాగ్యం
  తిరుపతి లో నా చిన్నతనం లో కలిగింది.
  ఇప్పుడు మీ వల్ల చాలా రోజుల తరువాత
  ఆయన ఫోటో చూసిగుర్తు పట్టి ఆనందించాను.

  Like

 2. నా ఫోటో చూసేటంత అందంగా ఉందను మరి, అందుకుపెట్టుకోలేదు నా బాల్గ్లో కాని మరోౘోటకాని. మీరన్నతరవాత ఆలోచించాల్సివచ్చేలా ఉంది. కాని నా ఫోటో ఇదివరకే మీరు ముందిగా మీ బ్లాగులో పెట్టేసేరు, ఆ తరవాత పరిచయం అని చెప్పి చి.లాస్య తన బ్లాల్గులో పెట్టేసింది, అదనమాట.

  Like

 3. good website
  ayurbless team
  free ayurveda treatment website: http://ayurbless.blogspot.in

  Like

 4. చాలా ఉపద్రవం తప్పింది.సరిఅయిన సమయానికి నా ఫోటో పేస్ బుక్ లో మార్చాను
  లేకపోతే ఈ బ్లాగ్ నా గురించే అనుకునే వాణ్ణేమో

  Like

 5. వామ్మో, వామ్మో, ఇన్నేసి అభాండాలా ఫుటో పెట్టని వాళ్ళ గురించి !~!!

  అందరూ వచ్చి ఇక్కడ హడ తాలు చేయవలె

  ఈ టపా ఏమన్నా నా గురించాస్మీ ! (గుమ్మడి కాయ దొంగ కథ గాదు గదా మరి ఇది!)

  ఫోటో లేని బలాదూరు బ్లాగిణి !
  జిలేబి

  Like

 6. డాక్టరుగారూ,

  మా అమలాపురానికి దగ్గరలో వేమవరం అని ఒక గ్రామం ఉంది. నా చిన్నతనంలో అక్కడ ప్రతీ ఏటా జరిగే సంగీతోత్సవాలలో, శ్రీ ద్వారం వారి వయొలిన్ కచేరీ వినే అదృష్టం కలిగింది. ఆ సమయంలోనే శ్రీ టీఆర్ మహాలింగం ( మాలి) గారి వేణుగానంకూడా విన్నాను.

  శర్మగారూ,

  అందాలూ అలంకరణలూ ఎవరికి కావాలి సార్? అయినా మీకేం తక్కువ?

  శాస్త్రిగారూ,

  అదేవిటో కానీ అందరూ భుజాలు తడిమేసికుంటున్నారు…

  జిలేబీ గారూ,

  అంత ధైర్యమే నాకు? అయినా మొహమ్మాట పెట్టేస్తున్నారు…మీకెలా కావలిస్తే అలా అన్వయించేసికోండి…

  Like

  • (1). నేరం చేసిన వాళ్ళ మొహాలు నలుగురికీ తెలియాలిగదా సమాజ శ్రేయస్సు దృష్ట్యా. కాని నిందితుల మొహాలకు నల్లముసుగులు ఎందుకు వేస్తారో / వేసుకోనిస్తారో ? బహుశా, నేరం ఋజువయ్యేంతవరకూ నిర్దోషే అనే సూత్రం వల్లనేమో? (అవునూ, పోలీస్ స్టేషన్లలో ఈ నల్లముసుగుల స్టాక్ ఉంటుందాండీ ??!!)

   (2). మీరు ఉదహరించిన ఆ “ప్రఖ్యాత రచయిత” (నేను అర్ధం చేసుకున్నది కూడా అదే “ప్రఖ్యాత రచయిత” అయితే) దాదాపు 1980 వ దశకం నుంచే ఈ గోప్య పద్ధతి పాటిస్తున్నారనుకుంటాను. మీరన్నట్లు ఆ రోజుల్లో అదో ఘనతగానే చెప్పుకునేవారు.

   (3). “పురాతత్వ తవ్వకాలలో” మీరు అందె వేసిన చెయ్యిలాగా ఉన్నారు. అంత పాత పత్రికలు, ఫొటోలు, వ్యాసాలు వగైరా ఎలా తవ్వి తీస్తారండి బాబూ? బ్లాగ్లోకానికి చాలా సేవ చేస్తున్నారు మీరు.

   (4). అమలాపురంలో ఆ రోజుల్లో ఆ ఉత్సవాల్లో మీరు ఉదహరించినవారితో పాటు, చెంబై వైద్యనాధ భాగవతార్ (గాత్రం), లాల్గుడి జి జయరామన్ (వయొలిన్), మదురై మణి అయ్యర్ (మృదంగం) గార్లను కూడా చూసినట్లు నా జ్ఞాపకం.

   మంచి టపా వ్రాసారు. (టపా చివర ఈ టపా ఫొటో అజ్ఞాతలకు “అంకితం” అంటారేమో అనుకున్నాను.

   Like

 7. నరసింహరావుగారూ,

  మీరన్నట్టు పోలీసు స్టేషన్లలో నల్ల ముసుగుల స్టాక్ ఉండుండొచ్చు ! చాలామంది “ప్రఖ్యాత” రచయితల ఫొటోలు చూశాము, ఈయన గారి ఒక్కరిదీ తప్ప. బహుశా మీరూ నేనూ ఒకేమనిషిగురించే మాట్టాడుతున్నామేమో. “సేవ” అని కాదూ, నాకు నచ్చిన కథలూ, వ్యాసాలూ పంచుకుంటున్నాను. ఆయన “మధురై” మణి అయ్యర్ కాదు పాలఘాట్ మణి అయ్యర్. మధురై మణి అయ్యర్ గారు ప్రసిధ్ధ గాయకుడు. నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు…

  Like

  • అవును, నేను చెప్పాలనుకున్నది గూడా (మృదంగం) “పాల్ఘాట్” మణి అయ్యర్ గారి గురించే, కాని కొంచెం confuse అయ్యి “మదురై” అన్నాను. Thanks for the correction.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: