బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సంగీత అతిరథ మహారథుల మధుర స్వరాలు వినాలనుందా…


   ఇదివరకటి రోజుల్లో వీనులకు విందైన సంగీతం, అది ఒక సినిమా పాట అవొచ్చు, లేదా శాస్త్రీయ సంగీతం అవొచ్చు. మార్కెట్ లో దొరికే క్యాసెట్లో, సీడీలో, అంతకుముందైతే గ్రామఫోను రికార్డులే కొనాల్సొచ్చేది. లేదా అదృష్టం బాగుండి ఏ రేడియోలోనైనా వారు దయతలిస్తే విని ఆనందించే అదృష్టం కలిగేది. కొద్దికాలానికి ఆల్ ఇండియా రేడియో వారు తమ archives నుంచి కొన్ని కొన్ని అమృతభాండాల్ని దేశంలోని వివిధ ఆకాశవాణి కేంద్రాలద్వారా విక్రయించేవారు. కానీ మాలాటివారికి ఏ కర్ణాటక సంగీతమో వినాలనుకుంటే , ఇక్కడ పుణె ఆకాశవాణి కేంద్రంలో అంత choice ఉండేది కాదు. సంగీతప్రియ అని ఒక సైటుంది కానీ, చాలా లింకులు తెరవబడేవి కావు. మనకింతే ప్రాప్తం అని వదిలేశాను.

    కానీ ఈమధ్యన Music online అనే ఒక లింకులో అద్భుత అత్యద్భుత.. ఇంకా ఎన్నెన్ని అద్భుత వాడాలంటే అంతంత అద్భుతమైన పాటలు ఉచితంగా దొరుకుతున్నాయి. వెంటనే వినడం మొదలెట్టేసి ఆనాటి పా…త.. మధురలోకాలలో విహరించేయండి.
మచ్చుకి ఒక లింకు ఇస్తున్నాను. ఇప్పటికే తెలిసుంటే సరేసరి లేదా…ఒకసారి వినండి.

    శ్రీ అవసరాల రామకృష్ణరావు గారి ఈ వ్యాసంకూడా చదివేయండి పనిలోపనిగా…మాయరోగాలు– శ్రీ అవసరాల

Advertisements

4 Responses

  1. thanks for sharing

    Like

  2. ఫణిబాబు గారూ,

    మంచి లంకె అందరితోనూ పంచుకున్నందుకు ధన్యవాదాలు. నేను సంగీతప్రియ వెబ్ సైటు (sangeethapriya.org) చాలా తరచుగా వాడుతానండీ. బహుశా ఈ మధ్య మీరు చూసి ఉండరనుకుంటున్నాను. కాకపోతే కొంతమంది (ఉదా: మల్లాది సోదరులు), వాళ్ళ కచేరీలు తీసెయ్యమని అభ్యర్థించారట. అందుకే కొన్ని లంకెలు తెరుచుకోవు. అలాంటివి కొన్ని తప్ప మిగతావన్నీ బాగానే ఉంటాయి. నేను ఇంచుమించుగా ప్రతీవారం ఎన్నోకన్ని డౌన్లోడ్ చేస్తూనే ఉంటాను.

    భవదీయుడు,
    వర్మ

    Like

  3. శర్మ గారూ, డాక్టరుగారూ,

    లింకులు నచ్చినందుకు సంతోషం. మీ స్పందనకు ధన్యవాదాలు.

    అబ్బులు గారూ,

    నేను కూడా మొదట్లో సంగీతప్రియ.ఆర్గ్ చూసేవాడిని, డౌన్లోడ్ కూడా చేసికునేవాడిని. కానీ ఈమధ్యన అక్కడ ఉన్న చాలా లింకులు “ఎర్రర్” అని చూపిస్తున్నాయి. ఏం చేయాలిభగవంతుడా అనుకునేటప్పటికి ఈ కొత్త లింకు దొరికింది. మీరన్నట్టు సంగీతప్రియ లో అప్లోడ్ చేసినవన్నీ ఇక్కడ దొరకడం లేదు. అయినా ఏదో సరిపెట్టేసికుంటున్నాను. ఎక్కడికక్కడే…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: