బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– నవ్వాలో ఏడవాలో..


    ఈవేళ శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారు, ఏదో సినిమాల్లో డయలాగ్గులు చెప్పేసినట్టుగా, ఎంతో సుళువుగా చెప్పేశారు- తన శరీరంలో క్యాన్సరు కణాలు ప్రవేశించినట్టు డాక్టర్లు చెప్పారూ అని ! టివీలో ఆయన చెప్పిన మాటలు వింటూంటే, ఎవరికైనా ఇంత గుండెధైర్యం ఉంటుందా అనిపించడమే కాకుండా, ఉన్నదున్నట్టుగా చెప్పగలిగే సాహసం కూడా cultivate చేసికోవాలనిపించింది. ఎన్నో సంవత్సరాలక్రితం “ఆనంద్” (హిందీ) సినిమాలో చూశాము. అదేమో reel life కానీ ఇదిమాత్రం నిజజీవితం. పైగా ఆయన అన్నట్టుగా, మనోధైర్యం ఉంటే, ఎలాటి ఒడుదుడుకులనైనా ఎదుర్కోవచ్చనీ. ఇది నిజంగా అందరికీ ఒక పాఠం లాటిది. ఆయన ప్రకటన ఎవరైనా మిస్ అయి ఉంటే ఇదిగో ఇక్కడ చూడండి.

    నాకు కొన్ని కొన్ని విషయాలు అర్ధం అవవు. ఉదాహరణకి Facebook. ఇదివరకటి రోజుల్లో దేశవిదేశాల్లో ఏదైనా సంఘటన మంచైనా, చెడైనా జరిగితే అందరికీ తెలియడానికి చాలా సమయం పట్టేది. కానీ ఈరోజుల్లోనో Facebook,Twitter ల ధర్మమా అని, కొద్దినిముషాల్లో ప్రపంచం అంతా తెలిసిపోతోంది.

    ఈ Social Networking ధర్మమా అని, ప్రపంచం నిజంగానే “గుప్పెట” లోకి వచ్చేసింది. ఎక్కడెక్కడివో విషయాలు మనకు మనసుంటే తెలిసికోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఏదో కారణం చేత టివీ లో న్యూసు చూడకపోయినా , ఒకసారి ఏ ఫేసుబుక్కో చూస్తే విషయం తెలిసిపోతోంది.చివరకి కుటుంబసభ్యులు కూడా వారి వారి జీవితాల్లో జరిగే విషయాలు ఈ ఫేస్ బుక్కు ద్వారానే తెలిసికుంటున్నారు. ఒకలా చూస్తే అది చాలా విచారకరమైన పరిణామం. స్నేహితుల మధ్య అయితే ఫరవాలేదు, కానీ కుటుంబసభ్యుల మధ్యకూడా, దీన్నే మాధ్యమంగా ఎంచుకోవడం, ఏమిటో నాకైతే నచ్చదు. కానీ కాలంతోపాటు మనమూ పరిగెత్తాలిగా !! బంధువులదగ్గరనుండి ఫోను రాలేదని బాధపడేకన్నా, ఆ బంధువుకి చెందిన ఏ Facebook,Twitter ఐడి యో నొక్కితే విషయం తెలిసికోవలసినంతగా, దిగజారిపోయాము.పోనిద్దురూ, మాధ్యమం ఏదైతేనేం క్షేమసమాచారం తెలుస్తోందిగా అని సరిపెట్టేసుకుంటున్నారు.

    ఈ సందర్భం లో నిన్న జ్ఞానపీఠ బహుమతి ఈమధ్యనే గ్రహించిన శ్రీ రావూరి భరద్వాజ గారి, మరణవార్త నేను టీవీలో చూడకపోవడం కారణంగా, ఈ Facebook లోనే తెలిసికున్నాను. చాలా విచారించాను కూడా. మనందరం ఎప్పుడో ఒకప్పుడు పైలోకాలకి వెళ్ళిపోవలసినవారమే. శ్రీ భరద్వాజగారు, స్వయంగా జ్ఞానపీఠ బహుమతీని స్వీకరించడం అదృష్టం.

    ఈవిషయం Facebook ద్వారా తెలిసికున్నప్పుడు ఓపికుంటే ఓ వ్యాఖ్య పెట్టడం. కానీ చిత్రం ఏమిటంటే కొంతమంది ” like ” పెట్టడం. వారి ఉద్దేశ్యం ఏమిటో అర్ధంకాలేదు. శ్రీభరద్వాజగారు స్వర్గస్థులవడం వారికి ఇష్టమయిందనా? లేక వారు మరణించడం మంచిదయిందనా? ఓ అర్ధం పర్ధం లేకుండా, ఓ వేలం వెర్రిలా ప్రతీదానికీ “like” లు పెట్టడం కొంచం ఎక్కువైనట్టుగా కనిపిస్తోంది. సందర్భం చూసి ఏదైనా మంచివార్త అయితే ఈ”like” లు పెడితే సంతొషిస్తారు కానీ, ప్రతీ విషయానికీ పెడితే మనోభావాలు కించపరిచినట్టవడంలేదూ? ఒకసారి ఆలోచించండి. FB లో కొంతమంది స్పందన చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు.

    మరీ ఈ టపా కొద్దిగా సీరియస్సు గా ఉన్నట్టుంది కదూ. కొద్దిగా relax అయిపోండి ఈ వ్యాసం చదివేసి.
పెళ్ళాన్ని పిలవడం ఎలా- అందరూ తమ తమ భార్యలని ప్రతీరోజూ ఏదో ఒక సందర్భంలో పిలవాలేకదా, ఈ వ్యాసంలో చెప్పబడిన పధ్ధతులు ఏవైనా ఉపయోగిస్తాయేమో చూడండి…పొరపాటున ఇంకొక వ్యాసంకూడా జతచేశాను. ఫరవాలేదులెండి, అది కూడా ఉపయోగబడేదే…

5 Responses

 1. మీరూ ముఖపుస్తకం మీద దాడి చేస్తున్నారా?

  Like

 2. పెళ్ళాన్ని పిలవడం ఎలా అన్న ప్రశ్న వచ్చే ఈ కాలం కుర్రాళ్ళు డార్లింగ్ అన్న ఆంధ్ర తెలుగు పదాన్ని పెట్టేసు కున్నారండోయ్ !! (ఇంతకీ భమిడి పాటి వారు అమ్మవారిని ఏమని సంబోదిస్తారో !)

  ఇక ముఖ పుస్తక చిత్ర కథ కొస్తే దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. పెళ్ళిళ్ళు జరిగినాయి. ముఖ పుస్తకం లో పేజీ ల పేచీ కనుక్కున్న వారికి ఇనాములు దక్కినాయి ( ఈ మధ్య ఈ ముఖ పుస్తక సైటు సెక్యురిటీ హెడ్డు మా హిందూ బిజినెస్స్ లైన్ కి ఇంటర్వ్యు ఇచ్చి చెప్పే ఇండియన్స్ ఈ ఇనాములు దక్కించు కున్న వాళ్ళలో అగ్ర గణ్యు లని !)

  జిలేబి

  Like

 3. ఏవిటో ఫణిబాబు గారూ, మీ చాదస్తం,ఫేస్ బుక్ లో లైక్ ల గురించి బాధపడుతున్నారు. ఈ తరం చాలా మంది కి సరైన అవగాహనా లేదు, నేర్పించినా నేర్చుకోరు అనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్నదే ఫాషన్ అని వాళ్ళ భ్రమ. సందర్భం చూసుకోకుండా ఫేస్ బుక్ లో లైక్ లు కొట్టటం ఒక్కటేనా? ఒకసారి ఓ తెలుగు టీవీ ఛానెల్ గుడ్ ఫ్రైడే నాడు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అని ప్రేక్షకులకు చెప్పిన ఘనత కూడా మూట కట్టుకున్నారు.

  Like

 4. శర్మగారూ,

  దాడి కాదండి బాబూ.. కొంతమంది వేసే వెర్రివేషాల గురించి వ్రాశాను..

  జిలేబీ,

  నా అభ్యంతరం ఫేస్ బుక్ గురించి కాదు. 800 కి పైగా స్నేహితులున్నారు నాకు ఫేస్ బుక్ లో.. నిత్యం నేను చాలా ఫొటోలుకూడా పెడుతూంటాను. నాకు అర్ధం కానిది ,కొంతమంది స్పందించే పధ్ధతి కి. ఇంకా “అమ్మవారిని” అమ్మడూ అని పిలుచుకుంటాను. సరేనా…

  నరసింహరావుగారూ,

  చాదస్థం అని కాదండీ. ఎవరో ఒకరు చెప్పాలిగా ఈ ప్రబుధ్ధులకి… ఇంకో విషయం మీరు అప్పుడెప్పుడో పూణె వచ్చి మాకు దర్శనభాగ్యం కలిగిస్తానన్నారు ఏమయిందీ అసలు రానేలేదా లేక వచ్చినా మామీద మీ దయాదృష్టి పడలేదా ?

  Like

  • మీ జవాబులో రెండో భాగం గురించి మీకు ఫోన్ చేస్తాను.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: