బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    ఏదో దసరా బాగానే గడిచిపోయిందని సంతోష పడ్డంత సేపు పట్టలేదు.దురదృష్టం కొద్దీ ఈవేళ జెమినీ లో “జగద్గురు శంకరాచార్య” సినిమా చూడాల్సి వచ్చింది. జగద్గురువులు ఆదిశంకరుల గురించి, బ్రహ్మశ్రీ చాగంటి వారి “శంకర విజయం” లో చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని,పోనీ ఆ అంశాలు దృశ్యరూపంలో కూడా చూసి ఆనందించవచ్చూ అనే ఒకేఒక్క కోరికతో రెండున్నర గంటలూ భరించాల్సొచ్చింది. అసలు ఆ సినిమా ఎందుకుతీశారో అర్ధం అవలేదు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎంత ఎక్కువగా పెడితే అంతగా సినిమా విజయవంతమౌతుందనే దురభిప్రాయం లోంచి ఎప్పుడు బయట పడతారో మన నిర్మాతలు, అన్నది తెలియడంలేదు. అప్పుడెప్పుడో సాయిబాబా చరిత్రని ఉధ్ధరించారు. ఇప్పుడు ఆదిశంకరుల వంతు వచ్చింది. ఒక్క పాత్రా నేలమీద నడిచిన పాపాన పోలేదు. ఎవరిని చూసినా గాలిలో ఎగిరేవారే. ఒక్కో సినిమాకీ అవేవో A సర్టిఫికేటూ, కొన్నిటికి U సర్టిఫికేటూ, కొన్నిటికి UA అనీ ఇస్తూంటారు. ఈ సినిమాకైతే ముందరే For Youth అని ఒక tag పెట్టేశారు. అప్పుడైనా తెలిసికోవలిసింది, ఈ సినిమా ఒఖ్ఖ facebook జనాలకే అని. సాయిబాబా సినిమాలోవారే మేక్ అప్ మార్చేసికుని ఈ సినిమాలో నటించేశారనుకుంటా. ఇంకా ఎంతమంది మహనీయుల చరిత్రలు ఈ గ్రాఫిక్స్ బారిన పడతాయో పాపం

    పాప ప్రక్షాలణం కోసం ఇదివరకెప్పుడో తీసిన శంకరాచార్య సంస్కృత సినిమా చూసి refresh కావాల్సొచ్చింది. మీరు కూడా ఈ చిత్రాన్ని ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ఇక్కడ చూడండి.

5 Responses

 1. ఈ శంకరాచార్య అయ్యరు గారి సంస్కృత శంకరాచార్య కాదని అనుకుంటా మీరు చెబుతున్నది ?

  జిలేబి

  Like

 2. జిలేబీ,

  నేను పెట్టిన లింకు సంస్కృతంలో అయ్యరుగారు దర్శకత్వం నిర్వహించిన ఆదిశంకర శంకరాచార్య సినిమాయే.

  Like

 3. అడుసు తొక్కనేల కాలు కడగనేల ?
  సినిమా చూడనేల ఆపై విచారించడమేల?……………..దహా.

  Like

 4. ఇలాంటి సినిమా ఐనా అసలు ఎలాంటి సినిమా ఐనా డబ్బులు సంపాదించుకోవటానికే తీస్తారు.

  ఒకప్పుడు రంగస్థలాన్ని పూజించే సంస్కృతి ఉండేది. అప్పట్లో డబ్బుకోసం సినిమాలను తీసినా విలువల విషయంలో మాట అనిపించుకోకూడదని భావించి సినిమాను ఒక దృశ్యకావ్యంగా మలిచేవారు. ఈ‌ రోజుల్లో‌డబ్బు సంపాదించుకోవటానికి విలువలను పట్టుకుని వేళ్ళాడితే ఎలా జనాకర్షణయే ముఖ్యం అని భావించి చెత్తాచెదారం అంతా చుట్టేసి వదులుతున్నారు.

  దృశ్యకావ్యంగా తీసే రోజుల్లో అనేక మంచి సినిమాలు కూడా అడని సందర్భాలున్నాయి. అప్పట్లో ధియేటర్లు తక్కువ, ప్రింట్లు తక్కువ. 1971lలో దసరాబుల్లోడు అనే ఫక్తు సరదా సినిమాకి 21ప్రింట్లు వేయతమే రికార్డు. అంచెలంచెలుగా సినిమా నగరాలు, పట్టణాలు దాటి పల్లెలకు వచ్చేది. ఈ‌ లోగా బాగాలేదని పేరు వస్తే ఇంతే సంగతులు. ఈ రోజున ప్రతి అడ్డమైన సినిమాకు వేయికి పైన ప్రింట్లు. జనానికి సినిమా బాగోలేదని అర్థం అయ్యే సరికే పెట్టుబడో కొంత లాభమో వచ్చేస్తుంది. ఒకప్పుడు పెద్దహీరోల సినిమాలూ కథలో కాని కథనంలో కాని లోపమో మరొకటో ఐతే ఆడేవి కావు. ఈ‌ రోజున కథ అన్నదే దరిద్రం ఐనా అసలే లేకపోయినా హీరో గారి అభిమానులు ఆడించేసుకుంటారట!

  సినిమాలకు కొన్ని సక్సెస్ ఆకెసరీస్ ఉన్నాయి. చిన్నపిల్లలు, పాములు, దేవుళ్ళు వగైరా. వీటిని సరిగా వాడుకుంటే బిలో ఆవరేజ్ కథతోనూ లాగించవచ్చు బండి. ఇప్పుడు భక్తుల కథలూ ఆ కోవలోకి వస్తున్నాయి. నాగార్జునకు నటనా లేదు, వయసూ కాదు యువతరం కథల్లో ఒప్పించటానికి. అందుకే భక్తుల కథల మీద పడ్డాడు. ఎంతటి భక్తుడైనా, మహాత్ముడైనా నాగార్జున గారి ఇమేజి ప్రకారం ఒదగ వలసిందే తప్ప దారి లేదు. చూస్తూ ఉండండి ఒక రోజున రాములవారి పాత్ర వేస్తాడు నలుగురైదుగురు హీరోయినులతో. అంతమందితో విసుగొచ్చి ఏకపత్నవ్రతం డిక్లేర్ చేస్తాడన్న మాట. మన తెలుగు నటులూ దర్శకులూ అఖండులు కదా మరి.

  ఒకప్పుడు బాలకృష్ణ అనే మరో‌ మహానటుడి పాండురంగడు సినిమా చూసి ఇంటిల్లపాది జనమూ తరించి పోయాం. ఇంటికి తిరిగిరాగానే వారి తండ్రిగారు చేసిన పాండురంగమాహాత్మ్యం మరోసారి పూర్తిగాచూసి సేదతీరాం. దాంతో రాత్రి బాగా పొద్దుపోయిందనుకోండి. అది వేరే విషయం. కాని మీరన్నట్లు కొంత పాపప్రక్షాళనం ఐంది కదా.

  అందుకే శ్రీరామరాజ్యం సినిమా చూసే సాహసకృత్యం ఇప్పటి దాకా చేయలేదు. నిన్ననే శ్రీవేంకటేశ్వరమహాత్మ్యం, లవకుశ సినిమాలు ఒకసారే వస్తే మొదటిది పూర్తికాగానే లవకుశ చూసాను మిగతాసమయం గంటన్నరపాటూ.

  Like

 5. సుబ్రహ్మణ్యంగారూ,

  మీ చేత చివాట్లు తిని చాలా కాలం అయిందనీ…

  శ్యామలరావుగారూ,

  ” ఈ‌ రోజుల్లో‌డబ్బు సంపాదించుకోవటానికి విలువలను పట్టుకుని వేళ్ళాడితే ఎలా జనాకర్షణయే ముఖ్యం అని భావించి చెత్తాచెదారం అంతా చుట్టేసి వదులుతున్నారు.” అక్షరసత్యం. శ్రీ సుబ్రహ్మణ్యంగారు శలవిచ్చినట్టుగా, తప్పంతా నాదేలెండి. ఆ మాయదారి సినిమా అసలు చూడమనెవరడిగారూ? కనీసం ఇటుపైన అయినా బుధ్ధితెచ్చుకుని ప్రవర్తిద్దామని అనుకుంటున్నాను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: