బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్..


    ఒకానొకప్పుడు అంటే, మేము ఉద్యోగంలో చేరినప్పుడన్నమాట (1963 లో) , ప్రతీ సంవత్సరమూ ఉద్యోగస్థులందరిచేత ఒక oath లాటిది చెప్పించి, ఓ రిజిస్టరులో సంతకం చేయించేవారు. నేను చేరింది, Indian Ordnance Factories లో కాబట్టీ, అక్కడ దేశ రక్షణ కోసం, మా ఫాక్టరీలలో తయారుచేయబడే , ఆయుధ సామగ్రి, మందుగుండు(Ammunition) ల వివరాలు బయటివారికీ, వారిద్వారా శత్రుదేశాలకీ తెలియకూడదనే సదుద్దేశ్యంతో. ఆరోజుల్లో ఎప్పుడో ఒకసారి, నోరుజారి ఏదో మాట్టాడితే, మా చిన్నన్నయ్యగారు – ఆయనకూడా రక్షణశాఖ వారి ఒక sensitive విభాగంలోనే పనిచేసేవారు- నన్ను చెడామడా కోప్పడ్డారు, oath తీసికోలేదా, లేకపోతే పరవాలేదులే అనుకున్నావా అంటూ.అప్పటినుంచీ పెళ్ళైనతరువాత ఇంటావిడతో కూడా, ఫాక్టరీ సంబంధిత వ్యవహారాలు మాట్టాడేవాడిని కాదు. ఇదంతా నేనేదో ఘనకార్యం చేశానని చెప్పుకోడానికి కాదు, మన దేశంలో ఒకానొకప్పుడు దేశరక్షణకి సంబంధించినంతవరకూ , అతి చిన్న ఉద్యోగినుండి, అత్యున్నత పదవిలో ఉన్నవారి వరకూ , వారు నిర్వహిస్తూన్న పదవికి ఎంత గౌరవం ఇచ్చేవారో(serenity of the job) చెప్పడానికి మాత్రమే.

    మొదటినుండీ అదే అలవాటైపోయింది.అలాటిది ఆ “లక్ష్మణ గీత” ఎప్పుడు దాటేరో కానీ, ఇప్పుడు ప్రతీదీ నెట్ లో దొరుకుతాయి. ఎన్ని ఫాక్టరీలూ, సంవత్సర ఉత్పత్తి బాంబులూ, గ్రెనేడ్లూ ఒకటేమిటి, తయారుచేసే ప్రతీ వస్తువూ ఎంతంత తయారవుతుందీ మొదలైన వివరాలు. కారణం- ఓ వస్తువుకి కావాల్సిన ముడిపదార్ధాలు ప్రతీదీ మార్కెట్ నుంచే కొనాల్సిరావడం వలన. ఎవరి దగ్గరైతే కొంటామో, వాళ్ళకిచ్చే ఆర్డరు ధర్మమా అని, ఈ వివరాలు తెలిసికోవడం ఓ పెద్ద పని కాదు.చెప్పేదేమిటంటే ప్రతీ విషయం లోనూ ” గోపనీయత” ( confidentiality) అన్నది had gone for a toss. ఈ ఆధునిక యుగంలో అందరూ అనేది ఒకటే మాట–openness, transparency అని. కరెక్టే, కానీ ఎంతవరకూ? దేనికివ్వాల్సిన గౌరవం దానికివ్వాలి. ఒక అత్యున్నత స్థానంలో పనిచేసిన పెద్దమనిషి, తాను అధికారంలో ఉండగా, ఏవేవో కారణాలవల్ల ఎన్నెన్నో చేయాల్సొస్తుంది. అన్నీ తెలుసు కదా అని, పదవీవిరమణ చేయగానే, తాను పదవిలో ఉండగా చేయాల్సొచ్చిన ప్రతీ పనినీ బహిరంగంగా చెప్పుకోవాలని ఏమీలేదు. ఏదో sensationalise చేయడానికి తప్ప ఇంకో కారణం కనిపించదు.

    ప్రస్థుతం మన మాజీ సైన్యాద్యక్షుడు చేసిన పని అదే. అప్పుడెప్పుడో, మాజీ వాయుసేనాద్యక్షుడు గురించి ఏవేవో విమర్శలు వచ్చాయి, అంతకుముందు, మా Indian Ordnance Factories చైర్మన్ గారినైతే జైల్లోనే పెట్టారనుకోండి. ఏ విభాగం తీసికోండి, అప్పటిదాకా పనిచేసినవాడెవడో, memoirs అని ఓ పుస్తకం వ్రాస్తానని చెప్పీచెప్పడంతోనే ఆర్డర్లు బుక్కైపోతాయి. అలా వ్రాయబడ్డ ప్రతీ పుస్తకంలోనూ, తానేదో శ్రీరామచంద్రుడనీ, మిగిలినవారందరూ ఒఠ్ఠి చవటాయలనీ వ్రాయడమే. ఈ మాయదారి “memoirs” అనబడే అవాకులూ చవాకులూ, వ్రాసినందుకో, ఏ ghost writer చేతో వ్రాయించినందుకో , ఈయనగారికి జీవితాంతం రాయల్టీలూ. అన్నీ అబధ్ధాలనడంలేదు, చాలా భాగం అతిశయోక్తులే.

    ఇదివరకటి రోజుల్లో ఓ రాజకీయనాయకుడో, ఓ ప్రముఖవ్యక్తో, లేదా వీరిదగ్గర పనిచేసిన కార్యదర్శులో, లేదా ఏ దగ్గరివారో కూడా తమతమ జ్ఞాపకాలపందిరిని అందరితోనూ పంచుకునేవారు, కానీ ఎప్పుడూ, అలా వ్రాసినవారి తదనంతరం.దానికీ ఓ కారణం ఉండేదనుకోండి, బ్రతికుండగా ప్రచురిస్తే మళ్ళీ ఏం గొడవలొస్తాయేమో అనే భయం అయుండొచ్చు. అతావేతా పోయిన తరువాత ప్రచురిస్తే ఓ గొడవుండదు. ఎవడిగురించినా వ్రాసినా, మిగిలినవాళ్ళందరూ కొట్టుకు ఛస్తారు. సర్వే జనా సుఖినోభవంతూ అనుకోవడం, ఓ వారంరోజులు మీడియాలో మొండెంమీద తలున్న ప్రతీవాడూ, “ఖండించేయడం”.

    పంజాబులో ఉగ్రవాదం, చాలా ఎక్కువగా ఉన్నరోజుల్లో ఆ గిల్లుగారో ఎవరో ఏమిటేమిటో చేసేశారనీ,ఎన్నెన్నో విషయాలు విన్నాము. ఉగ్రవాదం తగ్గిందాలేదా. అదీ ముఖ్యం, ఎవడెవడికి ఎంతంత డబ్బిచ్చారూ, వాటికి లెఖ్ఖా పత్రం ఉందాలేదా, అంటూ కోడిగుడ్డుకి వెంట్రుకలు లెఖ్ఖపెట్టడం బుధ్ధితక్కువతనం. పోలీసు వ్యవస్థలో informers అని ఉండరూ, వాళ్ళ సహాయమే లేకుండానే మనపోలీసులు నేరస్థులని పట్టుకుంటున్నారా ఏమిటీ? అలాగని అత్యున్నత పోలీసు అధికారి, పదవీ విరమణ అయిపోయిందికదా అని, ఆ informers ల పేర్లూ, వాళ్ళకిచ్చిన రొఖ్ఖం వివరాలూ అన్నీ బయటపెడతారా? సమాచారం అనేదానికి ఓ వెల ఉంటుంది, ఊరికే ఎవడూ పంచుకోడు. కాశ్మీరులో గొడవలు తగ్గించడానికి ప్రభుత్వం కొంత సొమ్ము కేటాయిస్తుంది, ఖర్చుపెట్టే తీరు వాళ్ళే నిర్ణయిస్తారు. మన సింగుగారు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ,కాశ్మీరులో, ప్రభుత్వం రాజకీయనాయకులకి డబ్బులిస్తోందీ అన్నారే, ఆయన పదవిలో ఉండగా ఎప్పుడూ నోరెత్తలేదే? అవునులెండి, ఆయన date of birth గొడవల్లో పడి ఇది దృష్టికి రాలేదేమో.

   అసలు మనరాజకీయనాయకులు ఎన్నికల్లో ఏ డబ్బూ ఖర్చుపెట్టకుండానే నెగ్గుతున్నారా? పోనీ ఆ లెఖ్ఖా పత్రం అడుగుదామంటే, మనప్రభుత్వం రాజకీయనాయకులని RTI నుంచి exempt చేద్దామనుకుంటోంది. దొందుకిదొందే.

    దేశరక్షణకి సంబంధించినంతవరకూ, మన త్రిదళాలూ, రాత్రనక, పగలనకా నిస్వార్ధంగా పనిచేస్తున్నారు కాబట్టే మనం , హాయిగా సమ్మెలూ, బంధులూ, రాస్తారోకోలూ చేసికోగలుగుతున్నాము. దిక్కుమాలిన సినిమాలు చూడగలుగుతున్నాము.అదేదో Grand Masti అని సినిమాట, దాన్ని చూస్తూ నవ్వినవ్వి గుండాగి చచ్చిపోయాడుట !అదృష్టవంతుడు. ఆ సినిమా గురించి ఎవరో, అసలు అలాటి సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారూ అని అడిగితే, మన కేంద్రసెన్సార్ అద్యక్షురాలు, ఆవిడెవరో ఓ గొప్ప డ్యానసరుట, ఏం చేయనూ దేశంలోని ప్రాంతీయ సెన్సార్ బోర్డులలో ఉండే సభ్యులు నూటికి తొంభైమందిదాకా, నిరక్షరాశ్యులూ, నిశానీగాళ్ళూనూ అన్నారుట, మిగిలిన వారందరూ ఆవిడకి లీగల్ నోటీసులిచ్చారు, ఠాఠ్ అలాగంటావా, అందరినీ వీధిలోపెట్టాలా అంటూ. ఇలా తగలడ్డాయి మన సెన్సార్లూ, సినిమాలూ

    ఆయనెవరినో ఇవేళ జైలునుండి బెయిలు మీద విడుదల చేస్తారుట, సంబరాలు చేసికుంటున్నారు. ఇదివరకటిరోజుల్లో స్వాతంత్రసమరంలో జైలుకెళ్ళి విడుదలయి వచ్చేరంటే ఓ అర్ధం ఉండేది. ఆమధ్యన ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ ముగ్గురో, నలుగురో మంత్రులు, ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లులేవోచ్ అని సంబరాలు చేసికున్నారుట, తీరా ఆ సంబరాలు పూర్తయే లోపలే, ఆవిడెవరిదో పేరు చేర్చారుట. ఈవేళో రేపో కేంద్రప్రభుత్వం ఓ Ordinance తెస్తోందిట, రాజకీయనాయకులకి సంబంధించినంతవరకూ, వారిమీద ఎలాటి ఆరోపణలు ఉన్నా సరే ఫరవాలేదూ అని ! అందరూ లాలూని రక్షించడంకోసమే ఈ Ordinance అంటున్నారు. కానీ ఆలోచిస్తే , ఈవేళ బెయిలు మీద విడుదలయే ఆయనకోసమే అని కూడా అనుకోవచ్చుగా. ఆయననేమిటీ, దేశంలో ఉన్న రాజకీయనాయకులలో కనీసం నూటికి యాభైమంది మీద ఏదో రకమైన ఆరోపణలున్నాయే, వాళ్ళందరూ ఎన్నికల్లో నిలబడి మనల్నందరినీ ఉధ్ధరించొద్దూ?

   అందుకే మేరా భారత్ మహాన్..

Advertisements

6 Responses

 1. Guruvu Garu, country is going to dogs. Cant do anything.

  Like

 2. మేం కాలేజ్ లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపాల్ గారు ఓ జోక్ చెప్పారు. ఇది బ్రిటిష్ ఇండియా రోజుల్లొ ఎవరో ఆంగ్లేయుడు అన్నాడని కూడా మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు. ఆయన చెప్పినదేమిటంటే :

  What is the difference between a criminal and a politician ? అని అడిగితే ఆ ఆంగ్లేయుడు చెప్పాడన్న సమాధానం : A criminal commits the crime and goes to jail. A politician goes to jail and then commits crimes.

  (గుర్తున్నంత వరకు వ్రాసాను. విని చాలా సంవత్సరాలయిపోయింది.)

  ఇంతకీ ఇది జోక్ మాత్రమేనా అంటారా ?

  Like

 3. చందూ,

  మరీ అంత అన్యాయం అనుకోను.. రాజకీయాల్లో ఏదైనా మార్పనేది వస్తే బాగుపడుతుందేమో. కానీ అదే కదా పెద్ద సమస్యా…ఎంతైనా మనం ఆశావాదులమే కదా చూద్దాం…

  నరసింహరావుగారూ,

  “A politician goes to jail and then commits crimes.” అంతగా కరెక్టుకాదేమో. వాళ్ళు కూడా నేరం చేస్తేనే జైలుకెళ్తారు. అయినా నూటికి ఏ పదిమందో తప్ప, మిగిలినవారికి ఈ నేర ప్రవృత్తి అనేది ఓ “వృత్తి” లాటిదేమో. …అది జోక్ అనుకోడానికి వీలులేదు.. పచ్చినిజం..

  Like

  • ఫణిబాబు గారూ, నేను ముఖ్యమైన భాగం చెప్పటం మర్చిపోయానని అర్ధమయింది, సారీ (చెప్పానుగా, నేను విని చాలా సంవత్సరాలయిందని). అసలు సంగతి, ఈ కథ బ్రిటిష్ ఇండియా కాలం నాటిది. ఆ కాలపు ఇండియన్ పొలిటీషియన్ల మీద మాత్రమే ఆ ఆంగ్లేయుడి విసురు (ప్రపంచంలోని అందరు పొలిటీషియన్ల గురించి కాదు). ప్రశ్నలో కూడా అంతే – క్రిమినల్ కి ఇండియన్ పొలిటిషియన్ కీ మధ్య తేడా ఏమిటని.

   ఇహ పోతే, ముందు జైలుకెళ్ళి రావటం విషయానికొస్తే : ఆ నాటి మన రాజకీయ నాయకులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని అరెస్ట్ అయి జైలుకి వెళ్ళేవారు కదా. వేరే ఏ నేరమూ చేయకపోయినా ఈ కార్యకలాపాల వల్ల మాత్రం జైలు తప్పేది కాదు. అటువంటి నాయకులు కొంతమంది క్రమేణా అవినీతికి అలవాటు పడ్డారనే అర్ధంలో ఆ అవినీతి పనుల్నే “నేరాలు” (“crimes”) అని చెప్పటం దీనిలోని భావంగా తోస్తున్నది. ఆ అర్ధంలోనే, ముందు జైలుకి వెళ్ళి, తర్వాత “క్రైంస్” చేస్తారని వర్ణించినట్లున్నారు. వీళ్ళ విషయంలో నేరాలు అంటే అవినీతే గాని మామూలు నేరస్ధులు చేసే హత్యలు, దోపిడీలు వగైరా కాదు. అప్పటి సమకాలీన కోణంలో ఈ కథ బాగా అర్ధమవుతుంది. ఈ మాట నేను మొదటే చెప్పవలసింది.
   (నేను మొదట చేసిన అసలు వ్యాఖ్య కంటే ఇప్పుడు ఇచ్చిన ఈ కొసరు – వివరణ – ఎక్కువగా ఉంది కదా. కాని పాయింట్ వివరించే ప్రయత్నం చేసానని ఆనందం.)

   ఏతావాతా, మన దేశంలో అవినీతి కొత్తేమీ కాదు. అయితే, ఇప్పుడు పూర్తిగా సిగ్గు విడిచేసినట్లుగా అనిపిస్తోంది.

   Like

 4. ఇంకా “మేరా భారత్ మహాన్” ఎందుకండి?
  “మేరా భారత్ బేమాన్” అని సిగ్గు లేకుండా ఒప్పేసుకుందాం.

  Like

 5. నరసింహరావుగారూ,

  మీరన్నట్టు “కవిహృదయం” అర్ధం అయింది…

  బోనగిరి గారూ,

  దురదృష్టం ఏమిటంటే ఈ అతితక్కువ రాజకీయనాయకుల ధర్మమాఅని, జాతి జాతంతటికీ చెడ్డపేరొస్తోంది. Its an occupational hazard..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: