బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    అన్నిటిలాగే మన మాతృభాష ఏమిటో గుర్తుచేసికోవాలననుకుంటా, “తెలుగుభాషా దినం” అని ఒకటి మొదలెట్టారు. మిగిలిన “దినాల్లాగే” ఇదీనూ.ఆ ఒక్కరోజే మన మాతృభాష గురించి గుర్తుచేసికోవలసిన దుస్థితి వచ్చిందీ అంటేనే చాలు, తెలుగుభాషయొక్క పరిస్థితి ఎలా ఉందో? ఏదో తెలుగువారందరూ ఒకే ఛత్రం క్రింద బ్రతుకుతారూ అని, ప్రత్యేక రాష్ట్రాన్ని సంపాదిస్తే, ఆ సంతొషం కూడా లేకుండగా చేస్తున్నారు, మన రాజకీయనాయకులు. ఏదో ఎవరి స్వార్ధం వారు చూసుకోవడమే కానీ, సామాన్య ప్రజలకి విభజన ఇష్టమా లేదా అనిమాత్రం ఆలోచించడం లేదు. ఎక్కడో ఇంకో రాష్ట్రంలో ఉంటున్నావూ, నువ్వుకూడా మాట్టాడడమేనా అని కొంతమంది అనొచ్చు. కానీ ఏ రాష్ట్రం అని చూసుకోకుండా, తెలుగుభాషమీద అభిమానంతోనే కదా, ఏదో నాకు తెలిసినది మీతో పంచుకుంటున్నానూ?

    ఈ సందర్భంలో ఏనాడో శ్రీశ్రీ గారు వ్రాసిన వ్యాసమొకటీ, శ్రీ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు వ్రాసిన వ్యాసమొకటీ మీతో పంచుకుంటున్నాను.

తెలుగుతనం-శ్రీశ్రీ-ఆనందవాణి-1946

అసలు తెలుగు భాష

Advertisements

10 Responses

 1. వ్యాఖ్యలు ఎక్కువగా పెట్టలేను కాని మీ పొస్ట్ చదవకుండా వారము గడవదు ! మీ రచనా స్రవంతి ఎల్లప్పుడు ఇలాగే కొనసాగించలని ప్రార్థన. సంకలిని లో మొట్ట మొదటగా మీ పొస్ట చదవడానికి ఉత్సుకత చూపిస్తున్నాను.

  Like

 2. ఒక ఖాళీ టపా తెలుగు భాషా దినానికి అంకితం !

  జిలేబి

  Like

 3. సమీరా,

  థాంక్యూ వెరీ మచ్…

  జిలేబీ,

  దేనికీ ఈ ప్రొటెస్టూ ?

  Like

 4. పూజ్యులు ఫణి బాబు గారు,

  తెలుగు భాష దుస్థితికి నిజ్జంగా విచారించాల్సిందే. కాని రాష్ట్ర విభజన అనేది భౌగోళిక విభజన. దానికి భాషకి సంభంధం లేదు. నిజ్జానికి తెలుగుకి ఈ కష్టకాలం ఒక్కరాష్ట్రం గా ఏర్పడ్డాకే మొదలియ్యిన్ది.
  అందరం తెలుగు వాళ్ళమే అని మనం, పక్కింట్లో వాళ్ళు ఒకే చూరు కింద ఉండాల్సిన అవసరం లేదు, ఉండలేం కూడా కదా. అయినా సౌకర్యం కోసం సొంత పిల్లలే వేరు వేరు ఇళ్ళల్లో ఉంటున్న రొజులివి. మీరు ఇది ఒప్పుకుంటారు కదూ. అది మనుషుల, మనసుల విభజన కాదూ కాదూ కాదూ. కేవలం భౌగిళిక సాంస్కృతిక విభజన. ఏమంటారు?. పెద్దలు ఏమైనా భాషా దోషాలుంటే క్షమించండి. భావ అభావాలను దొడ్డ మనసుతో మన్నించండి.

  Like

  • మీ వ్యాఖ్యను బట్టి తెలుగువారు అంతా గత 60ఏళ్ళుగా ఒకే చూరు కిందవున్నారని మీ అపోహ అని అర్థమవుతోంది. మీరు ఎవరి చూరుమీద వున్నారో కాని ఎవరు చూర్లలో వాళ్ళున్నారు, ఎవడి తిండి వాళ్ళు తింటున్నారు, ఎవడి కష్టాలు వాళ్ళు పడుతున్నారు. అలాంటి పిచ్చి అపోహలు పెట్టుకోకండి.

   Like

 5. విద్యాచరణ్,

  “మనం, పక్కింట్లో వాళ్ళు ఒకే చూరు కింద ఉండాల్సిన అవసరం లేదు” ఎందుకు ఉండలేరో నాకైతే అర్ధం అవడంలేదు. విభజన వలన లాభంపొందేది రాజకీయనాయకులు మాత్రమే..మాత్రమే..మాత్రమే. సామాన్యప్రజల మధ్య లేనిపోని వైషమ్యాలు పెట్టిందీ ఈ రాజకీయ నాయకులే అనడంలో సందేహం లేదు. పోనీ మీరు చెప్పినట్టుగా , “సౌకర్యం కోసం సొంత పిల్లలే వేరు వేరు ఇళ్ళల్లో ఉంటున్న రొజులివి. ” – ఉంటున్నాకానీ, ఒకరిమీద ఒకరు బురద చల్లుకోవడం లేదు,ఆ పాయింటు మీరు మిస్సయ్యారు. చివరకి తెలుగుభాష ఒకరినొకరు తిట్టుకోడానికే ఉపయోగిస్తోందని ఆవేదనతో పెట్టిన టపా ఇది.

  జాన్,

  “ఎవడి తిండి వాళ్ళు తింటున్నారు, ఎవడి కష్టాలు వాళ్ళు పడుతున్నారు. ” కరెక్టుగా చెప్పేరు.

  Like

  • ప్రియమైన జాన్ గారు,
   నేను ఒకే చూరు అన్నది ఒకే రాష్ట్రం అన్న అర్థంలో వాడాను. చాల వ్యక్తిగతంగా నా మీద అక్కసు చూపించారు. పిచ్చి అన్న పదం వాడడం లో మీ దాష్టీకం మాత్రమె బయట పడింది. భాష బురద చల్లడానికి నిజంగా ఉపయోగ పడింది.

   ఫణి బాబు గారు,
   విభజనైనా సమైఖ్యమైనా రాజకీయ లబ్ధి అన్నది ప్రధానాంశం. కలిసి ఉంది బురద చల్లుకునే సమయం వచ్చినఅపుడు ఎం చెయ్యాలో తమ లాంటి పెద్దలే సెలవియ్యాలి.

   Like

 6. విద్యాచరణ్,

  ఈ “బురద చల్లుకోడాలు” అనేవి ప్రజల మధ్య ఉన్నట్టులేదు. కొంతమంది స్వార్ధపర రాజకీయనాయకులు ఉసికొల్పడం వలనే, ఎప్పుడూ లేని వైషమ్యాలు వచ్చేయేమో అని నా అభిప్రాయం. ఏదైనా ప్రత్యక్షంగా అనుభవిస్తూన్న మీ పాయింటే కరెక్టు కావొచ్చు. ఇదివరకే ఒక టపాలో వ్రాసినట్టు, ఈ విభజన వలన నాకొచ్చే లాభమూ లేదూ, నష్టమూ లేదు…

  Like

 7. తెలుగు తెలుగు భాయి భాయి !ప్రాంతాలు రెండైనా తెలుగు భాష ఒక్కటే!తెలుగు ప్రజలలో విభేదాలు అడ్డుగోడలు మొలవలేవు!విద్వేషాలు లేవు!హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనడం ధర్మం కాదు!హైదరాబాద్ లాంటి రాజధాని కావాలనడం సరికాదు!ఒక దశాబ్దపు కాలం లో రాజదాని నగరాన్నిసర్వాంగసుందరంగా నిర్మించుకోవచ్చు!అయితే అన్నీ ఒకచోటే దొరికే సూపర్ బజార్ లా నిర్మించుకోకూడదు!రాజధాని మాయాబజార్ కాదు!సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో చేసిన తప్పు మళ్ళీఆంధ్రసీమలో పునరావృతం చేయకూడదు!అభివృద్ధిని వికేంద్రీకరించాలి!జిల్లాల అభివృద్ధిని అలక్ష్యం చేసి రాజధానిని పెంచుకుంటూ పోవడం ఎంతమాత్రం విజ్ఞత కాదు!రెండు తెలుగు రాష్టాలూ అభివృద్ధి చెందుతాయి!తెలుగు భాష తీయందనాన్ని పంచుకుందాం!తెలుగుప్రేమను పెంచుకుందాం!

  Like

 8. సూర్యప్రకాష్ గారూ,

  మీరు చెప్పింది లక్షణంగా ఉంది. మన రాజకీయ నాయకులకి జ్ఞానోదయం అయితే ఎంత బాగుండునో.
  “రెండు తెలుగు రాష్టాలూ అభివృద్ధి చెందుతాయి!తెలుగు భాష తీయందనాన్ని పంచుకుందాం!తెలుగుప్రేమను పెంచుకుందాం!”–excellent

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: