బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–few flying thoughts…


    ఒక్కొక్కప్పుడు “అలక” అనేది ఎందుకు వస్తుందో తెలియదు. ఏదో అనుకుంటాము, అలా కానప్పుడు, అందరిమీదా కోపం లాటిది వచ్చేసి, ” పోనిద్దూ ఎవరెలాపోతే మనకేమిటీ..” అనేసికుని తాత్కాలిక అస్త్రసన్యాసం లాటిది చేసేస్తూంటాము. సరీగ్గా నావిషయంలోనూ అలాగే జరిగింది. వయస్సొస్తే లాభం ఏమిటీ, అన్నీ ఆలోచించుకోవద్దూ, మనం అలిగితే నష్టం ఎవరికీ, నాకేగా.

అసలు ఈ బ్లాగనేది ఎందుకు మొదలెట్టినందుకూ, ఇంట్లో వాళ్ళందరికీ, నా కథలు విని..విని.. బోరుకొట్టేసిందనేకదా, నాకున్న ఇద్దరు మనవరాళ్ళూ, ఓ మనవడూ వాళ్ళ చదువుల్లో పడి, నాతో కబుర్లు చెప్పే టైమే ఉండడం లేదాయె. మిగిలిన ఒక్క మనవడూ ఏదో ఇంకా ప్లేస్కూలుకే పరిమితం అయిన కారణంగా, నామాట వింటూంటాడు. ఓ ఏడాది గడిచిందంటే ఆ ముచ్చటా తీరిపోతుంది.వ్రాయడం మొదలెట్టిన కొత్తలో చాలామంది వ్యాఖ్యల రూపంలో చాలా ప్రోత్సహించేవారు. నేను వ్రాసేది అంతబాగుంటోందా అని బోల్డంత ఆశ్చర్యపడిపోయి, రోజుకో టపా పెట్టేసేవాడిని, మొదటి సంవత్సరంలో. రానురానూ చదివేవారికికూడా విసుగెత్తి, వ్యాఖ్యలు తగ్గించేశారుకానీ చదవడంమానలేదు అని అర్ధం అయింది . నేను వ్రాసే టపాలు నచ్చో, నచ్చకో మొత్తానికి చదువుతున్నారుకదా, మళ్ళీ వ్యాఖ్యలే పెట్టడంలేదని ఏడుపెందుకూ? టపా వ్రాయడమంటే ఏదో copy, paste చేసేయడం కాదుగా, ఒళ్ళుదగ్గరపెట్టుకుని వ్రాయాలి. మనం వ్రాసేది ఇంకోరికెవరినీ కించపరిచేటట్టుగా ఉండకూడదూ, లేనిపోని controversies ఉండకూడదు. నేను గమనించిందేమిటంటే, అంతగా వ్యాఖ్యలు రావడంలేదూ అనుకుంటే, ఏదో ఒక విషయం తీసికుని, దానిని శల్యపరీక్షచేసేసి, మన ” స్వంత” అభిప్రాయాలని, అవతలివారిమీద రుద్దేయడం. వ్యాఖ్యలు గోదావరి వరదలా వచ్చేస్తాయి, కానీ, ఆ వరదలో మనమూ, మన బ్లాగూకూడాకొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువలన మన అస్థిత్వం కాపాడుకోవాలంటే, చాలా జాగ్రత్తలు తీసికుంటూండాలి.

ఎందుకొచ్చిన గొడవా అనుకుంటే అసలు ఈ బ్లాగులోకంలోకే అడుగు పెట్టకూడదు. అథవా పెట్టినా “ఆటుపోట్లకి” తట్టుకునే సహనమూ, ఓపికా కూడా ఉండాలి. ఇవన్నీ after thought గా వచ్చేవేలెండి. ఏదో శ్రమ పడి ఓ టపా పెట్టేమనుకుంటాము, మర్నాడు ప్రొద్దుటే లేచి కంప్యూటరు తెరిస్తే ఒఖ్ఖ వ్యాఖ్యకూడా కనిపించదు, పోనీ చదవలేదా అనుకుంటే, దేశవిదేశాల్లో వందలకొద్దీ చదివినట్టు తెలుస్తుంది. మరి అంతమందిలోనూ ఒక్కరికీ నచ్చలేదా, అని కొద్దిగా నిరాశా, నిస్పృహా కలగడం సహజం. పోనీ అలాటి విషయాలు, ఏదో ఒకటపారూపంలో పెట్టగానే, మన టపా అభిమానులుంటారే వాళ్ళందరూ, ఎవరికివారే-” మీ టపాలు నచ్చకపోవడమూ అనే మాటే లేదూ..” ” ప్రతీసారీ మీటపా అద్భుతమూ, అజరామరమూ..blah..blah..” అని వ్రాయడానికి కూడా బాగుండదూ..” అని కొందరూ,” మీరుకూడా వ్యాఖ్యలకోసమే వ్రాస్తున్నారంటే చాలా బాధగా ఉందీ..” అని జ్ఞానబోధలుకూడా, వ్యాఖ్యల రూపంలో పెట్టేస్తారు. కొంతమందైతే గీతాసారం బోధిస్తారు. నీవు చేసేదేదో చేసేయ్ ప్రతిఫలం ఆశించొద్దూ అని. చెప్పడం వరకూ బాగానే ఉంటుంది. కానీ మనం ordinary mortals సారూ. తన రాతలకి ఓ గుర్తింపనేది ఉంటుందనేకదా వ్రాస్తాడు, అదికూడా కరువయ్యేసరికి, బ్లాగులోకానికి దూరదూరంగా జరిగిపోతాడు పోనీ వ్యాఖ్యలు పెట్టడానికి అంత టైములేకపోతే, టపా చివరలో ఉండే ” ఈ టపా ఇష్టపడేవారి..” మీద ఓ నొక్కైనా నొక్కొచ్చుగా, ఇలా ఎన్నో మార్గాలున్నాయి టపానచ్చినట్టు అభిప్రాయం వ్యక్తీకరించడానికి.

చిన్నపిల్లలకైనా సరే ఓ “శభాషీ” (pat on the back) ఓ దివ్యౌవుషధం లా పనిచేస్తుంది. ఈ టానిక్కులు కరువౌవడంతోనే, చాలామంది రచయితలు బ్లాగులోకం వదిలేసి, ఇతరరచనా వ్యాపంగాల్లోకి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారేమిటీ, వెళ్ళిపోయారుకూడానూ. పోనీ వ్రాయడం మానేశారా అంటే అదీకాదూ, ఇంకొక “వేదిక” ఎంచుకున్నారు. వ్రాయకలిగేవారు ఎక్కడైనా, ఎప్పుడైనా వ్రాయకలరు. దానికి సందేహమూ లేదు, ఇంకొకరి సర్టిఫికేట్ అవసరమూ లేదు.

పైన చెప్పినవన్నీ, నేను వ్రాసే టపాలకి వ్యాఖ్యలు రావడంలేదని చెప్పడంలేదు.ప్రస్తుతం బ్లాగులోకంలో జరుగుతున్న “emotional athyaachaar”. ఇవన్నీ చదివేవారికి చేదుగా ఉండొచ్చు. కానీ అక్షరసత్యాలు. అలాగని అసలు టపాలకి వ్యాఖ్యలే లేవనడానికీ లేదూ, ఈ బ్లాగులోకంలో ఓ చిత్రం ఉంది, ఒక్కొక్క రచయితకీ ఓ ‘fan club’ లాటిదుంది. సినిమావాళ్ళకి ‘అభిమానసంఘం’ లాగ.. ఈ అభిమానసంఘాలవారు, వారికి నచ్చే టపాలే చదివి, వాటిల్లోనే తమ సంతొషాన్ని వ్యాఖ్యలరూపంలో వ్యక్తపరుస్తూంటారు.” అవునూ, మాకు నచ్చినవాటినే చదువుతామూ, అస్వాదిస్తామూ, మీకేం వచ్చిందీ, మీకు వ్యాఖ్యలు ఎండిపోయాయని కుళ్ళూ..” అనొచ్చు. కాని ఇలాటి పధ్ధతివలన చివరకి జరిగేదేమిటంటే, ఈ ‘limited ‘ వ్యాఖ్యలూ,వ్యాఖ్యలు పెట్టి పెట్టి , ఈ వ్యాఖ్యలు పెట్టేవారికీ విసుపువచ్చేస్తుంది. అసలు మన మాతృభాషలో బ్లాగులు ప్రారంభం అయిందెందుకూ, వ్రాయడంలో ఏ కొద్దిగానో నేర్పు ఉన్నవారు, తమకు తోచిందేదో వ్రాసి, చదివేవారికి ఓ change of scene సృష్టించాలనే కదా. దీనివలన వ్రాసేవారికి భాషలో పట్టూ, చదివేవారికి ఓ కొత్తవిషయం తెలిసిందన్న ఆనందమూ కలగాలనేకదా. సరే మీభాషా పటిమకోసం మమ్మల్ని హింసించడం ఎందుకూ అనికూడా అనొచ్చు. పైనే చెప్పాను, వ్రాయకలిగేవాడు ఎక్కడైనా వ్రాయకలడు.

ఇలా పైన వివరించిన భావాలన్నీ కలగాపులగం అయిపోయి, గత పదిపదిహేను రోజులుగా, అసలు ఒక్క టపాకూడా పెట్టకూడదని నిశ్చయించేసికుని, ఆ సందర్భంలోనే అంతర్జాలం లో ఈమధ్యన కొత్తగా వస్తూన్న గోతెలుగు.కాం లో వ్రాయడం మొదలెట్టాను. వారికీ నేను వ్రాస్తూన్న వ్యాసాలు నచ్చి, ప్రచురిస్తున్నారు. అవేవో కొత్తగావ్రాస్తున్నవీ కావు, నిజజీవితంలో మనకి అనుభవమయ్యే సంఘటనలే, ఇలాటివి గత నాలుగేళ్ళలోనూ నా బ్లాగుల్లో కూడా వ్రాశాను.ఇదివరకు వ్రాసినవాటి పోలికలు కొద్దిగా కనిపించొచ్చు, కానీ అలాగని వాటికి నకలుకూడా కాదు. అవేసంఘటనలని కొద్దిగా refresh చేసి , ఇంకొద్దిగా జోడించి, ఓ కొత్త దృష్టికోణం లో వ్రాస్తున్నాను. సంఝాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం కూడా లేదు. అలాగని ఈయనకే వ్రాయడం వచ్చూ పేద్ద గొప్పా.. అనే అహంభావంతో వ్రాస్తున్నాననిమాత్రం అపార్ధం చేసికోవద్దని మనవి. నాకూ తెలుసు, నేను వ్రాసేదాంట్లో ఏమీ గొప్పగొప్ప విషయాలుండవూ, ఏదో కాలక్షేపానికిమాత్రమే వ్రాస్తున్నవీ అని. తెలుగుబ్లాగులోకంలో వ్రాస్తూన్న అతిరథ మహారథులతో పోల్చుకుంటే నా స్థానం చిట్టచివరనే ఉంటుందనీ తెలుసు.

టపాలు పెట్టడం తగ్గించేసి, ఆమధ్యన నా టపాల్లో పెట్టిన కొన్నిలింకుల్లో లభించే , అద్భుతమైన మేలిమిబంగారం లాటి, పాతపుస్తకాలు చదవడం ప్రారంభించాను. ఒక్కోటీ చదువుతూంటే కొత్తకొత్తవిషయాలు తెలియడం మొదలయింది. నాకు సాయం, మా ఇంటావిడకూడా ఓ పుస్తకం చదవడమూ, పక్క గదిలో ఉన్న నన్ను పిలిచి ” ఏవండోయ్ మీకు ఈ విషయం తెలుసో తెలియదో, ఫలానా వారు ఫలానా వారితో ఇలాగన్నారుట..” అంటూ, నేను పుట్టకపూర్వం జరిగిన విషయాలనీ, జరిగిన సంఘటనలనీ ,నాతో పంచుకోవడం మొదలెట్టింది. ఎవరైనా ఏదైనా కొత్తవిషయం తెలిసికుంటే, ఆ విషయాన్ని ఇంకొకరితో పంచుకుంటే వచ్చే ఆనందమే వేరు. ప్రస్థుతం మేమిద్దరమూ ఒకరు తెలిసికున్న విశేషం ఇంకోరితో చెప్పుకోవడానికే పరిమితం అయింది.అలాగని ఒకానొకప్పుడు నా టపాలు చదివి , నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన నా అభిమానపాఠకులతో పంచుకోపోతే ఎలా, అనుకున్నాను.

అందువలన సన్యసించడం మానేసి హాయిగా నేను ,మా ఇంటావిడా చదివిన ఓ కథో, ఓ poitical commentary యో, ఏ ప్రముఖ రచయిత గురించి ఓ వ్యాసమో, మాకేది నచ్చితే దాన్ని నాటపాలో జోడించి మీఅందరితోనూ పంచుకోవాలని నిశ్చయించేసికున్నాను. ఈమధ్యన దొరికిన ఖజానా అంతా ఇంతా అమూల్యమైనదనుకుంటున్నారేమిటీ, మీ అందరికీ వాటన్నిటినీ ఓపెన్ చేసి చదివే సావకాశం ఎలాగూ ఉండదు. కానీ అలాగని వాటిని అందరూ చదవలేదే అనే ఓ లోటుకూడా ఉండకూడదనే అభిప్రాయంతో ఇటుపైన ప్రతీ టపాలోనూ ఒకటి జోడించదలుచుకున్నాను. అలాగని అవన్నీ మీకూ నచ్చాలని లేదు. నా పనేదో నేను చేసికుంటాను. ఆ పరంపరలో మొదటగా…శ్రీ మునిమాణిక్యం వారు వ్రాసిన “అల్లుళ్ళు” చదవండి. ఎలాగా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ అల్లుళ్ళ గొడవలే ఎక్కువగా వింటున్నాము.

మునిమాణిక్యం అల్లుళ్ళు

Advertisements

19 Responses

 1. కనిపించిన ప్రతిటపా చదవలేము
  చదివిన ప్రతిటపా మెచ్చుకోలేము
  మెచ్చుకున్న ప్రతిటపా కి కనెక్ట్ అవలేము
  కనెక్ట్ అయిన ప్రతిటపాకి కామెంట్ రాయలేము
  కామెంట్ రాసిన ప్రతిటపాను ఫాలో అప్ చేయలేము అనేది బ్లాగ్ భగవద్గీతాసారము :-))

  హహహ ఏదో పిల్లాట బాబాయి గారు 🙂 మొన్నటి మీ అమృతోత్సవం టపా నచ్చి ఆ లింక్ తో సహా నా మిత్రులతో షేర్ చేస్కున్నాను కానీ ఇక్కడ మీ బ్లాగ్ లో మీకు ఒక థాంక్స్ కూడా చెప్పలేదు అందుకే కొంచెం గిల్టీఫీల్ తో ఈ కామెంట్ రాస్తున్నాను. మీరు రాసిన ప్రతి మాటతో ఏకీభవిస్తున్నానండీ. నచ్చిన టపాకు ఏదో రూపంగా మెచ్చుకోలు అందజేయడం ముఖ్యమే.. నావరకూ నేను మాత్రం నా బద్దకానికి బిజీ అనో మరోటో పేరు తగిలించుకుని ఇలా గడిపేస్తుంటాను, ఇకపై మారడానికి ప్రయత్నిస్తానండీ.

  Like

 2. sir, liking ur post means i must log onto the site. just laziness for it n for writing a response, it’s tough to type in

  Like

  • tough to type telugu.not sure if u like english.i really like ur blog a lot, see it regularly too. makes me feel great to see this blog.

   Like

  • మంచి విషయాలు 100 మందికి చెప్పండి. 80 మంది వింటారు. 60 మందికి మనసులోకి వెళ్తుంది. 40 మంది ఆచరిద్దా మనుకొంటారు. 20 మంది మొదలుపెడతారు. 10 మందే బాగుపడతారు. మన ఒక్క రచన వలన, మన ఒక్క మాట వలన 10 మంది బాగుపడితే చాలదా !! చాలు.

   Like

 3. బ్లాగ్ గురువుగారికి,
  నమో! నమః. మీరూ ఇలా అంటే మాలాటి అర్భకులమేమైపోవాలంటారు?. మీరేదో కొత్తగా మొదలెట్టినట్లున్నారు :). గురువుకి చెప్పగలవాడను కాను కాని, ఒక్క మాట మనం మరొకరిని కామెంట్ చేస్తే వారు మనల్ని కామెంట్ చేస్తారు, అంతే, సింపుల్. 🙂

  Like

 4. Bash on regardless, more the merrier.
  Phani babu garu,behind u we r here.

  Like

 5. వేణూ శ్రీకాంత్,

  సరీగ్గా నేను వ్రాసినట్టే ‘ గీతాబోధ’ చేసేశారు… ఈ వ్యాఖ్యలవలన ఒరిగేదేమీ లేదు. ఏదో పరిచయస్థుల యోగక్షేమాలు తెలిసికోవడం తప్ప. ఈరోజుల్లో కమ్యూనికేషన్ అన్నది అంతర్జాల మాధ్యమంలోనే కదా, ఈ వ్యాఖ్యలు కూడా, Twitter, Facebook లకు ఏమీ తీసిపోవనే అభిప్రాయంతో పెట్టిన టపా ఇది. మరీ సీరియస్సుగా తీసేసికుంటే ఎలాగా?

  Saram,

  I appreciate your sentiment and thank you very much…I write few posts occasionally, as a wake up call. Idea is just to say hi.. to my well wishers…

  శర్మ గారూ,

  మీరన్నది కొంతవరకూ నిజమే. అప్పుడప్పుడు ఇలాటి టపాలు పెట్టినప్పుడైనా పాథకులకి గుర్తొస్తాము కదా అని. ఇంక నేను వ్యాఖ్యలు పెట్టడం అంటారా, చదవడం అయితే ప్రతీదీ చదువుతానే. అదేమిటో కానీ, నాకు light గా ఉండేవిమాత్రమే నచ్చుతాయి. అలాటి టపాల్లో నా వ్యాఖ్య తప్పకుండా కనిపిస్తుంది.
  మరి అలాటప్పుడు నేను వ్రాసేవి light గా ఉంటాయా అంటే, మరీ సీరియస్సు గా ఉండవేమో అనే నా అభిప్రాయం. బహుశా వీటిల్లో కూడా “వంతులు” ఉంటాయని తెలియకపోవడం తప్పే. నేను వ్యాఖ్యలు ఆశించేది, నా టపా గొప్పతనం చెప్పాలని కాదు, పైన వ్రాసినట్టుగా, మిత్రుల యోగక్షేమాలు తెలిసికోవడానికి మాత్రమే. ఈ బ్లాగు కూడా ఓ వేదికే గా…

  డాక్టరు గారూ,

  Thanks a lot…

  Like

  • హహహహ అంతేనంటారా మీరెలా చెప్తే అలాగేనండీ 🙂 మరీ సీరియస్ గా తీస్కోలేదులెండి కానీ టైమింగ్ అలా కరెక్ట్ గా కుదిరిందనమాట.

   Like

 6. మీరు చెప్పింది నూరుశాతం నిజం. మీ కబుర్లు బాగుంటాయి. కామెంట్ చేసినా, చెయ్యకపోయీనా నేను మాత్రం మీ ప్రతీ పోస్టూ చదువుతాను.

  Like

 7. Sir, I read your blog a lot. Almost daily I check if you had posted new ones or not. But I dont comment sir regularly sir.
  చిన్నపిల్లలకైనా సరే ఓ “శభాషీ” (pat on the back) ఓ దివ్యౌవుషధం లా పనిచేస్తుంది.
  I will remember this line and keep commenting sir.

  As usual, very nice post 🙂

  Like

 8. ఆఫీస్ వర్క్ లో చిరాకు పుడితే appleinsider.com , మీ బ్లాగ్ మాత్రమే సార్ నేను చూసేది.

  మీ ముచ్చట్లు చాలా బాగుంటాయి.

  Like

 9. కిశోర్,

  పోన్లెండి… చదువుతున్నారుగా.. ధన్యవాదాలు….

  చందూ,

  ముందుగా thanks a lot. అయినదానికీ, కానిదానికీ వ్యాఖ్యలు పెట్టమని కాదు నేను చెప్పేది. పైన వ్రాసినట్టుగా, పరిచయస్థుల యొగక్షేమాలు అప్పుడప్పుడు తెలిసికోవడమే నా ఉద్దేశ్యం. ఎంతైనా, నేను బ్లాగులోకంలో ప్రవేశించినప్పుడు, మీలాటివారి వ్యాఖ్యలే నా ఊపిరి…

  Like

 10. ఫణి బాబు గారి ఒక టపా చదివితే మినిమం రెండు మూడు టపా కంటెంట్ లు ఫ్రీ అని చదివే వారం !

  మొట్ట మొదటి మారు అయ్యగారు ఒక్క శీర్షిక మీద టపా రాసే రని హాశ్చర్య పోతే కొంత రిలీఫ్ గా ఆఖర్న టర్నింగ్ పాయింట్ పెట్టారు !

  ఇంతకీ బ్లాగ్ లోక అతి ‘రాధా ‘ మహా ‘రాధా’ లెవరండీ ? నా గురించేనా ఆ పొగడ్తలు !
  జేకే !

  All of us feel this concern some time or the other !

  Some time lament some time give it up for some time and post again – the wheel goes on and moves on !

  I think that’s the beauty of bloggers of telugu world and their positive strength.

  చీర్స్
  జిలేబి

  Like

 11. వేణూ శ్రీకాంత్,

  ఈవేళ ప్రొద్దుటే మీకు ఫోను చేశాను. కానీ switched off అని ఓ కన్నడ సందేశం వచ్చింది…..

  జిలేబీ గారూ,

  “సరిలేకు మీకెవ్వరూ..” అని పాట మొదలెట్టేయమంటారా ?

  I fully endorse your views. Not only positive strength …. but sometimes weakness also…

  Like

 12. నేను కూడా చదువుతాను మీ బ్లాగ్ ని రెగులర్ గా బాబాయి గారు…అసలు గమనించారో లెదోగాని,అసలు మీరు చెప్పారనే నేను తెలుగు లొ కస్టపడి comment రాస్తున్న…there will be hell lot of mistakes but I try whenever I can…plz don’t mind my mistakes..and don’t stop writing…plzzzzzzzzz

  Like

 13. ‘ఎద్దూ…..ముళ్లకర్ర……’ సామెతలాగా
  WE ARE LIKE THIS VONLEE……..:-D

  Like

 14. నిరుపమా,

  అదేదో గాలివాటంగా వచ్చిన భావన మాత్రమే. ఒకసారి వ్రాయడం మొదలెట్టినతరువాత, మానడం కూడా కష్టమే. ఇదో వ్యసనం లాటిది. అప్పుడప్పుడు క్షేమసమాచారాలు తెలిసికోడానికి ఇలాటి తిక్క పనులు చేయడం. మా ఇంటావిడ అంటూనే ఉంది, వ్యాఖ్యలు రావడంలేదని వ్రాశారు మీరూ అని. ఆ మాటమాత్రం ఒప్పుకోను. పైగా ఏమైనా అంటే ‘మీ కోనసీమవాళ్ళకి లౌక్యం ఎక్కువా..” అని ఓ రిటార్టొకటీ. ఏం చేయనూ..

  సాహితీ,

  “ఎద్దూ…..ముళ్లకర్ర……’ ” absolutely correct…

  Like

 15. మంచి విషయాలు 100 మందికి చెప్పండి. 80 మంది వింటారు. 60 మందికి మనసులోకి వెళ్తుంది. 40 మంది ఆచరిద్దా మనుకొంటారు. 20 మంది మొదలుపెడతారు. 10 మందే బాగుపడతారు. మన ఒక్క రచన వలన, మన ఒక్క మాట వలన 10 మంది బాగుపడితే చాలదా !! చాలు.

  Like

 16. శాస్త్రి గారూ,

  తెలుగు లిపిమీద పట్టు సాధించేశారన్నమాట !! మరీ రెండేసి సార్లు వ్యాఖ్యలు పెట్టేయాలా ? ( సరదాగానే). మీరు చెప్పిన ఆ ‘పది’ మందికోసమే కదా !!! Thanks..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: