బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ‘మా’ టీవీ లో ఓ మంచి కార్యక్రమం…


    గత పది పదిహేను రోజులుగా తెలుగు చానెళ్ళు చూస్తూంటే, అంతా అగమ్యగోచరంగా ఉంటోంది. ఎవరికి వారే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా, ప్రకటనలు చేసేస్తున్నారు. అక్కడ సీమాంధ్రప్రాంతంలో ఊహించినట్టుగానే ఆందోళనలు ప్రారంభం అయాయి. దీనితో తెలుగు కార్యక్రమాలు చూడాలంటేనే ఒకరకమైన భయం వేస్తోంది. కానీ ఈవేళ “మా” టీవీ లో ప్రసారం చేసిన “అమృతోత్సవం” ఓ అద్భుతమైన కార్యక్రమం గా నిలిచిపోతుంది. ఎన్నో రోజుల తరువాత, సినిమా ప్రభావం లేని ఓ స్వచ్చమైన తెలుగు కార్యక్రమం చూడగలిగే భాగ్యం కలిగింది.

    మూడున్నరగంటలపాటు నిజంగా అమృతమే వర్షించింది.చిన్నపిల్లల పాటల తో మొదలయి,ఓ సుందరమైన నృత్యం, ప్రియా సిస్టర్స్ గానం చేసిన కొన్ని కీర్తనలూ, చివరగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి inspirational ప్రసంగంతో కార్యక్రమం ముగించారు.

    బ్రహ్మశ్రీ చాగంటివారి ప్రసంగం గురించి చెప్పగలిగే తాహతు ఎవరికీ ఉంటుందనుకోను. ఏ విషయం తీసికున్నా, అలవోకగా , అందరికీ అర్ధం అయేటట్టు చెప్పడం, వారిలోని ప్రత్యేకత అని ప్రత్యేకంగా చెప్పాలంటారా? ఆయన ధారణా శక్తి అమోఘం, అద్వితీయం అని వేరే చెప్పఖ్ఖర్లేదు. గోదావరి తీరంలో అలనాడు అపర అన్నపూర్ణ అని పేరుగాంచిన సాధ్వీమణి డొక్కా సీతమ్మగారిని గురించి , బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్తూంటే విని ఆనందించడం మన అదృష్టం.Dokka Seetamma Garu అలాగే గోదావరి ప్రాంతాలని సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి చెప్పిన మాటలూ మొత్తం ప్రసంగానికి ఓ అందం తెచ్చాయి.

    డొక్కా సీతమ్మ గారి గురించి ఆకాశవాణి లో ప్రసారం అయిన ఒక రూపకం క్రింద చదవండి.

DS1

DS2

DS3

DS4

DS5

DS6

   డొక్కా సీతమ్మ గారి గురించి కల్లూరి శైలబాల గారు 2011 లో వ్రాసిన ఒక అద్భుతమైన వ్యాసం ఇక్కడ చదవండి.

16 Responses

 1. ఫణి బాబు గారు,

  ఆ మా ‘టీవీ’ వారి లింకూ ఇద్దురూ !

  జిలేబి

  Like

 2. sir,
  viswanth garu chepppnattu ee progaramme netrostavam

  Like

 3. నిన్న ప్రసారమైన అమృతోత్సవంలో చాగంటివారి ఉపన్యాసం అక్కడక్కడా చూశాను. పూర్తిగా చూడటం కోసం రాత్రి యూట్యూబంతా గాలించానుకానీ దొరకలేదు

  Like

 4. జిలేబీ,

  ఇంకా you tube లో లింకు ఇవ్వలేదు. పెట్టినప్పుడు తెలియచేస్తాను, తప్పకుండా చూడవలసిన కార్యక్రమం.

  వెంకట రమణగారూ,

  అందులో సందేహమే లేదు…

  తేజశ్వి,

  లింకంటూ ఇస్తే నా టపాలో పెడదామని, చాలాసేపు వెదికాను. ఈ విషయంలో మాత్రం ఈటీవీ వాళ్ళని మెచ్చుకోవాలి. వీలున్నంతలో కార్యక్రమం ప్రసారమైన వారంలోపులో యూట్యూబ్ లో upload చేసేస్తూంటారు.కానీ, మా వాళ్ళకి ఈ విషయంలో శ్రధ్ధ తక్కువ ! బహుశా, టీవీ లోనే చూసి, ఆ యాడ్లూ అవీ భరించాలనే కోరికై ఉంటుంది !!

  Like

  • ఫణిబాబుగారూ, వరూథినిగారూ, అమృతోత్సవం వీడియోను మాటీవీవారు ఇవాళ పెట్టారు. చూచి తరిద్దాం రండి.

   Like

 5. ఒకదానితో ఇంకొకదాన్ని పోల్చను కానీ మొన్నామధ్య వరకూ ఈటివిలో ప్రసారమైన ‘స్వరాభిషేకం’.. నిన్నటి మాటివిలో ‘అమృతోత్సవం’ ఈ రెండు కార్యక్రమాల వల్ల పర్వాలేదు ‘కళ ‘ ఇంకా అదృశ్యమవ్వలేదు.. మన చుట్టుపక్కలే తారట్లాడుతోంది అని చెప్పాయి!
  చాగంటిగారి ప్రసంగం మాత్రం ఒక్క క్షణం కూడా మిస్ అవబుద్దికాలేదు.. ‘కష్టానికి పరాకాష్ట ఏంటంటే ఆ కష్టం చెప్పుకోడానికి ఏ ఒక్కరూ లేకపోవడం ‘ అంటూ ఆయన చెప్తున్నప్పుడు ఆ సీతమ్మ పరిస్థితి మీద మళ్ళీ కొత్త దుఃఖమేదో మనసుని భారం చేసేసింది!!

  Like

 6. తేజస్వి,

  నేను వ్రాసిన జవాబుతో ఊరుకోక, మొత్తానికి శ్రమ పడి ఆ లింకు పట్టుకోవడం ఒక ఎత్తైతే, దానిని పాఠకులందరితోనూ పంచుకోవడం ఇంకా బాగుంది. మీరిచ్చిన లింక్ ధర్మమా అని, అందరూ చూడగలుగుతారు. Thank you very much..

  నిషిగంధా,

  స్వరాభిషేకం బాగుంది, కాదనలేము, కా..నీ…అమృతోత్సవం ఇంకా..ఇంకా.. బాగుంది, కారణం ఇందులో సినిమా ప్రభావం అసలు లేకపోవడం వలనేమో అని నా అభిప్రాయం. కానీ మీరన్నట్టు, టివీ లకీ ‘మంచిరోజులు’ వస్తాయేమో చూడాలి….

  Like

 7. చక్కటి వ్యాసం వ్రాశారు. బాగుంది. మీ మూలాన నిన్న మిస్ అయిన అమృతోత్సవం ఇవ్వాళ యు ట్యూబ్ లో చూసాము. థాంక్స్.

  Like

 8. 🙂

  Like

 9. రావుగారూ,

  ఆ కార్యక్రమ link పెట్టిన credit తేజశ్వి గారికి చెందుంది… ధన్యవాదాలు…

  రహమానూ,

  Thanks…

  Like

 10. ఈ మధ్య మీరు భలే మంచి లింకులు ఇస్తున్నారు.
  ధన్యవాదాలు.

  Like

 11. బోనగిరి గారు,

  ధన్యవాదాలు. ఇటుపైన ప్రతీ టపాలోనూ ఒక్కో లింకు జోడిద్దామని ఉద్దేశ్యమైతే ఉంది.. చూడాలి ఎంతవరకూ సఫలమౌతానో…

  Like

 12. Naku dokka seethamma gari gurinchi details kavali

  Like

 13. కిషోర్ గారూ,

  నాకు తెలిసి నెట్ లో నేను సేకరించిన సమాచారాల లింకులు ఈ టపాలోనే పైన పెట్టాను. దయచేసి చదవండి. ఇంకా ఏదైనా అదనపు సమాచారం దొరికితే, వెంటనే తెలియచేస్తాను. ధన్యవాదాలు.పైన ” నీలం” రంగులు ఉన్నచోట ఓ నొక్కునొక్కండి.

  Like

 14. dokka seethammagari gurinchiinkaa maku theliya cheyandi

  Like

  • మూర్తిగారూ,
   నాకు లభ్యమైన లింకులు పై టపాలో పెట్టాను. ఇంకా వివరాలు తెలిసికోడానికి ప్రయత్నం చేస్తున్నాను. దొరకగానే అందరితోనూ పంచుకుంటానని హామీ ఇస్తున్నాను. మీ స్పందనకు ధన్యవాదాలు…

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: