బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకో పదిసంవత్సరాల వరకూ…


     ఈ వారంలో జరిగిన విషయాలు ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సినవే.ఆంధ్రదేశాన్ని విడగొట్టడంలో మీ అభిప్రాయమేమిటీ అని కొందరు అడిగారు. నిజం చెప్పాలంటే,విడగొట్టడం వలన నాకైతే వ్యక్తిగతంగా లాభమూ లేదూ, నష్టమూ లేదూ. కారణం, అక్కడ మాకేమీ ఆస్థిపాస్థులు లేవు. యాభైఏళ్ళయింది మన ప్రాంతం విడిచి, ఉద్యోగరీత్యా, మహరాష్ట్రకి వచ్చి. అభిప్రాయమంటారా, తెలుగువాడిగా, బాధపడ్డది మాత్రం నిజం. ఇంకో భాష అంటే హిందీ మాట్టాడేవారు, తమ రాష్ట్రాలని అన్నేసి భాగాలుగా విడకొట్టినప్పుడు లేని బాధ, ఒక్క తెలుగువారి రాష్ట్రాన్ని విడకొట్టితేనే ఎందుకూ అనొచ్చు. 1956 లో విశాలాంధ్రగా ఏర్పరచడమే తప్పూ అని నా ఉద్దేశ్యం. తీరా ఏర్పాటు చేసిన తరువాత, మరి కోస్తావారు, హైదరాబాద్ లో ఏదో పొడిచేద్దామని, ఉన్న ఆస్థులన్నిటినీ ఇక్కడ పెట్టారు.దానికి సాయం, తెలుగుదేశప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాదు కాకుండా ఆంధ్రదేశంలోని ఇంకో నగరమేదీ, ఆయన దృష్టికే రాలేదాయె. హైదరాబాదంటేనే ఆంధ్రా అన్నంతగా అభివృధ్ధి చేశారు. అందులో సందేహమేమీ లేదు.He paid a heavy price by losing power.

     హైదరాబాదుతోపాటు ఆంధ్రదేశంలోని మిగిలిన నగరాలమీద కూడా శ్రధ్ధపెట్టి ఉంటే, ఈరోజున ఇంత గొడవ జరిగేది కాదేమో.ఏది ఏమైనా, సామాన్యప్రజానీకానికంటే, రాజకీయనాయకులకీ, పారిశ్రామిక వేత్తలకీ, ఈవిషయంలో పట్టింపు ఎక్కువైనట్టు కనిపిస్తోంది. మొత్తానికి 2009 నుండీ,ఆందోళనలు చేయగా చేయగా, మొత్తానికి యు.పి.ఏ. వారు, తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించడానికి అభ్యంతరం ఏమీ లేదూ, అని ప్రకటన చేసేశారు. ఊహించినట్టుగానే, ఈ ప్రకటన వెలువడగానే, ఆంధ్ర,రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ఇలా జరుగుతుందని ఊహించలేదంటారా మన రాజకీయనాయకులూ? తప్పకుండా ఊహించేఉంటారు, కానీ వాళ్ళకు జరిగే నష్టమేమిటీ? బాధపడేది సామాన్య ప్రజలేగా. ఇన్నాళ్ళూ హైదరాబాదులో బంధులూ, ఇప్పుడేమో ఆంధ్రప్రాంతంలోనూ. మొత్తానికి వాళ్ళ పబ్బాలు గడిచినంతకాలమూ, ఎవడు ఎలా పోయినా ఫరవాలేదు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత, వల్లభాయ్ పటేల్ గారు, చిన్న చిన్న ప్రాంతాలని కలపడానికి ఎంత ప్రయత్నం చేశారో కదా. అలాటిది ఈనాటి రాజకీయనాయకులు, ఎన్నెన్ని ముక్కలు చేస్తే, ఎంతంత తినేయొచ్చో అనే కానీ, దానివలన సామాన్యప్రజానీకానికి ఏమైనా ప్రయోజనమనేది ఉంటుందా అని మాత్రం ఆలోచించరు. అసలు కేంద్రంలో గట్టి పార్టీలాటిది ఉండే ఉంటే, ఈ గొడవలే వచ్చుండేవికావు.అసలు ఈ గొడవలన్నిటికీ మూలకారణం, ప్రాంతీయపార్టీలూ, సంకీర్ణ ప్రభుత్వాలూనూ.దానికి సాయం రాజకీయాల్లో చోటుచేసికున్న అనైతికమూనూ.

     ఏదో మొత్తానికి ఓ నిర్ణయం మంచైనా కాకపోయినా తీసేసికున్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఓ అయిదారు నెలలలో ఆంధ్రప్రదేశ్ ని విభజించినట్టే.

     ఈలోపులో ఎవరెవరికి ఎంతంత వాటా వస్తుందో, అదికూడా తేల్చేస్తారు. కానీ ఇంకో పదిసంవత్సరాలదాకా, హైదరాబాదే రెండు రాష్ట్రాలకీ రాజధానిగా ఉంటుందన్నారే అక్కడే అసలు గొడవంతా. రాజకీయనాయకులకి కాదు, వాళ్ళకేమిటీ, ఈ టీవీ చానెళ్ళున్నంతకాలం ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. కానీ law and order విషయంలోనే చికాకులన్నీనూ. ఇప్పటికే హైదరాబాదులో ఎక్కడైనా ఓ నేరం జరిగిందనుకుందాము, ఆ బాధితుడు ఏదో ఒక పోలీసు స్టేషన్ కి వెళ్ళి,FIR చేద్దామనుకుంటే, ఆ పోలీసుస్టేషను వాడు, నేరం జరిగిన ఇలాకా మా పరిధిలోకి రాదూ, ఫలానా స్టేషన్ కి వెళ్ళండీ అంటున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రవిభజన ధర్మమా అని, అసలు ఆ కేసు మారాష్ట్రానికి సంబంధించిందే కాదూ, ఆంధ్రా పోలీసు స్టేషన్ కి వెళ్ళండీ అని చెప్పినా ఆశ్చర్యపోనఖ్ఖర్లేదు. పైగా రోడ్డుమీద ఉండే ఏ పోలీసు ఏ రాష్ట్రానికి చెందినవాడో తెలిసికోవడమూ, వాడికివ్వల్సిన దక్షిణ సరిపోతుందా, లేక ఆ రెండో రాష్ట్రపోలీసుకీ ఇచ్చుకోవాలో తెలియక నానా హైరాణా పడేది సామాన్య ప్రజానీకమే.

     ఏదో ఉదాహరణకి పైవిషయం చెప్పాను కానీ, అలాటి confusions ఎన్నెన్నో తటస్థపడొచ్చు. ఇంక కోస్తాప్రాంతంలో రాజధాని ఎక్కడుండాలీ అనేదానిమీద ఎన్నెన్నో గొడవలుజరిగే అవకాశం ఉంది. కానీ రాబోయే పదిసంవత్సరాలలోనూ ఆంధ్రప్రాంతంలో కూడా ఓ కొత్త రాజధానీ నగరం ఏర్పడి, అదికూడా భాగ్యనగరానికి తీసిపోనట్టుగా అభివృధ్ధి చెందుతుందని ఆశిద్దాం. సర్వే జనా సుఖినోభవంతూ…

     జరిగేవి జరగకా మానవు.వాటిని అనుభవించకా తప్పదు. మనం ఆనందించడం ఎందుకు మానడం? సరదాగా శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారు వ్రాసిన ఈ “పతిభక్తి” కథ చదివేయండి. 1942 లో ఆంధ్రభూమిలో వచ్చింది.KK1,2… లమీద నొక్కుకుంటూ పోతే, అయిదుపేజీలూ చదవొచ్చు.
KK1KK2KK3KK4KK5

     అలాగే నేను గోతెలుగు.కాం లో వ్రాసిన వ్యాసం కూడా చూడండి.

Advertisements

2 Responses

  1. ఇంకో పది సంవత్సరాల వరకూ ఉమ్మడి రాజధాని భుజం భుజం కలిపి తెలుగు తెలుగు కలిసి హైదాబాద్ లో జీవిద్దాం,అప్పటివరకు ఆంధ్రసీమ కు ప్రత్యేక రాజధాని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించుకుని దానిలోకి ప్రవేశించవచ్చును!

    Like

  2. సూర్యప్రకాష్ గారూ,

    అనే ఆశిద్దాం….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: