బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    ఈమధ్యన పేపర్లు చదువుతూంటే మహ ఆసక్తికరంగా ఉంటున్నాయిలెండి. ఈవేళ్టికీవేళ, ఆయనెవరో గుజరాత్ హైకోర్టు CJ ట శ్రీ భాస్కర్ భట్టాచార్య, ఓ బాంబు పేల్చేశారు.. ఈమధ్యన గుజరాత్ లో ఎవరికివారే జాతీయ స్థాయిలో పేరుతెచ్చేసికుంటున్నారు, మొన్నెప్పుడో శ్రీ మోడీ, ఇదిగో ఈవేళ ఈయనా. కథేమిటిటా అంటే, ఈమధ్యన సుప్రీంకోర్టుకి ప్రమోషన్ విషయంలో, ప్రస్తుత ముఖ్య న్యాయాధీషుడు శ్రీ కబీర్ గారు, ఈయన పేరు కొట్టేశారుట. అయినా ఇవేమైనా కొత్తా ఏమిటీ, ప్రభుత్వాలు చేసే ప్రతీ పదోన్నతిలోనూ ఏదో ఒక అవతవక జరుగుతూంటూనే ఉంటుంది.జరక్కపోతే విశేషం కానీ, జరిగితే పేద్ద గొప్పేమిటీ? ఆ గొడవ పక్కకుపెట్టండి, ఈయన చెప్పిన కారణాలు మాత్రం బలే ఆసక్తికరంగా ఉన్నాయి.కబీర్ గారి చెల్లెలు శ్రీమతి సుక్లా కబీర్ సిన్హా గారి ప్రమోషన్( గుజరాత్ హై కోర్టుకి) విషయంలో ఈ భట్టాచార్యగారు పుల్ల అడ్డుపెట్టేరట. ఆయన ఊరికే అడ్డుపెట్టలేదు, కారణాలు స్పష్టంగా చెప్పేరుట ఆనాడే–
1. ఈవిడ B.A. పాసవడానికి నాలుగేళ్ళూ, M.A. పాసవడానికి అయిదేళ్ళూ తీసికున్నారుట. ఇవేమైనా రిసెర్చ్ కోర్సులా ఏమిటీ అన్నేళ్ళు చదవడానికి?
2. ఈవిడ సంవత్సరాదాయం 88,000 ట. ఇంత తక్కువ ఆదాయం వచ్చే అడ్వకేట్లని హైకోర్టు జడ్జీలకింద ప్రమోషన్ ఇవ్వమంటే మరి తిక్క రేగదూ? అరే కోర్టులో పనిచేసే చప్రాసీకే 1,56,000 రూపాయలొస్తూంటే (ఇవి నా మాటలు కాదు బాబోయ్.. శ్రీ భాస్కర్ గారివి !),ఈమాత్రం ఆదాయం వచ్చేవారిని హైకోర్టు జడ్జీకింద ఎలా చేస్తామూ అనేది ఈయన వాదన. ఏదో ఆయన అభిప్రాయం ఏదో ఆయన చెప్పి ఊరుకున్నారు, కానీ ఉపయోగం ఏమైనా ఉందా, అప్పటి CJ, ఈయన వాదాన్ని కొట్టిపారేసి, ఆవిడని గుజరాత్ హైకోర్టు జడ్జీగా చేసేశారు. ఆమాత్రం ఉపకారం చేస్తే కృతజ్ఞత అనేది ఉండాలా అఖ్ఖర్లేదా, ఇప్పుడేమో, మన భాస్కర్ గారి పేరు తప్పించేసి, అప్పుడెప్పుడో తన చెల్లెల్ని ఉధ్ధరించినాయనని సుప్రీంకోర్టుకి జడ్జీగా ప్రమోషన్ ఇచ్చేరుట. అలా ఉండాలి న్యాయస్థానాలూ, న్యాయాధిపతులూనూ… మేరా భారత్ మహాన్… వివరాలు ఇక్కడ చదవండి.శ్రీ భాస్కర్ భట్టాచార్య గారు ఈ విషయంలో చాలా strong పదజాలమే ఉపయోగించారు. వివరాలు నేను వ్రాయడంకంటే, ఆ పేపరులోనే చదవండి.

    మామూలుగా మన ఇళ్ళల్లో ఫోన్లుంటాయికదా, ఎవరెవరు ఎక్కడెక్కడికి ఫోన్లుచేశారో వివరాలుకూడా ఇస్తూంటారుకదా, మరి కేరళ ముఖ్యమంత్రిగారూ, మాజీ రైల్వే మంత్రిగారూ, అసలు ఏమౌతోందో తెలియదూ అంటారేమిటో.. అంతా జగన్మాయ !

    ఈమధ్య సుప్రీంకోర్టు వారిచ్చిన జడ్జిమెంటు ధర్మమా అని, పాపం ఎంతమంది పొట్టలమీద దెబ్బో కదూ? ఇన్నాళ్ళూ జైళ్ళలో ఉండికూడా, ఎన్నికల్లో పోటీచేసిన వారి గతేమిటో పాపం ! My heart goes out for them.. ఏమిటో ఈ సుప్రీంకోర్టోటి మధ్యన. ఏదో జనాల్ని వెర్రివెధవలు చేసి ఆడిస్తున్నారుకదా, మళ్ళీ వాళ్ళ నోళ్ళలో మట్టికొట్టడం ఎందుకో ? ఏమిటో కానీ, మన రాజకీయనాయకులని ఇరుకులో పెట్టేశారు. చూద్దాం, అదేదో RTI విషయంలోలాగానే, రాజకీయనాయకులు above court cases అని ఓ చట్టం పాస్ చేసినా చేయొచ్చు, ఈలోపులో ఓ ordinance ఇచ్చేస్తే, ఏ పార్టీవాడూ నోరెత్తడు !అందరికీ ఉపయోగకరమేగా!!

    ఇదివరకటంత రెగ్యులర్ గా టపాలు పెట్టడానికి సావకాశం ఉండడంలేదు. దానికి ముఖ్యకారణం కూడా నేనే అనుకోండి. ఆమధ్యన అందరికీ ఉపయోగపడతాయని కొన్ని లింకులు ఇచ్చాను గుర్తుందా, ఆ లింకులేమిటో నేనూ చూద్దామని చూస్తే కొన్ని అద్భుతమైన ఆణిముత్యాలు– పుస్తకాల రూపంలోనూ, 1913 నుండీ వచ్చిన ఆంధ్రసచిత్రవారపత్రిక ఉగాది సంచికలరూపంలోనూ, అలాగే యువ, భారతి మాసపత్రికలరూపంలోనూ– దొరికేయి. ఊరుకోవచ్చా, వాటిని download చేసి మా ఇంటావిడకి చెప్పాను. అంతే, ఆ డెస్క్ టాప్ వదలదే. ఏదో చదవడం, ఆ చదివిందేదో నాతో చెప్పడం, అరే అద్భుతంగా ఉందే అని నేనూ చదవడం. మా మిగిలిన జీవితకాలం సరిపోదు వాటన్నిటినీ పూర్తిగా చదవడానికి, అయినా సరే, ఆనాటి సామాజిక పరిస్థితులూ, వాతావరణం అ..బ్బ..బ్బ..బ్బ చదవాలండీ. ఇప్పటిదాకా చదవకపోతే ఇప్పుడైనా మొదలెట్టండి. బ్లాగులవైపూ, టీవీల వైపూ చూడరంటే చూడరు.

బైదవే ఈ వారం గోతెలుగులో నావ్యాసం ఎపార్టు(మెంటాలిటీ) ప్రచురించారు.

5 Responses

 1. అంతా విష్ణు మాయ.ఏమయినా జరగచ్చు సార్! మేరా భారత్ మహాన్

  Like

 2. గో తెలుగు లో మీ వ్యాసం ఒక ఎత్తైతే, అక్కడ పెట్టిన మీ ఫోటో మరో సూపెర్ డూపర్ !!

  చీర్స్
  జిలేబి

  Like

 3. మీ ‘తెలుగును పొమ్మనే’ సైటు వ్యాసా లను ఇక్కడ కూడా పెడితే బాగుంటుందేమో కదా

  Like

 4. అపార్ట్ ‘మెంటాలిటి’ చాలా ప్రాక్టికల్ గా
  ఉన్నదున్నట్లు వ్రాసారు , అది అనుభవించే
  నేను వేరే విడిగా ఉండే ఇల్లు కొని , మారి పోయాను.

  Like

 5. శర్మగారూ,

  మీరన్నట్టుగా అంతా విష్ణుమాయే…

  జిలేబీ,

  చివరకు నా ఫొటో మాత్రమే నచ్చిందంటారా?

  డాక్టరుగారూ,

  ఇదివరకు ఎక్కడా ప్రచురించబడలేదూ అని ఓ హామీపత్రంకూడా ఇచ్చుకోవాలి గోతెలుగువారికి. అందుకే అక్కడ ప్రచురించిన తరువాత లింకు ఇస్తున్నాను.
  ఈరోజుల్లో అందరికీ మీకున్నంత అదృష్టం ఉండదు, ఉందికాబట్టే విడిగా ఇల్లు కొనుక్కున్నారు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: