బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    మెల్లిమెల్లిగా ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న యాత్రీకులని రక్షించి, తమతమ స్వంత ఊళ్ళకి పంపుతున్నారు. ఈ సందర్భంలో మన సైన్య,వాయు,నావికా దళంవారూ, ITBP వారూ చేస్తూన్న సేవలు అద్భుతం. ఏ భాష టీవీ చానెల్ చూసినా, అక్కడినుంచి క్షేమంగా బయటపడ్డవారితో ఇంటర్వ్యూలు, వాటిల్లో వారు పడ్డ బాధలు,అక్కడ వారు పొందిన సహాయమూ గురించి కళ్ళకు కట్టినట్టుగా చెప్పడంతో, మన సైనికుల గొప్పతనం ప్రపంచంఅందరికీ తెలుస్తోంది. ప్రచారమాధ్యమాలు ఈమధ్యన చేస్తున్నవాటిలో ఇది మాత్రం చాలా బావుంది.

    మొన్న వ్రాసిన టపాలో,మనతెలుగు చానెల్ వారొకరు, ఉత్తరాఖండ్ లో వరదలు రావడానికి, ముఖ్యకారణం, అక్కడ కట్టిన, కడుతూన్న జలవిద్యుత్ ప్రాజెక్టులే అని చెప్పినప్పుడు, కొద్దిగా ఆశ్చర్యం వేసింది. అదేమిటీ, ప్రతీవారూ, ప్రాజెక్టులూ..ప్రాజెక్టులూ అని ఘొషిస్తూంటే, ఈ చానెల్ వాళ్ళేమిటీ, అసలు ప్రాజెక్టులే వద్దంటున్నారూ అని. అదే అర్ధం వచ్చేటట్టు, నేను నిజానిజాలు తెలియకుండగా, ఏవేవో వ్రాశాను. కానీ, CAG వారు, 2010 నుండీ మొత్తుకుంటున్నారు. అక్కడ కడుతూన్న ప్రాజెక్టులవలన, పర్యావరణానికి ఎంత నష్టం వస్తోందో తెలియచేస్తూ ఒక రిపోర్టు కూడా సమర్పించారు. మామూలు నివేదికల్లాగే ఇదీ బుట్టదాఖలయింది. ఫలితం- ప్రస్తుతపు devastation. ప్రాజెక్టులకి సంబంధించినంతవరకూ వారి రిపోర్టు ఇక్కడా, పూర్తి రిపోర్టు చదవాలంటే ఇక్కడా నొక్కండి. తెలుస్తుంది.

    కేంద్రప్రభుత్వం వెయ్యికోట్లు సహాయం ప్రకటించిందిట. ఇప్పుడు ఆ వెయ్యికోట్లూ ఎవరికి వెళ్తాయీ? నదీతీరంలో ఎడాపెడా రిసార్టులూ, హోటళ్ళూ కట్టేసిన బడాబాబులకే అనడంలో సందేహం ఏమీ లేదు. చనిపోయినవారికి రెండు లక్షలన్నారు. లెఖ్ఖాపత్రం లేక కొట్టుకుపోయినవారి విషయం ఏమిటీ? వీటికిసాయం, పోయినవారి బంధువులు ఈ compensation పొందడానికి, వారిదగ్గర ప్రమాణపత్రాలు ఎలా చూపించగలరూ? ఆతావేతా తేలేదేమిటీ అంటే, influence ఉన్నవాళ్ళెవరో పంచుకుంటారు. అన్నీ ప్రశ్నార్ధకాలే.

    మన జీవితాల్లో మొబైల్ ఫోన్లు ఎంతగా అంతర్భాగం అయిపోయాయో తెలియడానికి సరదాగా ఈ లింకు చూడండి.

    ఇంకో విషయమండోయ్, కొత్తగా వస్తూన్న అంతర్జాల పత్రిక gotelugu.com లో ఒక వ్యాసం వ్రాశాను.

5 Responses

 1. మరో మిథునం బాగుంది.
  ఎవరు ముందు ఎవరు వెనుక
  ఛాయస్ ఉంటే ఎంత బాగుంటుంది !

  Like

 2. అహ్మద్ గారూ,

  మీరు అప్పుడెప్పుడో ఒక aggregator ప్రారంభించినట్టున్నారు. ఏమిటీ ఎక్కడా కనిపించడంలేదేమిటీ? ఎప్పుడు ప్రయత్నించినా “removed” అనే వస్తోంది, తీసేశారా?
  నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు…

  డాక్టరుగారూ,

  “మిథునం” ఇంకోలా ఉంటే ఎలా ఉంటుందీ ఊహించి వ్రాశాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు…

  Like

 3. poyina vaalaaku govt. ichhe saayam vishayam lo oka pitta katha:
  delhi lo oka peddamanishi ‘maa parents koodaa ee sunami lo gallantayyaaru’ ani register chesaadataa.. ayyo paapam vivaraalu kanukkondaam ani govt vaallu intiki vellaarata.. aa peddamanishi intloledu..aayana bhaarya amaayakamgaa ‘maa attaamaamalu poyi padellayindi’ ani cheppindata…
  mera bhaarat mahaan

  Like

 4. అమరేంద్రగారూ,

  ఇందులో ఆశ్చర్యమేమీలేదు.. రాబోయే రోజుల్లో ఇలాటివి ఇంకా ఎన్నెన్నో వినాల్సొస్తుంది. చివరకి తేలేదేమిటంటే రాబోయే ఎన్నికలకి ఖర్చులకోసం రాజకీయనాయకులు ఏదో పేరు చెప్పి జేబుల్లో వేసికుంటారు !! మీ స్పందనకు ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: