బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “ఈనాడు” వారి భాషా సేవ


   తెలుగులోనే మాట్టాడాలి, తెలుగుభాషని అభివృధ్ధి చేయాలీ అనే స్లోగన్సే తప్ప, ప్రభుత్వం వారు sincere గా చేసే ప్రయత్నం ఏమీ కనిపించడంలేదు. ఏదో ప్రతీ సంవత్సరమూ, ఒక రోజు ని తెలుగుభాషా దినం, మాతృభాషా దినం అంటూ, రవీంద్రభారతి లోనో ఎక్కడో ఓ సభ ఏర్పాటు చేసేస్తే సరిపోతుందా? మామూలుగా ప్రతీవాళ్ళూ చేసే Fathers Day, Mothers Day, Valetines Day ఇంకో సింగినాదం Day ల్లాగే ఇదీనూ. అక్కడెక్కడో అమెరికాలో జరిగే తానాలూ, ఆటాలూ వగైరాల్లో పాల్గొని, అవేవో “జీవితసాఫల్య ఎవార్డులు ” తీసికోడంతో సరిపోయిందనుకుంటారు మన గౌరవనీయ ప్రభుత్వం వారు.. నాకో విషయం అర్ధం అవదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగు సమావేశాలు జరిగినా, ఓ పేద్ద పటాలం వెళ్ళిపోతుంది. వీళ్ళందరి ఖర్చులూ ఎవరు భరిస్తూంటారుట? అయినా మనం అందరం పన్నులు కడుతున్నాము కదా, డబ్బుకి లోటేమిటిలెండి?

    ఓ సెన్సార్ బోర్డనోటుంది.వాళ్ళు సినిమాల్లో చూపించే దృశ్యాలు ఎలాగూ పట్టించుకోడంలేదు, కనీసం ఆ సినిమాల పేర్లైనా తెలుగులో ఉండాలని సూచిస్తే వాళ్ళ సొమ్మేంపోయింది? పైగా సినిమాకి ఏం పేరు పెట్టాలో మేమేం చెప్పగలమూ అంటారు, “పేరు లో ఏముందీ” అంటూ పాటకూడా పాడే సమర్ధులు. ఆ సినిమావాళ్ళూ అలాగే తగలడ్డారు. సినిమాలకి తెలుగులో ఉండే పేర్లు పెడితే అవేవో ఆర్ధికసహాయాలు చేస్తామంటే చాలు, పొలోమంటూ పెట్టేస్తారు. ఆమాత్రం కూడా చేయలేదా ప్రభుత్వం? పక్క రాష్ట్రాలవాళ్ళు చేస్తున్నట్టు చేయడానికి వీళ్ళకేం రోగం? భాషాభివృధ్ధికి ఏమిటేమిటో చేసేస్తున్నామూ అని ఊరికే ప్రసంగాలు చేయడం కాదు. చేస్తున్నట్టు కనిపించాలి కూడానూ.

    ఈ విషయంలో తెలుగుభాషకి కొంతలోకొంత సేవలాటిది చేస్తున్నది రామోజీ ఫౌండేషన్ వాళ్ళేమో అనిపిస్తుంది.ఆయన అంటే రామోజీ గారికి ఎన్ని గొడవలుండనీయండి, భాష విషయంలో మాత్రం సేవ చేయడమే కాదు, వారు చేసేవి అందరికీ అందుబాటులోకి తేవడం. నాకు ఈనాడు పేపరంటే అదేదో అభిమానమేమో అనుకోకండి. వార్తాపత్రికలన్నీ ఏదో ఒక రాజకీయపార్టీకి mouth pieces లే. ఏ పార్టీ అభిమానులకి ఆ పత్రిక నచ్చుతుంది. అందులో వ్రాసినవే వేదాక్షరాల్లాగ కనిపిస్తాయి.

   కానీ పార్టీలకీ, రాజకీయాలకీ అతీతంగా, తెలుగు భాషనే దృష్టిలో పెట్టుకుని, తమకి తోచిన సేవ చేయడంలో ఈనాడు గ్రూప్ వాళ్ళు మాత్రం second to none. వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే. ఇదేమిటీ ఈవేళ ఈయన ఈనాడు గురించి ఇంతలా ప్రశంసిస్తున్నారేమిటీ, వాళ్ళు ఏమైనా డబ్బులు కానీ ఇచ్చారా అనుకోవచ్చు. అలాటిదేమీలేదులెండి, ఉన్నదేదో చెప్పాలనే ఈ టపా. అసలు పుస్తకాలు ఎందుకుప్రచురిస్తారుట, నలుగురు చదువుతారూ, అన్ని విషయాలూ తెలుస్తాయీ అనే కదా. ఆ సందర్భంలోనే తెలుగు సాహిత్యాన్ని అందరికీ చేరువలోకి తెచ్చే ఉద్దేశ్యంతో ఓ రెండు మాసపత్రికలు నడుపుతున్నారు. అవి సరిపోనట్టు ఇంకో మాసపత్రిక కూడా మొదలెట్టారు. దానికి ఓ కొంత వెల పెట్టారు. గత కొన్నేళ్ళగా నెలకీ అతిస్వల్ప (అంటే 10 రుపాయలు) వెలతో, అందరికీ అందుబాటులో పెట్టడానికి ఖలేజా ఉండాలి. మిగిలిన వార మాస పత్రికలన్నీ, ఏదో కారణం చెప్పి ఖరీదులు పెంచేస్తున్న ఈ రోజుల్లో కూడా, ఈనాడు వారు ప్రచురిస్తున్న విపుల, చతుర మాసపత్రికలు ( with so much content) అంత తక్కువ ఖరీదుతో అందరికీ అందుబాటులో ఉంచడం ఈనాడు రామోజీరావుగారికే చెల్లింది. పైగా దేశవిదేశాల్లో అందరికీ లభించవేమో అనుకుని ప్రతీనెలా, ఈ మాసపత్రికల– విపుల చతుర — ల online editions కూడా అందుబాటులో పెట్టారు. డబ్బులే చేసికోవాలంటే ఈనాడు వాళ్ళు ఇలా చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఏదో నలుగురూ చదవాలీ, భాష అభివృధ్ధి చెందాలీ అన్నదే వీళ్ళ ఉద్దేశ్యం.

    ఈమధ్యనే ఇంకొక మాసపత్రిక కూడా మొదలెట్టారన్నానుగా, “తెలుగు వెలుగు” అని, ఏదో అంతర్జాలంలో ఆ పత్రిక గురించి రివ్యూలు చదివి, అరే ఆ పత్రిక ఇక్కడ( పూణె) లో కూడా దొరికితే బావుండేదీ , అనుకుని మా రైల్వే బుక్ స్టాల్ వారిని అడిగాను. ఏదో మా మిత్రుల ధర్మమా అని, ఓ రెండు సంచికలు దొరికేయి పోస్టు/కొరియర్ ద్వారా పంపబడగా, కానీ ప్రతీ నెలా పంపమంటే బాగోదుగా. ఎలాగరా అని ఆలోచిస్తూంటే నిన్నటి గూగుల్ ప్లస్ లో ఎవరో పెట్టిన లింకు గురించి మా ఇంటావిడ చెప్పింది. మొత్తానికి తెలుగు వెలుగు మాసపత్రిక e-edition కూడా పెట్టేశారు.

    ఈనాడు వారు తెలుగుభాషకి చేస్తూన్న ఈ సేవ మాత్రం అభినందనీయం. ఈనాడు యాజమాన్యం వారు ఇంత “బడా దిల్” ప్రదర్సించవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. రెండు మూడు పత్రికలు ప్రచురిస్తున్నాము, దాని వెల ఫలానా కావలిసిస్తే కొనుక్కోండి, లేదా సంవత్సర చందా ఇంత, అని చెప్పేసి వదిలేయొచ్చు. కానీ అలా కాకుండగా, తెలుగు భాషాభిమానులందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వారు ఆ మాస పత్రికల e-edition అందుబాటులోకి తేవడం చాలా బావుంది.

    మిగిలిన తెలుగు పత్రికలు కూడా ఇలా చేయగలిగితే కనీసం అంతర్జాలంలోనైనా తెలుగు భాష అభివృధ్ధి చెందుతుందేమో అని ఓ ఆశ. కారణం print editions కి ఎలాగూ కాలదోషం పట్టింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతర్జాలమే.తెలుగులో ప్రచురిస్తున్న మిగిలిన పత్రికలు కూడా అంతజాలంలో వస్తే ఇంకొన్ని పత్రికలు చదువుకోవచ్చని ఓ చిన్న ఆశ…

8 Responses

 1. గౌ//ఫణిబాబుగారికి మీ బ్లాగ్ను బ్లాగ్ వరల్డ్ లోనికి మెంబర్ గా తీసుకోవడం జరిగింది.బ్లాగ్ వరల్డ్ మరింత డిజైన్ చేస్తున్నాము.అయిన తరువాత దానికి మరింత పబ్లిషిటి కూడా చేస్తాం.లేటెస్ట్ వివరాలకు బ్లాగ్ వరల్డ్ ను విజిట్ చేస్తూ ఉండండి.మీ బ్లాగ్ ఉన్న లింక్.
  http://ac-blogworld.blogspot.in/p/blog-page_10.html

  Like

 2. నిష్టురంగా ఉన్నా నిజాన్ని చెప్పేరు.

  Like

 3. అదేమిటండీ హరేఫేల గారు, మా ఆంధ్ర జ్యోతి ని వదిలిబెట్టేరు ? వారి నవ్య పత్రిక తెలుగు లో ఆన్లైన్ లో పెట్టేరు ?

  రెండు , ఈమాట అన్న ఆన్లైన్ పత్రిక ఒకటి ఉన్నది. నాకు తెలిసినంత లో ఈ పత్రిక తెలుగు అపురూపం .

  http://www.eemaata.com

  అనుకుంటా వీరి లింకు ! ఇంత దాక చూడ కుంటే చూడ వచ్చు .

  ఇక కౌముది, మాలిక , తూలిక బ్లాగ్ లోకం వాళ్లకి పరిచయ మైనదే అనుకుంటా !

  ఆన్లైన్ లో పత్రిక నడపటం ప్రింట్ మీడియా కన్నా సులువైనట్టు ఉన్న కాలం ఇది మరి !
  గో గ్రీన్ !

  చీర్స్
  జిలేబి

  Like

 4. >తానాలూ, ఆటాలూ వగైరాల్లో పాల్గొని, అవేవో “జీవితసాఫల్య ఎవార్డులు ” తీసికోడంతో సరిపోయిందనుకుంటారు
  ద్రవ్యలాభం ఏమి ఉండదు అనుకుంట. ఒక్క శాలువ/పూల గుత్తి/ప్రశంశా పత్రం మాత్రమే ఇస్తారు కదా!

  Like

 5. తమిళ నాడు ప్రభుత్వం తమిళ్ పేరు తో సినిమా తీస్తే టాక్స్ రాయితీ ఇస్తుంది ఇలా ఎన్నో చెయ్యవచ్చు కాని మన రాజకీయ నాయకులకు అంత తీర క లేదు ప్రతిపక్ష్య నాయకులూ మల్లి పదవి కావాలని చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇంకేమి పట్టవు మాతృభాష పరి రక్షణ ఎవరు చెయ్యాలి మరి ??

  Like

 6. అహమద్ చౌదరి గారూ,

  మీరు ఇచ్చిన లింకులో నా టపా చూశానండి. ధన్యవాదాలు.. నా టపా గురించి కొంచం అతిశయోక్తిగా వ్రాశారేమో..

  శర్మగారూ,

  ఏం చేయమంటారు మరి ?

  జిలేబీ,

  I think you missed my point… మీరు చెప్పినవాటి గురించి నాకూ తెలుసు. “నవ్య” గురించి ఇదివరకే వ్రాశాను. ఇంక మిగిలినవాటి గురించంటారా, primarily అవి అన్నీ అంతర్జాల పత్రికలే. వ్రాసింది commercial గా ప్రచురించే పత్రికల విషయం…

  పానీపురి,

  చిరకాల దర్శనం…అక్కడ “దక్షిణ” లు ఏమిస్తారో మీకే తెలియాలి. తెలుగు సమావేశాల పేరు చెప్పి ఓ “ఫుకట్” ట్రిప్పు దొరుకుతోందా లేదా…

  ఉమాబాలు గారూ,

  మీరు చెప్పినట్టు భాష ఏమైతే ఎవరికి పడుతుందీ? వాళ్ళూ, వాళ్ళ పదవులూ సురక్షితంగా ఉంటే చాలు…

  Like

 7. Eenadu vaari telugu velugu pusthakam chadavali ani chaala rojula nunchi anukuntunaa. Link thelipinandhuku thanks Lakshmi Phani gaaru

  Like

 8. దిలీప్,

  నేను పెట్టిన లింకు మీకు ఉపయోగించినందుకు చాలా సంతోషం…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: