బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏమిటో అంతా గందరగోళంగా ఉంది….


    ఏదో వీధిన పడకుండా, నేను వారానికోటీ, మా ఇంటావిడ నెలకో, రెణ్ణెల్లకో ఒకటీ టపాలు పెట్టి కాలక్షేపం చేస్తున్నాము. ఇదివరకటి రోజుల్లో మా దగ్గర Desktop ఒకటే ఉండడంతో కొద్దిగా అభిప్రాయబేధాలు వచ్చేవి. మరీ పెద్ద కారణం కాదూ, ఆ Desktop ముందర, రోజులో చాలా భాగం నేనే కూర్చుంటూ ఉండేవాడిని. ఏ మంచినీళ్ళు త్రాగడానికో లేచినప్పుడు చటుక్కున తనొచ్చి కూర్చొనేది. రోజంతా ఈ musical chairs తోటే సరిపోయేది. భోజనం దగ్గరకూడా అదే తంతు, ఎవరు ముందర భోంచేసేస్తే వాళ్ళు వెళ్ళి కూర్చోడం.

    జ్ఞాపకం ఉండే ఉంటుంది, ఇదివరకటి రోజుల్లో అంటే చిన్నపిల్లలు లక్షణంగా తిండి తినే రోజుల్లో అన్నమాట, అలాగే పోషకపదార్ధాలతో తినే రోజులన్నమాట, టీవీ లూ రిమోట్లూ లేని రోజుల్లో అన్నమాట,కంప్యూటర్లూ అంతర్జాలాలూ లేని రోజులన్నమాట, అమ్మ చేతిముద్దే తినే రోజులన్నమాట, ఇంటినిండా గంపెడు పిల్లలుండే రోజులన్నమాట... అమ్మ అనేది ఇది అమ్మ ముద్దా, ఇది నాన్న ముద్దా, ఇది తాతయ్య ముద్దా, ఇది అమ్మమ్మ ముద్దా, ఇది దేవుడి ముద్దా అంటూ, ఎవరు ముందర బువ్వ తినేస్తారో వాళ్ళకి ఓ అసలు సిసలైన అమ్మ ముద్దూ.. అంటూ. ఆ రోజులలాగుండేవి మరి.

    ఇప్పుడు ఆ ముద్దలూ లేవూ, ఆ అమ్మ ముద్దులూ లేవు. కానీ ఎవరికి వారికే తొందరగా తినేయాలనే అనే concept మాత్రం మిగిలిపోయింది. ఎవరి కారణాలు వారివి, ఎక్కడ చూసినా ఉరకలూ పరుగులూనూ, ఆ మాయదారి టివీ లో సీరియల్ ఏమైపోయిందో అని కొందరికి ఆత్రం, ఏ భక్తి కార్యక్రమాలో పెట్టేసికోవచ్చని కొంతమందికి హడావిడి, ఆ దిక్కుమాలిన క్రికెట్ మాచ్ ఏమైపోయిందో అని కొందరికి ఖంగారు, మొత్తానికి భోజనం చేయడం అనే ప్రక్రియ had gone for a toss.

    మరి మీకెందుకండీ లింగూలిటుకూ అంటూ ఇద్దరే ఉన్నారూ, హాయిగా కలిసి భోజనం చేయొచ్చుగా అనొచ్చు మీరు. పైన చెప్పానుగా ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. కూర్చోడం కలిసే కూర్చుంటాం, మరీ తను ముందరే భోజనం చేసేసే పరిస్థితికి రాలేదులెండి. ఇంకా పూజలూ, వ్రతాలూ చేసికుంటూంటుంది . అయినా భోజనం పూర్తిచేయడానికి రూల్సేవీ లేవుగా, అదిగో ఆ కిటుకు పట్టేసింది.
ఏదో నాలుగు ముద్దలు తినేసి, వెళ్ళి కంప్యూటరు ముందు కూర్చోడం. పైగా స్టవ్ మీద పాలు పెట్టేసి వెళ్ళడం,” ఓసారి చూస్తూ ఉండండీ, పాలు పొంగిపోతాయేమో..” అంటూ ఓ ఆర్డరు పాస్ చేసేసి. తప్పుతుందా మరి, ఆవిడ ఈలోపులో ఆ కంప్యూటరు దగ్గరకి వెళ్ళి కూర్చోడం. అప్పుడెప్పుడో అమ్మాయీ, అల్లుడూ మాకు ఒక Tab ఇచ్చినప్పటినుండీ, పరిస్థితుల్లో కొద్దిగా మార్పొచ్చిందిలెండి.నాతో పట్టింపులేకుండగా, దాంట్లొనే చూసుకుంటోంది. మళ్ళీ దాంట్లో ఓ మెలికోటీ, అందులో ” తెలుగులో వ్రాసుకోవడానికి పడడం లేదు. అవేవో ప్రహేళికలూ అవీ పూరిస్తూంటుందిగా, వాటి గురించన్నమాట. దానికీ ఓ సొల్యూషన్ పట్టాను. ఆ వచ్చిన ప్రహేళికలేవో ఓ print out తీసి ఆవిడకిచ్చేయడం. అవి పూర్తయేదాకా నా జోలికి రాదు. ఏదో ఇలా adjust అయిపోయాము.

    ఆ Tab ని మాత్రం ఇంట్లో wi-fi ఉన్నప్పుడే వాడుకోవాలీ అని ఓ out of court ఒడంబడిక ఒకటి చేసికున్నాములెండి. లేకపోతే బిల్లు తడిపిమోపెడవుతుందని. మళ్ళీ ఇందులో ఇంకో గొడవొచ్చింది. పిల్లలు ఎప్పుడొచ్చినా హాయిగా wi-fi మాత్రం connect అవుతూంటుంది. తన Tab దగ్గరకొచ్చేటప్పటికి అల్లరి పెట్టేస్తూంటుంది. అదేదో వీధుల్లో గాడీలు park చేసికోడానికి, అవేవో తేదీలుంటాయి చూడండి, అలాగ రోజువిడిచిరోజు మాత్రమే ఆ మాయదారి wi-fi connect అవుతూంటుంది. అదేం చిత్రమో మరి !

    అఛ్ఛా ఇవన్నీ ఇలాగుంటూండగా, ఈమధ్యన ఇంకో విచిత్రం కనిపిస్తోంది. అప్పుడప్పుడు తను వ్రాసుకున్న టపాలు అప్పుడప్పుడుTab లో చూస్తూంటుంది, ఏమైనా వ్యాఖ్యలున్నాయేమో అని, అలా ఒకసారి చూస్తూన్నప్పుడు తను వ్రాసిన ఒక టపాలో, తను పెట్టని కొన్ని పదాలు కనిపించాయి, రెండుమూడు చోట్ల. నాకు చూపించిందికాబట్టి కానీ, తను చెప్తే నమ్మేవాడిని కాదు. ఏమో ఎవరైనా తన టపాలు hack చేస్తున్నారేమో అనిపించింది. అయినా నా టపాలు hack చేయడానికి ఎవరికి పట్టిందండీ అంటూనే, ఆ particular టపాకి ఓ screen shot తీసి, అసలు ఈ గొడవలేమిటో అని, మన పాఠకులనెవరినైనా అడుగుదామని, desktop లో చూద్దామని ప్రయత్నిస్తే, అసలు ఏమీ తెలియని అమాయకురాలులా మామూలుగానే ఉంది. ఈ లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుకా అంటారా, లేక మీలో ఎవరైనా విజ్ఞులు కొద్దిగా తెలియచేస్తారా? ప్లీజ్…

    కొన్ని అద్భుతమైన ఫొటోలు చూడాలంటే ఇక్కడ నొక్కండి.

7 Responses

 1. wonderful link. Thank u

  Like

 2. విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా… మేడం గారు ఇంట్లో లేక పోతే అన్నీ మధుర అనబడు wi-fi or wife స్మృతులే గురు గారికి…

  Like

 3. ఫోటోలు చాలా బాగా ఉన్నాయి, థాంక్స్

  Like

 4. మీ గిల్లికజ్జాలు బావున్నాయి . అప్పట్లో వారపత్రిక వచ్చిన రోజు నే చదవాలని ఇటువంటి “వార్”లే జరిగేవి .మీరు చూపిన చరిత్ర చిత్రాలు చాలా చాలా బావున్నాయి .

  Like

 5. శర్మగారూ,

  Thanks…

  విద్యాచరణ్,

  ఏవో లేనిపోని “between the lines” ఊహించేసికోడం బాగోలేదు…..

  డాక్టరుగారూ,

  ధన్యవాదాలు…

  నాగరాణి గారూ,

  కాలం మారింది కదా.. అలాగే కారణాలూ మారుతున్నాయి… ధన్యవాదాలు…

  Like

 6. lines మధ్య అంత gap కూడా లేదు లెండి. కుర్రాళ్ళం కదా మీ ముందు. కించిత్ ప్రథమావేశం
  ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి

  Like

 7. విద్యాచరణ్,

  నేను వ్రాసేవాటిని మరీ serious గా తీసుకోకూడదు…’ఇబ్బంది ‘ ఏమీ లేదు. ఉన్నమాటే కదా…మరీ ఇంకొకరు point out చేసేటప్పటికి భుజాలు “తడుముకోడం” అన్నమాట…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: