బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కావల్సినంత కాలక్షేపం… మీదే ఆలశ్యం మరి…


    గత వారంరోజులనుండీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి “అనుభవాలూ-జ్ఞాపకాలూ” చదవడంలో బిజీ అయిపోయాను(ము), చెప్పానుగా ప్రస్తుతం మాకు “శలవలు” అని. ఆ ముచ్చటా ఇంకెన్నిరోజులూ? 31 వ తారీకుదాకా, తరువాత మా వాళ్ళొచ్చేరంటే మళ్ళీ బిజీ బిజీ..

    ఓ గొడవొదిలింది… ఆ మాయదారి IPL ముంబైవాళ్ళకిచ్చేసి(fixing again?) , కొద్దిగా ఊపిరితీసికోడానికి ఆ మద్రాసీ శ్రీనివాసన్ bought little time. మొదటినుండీ అందరికీ తెలిసిందే ఈ IPL గేమ్సన్నీ ఉత్తి తమాషాలూ అని. అయినా సరే ఎండల్లో పడిపోవడం. పోనిద్దురూ ఎవడిపిచ్చి వాళ్ళకానందం.

    ఈవేళ శ్రీ కందుకూరి వీరేశలింగం గారి 95 వ వర్ధంతిట. ఎప్పటినుండో వారు వ్రాసిన “స్వీయ చరిత్ర” చదవాలని ఉండేది. మా ఇంటావిడ మొత్తానికి నెట్ వెదికేసి పట్టేసింది. మీరు కూడా చదవాలని అనుకుంటే ఇక్కడ నొక్కండి, రెండు భాగాల్లో ఉంది. పనిలోపనిగా ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి ” నా జీవిత యాత్ర” కూడా చదవాలీ అనుకుంటే ఇక్కడ నొక్కేయండి. 900 పైచిలికు పేజీలు, ఆదంతా download చేసి పెట్టాలంటే కొద్దిగా శ్రమతో కూడిన పనాయె. ఆ తిప్పలేవో మీరే పడండి. బైదవే ఈ లింకులు దొరికే చోటికి వెళ్తే ఇంకా మంచి పుస్తకాలు కూడా దొరుకుతాయండోయ్… ఈ స్వియచరిత్రలూ అవీ ఇప్పుడెందుకండీ అంటారా ఇదిగో భక్తి పేజీలు మరి. సరదాగా శ్రీ చాసో గారి వ్యాసం చదవాలనుకుంటారా ఓ నొక్కు ఇక్కడ నొక్కేయండి. కావలిసినంత కాలక్షేపం. ఈవేళ్టికి ఇవి చాలు కదూ…

5 Responses

 1. శ్రీపాదవారి అనుభవాలు-జ్ఞాపకాలూనూ బట్టీ వచ్చేసిందేమో! కందుకూరి, ప్రకాశం గార్ల జీవిత చరిత్రలు చదివేసినవే, మిగిలిన లింక్ లు చూడాలి. లింకులిచ్చి మంచి పని చేసేరు.

  Like

 2. శ్రీ పాద వారి పుస్తకాల్లో నాకు చాల నచ్చింది “చదువు” అనే నవల. కథల్లో :కీర్తి కండూతి నా Favaourite . ఈ మధ్యే మళ్ళీ చదివిన పుస్తకం “కలుపుమొక్కలు”. 20వ శతాబ్దం పూర్వ భాగంలో రాసినవైనా ఇప్పటి పరిస్థితులకు కూడా చక్కగా అబ్బుతాయి. నామట్టుకు నాకైతే శ్రీ పాద ఒక పెద్ద సామాజిక విప్లవకారుడు, దార్శనీకుడునూ. పోయిన్నెల ఏప్రిల్ లో వారి పుట్టినరోజున జ్ఞాపకం చేసుకున్నాము. మళ్లి శ్రీ పాద వారిని జ్ఞాపకం చేసిందుకు కృతజ్ఞతలు గురువుగారు. http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=35&PHPSESSID=416e10e02efb78fa7f8ce50429bb592b దీనిలో వారివి ఇంకొన్ని పుస్తకాల వివరాలున్నాయి.

  http://pustakam.net/?tag=sripada-subramanya-sastry మరియు http://archive.org/search.php?query=creator%3A%22Sri.Sripada+Subramanya+Sastry%22

  పోయిన వారం మరో గొప్ప రచయిత అస్తమించారు. ఆయన పేరు “త్రిపుర”.

  Like

 3. namasste. srepadasubramnaym gari anubhavalu and zapkalu link ivvgalara please. namaste. a.venkataramana

  Like

 4. శర్మగారూ,

  తెలుగులోని అందరు రచయితలనీ ఔపోసన పట్టేసిన, మీలాటి స్థితప్రజ్ఞులకి కాదు మాస్టారూ ఇలాటివి. ఏదో సాదా సీదాగా బ్రతుకుతున్న నాలాటివారికి ఇవన్నీ కొత్తే మరి..

  విద్యాచరణ్,

  ఆ లింకులు తెలుసు.

  రమణ గారూ,

  చివరకి దొరికిందా లేదా?

  Like

 5. “చదువు”, “కీర్తి కండూతి” కొడవటిగంటి వారి రచనలు. నేను తప్పుగా శ్రీ పాద వారికి ఆపాదించాను. దీనికి నన్ను క్షమించాలి. కలుపుమొక్కలు మాత్రం శ్రీ పాద వారిదె. కొడవటి గంటి వారి రచనలు నా అల్ టైం ఫేవరెట్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: