బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మాకూ శలవులే…


   ప్రస్తుతం మాకు వేశవి శలవలు. ఏదో ఉద్యోగాలు చేసేవారికి శలవలంటే అర్ధం ఉందికానీ, తొమ్మిదేళ్ళక్రితం రిటైరయి హాయిగా కొంపలో కూర్చుండే మాలాటి వాళ్ళకి శలవలేమిటా అని ఆశ్చర్యపోతున్నారు కదూ, మరి అందులోనే ఉంది అసలు మజా అంతా..రిటైరయిపొయిన తరువాత అంత పనులేముంటాయీ అనుకోకండి. ఇళ్ళలో ఇంకా పదేళ్ళైనా నిండని మనవలూ, మనవరాళ్ళూ ఉంటే తెలిసొస్తుంది పనంటే ఏమిటో? అలాగని వాళ్ళకేమీ నీళ్ళోయడం, బువ్వ పెట్టడం లాటివి కావు, అవి చూసుకోడానికి అమ్మమ్మలూ/నానమ్మలూ ఎలాగూ ఉన్నారు. ఎప్పుడైనా స్కూలుబస్సునుండి దింపుకోవాలన్నా, ఏ క్రెచ్ లోంచో తీసుకురావాలన్నా, తాతయ్యలే కనిపిస్తారు పిల్లలకి.

    అసలు విషయం ఏమిటయ్యా అంటే, మా అబ్బాయీ,కోడలూ, మనవడూ, మనవరాలూ మూడు రోజులక్రితం బయలుదేరి,holiday tour కి వెళ్ళారు. పిల్లలతో పూర్తి సమయం గడపడానికి, ఈరోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు, ఇలాటివే కదా అవకాశాలూ మరి. మా ఫ్రెండ్స్ ఎవరితోనో ఈమాట చెప్పినప్పుడు, వారన్నారూ ” మీరుకూడా వెళ్తున్నారా..” అని. మేమెందుకండి బాబూ తోకల్లాగ, వాళ్ళేదో పిల్లలకే పూర్తి attention ఇవ్వాలని వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటే, మళ్ళీ తెయ్యిమంటూ మమ్మల్ని కూడా తీసికెళ్ళూ అంటే అసలు అందులో అర్ధం ఉందా? ఇలాటివి తల్లితండ్రులే అర్ధం చేసికుని, పిల్లలు ఏదో “మొహమ్మాటానికి” అడిగినా, ” మాకు అంతంతదూరాలు తిరిగే ఓపిక లేదు నాయనా..” అని సున్నితంగా చెప్పేస్తే, మన గౌరవం మనకీ మిగులుతుంది, వాళ్ళకీ ఈ extra baggage గురించి బాధా ఉండదు. ఎంతంత రిజర్వేషన్లూ, బుకింగులూ చేసికున్నా, ఎక్కడ ఉండే శ్రమ అక్కడుంటుంది. ఈ ప్రయాణాల్లో తినే తిండీ,త్రాగే నీరూ ఒక్కొక్కప్పుడు, ఈ పెద్దాళ్ళకి పడక, ఏదో అనారోగ్యం కలగొచ్చు. వీటికి సాయం ఆ ప్రదేశాల్లో కూడా వీరు చూడాలనుకున్నవి ఆ పిల్లలకి నచ్చకపోవచ్చు, వారికిష్టమైనవి వీళ్ళకి ఎందుకూ ఇప్పుడూ అనిపించొచ్చు.ఏదో తేడా వచ్చి ప్రయాణం అంతా మూతిముడుచుక్కూర్చోడం కంటే హాయిగా ఇంట్లోనే కూర్చోడం సుఖం. అంతగా వెళ్ళాలీ అనుకుంటే విడిగా ఈ భార్యాభర్తా వాళ్ళు చూడాలనుకున్న ప్రదేశాలకి వెళ్ళడం. అప్పుడు మాత్రం ఆ తిండీ, నీరూ గొడవలుండవా అంటారేమో, ఉంటాయి ఎందుకుండవూ, ఓ వయస్సు వచ్చినతరువాత ఇలాటివి తప్పుతాయా? కానీ తేడా ఏమిటీ అంటే, ఇక్కడ శ్రమ పడేది ఇద్దరే భార్యా భర్తానూ, అక్కడేమో నలుగురిని బాధపెట్టాలి. అంతగా ఏ emergency అయినా వచ్చినా, ఓ నాలుగైదుగంటల్లో ఏ కొడుకో, కూతురో వీళ్ళ rescue కి ఎప్పుడూ వస్తారు, ఆమాత్రం ప్రయాణ సాధనాలు ఉన్నాయి ఈరోజుల్లో.

    ఇంకో విషయం ఈ పెద్దాళ్ళు కొన్ని సంవత్సరాలక్రితం వారివారి పిల్లలతో ఇలాటి ” విహారయాత్రల” కి వెళ్ళినప్పుడు, ఎన్నెన్నిసార్లు వాళ్ళవాళ్ళ తల్లితండ్రుల్ని తీసికెళ్ళారుట? కనీసం ఈ రోజుల్లో పిల్లలకి ఆమాత్రం ఆలోచనైనా వస్తోందని సంతోషించాలి. వస్తారా అని అడగడం వాళ్ళ ధర్మం, రామూ అని సున్నితంగా చెప్పేయడం ఈ పెద్దాళ్ళ ధర్మమూనూ.ఏమంటారు? కొంతమందనుకుంటారు, అసలు వాళ్ళు అడిగే ఉండరూ, అది దాచుకోడానికే ఈ కబుర్లన్నీనూ అని. పోనీ వారి సంతృప్తికోసం వాళ్ళన్నదే రైటూ అనుకున్నా, అసలు వాళ్ళనుండి అలాటివి expect చేయడమే తప్పూ అంటాను. అంతగా ఏ విహారయాత్రకైనా వెళ్దామనుకుంటున్నామురా అని ఒక్క మాట వాళ్ళతో అన్నామంటే, కావలిసిన ఏర్పాట్లు నిమిషాల్లో చేసేస్తారు ఈ రోజుల్లో పిల్లలు. ఉన్నదానికి సంతోషించాలికానీ, అదేదో లేదూ, ఇదేదో లేదూ అంటూ ఏడవడంలో అర్ధం లేదు. ఏమో నా అభిప్రాయం చెప్పాను.

   ఆతావేతా తేలిందేమిటంటే, మాకు ప్రస్తుతం వేశవి శలవలూ అని. మూడేళ్ళనుండీ అలవాటైపోయిందేమో, పిల్లలు లేకుండా తోచడంలేదు.మరి ఏదో ఒక కాలక్షేపం ఉండొద్దూ. హాయిగా ఓ పుస్తకం చదువుకోడంలో ఉన్న ఆనందం కంటె ఏమి కావాలి? ఆమధ్యన మన తెలుగు పుస్తకాల treasure ఒకదానిని గురించి ప్రస్తావించాను. కానీ అందులో మనక్కావలిసిన పుస్తకాన్ని సావకాశంగా చదువుకోడానికి download చేసికునే సదుపాయం లేదు అప్పటికి.కానీ ఆ లోటుకూడా తీరిపోయింది నిన్న నెట్ లో చూస్తే. మీకు నేను పైన ఇచ్చిన లింకులోని 23000 పైచిలుకు పుస్తకాలలో ఏవైనా download చేసికోవాలనుకుంటే ఈ లింకు నొక్కి, అందులో వివరించినట్టుగా, ఆ పుస్తకంయొక్క అదేదో 13 digits నెంబరు ని దాంట్లో పెట్టి download మీద నొక్కితే, హాయిగా పుస్తకం నిడివినిబట్టి download అయిపోతుంది. ఎప్పుడు కావలిసిస్తే అప్పుడు చదుకోవచ్చు.
నిన్న కూర్చుని శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి “అనుభవాలూ-జ్ఞాపకాలూ” download చేసికున్నాను.596 పేజీల పుస్తకం. ఒకే sitting లో చదివేయడంకంటే, ఆరారగా చదివి, ఆస్వాదించడంలో హాయి ఎక్కువ.పైగా శ్రీ శాస్త్రిగారి పుస్తకాలు అలా చదివితేనే మజా.ఒరిజినల్ సైటులో కాపీరైట్లూ గొడవా లేవని వ్రాయబట్టి నేను చదువుతున్న పుస్తకాన్ని మీతోనూ పంచుకుంటున్నాను.శ్రీపాద వారి ఆత్మకథఆలశ్యం ఎందుకూ చదవడం ప్రారంభించేయండి మరీ… Happy reading...

8 Responses

  1. Wow!
    Many Thanks for the digital library link sir!

    Like

  2. అంత ప్రస్ఫుటం గా, ఆ పీడీఎఫ్ లో ‘WARNING’ అంటూ ‘కాపీ’ రైటు (!) కనిపిస్తోంటే ,

    కాఫీ ప్రాబ్లెం లేదంటారేమండీ మాష్టారు !!

    విశాలాంధ్ర వాళ్ళు మీ మీద ఏమైన్నా ‘కేసు’ బనాయిస్తారేమో మరి !!
    జేకే !!

    నెనర్లు ఆ లింకులకి !

    (ఇంతకీ శ్రీపాద వారి అపర ‘ఫ్యాను’ అనపర్తి అయ్యవారు ఎమైనట్టు?
    రెండు, శ్రీమాన్, బులుసు వారు ఆ ఏప్రిల్ ఫూల్ టపా ఒకటి పెట్టి కొట్టు కట్టేశారు మళ్ళీ !
    వారూ ఏమైనట్టు ?

    ఈ మధ్య బ్లాగు లోకం లో వీరి కాలక్షేప టపాలు కనిపించడం లేదు ?)

    చీర్స్
    జిలేబి.

    Like

  3. డాక్టరుగారూ, కృష్ణా,

    Thank you very much

    జిలేబీ,

    మీరన్నదీ రైటే. కానీ నేనిచ్చిన సైటులో రెండు రకాల పుస్తకాలున్నాయి
    CopyRight Protected Books
    CopyRight Freed

    అని. నేను పెట్టిన శ్రీపాద వారి పుస్తకం, రెండో కోవకి చెందినది. అయినా కుదరదూ అని ఎవరైనా అభ్యంతరం పెడితే తీసేస్తాను.ఏదో అందరూ ఆనందిస్తారని పెట్టాను కానీ, వ్యాపార దృష్టితో పెట్టినది కాదు.

    Like

  4. laxmi phani gari blogs chala bagunnayi.

    Like

  5. సుజాత గారూ,

    నా టపాలు నచ్చుతూన్నందుకు ధన్యవాదాలు..

    Like

  6. 🙂
    జయహో DLI

    Like

  7. రెహమానూ,

    అనుకుంటూనే ఉన్నాను.. చెప్పా పెట్టకుండా పారిపోతావని.. అనుకున్నంతా అయింది..

    Like

Leave a comment