బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    మొత్తానికి ఇంకో ఇద్దరు కేంద్రమంత్రుల గొడవ వదిలిపోయింది.ఒకడేమో CBI వాళ్ళ రిపోర్టు ముందరే చదివేసి, అందులో ఏవేవో మార్పులు చేశాడుట, అయినా ఆమాత్రం చేయరేమిటీ మరీ? ఏదో ఇదివరకటి రోజుల్లోలా కాకుండా, పత్రికలూ, టీవీ వాళ్ళూ గొడవ పెట్టేస్తున్నారని కానీ, ఇలాటివి ఎప్పుడూ మన దేశంలో జరగనట్టే ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా చేసేది ఇదే కదా. పట్టుబడితే దొంగా, లేకపోతే దొరా. టీవీ ల్లో చర్చాకార్యక్రమాలు( జాతీయ చానెల్స్) చూస్తూంటే, చచ్చే నవ్వొస్తుంది. అవే మొహాలు, అవే arguemeంట్లూ. అయినా ఇవిమాత్రం ఎన్నిరోజులూ, ఇంకోటేదో వస్తుంది, ఈ గొడవంతా తెరవెనక్కి వెళ్ళిపోతుంది.కాలక్షేపానికి మాత్రం లోటు లేదు ! పాపం మన ప్రాంతీయ చానెళ్ళకి మాత్రం, వాళ్ళ ever green topic ఉండనే ఉంది.

    ఇంక రెండో ఆయన, అతని మేనల్లుడుట ఏదో డబ్బులు తీసికుంటూ పట్టుబడ్డాడుట. నాకు ఒక విషయం అర్ధం అవదు, ప్రతీవాడూ CBI- government tool అంటూ ఘోషిస్తూంటాడే, మరీ అధికారంలో ఉండే వారి బంధువుల గురించి, అసలు ఈ రెయిడ్లూ అవీ ఎలా జరుగుతాయో? పోనీ ఎవరో తెలిసీ తెలియక పాపం చేశారే అనుకోండి, మరీ ఇంత గొడవ చేసేస్తారా? అసలు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారూ, ఏదో నాలుగు డబ్బులు చేసుకోవాలనే కానీ, దేశసేవా, ప్రజా సేవ కోసమా ఏమిటీ? ఎంతచెట్టుకంత గాలి అన్నట్టు Railway Board Member అవడానికి ఆ మాత్రం, 10 కోట్లు అడిగితేనే తప్పా? పైగా ఆ మహేశ్ కుమార్ అన్నవాడు అంత డబ్బు ఇవ్వకలిగాడూ అంటే, ఎంతకాలం నుండీ, దేశాన్ని దోచుకుంటున్నాడో?

    వచ్చిన గొడవల్లా ఏమిటంటే ఇదే పవన్ కుమార్ బన్సల్ రైల్వే మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టినప్పుడు, ఒక్కడంటే ఒక్కడైనా వీటిగురించి మాట్టాడాడా? ఎందుకొచ్చిన గొడవలే అని వదిలేశారు.ఇప్పుడు మాత్రం అతను చండీగడ్ లో చేస్తున్నవన్నీ రోజుకోటి చొప్పున బయట పెడుతున్నారు.అయినా ఇవన్నీ ఎన్నిరోజుల్లెండి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఈ దౌర్భాగ్యులే దిక్కు. వీడు కాపోతే వాడి కొడుకో, కోడలో.

    ఇంకో విషయం, ప్రతీరోజూ దేశంలోని జాతీయ చానెళ్ళూ, ప్రాంతీయ చానెళ్ళూ ఏదో ఒక విషయం పట్టుకుని వాడెవడినో పట్టుకున్నారూ, వీడినెవణ్ణో పట్టుక్లున్నారూ అంటూ ఊదరకొట్టేస్తారే, మరి వాడి సంగతేమయిందో, వాడు ఉన్నాడో, పోయాడో వాటి వివరాలు follow up చేసి అందరికీ ఎందుకు తెలియచేయరుట? ప్రతీ రోజూ ఏదో ఒక so called sensational issue చూస్తూనే ఉంటాము. ఓహో అ..లా…గా.. మనం కూడా ముక్కుమీద వేలేసికుని, నోరెళ్ళబెట్టేసికుని,” ఏమిటోనండీ మా.. రో…జు… ల్లో.. ఇలా ఉండేదా అంటూ ఆశ్చర్యపడిపోవడం. Life goes on…

    ఈరోజుల్లో ఎక్కడచూసినా కనిపించేవి ఐపాడ్లూ, ల్యాప్ టాప్పులూ, రెండేళ్ళ పసిపిల్ల దగ్గరనుంచీ ఎవరి చేతుల్లో చూసినా టీవీ రిమోట్లూ, అవేవో చేతులూ, కాళ్ళూ ఊపేసే consoleలూనూ. వేసవికాలంలో చిన్నపిల్లలు ఎండలో బయటకి వెళ్ళకుండా, చేతిలో వీటిల్లో ఏదో ఒకటి పెట్టేస్తే, వాళ్ళ దారిన వాళ్ళు పడుంటారు. అదేకదా ఈరోజుల్లో తల్లితండ్రుల ధ్యేయం. పోన్లెద్దూ ఈ వంకనైనా ఏదో ఒకటి కడుపులో పడేసికుంటున్నాడూ అనేసికుని, చేతిలో ఓ రిమోట్టోటి పెట్టేసి ఆ టీవీ ఎదురుగా కూర్చోపెట్టేయడం. ఇంతంతసేపు ఆ టీవీ ముందరా, చేతిలో ఐపాడ్లూ పెట్టుకుని రోజంతా కాలక్షేపం చేస్తారే, ఆ తల్లితండ్రులకైనా తట్టఖ్ఖర్లేదా, వాటిల్లోంచి వచ్చే radiation ప్రభావం ఎలా ఉంటుందో? పోనీ తెలియకా అంటారా అంటే అదీ కాదు, తెలుసు కానీ ఏమీ చేయలేని చేతకానితనం. పోనీ ఇళ్ళల్లో ఉండే పెద్దాళ్ళెవరైనా ఈ విషయం గురించి మాట్టాడడానికి ప్రయత్నం చేసినా, ఓ పేద్ద గొడవైపోతుంది. మీరోజుల్లో ఇలాటివన్నీ లేవు కాబట్టి అలా అనిపిస్తుంది కానీ, ఈరోజుల్లో ఇవి లేకుండగా రోజే వెళ్ళదు. అసలు నెట్ అనేదే లేకపోవడం ఊహించడానికే భయంకరంగా ఉంది అనేసి నోరుమూయించేయడం. నిజమే ఒప్పుకుంటున్నాము, ఈ టెక్నాలజీ ధర్మమా అని ఎన్నెన్నో తెలుస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్టాడేది, చిన్నపిల్లలకి మరీ అంత చిన్నప్పటినుంచీ, వాటికి బానిసలుగా చేయడం మనకి ధర్మమేనా అని. ఊరికే చాదస్థం అనుకోకుండా ఇక్కడ ఒకసారి దృష్టి పెట్టండి.

    ఇలాటివన్నీ మాకు తెలియదనుకుంటున్నారా, ఎప్పుడో తెలుసు.. కా…నీ…. ఏం చేయమంటారు? మాకా పిల్లలతో గడపడానికి టైమే ఉండదు. మా ఉద్యోగాలలో తిండి తినడానికి కూడా టైముండదు. ఇంక పిల్లలంటారా వాళ్ళక్కూడా ఏదో కాలక్షేపం ఉండొద్దూ?ఎంత దేవుడూ, కర్మ లగురించి ఎలా మాట్టాడినా, సడెన్ గా దేవుడు గుర్తుకొచ్చేస్తాడు. పోనిద్దురూ నారు పోసినవాడు నీరుపోయడా ఏమిటీ మీరు మరీనూ.. ప్రపంచం చాలా ఫాస్టు మాస్టారూ.. మా పిల్లలకి సెల్ ఫోన్లూ, కాన్సోళ్ళూ, లాప్ టాప్పులూ లేవన్నా, వాటి గురించి తెలియదన్నా ఎంత తలవంపో అసలు మీకు తెలుసునా? చేతులకి పట్టొస్తే చాలు, ఓ రిమోట్టో, ఓ ఐపాడ్డో పెట్టేస్తే వాడిదారిన వాడు పడుంటాడు. మీకా వాళ్ళని ఆడించే ఓపిక లేదు, ఏదో మాదారిన మేమే, ఏదో మార్గం చూసుకుంటే , దానికీ చివాట్లేనా? ఇంక మిగిలిన విషయాలంటారా, అప్పుడు చూసుకోవచ్చులెండి.అనేవాళ్ళూ ఉంటారు

7 Responses

 1. బోలెడు మంది దేముడు అని యెందుకు వ్రాస్తున్నారో నాకు బోధపడటం లేదు. దయచేసి గమనించండి “దేవుడు” అనటం సరియైన వాడుక. ఇది దేవ శబ్దభవం‌కాబట్టి దేవుడు కాని దేముడు అనే మాట తెలుగులో లేదు! నొప్పించి ఉంటే మన్నించడి.

  Like

  • జనాలతో ‘దేవులాడ'(వెతుకులాడ) బడే వాడు దేవుడు. దేముడు దానికి వికృతి, ఎవరో పుట్టించకపోతే మాటలెలా పుడతాయి? వేయండి ఈయనకో వీర తాడు.

   Like

 2. శ్యామలరావుగారూ,

  చేసిన తప్పుని సవరించుకున్నానండి. ధన్యవాదాలు…

  Like

 3. ‘దేవ’ సంస్కృతం నుంచి దేవుడు తత్సమం,
  దేముడు తత్భవమ్ , చాలా మంది చాలా చోట్ల వాడుతారు.
  అర్థం చేసుకుంటే తప్పేమీ లేదు.

  Like

 4. Anony,

  నా తెలుగు vocabulary అంతగా బాగోదండి. బహుశా తప్పు వ్రాసేమోనని సవరించుకున్నాను.

  డాక్టరుగారూ,

  అయితే నేను వ్రాసింది కూడా రైటేనంటారా…

  Like

 5. రాష్ట్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత
  శ్రీ బలివాడ కాంతా రావు గారి ‘సంపంగి’ చూడుడీ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: