బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    నిన్నటి “సాక్షి” లో ఈవేళ మహాకవి శ్రీశ్రీ గారి జయంతి అని చదివాను. అలాగే ఈవేళ్టి సాక్షిలో ఈవేళ మరో తెలుగు సాహిత్య మహామనీషి భమిడిపాటి కామేశ్వరరావు గారి జయంతి అనికూడా చదివాను. వారిద్దరి గురించీ ఓ టపా పెడదామని, ముందుగా తెలుగువిఈపీడియా తెరిస్తే తెలిసిందేమిటయ్యా అంటే, శ్రీ శ్రీ గారి కరెక్టు పుట్టినరోజు ఆయనకు కూడా తెలియదని, ఆయనే “అనంతం” లో వ్రాసుకున్నట్టు తెలిసింది. పైగా అందులో ఏమి వ్రాశారో తెలిసికుందామా అంటే, ఈ వికీపీడియా వారు, “అనంతం” లోని విషయాలకి కాపీరైట్టు ఉందనీ, అందువలన పూర్తి వివరాలు ఇవ్వలేకపోతున్నామనీ వ్రాశారు.ఇలా కాదని, మాకు శ్రీముళ్ళపూడి వెంకటరమణ గారు, మేము మొదటిసారీ, ఆఖరిసారీ కలిసినప్పుడు, వారు మాకు అత్యంత అభిమానంతో బహూకరించిన మహాప్రసాదం– “శ్రీశ్రీ ప్రస్థానత్రయం” ( మూడు భాగాలు) సెట్టుSri Sri 003 తెరిచి చూశాను. అందులో వారు వ్రాసిందేమిటయ్యా అంటే, వారి కరెక్టు జన్మతేదీ అసలు ఎవరికీ తెలియనే తెలియదని.

    ఇంక భమిడిపాటి కామేశ్వరరావుగారి విషయానికొస్తే ఆయన జయంతి ఏప్రిల్ 28 అని. మరి ఈ పేపర్లవాళ్ళు ఏదైనా ప్రచురించే ముందు, వాటి పూర్వాపరాలు ఒకసారి పరిశీలించి పెడితే బావుంటుందేమో కదూ.. వారి జయంతి లు ఎప్పుడైతేనేమిటిలెండి, వారి ఘనత ఆ తేదీలబట్టి ఏమీ మారదుకదా.

    ఎలాగూ పుస్తకాల విషయంలోనే ఉన్నాము కాబట్టి ఈవేళ నేను తెలిసికున్న కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాల లింకులు క్రింద ఇస్తున్నాను, ఎవరికైనా ఆసక్తి ఉంటే చూసి డౌన్ లోడ్ చేసికోండి.

    1. త్రైత సిధ్ధాంతము

    2. గ్రంధ నిధి

    3.291 పుస్తకాలు

    4. ఉచిత తెలుగు పుస్తకాల లింకులు

    ఇప్పటికే మీ అందరికీ తెలిస్తే సంతోషం.

Advertisements

3 Responses

  1. ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నారండీ! మా మిత్రులు /గురువుగారు ఫణిబాబుగారు నిలువెత్తు బంగారం. మంచి లింక్ లిచ్చేరు. ధన్యవాదాలు.

    Like

  2. భమిడిపాటి ఫణిబాబు gariki ……ధన్యవాదాలు

    Like

  3. శర్మగారూ,

    మరీ అంతలేసి పొగడ్తలెందుకులెండి. ఏదో తెలిసినదేదో అందరితోనూ పంచుకోవడమే నా ధ్యేయం. ఆ లింకులు మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

    లలితగారూ,

    మీకు నచ్చినందుకు సంతోషమండీ…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: