బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.


    సంగీతప్రపంచంలో ఇంకో తార రాలిపోయింది. పెద్దపెద్ద గాయకుల్లాగ వేలల్లో పాడకపోయినా, పాడినవి మాత్రం అఛ్ఛోణి లాటివే. నేను చెప్పేది హిందీ సినీసంగీతంలో ఓ వెలుగు వెలిగిన శ్రీమతి సంషద్ బేగం గారి గురించి. ఆవిడ గళంలోంచి జాలువాఱిన పాటలు
ఇక్కడ వినండి. లేదా ఇక్కడైనా వినండి.ఆవిడ పాడిన అన్ని పాటల లింకులూ కూడా ఇచ్చారు.

    రెండు మూడు రోజులక్రితం కర్నాటక సంగీతం ఓ మహా వయొలిన్ విద్వాంసుడు శ్రీ లాల్గుడి జయరామన్ గారిని కూడా కోల్పోయింది. నా అదృష్టం ఏమిటంటే ఆయన కచేరీలు ఓ అయిదారు దాకా వినడం. ఆయన వాయూలీన విన్యాసాలు ఇక్కడ వినండి.

    ఇంకో విషయం- చాలామంది రైళ్ళలో ప్రయాణాలు చేయడానికి online లోనే చేస్తూంటారు.నేను చెప్పేది మన బ్లాగులు చదివేవారి గురించి. చాలామందికి జరిగేదేమిటంటే irctc.co.in లో రైల్వేలలో ఉండే కోటా వివరాలు కనిపించవు. ఎప్పుడు చూసినా GEN అనే ఉంటుంది. కానీ చిత్రం ఏమిటంటే వివిధ రకాలైన కోటాలు ఉన్నాయి.వాటి వివరాలు ఇక్కడ చూసుకోండి.ముందుగా ఇక్కడ చూసుకుని, irtc.co.in కి వెళ్తే బావుంటుందని నా అభిప్రాయం. అలాగే ఈ ఆన్లైన్ లో చేసేటప్పుడు, నాలుగక్షరాలు మించి స్టేషన్ పేరు అనుమతించబడదాయే. పైగా ఉదాహరణకి విజయవాడ ఆవాలంటే BZA అనీ, వారణాసి కావాలంటే BCY, BCB అని వ్రాయలట, ఎక్కడైనా ఉందమ్మా ఈ చిత్రం? మరి ఇలాటివన్నీ తెలియాలంటే ఏం చేయాలిట? హాయిగా ఇక్కడ కి వెళ్ళి చూసుకోండి. ఏదో అందరూ నాలాగ రైళ్ళలోనే వెళ్తారేమో, వాళ్ళకి ఉపయోగిస్తుందేమో అని ఇచ్చాను. కాదూ, మీకైతే ఇప్పుడు తెలిసిందీ, మాకు ఎప్పణ్ణించో తెలుసూ అన్నారా… సంతోషం.

2 Responses

  1. thanks andi.meeru irtc lanti vishayalu separate post lo pedite baguntundi.

    Like

  2. బాసు,

    ముందుగా నేనిచ్చిన లింకులు ( రైల్వే సంబంధిత) మీకు ఉపయోగకరంగా ఉన్నందుకు సంతోషము.
    మీరు ఇచ్చిన సలహా బాగానే ఉంది, కానీ వీటన్నిటికీ ప్రత్యేకంగా పోస్ట్ పెట్టడానికి, సరిపడే content కూడా తయారుచేసికోవాలిగా. ఏదో నా టపా చదువుతున్నారు కదా అని అప్పుడప్పుడు నాకు తెలిసినవి అందరితో పంచుకుంటూంటాను. పోనిద్దురూ, మీరొక్కరైనా స్పందించారు..thanks ..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: