బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-“కొత్తబంగారు లోకం” లో అడుగెట్టి అప్పుడే నాలుగేళ్ళా….


   ఈ బ్లాగుల “కొత్త బంగారు లోకం..” లోకి ప్రవేశించి అప్పుడే నాలుగేళ్ళయిపోయిందా అనుకుంటే ఆశ్చర్యం వేస్తోంది.ఇంతకాలం నన్ను భరిస్తున్నారూ అంటే, అదంతా నేనేదో బాగా వ్రాస్తానని కాదు, మీ అందరి సహృదయతానూ అని చెప్పకుండానే తెలుస్తోంది.నేను వ్రాసే “ఊసుబోక” కబుర్లు, ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరికి అనుభవంలొకి వచ్చినవే. మీరందరూ చెప్పుకోరూ, నాకు పనీ పాటా లేదు కాబట్టి ఇదిగో ఇలా రోడ్డుమీద పడ్డాను.

    నాలుగేళ్ళ క్రితం రాజమండ్రీ లో ఉండగా, గోదావరి తల్లి గాలి ధర్మమా అని నేను ఈ బ్లాగులూ అవీ నేర్చుకోకపోయుంటే ఈ అదృష్టం నాకు కలిగేదంటారా? ఈ నాలుగేళ్ళలోనూ ఎంతమంది స్నేహితులు లభించారో కదూ. ఇన్నేళ్ళు నెత్తిమీదకొచ్చిన తరువాత తెలిసీ తెలియక ఓ కొత్త ప్రపంచం లోకి అడుగెట్టి, అక్కడకేదో నా టపాలు చదివేవారికి, తెలియదేమో అన్నట్టు నేను “discover” చేసినవేవో, నా టపాలో పెట్టేసి అక్కడికేదో ఘనకార్యం చేసేసినట్టు పోజు పెట్టడం,ఆ పెట్టినదాన్ని నా సహృదయులైన పాఠకులు కూడా చదివేసి “అఛ్ఛా .. అలాగాండీ,నిజమాండీ.. మాకు తెలియనే తెలియదూ..” అంటూ మొహమ్మాటానికి, (లోలోపల నవ్వుకుంటూనే), పోన్లెద్దూ పెద్దాయన సంతోషిస్తాడూ అని భావించేసి ఓ వ్యాఖ్య పెట్టేయడమూ, ఆ వ్యాఖ్యలు కూడా ఈమధ్యన “చిక్కి” పోతున్నాయి, అది వేరేసంగతిలెండి.పోన్ల్లెద్దురూ చదవడం చదువుతున్నారు కదా,ఆమాత్రం చాలదూ నాలాటి అల్పసంతోషికీ?

    ఈ నాలుగేళ్ళలోనూ నేను సాధించింది ఏమైనా ఉందా అంటే ఎంతొమంది ప్రాణం పెట్టే ఆత్మబంధువులు అని ఢంకా బజాయించి చెప్పుకోగలను.నేను వ్రాసే టపాలు చదివి, వ్యాఖ్యల రూపంలోనే తమ స్పందన తెలుపుకోనఖ్ఖర్లేదు, దేశవిదేశాలనుండి ఫోను ద్వారానో, చాటింగు ద్వారానో వారి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారంటే అంతకంటే ఇంకేమి కావాలండి, నాలాటి అర్భకుడికీ? కారణాలు ఏవైనా కావొచ్చు, వారివారి విలువైన సమయాన్ని నాతో మాట్టాడడానికి వెచ్చిస్తున్నారంటే, అంతకంటే గొప్పcompliment ఉంటుందనుకోను.అలాగని మాట్టాడడం మాత్రం మానేయకండే…భాగ్యనగరంలో ఒకాయన ఉన్నారు, ఆయన ఎప్పుడూ నా టపాల్లో వ్యాఖ్యలు పెట్టరు, అలాగని చదవరా అంటే అదీకాదూ, వారానికో, పక్షానికో ఓసారి ఫోను చేసేయడం, ఆ వారం రోజుల్లోనూ నేను వ్రాసిన టపాలమీద తన అభిప్రాయం చెప్పేయడమూ.అదృష్టం కొద్దీ ఇప్పటిదాకా సదభిప్రాయమే అనుకోండి, ఏమో ఎప్పుడెవరికి ఇంకోలా అనిపించొచ్చో ఎవరికి తెలుసూ? ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు అనిపిస్తూంటుంది, ఫరవాలేదూ, చూడాలే కానీ జగమంతకుటుంబం నాదీ.అలాగని ఆ పాటలోవ్యక్తిలా ‘ఒంటరిని’ మాత్రం కాదు.

    ఈ ప్రస్థానంలో కొందరు అలిగారు, కొంతమందికి కోపాలొచ్చాయి, కొంతమందైతే అసలు పలకరించడమే మానేశారు ఎవరిష్టం వారిదీ. అయినా ఏదో కోల్పోయామే అని ఏడిచే బదులు, కొత్తగా స్నేహితులైనవారి గురించి ఆలోచిస్తూ ముందుకుపోవడమే.జీవితంలో ఒడుదుడుకులనేవి ఎప్పుడూ ఉండేవే.

    అటు అనపర్తి నుంచి, కాకినాడమీదుగా, రాజమండ్రీ, భాగ్యనగరాలేకాకుండా,ఇటు తిరుపతి, బెంగళూరు, చెన్నైలలో కూడా చుట్టాలనే వాళ్ళున్నారంటే అది నేను ఏ జన్మలోనో చేసికున్న పుణ్యం.ఇదివరకటి రోజుల్లో ఏదైనా ఊరు వెళ్ళాలంటే అక్కడ చుట్టాలెవరైనా ఉన్నారా అని ఆలోచించేవారం, అంటే వాళ్ళ నెత్తిమీద కూర్చోవచ్చని కాదు, వారిని కలిసి ప్రత్యక్షంగా కూడా ” బోరు” కొట్టడమేమిటో వారికి తెలిసొచ్చేటట్టు చేయడానికి, ఇప్పుడు ఎక్కడచూసినా చుట్టాలే..

   ఈ అంతర్జాలంలో అడుగెట్టనివారు ఎంతోమందున్నారు.ఎవరికారణాలు వారివి.కొంతమంది ఎందుకులెద్దూ ఈ వయస్సులోనూ లేని పోని గొడవలూ అనుకునేవారు కొందరూ.కానీ రిటైరయినతరువాత నేర్చుకుని, ఈ కొత్తబంగారులొకంలో అడుగెట్టి ఏమైనా తప్పుచేశానా అనే భావనమాత్రం ఎప్పుడూ రాలేదు ఇప్పటిదాకా.ఇదివరకటి రొజుల్లో కంటే ఇప్పుడు ప్రతీదీ సులభమైపోయింది, దానితో పాటు బధ్ధకం కూడా అనుకోండి. ఏదైనా ఓ “మంచి” జరిగినప్పుడు దానితో ఓ “చెడు” కూడా వెన్నంటే ఉంటుందిగా.ఇదివరకైతే పిల్లలు ఏదో చెప్పేవారు ఓహో.. అనుకునేవాడిని. ఉద్యోగంలో ఉన్నప్పుడైతే దానివలన ఎన్నెన్నో పరిచయాలు అవుతాయి.కానీ, ఉద్యోగవిరమణ చేసిన తరువాత అంతా శూన్యం. పలకరించేవాళ్ళుండరు, ఇంట్లోవాళ్ళకే మనం ఓ భారమైపోతాము. దానితో ఒకరకమైన న్యూనతాభావం మనమీదమనకే వచ్చేస్తుంది.అలా కాకుండగా, మనకి ఓ “ఆత్మవిశ్వాసం” ఏర్పరుచుకోడానికి ఇంతకంటే మంచి “సాధనం” ఇంకోటుండదని తెలిసికున్నాను. ప్రపంచంలో మన మాట ఎవరు విన్నా, వినకపోయినా, ఈ కంప్యూటరు మాత్రం తప్పకుండా వింటుంది. తప్పుచేస్తే “ఒరే వెధవాయీ నువ్వు రాసింది తప్పురా, నీక్కావలిసినది ఫలానా కదూ..” అని సుతిమెత్తగా చివాట్లెసి, మనక్కావలిసినదేదో చూపిస్తుంది. పైగా ఈవయస్సులో మనం చివాట్లు తిన్నట్టు ఎవరికీ తెలియదు కూడానూ !!

    ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుందనుకోండి, మనకంటే అర్భకుడు( కంప్యూటరు విషయంలో) ఎవడైనా దొరికితే, వాడికి జ్ఞానబోధ చేయాలని, ఆమాత్రం ఉండొచ్చులెండి.అలాగని ఈ కొత్తబంగారులోకం లో ఏవేవో చేసేశాయలనీ, ఏవేవో కొత్తవిషయాలు ఆవిష్కరించేయాలనీ మాత్రం లేదు. ఏదో సంసారపక్షంగా మన కాలక్షేపం జరిగితే చాలు.ప్రతీదానికీ ఎవరెవరినో అడిగే అవసరం లేకపోతే చాలు.నాలాటివారి కాలక్షేపాన్ని సహృదయంతో భరిస్తూన్న మీఅందరికీ మరో మారు సహస్రకోటి నమస్కారాలు…

    ప్రస్థుతం నా పరిస్థితి ఎలాటిదీ అంటే మా మనవడు చి.అగస్థ్య లాగ అన్నమాటAgastya
అలాగని నేనేదీ ఇలా తయారవాలని ఏ కోశానా లేదు…Phani Babu

GOD BLESS YOU ALL…..

Advertisements

13 Responses

 1. అంతర్ జాలం నిజంగా విశ్రాంత జీవుల పాలిటి వరo.
  ముఖ్యంగా మనిషి తీరిక లేనంత మిషిన్ అయినప్పుడు,
  బంధు మిత్రులు దగ్గర ఉండి దూరమై నప్పుడు,
  కొత్త స్నేహితాలు కలిపే పెన్నిధి ఈ క్రొత్త బంగారు లొకo.
  నాలుగేళ్ళు వెన కేసుకున్నందుకు శుభాకాంక్షలు

  Like

 2. ఒక అద్భుత ప్రపంచాన్ని అందు ఒక గొప్ప స్నేహితులు,కుటుంబాన్ని, నాలాటి అనామకునికి, చదువురాని , చదవలేని ఒక పల్లెటూరి వాడికి కల్పించిన ఘనత మీదికాదూ? ఇప్పుడు నిజంగానే నాకు జగమంత కుటుంబం ఉంది. రెండు రోజులు నెట్ లో కనపడకపోతే వెతుకుతున్నారు, నాకోసం. సెర్చ్ వారంట్ ఇచ్చేసి వలేసై పట్టేస్తున్నారు. నేటి ఈ రోజుల్లో మరొకరు ఎలా ఉన్నావని కుటుంబ సభ్యులే పట్టించుకోని రోజులలో ఇంతమంచి వ్యాసంగం దొరకడం, అది మీరు పరిచయం చేయడం, గురువుగా మీకు నమస్కారం. స్వంత డబ్బా కొట్టేసుకున్నానా? చెల్లయిని అడిగానని చెప్పండి. మీరిలాగే మాకు మార్గదర్శనం చేయాలని ….మీకు శుభకామనలు.మిమ్మల్ని ఆశీర్వదించేవారు లేరు, ఆ పని నేను చేస్తా.

  శతంజీవం శరదో వర్ధమానా ఇత్యపినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనా వర్ధయన్తి శతమేనమేన శతాత్మానం భవతి శతమనంతం భవ తి శతమైశ్వరయం భవతి శతమితి శతం దీర్ఘమాయుః//

  లోకాస్సమస్తాః సుఖినోభవంతు.

  Like

 3. నాలుగేళ్ళు నిండిన మీ బ్లాగుకి శుభాకాంక్షలు. మీకు అభినందనలు.

  Like

 4. శుభమస్తు..

  Like

 5. మిమ్మల్ని దీవించలేను కాబట్టి,
  నాలుగేళ్ళ మీబ్లాగు బుడతడిని దీవించేస్తాను.

  “మీ బ్లాగు కొన్ని తరాలపాటు నెట్‌లో ఉండి మీ మనవలు, వాళ్ళ మనవలూ చదివి ఆనందించాలి.”

  Like

  • అలా ఐతె గురువు గారు వారి టపాలన్నిటినీ ఆంగ్ల భాష లోకి తర్జుమా చేయాలి మరి.

   Like

 6. ఓ నాలుగేళ్ళుగా బంగారం ధర ఆకాశం వైపు సాగి పోతోంటే ఏమబ్బా కారణం అయి ఉంటుందని ఆలోచించి ఆలోచించి బుర్రలు బద్దలు అయ్యె !

  ఇప్పటికి అర్థమయ్యింది ఇది బాతా ఖానీ ఫణి బాబు గారి వల్ల అని – వారు బంగారు లోకం లో కాలు బెట్టడం తో ధర ఆకాశాని కి ఎగిరి పోయినట్టుంది !

  శుభాకాంక్షల తో !!

  చీర్స్
  జిలేబి.

  Like

 7. మీ బ్లాగు నాలుగు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకొన్నందుకు శుభాకాంక్షలు.

  Like

 8. మీ బ్లాగు ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నన సందర్భాన శుభాకాంక్షలు.

  చందు

  Like

 9. తెలుపు నలుపు లో డిగ్రీ ఫోటో బాగుంది ,
  మీదే కదా!!

  Like

 10. డాక్టరుగారూ,

  ధన్యవాదాలండి. అవును ఆ ఫొటో నాదే..

  శర్మగారూ,

  “నాలాటి అనామకునికి, చదువురాని , చదవలేని ఒక పల్లెటూరి ..” మీటపాలు చదివితే తెలియడంలేదూ? చదువొచ్చినవారెవరో, రానివారెవరో? ఇంక ఘనతంటారా, ప్రేరేపించడంవరకే నేను చేసిన పనల్లా..

  సుబ్రహ్మణ్యంగారూ, విద్యాచరణ్,

  ధన్యవాదాలు…

  బోనగిరిగారూ,

  థాంక్స్..అంతంత ఆశలు లేవండీ…

  చందూ,

  నా తెలుగే ఇలా ఉంటే, ఇంగ్లీషోటా.. ఏదో ఇలా వెళ్ళిపోనీ…

  కిశోర్ వర్మా,

  థాంక్స్…

  జిలేబీ గారూ,

  గత వారంరోజులనుండీ బంగారం ధరలు పడిపోతున్నాయే మరి. దీనికేం చెప్తారు?

  Like

 11. nenu mee blog regular ga chaduvutanu kani comment pettadaniki baddakam.
  naku mee post lu chala nachutayi

  Like

 12. శ్రావ్యా,

  పోనిద్దూ చదువుతున్నారు కదా, అది చాలు. వ్యాఖ్యలకేమిటి, అప్పుడప్పుడు అసలు వ్యాఖ్యలే ఉండడంలేదని, నిరుత్సాహపడ్డా, అలవాటు పడిపోయాను. thick skinned..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: