బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకో కొత్త పరిచయం…


   క్రిందటి నెల మా దాసరి అమరేంద్ర గారి అరవయ్యో జన్మదినోత్సవానికి వెళ్ళి, పూణె తిరిగివచ్చేటప్పుడు, శతాబ్ది లో, మా ఇంటావిడ తన చుట్టంతో కూర్చోడంతో, నేను విడిగానే కూర్చోవలసొచ్చింది. నా కాలక్షేపానికి కొదవేమీ లేదనుకోండి, అంతకుముందు శ్రీ కృష్ణమోహన్ గారు,భాగ్యనగరంలో ఆ పూట భోజనం పెట్టి, చేతిలో ఆయన వ్రాసిన మూడు పుస్తకాలుకూడా ఇచ్చారని చెప్పేనుగా, అవి చదువుతూ కూర్చున్నాను.ఓ పుస్తకం తీసి చదువుతూ కూర్చున్నాను, ఆ పుస్తకాన్ని చదువుతూంటే, నవ్వు ఆపుకోలేక కొద్దిగా పైకే నవ్వేశాను. అవతలవైపు సీటులో, తన భార్యా, కుమార్తె తో కూర్చున్న ఒకాయనకి, ఈ నా నవ్వు కొంచం విచిత్రంగా కనిపించుండాలి. తనలో తనే నవ్వేసికుంటున్నాడూ ఈయనా, కొద్దిగా “మానసిక్ సంతులన్” ఏదైనా “గతి” తప్పిందేమో అనికూడా అనుకునుండొచ్చు. విషయమేమిటో తెలిసికోవాలనేమో, నా పక్కకు వచ్చి మాట కలిపారు.ఆయన ముందు మాటకలిపారా లేక నేనే ముందా అన్నదిమాత్రం గుర్తులేదనుకోండి. నేనే అయిఉంటాను, అలవాటేకదా! అసలు మాట కలపడానికి దారితీసిన కారణం ఏమైఉంటుందా అని ఆలోచిస్తే తరువాత గుర్తొచ్చింది.ఆ క్యాటరింగువాడు తినడానికి ఏవేవో తెచ్చినప్పుడు అదేదో శాండ్ విచ్చో సమోసాయో ఇంకేదో, దానిమీద Dt of mfr శ్టాంపేస్తూంటారులెండి, అక్కడ March 15 కి బదులుగా Feb 15 th అనుందిట.వాళ్ళ అమ్మాయి ఇది చూసి తండ్రితో చెప్పింది. ఆ అమ్మాయి షార్ప్ నెస్స్ కి ఆనందం వేసింది.అప్పుడన్నమాట మాకు మాటకలిసింది.

    అందుకే అంటారు దేనికైనా కలిసిరావాలీ అని.ఆ మాటా ఈమాటా చెప్పుకుంటూ ఓ మూడు నాలుగ్గంటలు కబుర్లు చెప్పుకున్నాము. చెప్పుకోవాలిగా, తెలుగువారెవరైనా కనిపిస్తే నా బ్లాగు విషయం, ఊరుకోలేక చెప్పేశాను. ఆయన భార్యగారు అదేదో పత్రికలో పజిల్ పూరిస్తున్నారు. నేనుకూడా మా ఇంటావిడ గొప్పచెప్పుకోవద్దూ.. మా ఇంటావిడకి కూడా ఈ గళ్ళనుడికట్లంటే చాలా పిచ్చండీ, ఎంతపిచ్చీ అంటే, పత్రికలు లేనప్పుడు, నేనేదైనా గళ్ళ చొక్కా వేసికుంటే, దానిమీదే ఏవేవో చేసేస్తూంటుందీ అని ఇంటావిడమీద జోక్కేసేశాను, కోప్పడ్డానికి పక్కన లేదుకదా అని!

   మాటల్లో తేలిందేమిటంటే నాకు పరిచయం అయిన వారి నాన్నగారు- శ్రీ అష్టకళ నరసింహ రామ శర్మ గారు. వారిగురించి వికీపీడియా లో ఇక్కడ చదవండి.ఈ విషయం ఇంటికొచ్చిన తరువాత నెట్ లో చదివి తెలిసికున్నాను. ఆ మధ్యన hmtv లో ” జైతెలుగు జైజైతెలుగు” అనే ఓ కార్యక్రమంలో వారితో ఒక ఇంటర్వ్యూ కూడా వచ్చింది. వాటిని ఇక్కడ, ఇక్కడా చూడండి.ఈసారి భాగ్యనగరం వెళ్ళినప్పుడు తప్పకుండా వారిని కలిసే ప్రయత్నం చేయాలి. మనం చేసినా చేయకపోయినా, అలాటి మహత్కర కార్యాలు చేసేవారిని దర్శించుకున్నా పుణ్యమేట. శ్రీ చాగంటి వారు చెప్పారు.ఎలాగైతేనేమిటి పుణ్యం సంపాదించుకోవాలి! ముందుగా వారి కుమారుడితో పరిచయం అయిందికదా, తనే చూసుకుంటారు! కానీ నాతో అన్నిగంటలు కబుర్లు చెప్పినతరువాత ఆయన స్పందనా తెలిసికోవాలని ఉన్నా మరీ అడిగేస్తే బావుండదని ఊరుకున్నాను. కానీ , నచ్చినట్లే అనిపిస్తోంది. కారణమేమిటంటే, ఆయనతో మాటల్లో బాపూరమణ లంటే, నాకు ఎంత భక్తీ అభిమానమో చెప్పాను. తెలుగుభాషంటే ఎంత అభిమానమో కూడా చెప్పాను.

    భాగ్యనగరం తిరిగి వెళ్ళీవెళ్ళగానే ఆయన చేసిన పనేమిటయ్యా అంటే “తెలుగువెలుగు” ఉగాది సంచికా, దీనితోపాటు మరో అద్భుత కానుకాBapu పంపారు.

   అంత శ్రమ తీసికుని ఏదో రైల్లో పరిచయమైన వ్యక్తికి, అంత అభిమానంగా ఈ కానుక పంపారంటే తెలుస్తుంది ఆయన స్నేహానికి ఎంత పెద్దపీట వేస్తారో! అన్నీచెప్పి ఆయన పేరు చెప్పలేదుకదూ… శ్రీ విద్యాచరణ్.ఇంకో విషయం ఆయనకూడా బ్లాగులు వ్రాస్తారుట.దాని లింకు ఇక్కడ. ఏదో మామూలు కబుర్లు చెప్పుకుని బ్రతికే నాలాటివాడికి ఇలాటి బ్లాగులు అర్ధం చేసికోడానికి కాస్త టైముపడుతుందనుకోండి.అయినా ప్రయత్నలోపం లేకుండా మాత్రం చూస్తాను.

    ఇంక శ్రీ విద్యాచరణ్ పంపిన పై పుస్తకం చదివేశాను, ఆ పుస్తకంకూడా ఎవరిగురించీ.. మా దేవుళ్ళగురించి.పైగా ఈ అద్భుత కానుక నాకందిందెప్పుడూ–though late than never శ్రీ బాపూగారు “పద్మశ్రీ” ఎవార్డు అందుకున్నరోజున. Thank you vidyacharan. అప్పుడెప్పుడో ఆరుద్ర గారు వ్రాసిన ” కూనలమ్మ పదాల” టైపులో, బాపూరమణల గురించి ఓ ద్విశతి. మచ్చుకి ఓ పద్యం..

    ఇద్దరిని కలిపి మిమ్ముల

    నొద్దిక నొకరే యటన్న యూహన్ తమితో

    ముద్దుగ వ్రాసితి నివి-మీ

    వద్దన్ గల చనువుతోడ

    –బాపూరమణా

    ఈ ద్విశతి రచయిత డా. అక్కిరాజు సుందర రామకృష్ణ గారు “నామాట” లో

చెప్పినట్టుగా..” ఇద్దరినీ కలిపి ఒకే ఆత్మగా అభివర్ణించాలనిపించిఁది.ఒకడు ఎలాగూ మన మధ్యలేడు. ఉన్న

మహనీయుడన్నా నా ప్రయత్నానికి ఆనందిస్తాడేమో, అభినందిస్తాడేమోనని నమ్మకం....” శ్రీ బాపూగారి

అభిమానమంతా, ఈ పుస్తకానికి ఆయనవేసిన బొమ్మలోనే తెలుస్తుంది.

Advertisements

12 Responses

 1. మీరు అదృష్టవంతులు. మంచి పరిచయం.

  Like

 2. అద్భుతమైన టపా , అభినందనలు.
  బాపు గారి అర్థవంతమైన ‘పుస్తకం పైని బొమ్మ’,
  హృదయాన్ని కలచి వేసింది
  మితభాషి, గీతల్లో ఎంత బాగా విరహ విషాదాన్ని
  మనందరికీ తెలియచేసారు !!
  చాలా ధన్యవాదాలు.

  Like

 3. మీరు పరిచయం చేసుకున్నవాళ్ళలో కొంతమంది మీకు పుస్తకాలో మరొకటో బహుమతిగా పంపిస్తున్నారు. సంతోషం.
  వారి అడుగుజాడలలో మీరు నడవాలని నా కోరిక.

  మీతో ముఖపరిచయం లేకపోయినా, శబ్ద పరిచయం, వ్రాత పరిచయం నాకు ఉన్నాయి.
  పోస్ట్ మాన్ కోసం ఎదురు చూస్తుంటా …….దహా.

  Like

 4. ఇదిగో నండీ భమిడి పాటి వారు,

  అట్లా బులుసు వారికి పుస్తకం పంపించేటప్పుడే, మరో చేత్తో నాక్కూడా ఓ క్రోసేడు పుస్తకాలు పపించండి !

  చీర్స్
  జిలేబి.

  Like

 5. శర్మగారూ,

  అది మాత్రం నిజమండీ…ధన్యవాదాలు…

  డాక్టరుగారూ,

  “బాపు గారి అర్థవంతమైన ‘పుస్తకం పైని బొమ్మ’,
  హృదయాన్ని కలచి వేసింది
  మితభాషి, గీతల్లో ఎంత బాగా విరహ విషాదాన్ని
  మనందరికీ తెలియచేసారు !!” నిజం సార్. మీరన్నట్టుగా మరాఠీ పుస్తకాలు ఇస్తే బావుంటుందేమో…

  సుబ్రహ్మణ్యం గారూ,

  “పోస్ట్ మాన్ కోసం ఎదురు చూస్తుంటా …” ఇదిమాత్రం బావుంది. లక్షలూ కోట్లూ అవీ డాలర్లలో మనకా, పుస్తకాలు మాత్రం నాలాటి అర్భకుల దగ్గరనుంచా… వహ్వా..వహ్వా…

  జిలేబీ గారూ,

  బులుసువారి “కోరికలు” మీకూ వంటబడుతున్నాయే…

  Like

 6. శ్రీ సి.వి.ఆర్. మోహన్ గారికి ధన్యవాదాలు.

  ఫణి బాబు గారూ… మరాఠి పుస్తకాలైతే, ఒకో పుస్తకం కనీసం నాలుగు ఐదు కేజీ లకు తగ్గకుండా ఓ పదైనా పంపించండి. వ్రతం చెడ్డా అంతో ఇంతో ఫలం దక్కాలి గదా.

  మనింట్లో పంచ భక్ష్య పరమాన్నాలు ఉన్నా పక్కింటి పుల్ల కూర రుచే వేరు కదా…దహా.

  >>>బులుసువారి “కోరికలు” మీకూ వంటబడుతున్నాయే…
  వంటబడటం కాదు పంట పండించుకునే ప్లాను.
  జిలేబీ గారికి పుస్తకాలు పంపితే వాటికి కూడా చీమలు పట్టేస్తాయేమో ఆలోచించండి….దహా.

  Like

 7. సుబ్రహ్మణ్యంగారూ,

  వామ్మోయ్.. వామ్మోయ్.. ఇదన్నమాట మీ “కోరిక” లోని అంతరార్ధం… మళ్ళీ జిలేబీగారి సంగతెందుకూ ఇక్కడ? చీమలే పడతాయో ఇంకోటేవో పడతాయో… ఆవిడిష్టం అడిగారూ, పంపుతానో లేదో మేమూ మేమూ చూసుకుంటాం. ఆవిడకూడా అడగడం వెనుక అంతరార్ధం చెప్పేస్తే చూద్దాం…

  Like

 8. ఫణి బాబు గారు ధన్యోస్మి ( సర్ అంటే అలా పిలవద్దంటారు దూరం చేస్తున్నానమంటారు, గురూగారు అంటే మరీ వ్యంగం అంటారు. మీతో ఎలా వేగేదండీ బాబు.. అందుకే చిన్న వాణ్ణి అయినా ఇలా ILU ),

  రైల్లో మీలో మీరు నవ్వుకుంటుంటే మీ ఆనందాన్ని చూసి కేవలం అసూయ పడ్డ మాట నిజ్జం కాని మీ మానసిక స్థితి మీద మాకు ఏ మాత్రం కామెంట్ చేసుకోలేందంటే నమ్మన్ది. కాని మీ బోసి నవ్వులు మాత్రం మా అమ్మాయి దృష్టినించి తప్పించుకోలేదు. అందుకే “బోసి నవ్వుల ముసలి తాతకి ప్రేమతో నమస్కరింతునని తనకి చెప్పాను.

  అన్నట్టు,నేను బాపురమణ గారి మీద పద్యాలు పంపిస్తానంటే నాకు పద్యాలంటే ఎలర్జీ అన్నారు. అయినా చదివినఅందుకు సంతోషం.

  నాన్నగారు నిర్మించిన శ్రీ సరస్వతీ క్షేత్ర్హం పైన ఆ మధ్య ఈ టీవీ “తీర్థయాత్ర”లో వచ్చిన కార్యక్రమం యు ట్యూబ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. వీలైనప్పుడు చూడండి.

  Part1: https://www.youtube.com/watch?v=xtzeVp6Vdng

  Part2: https://www.youtube.com/watch?v=rTBk-8FvjW4

  Part3: https://www.youtube.com/watch?v=1FMd-P5RXpY

  Part4: https://www.youtube.com/watch?v=gjTVYOxAoPk

  ఉగాది రోజు SVBC ఛానెల్లో నాన్న పాల్గొన్న ఉగాది కవి సమ్మేళనం 1130కి మరియు రాత్రి 1030కి ప్రసారం అవుతుంది. కుదిర్తే చూడండి. ఉంటాను

  రసహృదయ పక్షపాతి
  మీ విద్యాచరణ్ అష్టకాల

  Like

  • ugadi nadu chadivanu,,,kammani pachadi tinna anubhooti..vidya charanki, bhamidipati gariki jeevitamlo shadruchulu aniivelala cheralani kanksha

   Like

 9. విద్యాచరణ్,

  స్పందించినందుకు ధన్యవాదాలు…మీ నాన్నగారు పాల్గొన్న కవిసమ్మేళనం కార్యక్రమం ఈవేళ ఎస్.వి.బి.సి. లో చూశాను. జొన్నవిత్తులవారి పద్యాలతోనే నిండిపోయింది. మిగిలినవారికి అవకాశము అంతగా ఇవ్వలేనట్టనిపించింది..

  మూర్తిగారూ,

  మీరు వ్రాసినదంతా చాలా బావుంది. కానీ తెలుగు లిపిలో వ్రాసుంటే ఇంకా బావుండేది….ధన్యవాదాలు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: